శర్మ కాలక్షేపం కబుర్లు-పాపం చిరంజీవి.

పాపం చిరంజీవి

సత్తిబాబు ఈమధ్య కనపడలేదని నేనే అతనింటి కెళ్ళాను. ఎవరో వున్నారు. మళ్ళీ వస్తానని వచ్చెయ్యబోతుంటే, రండి ఇతను మన మిత్రుడుఅని పరిచయం చేసి, అతనితో మాటల్లో ములిగిపోయాడు. నేను వింటూ కూచుండిపోయాను.

మా కొత్త మిత్రుడు ఇలా చెప్పుకొచ్చేడు.  నాలుగేళ్ళకితం పార్టీ పెట్టకముందు రాజాలా వుండేవాడు చిరంజీవి ఎలా అయిపోయాడు. పార్టీ పెట్టినపుడు ఎంత హడావుడి చేసేడు. పార్టీ పెట్టినపుడు అందరూ సామాజిక న్యాయానికి చిరంజీవి పాటు పడతాడని అనుకున్నాము. టిక్కట్లిచ్చేటపుడు ఎందుకో తేడాలొచ్చేసాయి.  అనుకున్నట్లు టిక్కట్లు ఇవ్వలేదు. మరో అనుమానం కూడా వుంది ప్రజలలో.  ఇతని చేత రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం అధికారంలోకి రాకుండా వుండేందుకు పార్టీ పెట్టించాడని కూడా వదంతి.  అనుకున్న వారికంటే తక్కువ మంది ఎన్నికయ్యారు.  ప్రజలు అంతే చేసారనుకున్నారు.  రాజశేఖరరెడ్డి బతికుంటే పరిస్థుతులెలా వుండేవో తెలియదు కాని, ఆయన పోయిన తరవాత చిరంజీవిలో మార్పు వచ్చింది.  కాంగ్రెస్ వారికి ఎందుకు చేరువయ్యాడో తెలియలేదు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నాడు.  ఏమి ఆశించి పార్టీని కాంగ్రెసులో విలీనంచేసాడో నేటికి ప్రజలకి తెలియదు.  ప్రజలికి మతి పోయింది. కాంగ్రెస్  పార్టీకి ఎప్పుడూ కావలసినదిఒక్కటె. అధికారంలో వుండటం. దానికోసం ఏమయినా చేస్తుంది. అది ఆపార్టీ లక్షణం. విభజించి పాలించడం అనే రాజనీతిని తెల్లవాళ్ళకంటె బాగా అకళింపు చేసుకున్న పార్టీ అది.  ఆ పార్టీ దాని స్వంత మనుషులనే కరివేపాకులా ఏరి అవతల పారేస్తుంది, అవసరం తీరినతరవాత. ఇప్పుడు అహమద్ పటేళ్ళు  మాట్లాడతారు, నెగ్గేదాకా!  ఇది దాని అలవాటు. కోకొల్లలూ అనుభవాలు. ఎంతదాకనో ఎందుకు తెలుగు బిడ్డ పి.వి ప్రధాని అయి పార్టిని బతికించి అధికారంలో నిలిపితే, తరవాత ఆయన మీద కేసు వస్తే అది మాకు సంబంధం లేదన్న పార్టీ అది. అలాగే ఆయన చనిపోతే పార్టీ ఆఫీసులోకి శవాన్ని కూడా రానివ్వని పార్టీ. ఢిల్లీలో అంత్యక్రియలుకూడా జరగనివ్వకుండా చేసిన ఘనత కూడా దానిదే. ఆయనకు స్మారకం ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగా చేస్తున్న పార్టీ. ఇప్పుడు చిరంజీవి పరిస్థితి దానికి తేడాగా లేదు, వుండదు, వుండబోదు. ఈ రోజు అవసరం తీరిపోతే రేపు మరిచిపోతుంది. ఎన్నాళ్ళనుంచి ఇతనికి సముచిత స్థానం ఇస్తామని ఊరుస్తున్నారు. ఏమిచ్చారు. రేపు మళ్ళీ తిరుపతే…….. అంటూ వూగిపోయాడు. నేను ఏమీ మాట్లాడాలో తెలియక,కనపడేదంతా నిజం కాకపోవచ్చు. అతనికి సముచిత స్థానం ఇవ్వచ్చు, మనకు వినపడే కనపడే దానికి భిన్నంగా పరిస్థితులుండవచ్చు .చిరంజీవి చిన్నపిల్లాడుకాదు కదా! కొంచం వోపిక పట్టమన్నాను. దానికతను మరీ రెచ్చిపోయేలా కనపడితే మా మిత్రుడు,సత్తిబాబు ఆపుచేసాడు. మళ్ళీ వస్తానని చెప్పి, నేను లేచి వచ్చేసాను. పాపం చిరంజీవి.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-పాపం చిరంజీవి.

  1. నాకు తెలిసినంత వరకు మా తిరపతయ్య నిఖార్సైన మనిషి. కష్ట పడి పైకి వచ్చిన వాడు. కష్టే ఫలే అన్న దానికి అతను నమూనా. ఆతను పార్టీ పెట్టడం కూడా ఈ కోవలోకి చెందినదే అనుకుంటాను. కాలం కలిసి రాలేదు అంతే – రామారావు గారు మొదటి తరం. చిరంజీవి రెండవ తరం. దానికి దీనికి వ్యత్యాసం ఉంది రాజకీయం వరకైతే. (సినిమా ఫీల్డ్ లో ఇద్దరూ స్వయం కృషి వల్ల వచ్చిన వాళ్లే) రాజకీయం లో రామారావు మొదట వచ్చిన ప్రభంజనం. కాబట్టి దాని ‘కష్ట’ ఫలితం వేరు.(enterpreneur) అనుకోవచ్చు రామ రావు గారిని. ఆ తరువాత సినీ రంగం నించి వచ్చిన వారలు fallowers – far lowers!

    ఇక కాంగ్రెస్సు గురించి మీరు చెప్పినది సరిఐన మాట. ఒక్కటే ఒక్క మినహాయింపు, ఇప్పటిదాకా వారు నెహ్రు ఫేమిలీ ని పక్కకు దొల లేదు. ఆ సమయమూ రాబోయే కాలం లో రావచ్చేమో. కరివేపాకు వద్దనుకుంటే ఎరెయ్యడం వల్లె ఆ పార్టీ ఇన్ని దశాబ్దాలు గా నిల దొక్కు కుని వుంది. అలా ఎరెయ్యని పార్టీ లు కాల గతిలో మన దేశం లో హుష్ కాకీ అయిపోయాయి కూడా. పార్టీ పదవి రాజ్యం వీర భోజ్యం. !

    చీర్స్
    జిలేబి.

వ్యాఖ్యలను మూసివేసారు.