శర్మ కాలక్షేపంకబుర్లు-మందుకొట్టినంత కిక్

మందుకొట్టినంత కిక్

మొన్ననొక రోజు మనవరాలికి రాత్రింతా దగ్గు తగ్గకపోతే మెడికల్ షాపులో మందు తెద్దామని వెళ్ళేను. రాత్రి ఇబ్బంది పడకుండా నిద్ర పోవాలంటే కోడిన్ కలిసివున్న మందు అయితే మంచిదని తెలుసు. అందుకని కోడిన్ ఫాస్ కలిసివున్న దగ్గుమందు ఇమ్మని అడిగేను. షాపతను అయ్యా! కోడిన్ కలిసివున్న దగ్గుమందు మీకు వూరుమొత్తం మీద దొరకటం కష్టమండీ అన్నాడు. అదేమన్నాను. మా దగ్గర రెండు కంటే ఎక్కువ కోడిన్ కలిసి వున్న దగ్గుమందు సీసాలుంటె కేసు రాస్తున్నారు. రోజూ స్టాకు రెండు సీసాలు తెప్పించి అమ్మడం కుదరదు. ఇదండి సంగతీ. మీకు కోడిన్ లేని మందు ఇస్తాను పట్టుకెళ్ళమన్నాడు. కోడిన్ మందు బల్కు డ్రగ్ దొరకటం లేదా మరేమైనా విశేషమా అంటే. పక్కనే ఉన్న మెడికల్ కంపెని మనిషి అయ్యా! అదేమీ కాదు. ఈ కోడిన్ కలిసివున్న దగ్గుమందు రెండు సీసాలు ఒక సారి తాగేస్తున్నారు కిక్ కోసం. మందుషాపులవారు ప్రభుత్వానికి ఫిర్యాదుచేసేరట, కోడిన్ కలిపిన దగ్గుమందుతాగటం మూలంగా మా అమ్మకాలు తగ్గుతున్నాయని. ఘనత వహించిన ప్రభుత్వం వారు రెండు సీసాల కంటే ఎక్కువ స్టాకు పెట్టకూడదని ఆర్దరిచ్చారు. నాకు నిజంగా మతి పోయింది.

సరే మందంటే గుర్తుకొచ్చింది. మందుగురించి వేదంలో వుందిష. నిజం. వేదంలో సోమలతను తేవడం దంచడం. దానిని రకరకాల  పద్దతుల ద్వారా సోమరసాన్ని తయారు చేయడం ఉందిష. సోమలత ఉందంటారు మరి. అదే సుర అయ్యింది. బృహస్పతి కొడుకు కచుడు రాక్షస గురువు శుక్రాచార్యునివద్ద మృతసంజీవని విద్య నేర్చుకోడానికి వచ్చి దేవయానిచే ప్రేమింపబడి,రాక్షసులచేచచ్చి,మందుతో గురువు కడుపులోచేరి, గురువుని బతికించడానికి మృతసంజీవని  నేర్చుకుని గురువు పొట్ట చీల్చుకువచ్చి బతికి, గురువుని మరల బతికించుకుంటాడు. విద్య నేర్చుకుని,దేవయానిని ప్రేమించనందుకు దేవయానిచే శాపంపోందేడు. అప్పటినించి మందు కొట్టడం కూడదని శుక్రాచార్యుడు రూల్ పాస్చేసాడు. మన ప్రభుత్వంవారు తాగండీ, తాగండీ అంటున్నారు. దసరాల్లో మందు అమ్మకాలు 226 కోట్లట. అదివేరే సంగతి. తరవాత రోజులికి తాటికల్లు,ఈతకల్లు, ఇప్పకల్లు,జీలుగుకల్లు,తాటిచిగురు వగైరా మొదలైన వృక్ష సంబంధమైన మందు తయారు చేసేరు. ఈతకల్లు తగు మోతదులో రోజూ చెట్టునుంచి తీసిన వెంటనే తాగితే కుష్టువ్యాధి నివారిస్తుందంటారు. తాటిచిగురు ఎంతకాలం నిలవ ఉంటే అంత బాగుంటుందిష. గో.జిలలో కలిగిన మారాజులు పాతికేళ్ళకితం చిగురు కొడతారట. తరవాత కాలంకి మన దొరలు తెల్లగుర్రం, ఎర్రగుర్రం,నల్లగుర్రం, వేట్-69 వగైరా వగైరాలన్ని తయారుచేసి, నిలవచేసి మంచి మంచి సీసాలలో పొసి పైన మంచి మంచి అమ్మాయిలబొమ్మలేసి, మనకి బాగా అలవాటు చేసారు. నల్లమందు,గంజాయి, హెరాయిన్,వగైరా, వగైరాలు మత్తుమందులు.

