శర్మ కాలక్షేపం కబుర్లు-షీకాయాకు- Marketing.

షీకాయాకు మార్కెటింగ్.
మా వూళ్ళో సంత, అదేనండి నాగరికులు అనే మార్కెట్ మాకు ఆదివారం.  ఇక్కడ ఆదివారం ఎందుకు మార్కెట్ పెట్టేరంటే, దానికి కారణం మా వూళ్ళో వున్న ఐ.యెల్.టీ.డీ.  ఈ సంస్థ వారాంతంలో, శనివారం జీతాల బట్వాడా చేసేది.  ఉద్యోగులుకి  ఆదివారం  శలవు, మార్కెట్లో కావలసిన  సరుకులు కొనుక్కునేవారు.  అందుకు మా వూళ్ళో ఆదివారం సంత.  అప్పుడు పనివారు వేలలో ఉండేవారు. ఎక్కువమంది స్త్రీలే, ఇప్పుడా కంపెనీ మనుషులను తగ్గించేసినా మా వూరి సంత రోజు మాత్రం మారలేదు.  ఒక ఆదివారం సంతకి నా శ్రీమతితో వెళ్ళేను. ప్రతి వారం నేను నాశ్రీమతి ఇద్దరం వెళ్ళి సంత చేయడం అలవాటు. సంతలో, ఒక ఆకుకూరలు అమ్మే అతను షీకాయి ఆకు అమ్మకానికి తెచ్చేడు.  నేను ఒక కట్ట కొనబోతూ వుండగా నాశ్రీమతి అదేమిటి,  ఎందుకని అడిగింది.  అమ్ముకునేవాడికి  అది  షీకాయాకని తెలుసు కాని దాని వుపయోగం, ప్రత్యేకత తెలియదు. నేను నాశ్రీమతికి ఆ ఆకు, పుల్లగా వుంటుందని జ్వరానికి, చాలా కాలంగా వదలని జ్వరాలకి, లోజ్వరాలకి మందని, మామూలుగా తింటే కూడా మంచిదని, ఆమెకు ప్రసూతి కాలంలో ఈ ఆకు పచ్చడి పెట్టినది గుర్తుచేసేను. దానికామె గుర్తుకొచ్చిందని ఒక కట్ట తీసుకుంది. నా పక్కనున్న ఒకతను ఏమిటండి! అని అడిగితే ఆ ఆకు విశేషం మళ్ళీ చెప్పేను.  ఇది చుట్టూ వున్న పదిమంది విన్నారు. కొట్టు వాడి దగ్గర పది కట్టలున్నాయి.  అన్ని కట్టలూ మరుక్షణం అమ్ముడైపోయాయి.  ఎవరో అడిగితే లేదన్నాడు. మళ్ళీ వారం తెస్తానన్నాడు.  నేనింకా డబ్బులివ్వలేదు.  డబ్బులివ్వ బోతూ వుంటే కొట్టువాడు వద్దండి అన్నాడు.  ఏమన్నాను.  అయ్యా! చెట్టు చిగిర్చినప్పటినుంచి ప్రతివారం చెట్టు ముళ్ళుగుచ్చు కుంటూ వుండగా కోసితేవడం ఎవరూ కొనక, పట్టుకుపోయి పారెయ్యడం తప్పించి ఎప్పుడూ ఆమ్ముడు కాలేదు.  మరొకటి  ఏమంటే  నాకు  దీని  గురించి  మీరు చెప్పేదాకా  తెలియదన్నాడు.  ఆకు కూరల్లో ఏ కూరవల్ల ఏ వుపయోగలున్నయో  నా దగ్గర తెలుసుకున్నాడు.  కొత్తది ఏదేనా కూర తెస్తే ముందు నన్ను అడిగి అప్పుడు అమ్మకం ఆరంభిస్తాడు.  ఏవరేనా నీకెలా తెలుసు ఈ విషయాలని  అడిగితే  పిలక పంతులుగారు చెప్పేరంటాడు.  అల్లా సంతలో నేనూ ఫేమస్ అయిపోయాను, ఆరోగ్య సూత్రాల మూలంగా.  ఇక అప్పటినుంచి  ఆకుకూరలికి  ఆరోగ్య సూత్రాలు వల్లించి ఆకూరలు అమ్మడం మొదలు పెట్టేడు.  నిజం అతని కొట్టు ఎప్పుడు ఖాళీ వుండదు మరి.  అప్పటినుంచి అతను నాకు ఆకు కూరలిస్తూ వుంటాడు, డబ్బులు తీసుకునే.  కొన్ని ఆకు కూరలు ఇంటిలో పండిస్తాము. పెరటిలో అరటికాయ ఉంటుంది తప్పక.  ఇప్పుడు పొట్లపాదు కాస్తూ వుంది. తినగా మిగిలినవి పంచిపెట్టేస్తాము, చుట్టు పక్కల వాళ్ళకి.  పక్కనున్న పెద్దబ్బాయి ఖాళీ స్థలం 400 గజాలలో కూరలు, పాదులు పెట్టేవాళ్ళం. ఓపిక తగ్గి రెండేండ్లనుంచి పెట్టటం లేదు.

