శర్మ కాలక్షేపం కబుర్లు- ప్రయాణం

ప్రయాణం

శనివారం మధ్యాహ్నం బయలుదేరి శ్రీమతితో కలిసి, పుట్టిన వూరు ప.గో.జిలోని గూటాల వెళదామని నిర్ణయించుకున్నాను. కారణం అన్నయ్య, అతని పిల్లలు లింగార్చనకి ఏర్పాట్లు ఆదివారం చేసుకుని రమ్మని పిలవడం. ఆదివారం అఖండగోదావరీ స్నానం చేసి లింగార్చనలో పాల్గొని, మరుసటిరోజు కార్తీక సోమవారం కనక అఖండ గోదావరీ స్నానం చేసి, పట్టిసం కొండపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని దర్శించి, ఉపవాసం వుండి ఇంటికొచ్చి మిగిలిన కార్యక్రమం పూర్తి చేసుకోవాలని కోరిక. శనివారం మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం కి అక్కడికి చేరుకోవాలని కోరిక. శనివారం ఉదయ కార్యక్రమాలు పూర్తి చేసుకుని టిఫిన్ చేస్తుండగా నా స్నేహితునినుంచి ఫోన్ వచ్చింది. ఒక్క సారి వస్తేచిన్న పని చూసి ఒక్క అరగంటలో  వెళ్ళిపోవచ్చని, నా ప్రోగ్రాం చెప్పేను, తొందరగా వెళ్ళిపోవచ్చంటే,  బయలుదేరి వెళ్ళాను.  ఒక చిన్న కమిటీకి మెంబర్లని నామినేట్ చేయాలి. రెండువర్గాలమధ్య సయోధ్య చెయ్యాలి.  నేను వెళ్ళగానే కార్యక్రమం మొదలుకాబోయే సమయంలో నా స్నేహితుని దగ్గర బంధువు ఒకాయన వచ్చాడు. ఎక్కడి కార్యక్రమాలు అక్కడే ఆగిపోయాయి. నాకు అర్ధం కాలేదు. సామాన్య కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకు ఇష్టం లేక బయటకి వచ్చేసాను. పన్నెండయింది. వచ్చినతను వెళ్ళడు. తగువుతేలదు. నాకు బయటకొచ్చిన తరవాత తెలిసిందేమంటే ఈ వచ్చిన వ్యక్తికి సయోధ్య ఇష్టం లేదు. పని పూర్తి కాదనుకుని, నేను వెళ్ళిపోతున్నాననిచెప్పి
వచ్చేసాను. నా వెనక నా స్నేహితుని బంధువు వచ్చేసాడు. నేను ఇంటికి రాకుండానే మళ్ళీ కబురొస్తే వెళ్ళేను. మాటలు సవ్యంగా జరిగిపోయాయి. కమిటీ మొత్తంగా ఏకగ్రీవంగా అమోదం పొందింది, కాని ఒక్క స్త్రీ పేరు దగ్గర పేచీ వచ్చేసింది. ఒకరుకాదంటే ఒకరు కావాలన్నారు. తర్జనభర్జన తరవాత మరొక పేరు కోసం అలోచన మొదలైంది. ఇది ఎంతకూ తేలలేదు. మూడయిపోయింది. నాకు సహనం నశించింది. కాని చేయగలది లేదు. ఏమిటి! ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి వేళ్దామనుకుంటే ఈ అడ్డాలేంటో ఎందుకొస్తున్నాయో అనుకుంటూ, ఇవి ఒకరకంగా పరీక్షలు, మన సంకల్పం ఎంత స్థిరమైనదో తెలుసుకోవడానికి భగవంతుడు చేస్తున్న పరీక్ష అనుకున్నాను. నేను వెళ్ళవలసినదూరం డెభ్భయికిలోమీటర్లు. కాని ఆ సమయంలో తగిన ప్రయాణ సాధనాలు దొరకవు. ఇదీ బాధ. మోటార్ సైకిల్ మీద వెళ్ళచ్చు, కాని బండి పై దూర ప్రయాణం మానేసి చాలా కాలమైనది. దానికితోడు చలి, కూడా శ్రీమతి వుందికదా.