అటుతర్వాత తినే ఆహారపదార్ధాలనుంచి మందు తయారుచెయడం మొదలుపెట్టేరు. అందులో పులిసిన గంజి,నల్ల బెల్లం ఊట, ద్రాక్ష,గోధుమనుంచి, ఓట్స్,బార్లీనుంచీ తయారు చేయడం నేర్చుకున్నారు. మన ప్రభుత్వం వారు హైదరాబాదులొ పండె అనాబ్ షాహి ద్రాక్షని మందుతయారుచేయడానికి లైసెన్సు ఇస్తూవుందష.  రోము సామ్రాజ్యంలో సైనికులు, ఆఫీసర్లు,అందరూ ఎక్కువగా వైన్ తాగడం మూలంగా ప్రభుత్వం కూలిపోయిందిట,మందులో జింకు ఎక్కువగా తీసుకోడాం మూలంగా.. మందనుకున్నాము కదా ఒక ముచ్చట చెప్పుకుందాం.

ఒకప్పుడు మా ఇళ్ళలో మందు ఫ్యాక్టరీ వుండేది. నిజం. నేను మందుకొట్టి చెప్పడం లేదు. మా ఇళ్ళలో మా చిన్నప్పుడు ఉదయం పూట చల్ది అన్నం పెట్టేవారు. అయితే దీనిని తరవాణీలో వేసి రాత్రి నిలవవుంచి పొద్దుట పెట్టేవారు. తరవాణీలో వేసిన అన్నంలో వేసంకాలంలో కొత్తావకాయ,వాము,ఉప్పుకొద్దిగా అవసరాన్ని బట్టి,నువ్వులనూనె  కలుపుకుని తింటె పుల్ల పుల్లగా కారంకారంగా బలేగా వుంటుంది. ఆ తరవాత ఒక క్వార్టరు తరవాణీ తాగితే క్వార్టరుబాటిల్ మందు కొట్టినంత కిక్ వచ్చేది. దీనిలో 10% నుంచి 15% ఆల్కహాలు ఉంటుంది. ఇది ఎంత ప్రసిద్ధి అంటే మండపేట పట్టణంలో ఒకపేటపేరు తరవాణీపేట. నిజం! కావాలంటే ఎవరినైనా కనుక్కోవచ్చు. దీని గురించి తెలియనివారికి దీని తయారీ రహస్యం చెబుతున్నాను. దీనికి పేటెంటు లేదు. అన్నం గంజి వార్చాలి. మొదటె హంసపాదు. కుక్కర్లో వండుకుంటే గంజి ఎక్కడనుంచి వస్తుంది మరి. వార్చిన గంజిలో కొద్దిగా నీరుపొసి నిలువ వుంచాలి మూడురోజులికి బాగా పులిసి కొద్దిగా పులిసిన వాసన వస్తుంది. కలవనియకుండ పైన వున్న నీటిని వేరుచేసుకుని మరలా కొత్త గంజిలో పోయాలి. పాత గంజి చిక్కటిది పారబోయచ్చు. ఇలా మూడు సార్లు చేసేటపాటికి అసలు సిసలైన తర్వాణీ తయారవుతుంది. రోజూ వాడు కున్న తరవాత మంచినీళ్ళు పోయడమే కుండలో. దీన్ని సాధారణంగా కుండలో పెట్టేవారు. మేము చిన్నపుడు ముఖ్యంగా వేసవిలో తర్వాణీ అన్నం తప్పనిసరిగా తినేవారం. ఇది తినడం మూలంగా ఆకలి బాగా ఉంటుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. శరీరం శ్రమకి తట్టుకుంటుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇంకెదుకూ ఆలశ్యం మందు ఫ్యాక్టరీ పేట్టేయండి. ………..

ALMOST NO POWER DURING DAY TIME

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మందుకొట్టినంత కిక్

 1. Babayya,

  Let me tell you one small incident, which i came across, when I was in Mumbai. In one of the Engineering Hostels in Bhabha Atomic Research Centre, you know the best talented Engineering students are only available. There was a sudden bet between friends….that they consume alcohol immediately. I was surprised that such alcohol is not available neither in the hostels nor in the nearby vicinity. Creamy layer kadaaaa…..??? He went to the hospital complainng that he was getting severe cough… and got two cough syrups….When we were all present, he consumed both the bottles..and won the bet, in the presence of all of us….

  Of course, in the universities, and other Medical College campuses etc., narcotic drugs, alcohol have become very common…..

  Anyhow it is very interesting… and an eye-opener to the present-day parents so that they can monitor their children. Linking with Taravani to Drugs is conveniently commendable.

  Regards

 2. శర్మ గారూ,
  ఇలాంటి విషయాన్ని కూడా బాగా రాసారండీ! మందు గురించి వేదంలో ఉన్న భాగాన్ని అంత చెప్పారు! అంత దాకా ఎందుకండీ? మనకి మధుపాన సముద్ర ప్రస్తావన కూడా ఉంది కదా! అలానే ఈ సుర అనేది క్షీర సాగర మధనం జరిగినప్పుడు వచ్చిన రెండవ విశేష వస్తువనీ దానిని దేవతలు తీసుకొనుట వలన వాళ్ళు సురలు అయ్యారనీ, దైత్యులు తిరస్కరించుట వలన అసురలు లేదా అసురులు అయ్యారనీ కూడా ఉంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s