మరో సంగతేమంటే మనం రోజూ చూసే ఆకు కూరలలో ఎన్ని ఔషధ విలువలున్నాయో! కొత్తిమీర,మునగాకు రక్తం పట్టడానికి పనికొస్తాయి, కరివేపకూడా.  వీటిలో ఇనుము శాతం ఎక్కువ. తెలగపిండికూర అని పల్లెలలో దొరుకుతుంది, ఇది కూర చేసుకుతింటె మూత్రాశయంలో రాళ్ళు కరుగుతాయి.  అదే పనిగా టమటా తింటే మూత్రపిండాలలో రాళ్ళు బయలుదేరుతాయి.  మెంతికూర శంఖుచక్రాలలో ( డయాబెటిస్, బి.పి లకి ముద్దుపేర్లు )శంఖానికి మంచి మందు. శంఖం నీటిలో వుండేది. మూత్రాశయానికి సంబంధించిన రోగం డయబెటిస్ అందుకు అది శంఖం, చక్రం లక్షణం గిర గిరా తిరగడం, బి.పి లో మొదటి లక్షణం తలతిరగడం ( బుర్ర తిరగడం కాదు. బుర్ర తిరుగుడంటే అర్ధంవేరు)

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-షీకాయాకు- Marketing.

 1. @@@
  చి.రవికి,
  షీకాయి చెట్టు నుంచిపంట. చింతకాయి,తుమ్మకాయిలావుంటుంది. దీన్ని రంగుల తయారీలో వాడతారు. దీన్ని పొడిచేసి కుంకుడుకాయి వాడినట్లువాడతారు. లేతాకు ఔషధ గుణంకలది. ఈ చెట్టుకి ముళ్ళుంటాయి. నాకామెంట్లన్నీ చదివితే నీకు ఇంకా బోధ పడుతుంది.

 2. @@@
  బులుసు సుబ్రహ్మణ్యంగారు,
  ఆకు పుల్లగా వుంటుంది.చూడటానికి కొద్దిగా చింతాకును పోలివుంటుంది. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి బాగుంటుంది. పట్నవాసాలలో దొరకడం కష్టం. ఎవరేనా ఆకు కూరలవారిని తెచ్చిపెట్టమనచ్చు.పల్లెటూరి వాళ్ళంకదా! మీకు తెలియని ఒక విషయం చెప్పగలిగినందుకు ఆనందం. ధన్యవాదాలు.

 3. @@@
  జ్యోతిర్మయిగారు,
  షీకాయని రంగులతయారీలో వాడతారు. దీనిని జుట్టును రుద్దుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. ఈకాయలు చింతకాయలలా వుంటాయి. ఇవి ఒక చెట్టుకు కాస్తాయి. ఆ చెట్టుకు ముళ్ళు కూడా ఉంటాయి.లేతాకు పచ్చడి బాగుంటుంది. ఆకు ముదిరితే పనికి రాదు. ఈనెలతో కూడా ముళ్ళు వుంటాయి. చాలా పదునుగా వుంటాయి. మీకు తెలియదన్నట్లు చెప్పేను! దీనినే చాదస్తం అంటారు కదా! ధన్యవాదాలు.

 4. @@@
  జిలేబిగార్కి
  వడియాలొద్దు-అప్పడాలు చాలన్నాడట వొకడు. ఉన్నది చాలుగాని,మీ అభిమానానికి కృతఙ్ఞతలు.

 5. @@@
  రసఙ్ఞగారు
  తోటకూర,గోంగూర,చుక్కకూర,నెల్లికూర,పొన్నగంటికూర,బచ్చలికూర,బలుసాకు,చింతచిగురు అబ్బో ఎన్నో! చెప్పుకుంటూ పోతే ఇదే మరో టపా అయ్యేలా వుంది. ధన్యవాదాలు.

 6. షీకాయాకు పచ్చడి ఒక్కే ఒక్కసారి తిన్నాను. తర్వాతెప్పుడూ మళ్ళీ దానిని చూడలేదింక. చాలా మంది కూరలో కరివేప వేసుకుంటారే కాని తిననే తినరు. తీసి పక్కన పెట్టేస్తారు.మాష్టారూ చాలా మంచి విషయం చెప్పారు.మీకు బోలెడు ధన్యవాదాలు.

 7. శర్మ గారు కొత్తగా మరో పెద్ద టపా తేవాల్సిందే మరిన్ని విశెషాలతో – పిలక పంతులు గారి పిచ్చాపాటి అన్న పేరుతో!. మరిన్ని విశెషాలు రాస్తారని ఆశిస్తూ

 8. చాలా చక్కగా చెప్పారు! ఈ షీకాయ ఆకు పచ్చడి చేస్తుంది మా అమ్మ. మీరు చెప్పిన ఈ తెలగపిండి ఆకుని కొంతమంది కొండపిండి ఆకు అని కూడా అంటారు. ఇంకా నల్లేరు కాడల పచ్చడి వలన అర్త్రిటిస్ (కీళ్ళ నొప్పులు తగ్గుతాయి). అలానే పోన్నగంటికూరని కూడా కంటి చూపుని పెంచడానికి వాడతారు దానినే పోయిన కంటి కూర ఇది తినడం వలన కనుచూపు లేని వారికి కూడా వస్తుందని అమ్మమ్మ చెప్పేది. గంగబావిరాకు మొదలయినవన్నీ కూడా అమ్మ వండుతూ ఉంటుంది. గుంటకలగరాకుని నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి మందుకింద ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటారు దీని వలన లో జ్వరాలు పోతాయి. చక్కని టపా నా వ్యాఖ్య కూడా పెద్దదయ్యిన్దనుకుంట? మీరు చెప్పిన ఈ కబుర్లన్నీ చదవగానే ఇంటి మీదకి గాలి మళ్ళి మాటల గోదావరి పొంగింది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s