ఎలా! ఒకళ్ళకే బండి మీద ప్రయాణం కష్టం అనుకుంటే ఇద్దరు ప్రయాణం ఎలా? చూద్దాం ఆయనే ఏదో మార్గం చూపక పోతాడా అని భగవంతునిపై భారం వేసివున్నాను. మొత్తానికి ఆ పేరు వచ్చేటప్పటికి మూడయింది. ఆపేరు వచ్చిన తరవాత ఇదంతా కంప్యూటర్ కిచేర్చి ప్రింటు ఇచ్చేటప్పటికి మూడున్నరైంది. ఉదయం నుంచి భోజనంలేదు. సమయం దాటిపోయింది. విషయం తెలిసున్న స్నేహితుడు కారు పంపుదామనుకుని నా ప్రయాణం పట్ల అశ్రద్ధ చేసాడు. నన్ను కారులో పంపగలుగుతాననుకున్నాడు, ఇటువంటి సమయాలలో అల్లా చేయడం అతనికి అలవాటే.. దురదృష్టం, కారుని నా స్నేహితుని తల్లి తీసుకెళ్ళింది, ఆ విషయం ఇతనికి తెలియదు. ఎప్పుడొస్తుందో తెలియదు. సరే బయలుదేరుదాం ఎలా జరగాలనివుంటే అల్లా జరుగుతుందనుకుంటు బయలుదేరాము. టాక్సీ పెడతానన్నాడు. నాకిష్టం లేక వద్దన్నాను.  బస్ స్టాండుకొస్తే మేమువెళ్ళవలసి దిశకి వ్యతిరేక దిశలో వరసగా ఆరు బస్సులు వెళ్ళాయి. వెళ్ళవసిన దిశలో బస్సులేదు. ఏమిచేయాలో తోచలేదు. ఈ లోగా ఒక ఆటో వాడు నేను వెళ్ళవల్సినదిశలో వెళుతున్నాడు. నాకు ఆటోలలో దూర ప్రయాణం చేయడం భయం. కారణాలు రెండు. ఒకటి ఓవర్లోడు. రెండు నియంత్రణలేని వేగం. నా అదృష్టం కొద్దీ మేము ఇద్దరం మరొకరు తప్పించి అందులో మరొకరు ఎక్కలేదు. మమ్మల్ని అతను ఒక పెద్ద వూరుకి చేర్చ గలిగేడు. అక్కడనుంచి మరొక ముఫై కిలోమీటర్లు ప్రయాణం ఉంది. చీకటిపడబోతోంది. బస్సు వచ్చే జాడలేదు. మళ్ళీ ఆటోయే గతి!  ఈ సారి మొదటి సారిలా అదృష్టం వరించలేదు. నానా అవస్థా పడి చివరికి చేరుకునేటప్పటికి రాత్రి ఎనిమిదయింది. ఇదంతా యెందుకు చెప్పాల్సి వచ్చిందంటె ఒక ఆటొలో మొత్తం దూరం ఒక్కళ్ళమే వెళ్ళాలంటే అయ్యే ఖర్చు డెభ్భయి కిలోమీటర్లకి ఏడువందలు. సామాన్యుడు చేయగల ఖర్చుకాదని నా అభిప్రాయం. కాదు! నేను చేయలేని, తలకుమించిన ఖర్చు. మామూలుగా ఒకరిప్రయాణానికి, ఆదూరానికి అయ్యేఖర్చు ముఫై అయిదు రుపాయలు.  అనగా తొమ్మిదిరెట్లు అదనపు, అనవసర ఖర్చు భరించడం నాలాంటి సామన్యులకు కుదురుతుందా? ఏమైతేనేమి అక్కడకు చేరుకున్నాము. ఇప్పటికీ పల్లెలకి ప్రయాణాలిలాగేవున్నాయి. మరునాడుదయమేలేచి, సంకల్పంచెప్పుకుని అఖండగోదావరీ స్నానంచేసాము. ఆదివారం కార్యక్రమం పూర్తి చేసుకుని సోమవారం మళ్ళీ గోదావరీ స్నానం చేసి, స్వామిని దర్శించుకుని వద్దామనుకున్నది కాస్తా కొండెక్కింది, సోమవారం వుదయమే బయలుదేరి వచ్చెయ్యవలసి వచ్చింది, అనుకోని కారణం మూలంగా. అనుకున్నవన్నీ జరగవు. ప్రాప్తమున్నంత తప్పదు.

2 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- ప్రయాణం

  1. టపా టైటిల్ అఖండ గోదావరీ-ఆటో అగచాట్లు అని పెట్టి ఉండవలె ! ప్రయాణం లో పదనిసలు ఎక్కడైనా తప్పవనుకుంటాను. కొన్ని మార్లు మరీ చీకాకు వేస్తుంది. దీన్ని మరిపించే మంత్రం మీరు చెప్పిన – ఆ చిట్కా –

    “ఇవి ఒకరకంగా పరీక్షలు, మన సంకల్పం ఎంత స్థిరమైనదో తెలుసుకోవడానికి భగవంతుడు చేస్తున్న పరీక్ష” అనుకోవడం ! చాలా మంచి మంత్రం. .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s