శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు

                                                            తిట్లు.

కామ,క్రోధ, మోహ,లోభ,మద, మాత్సర్యాలు అనే ఆరూ శత్రువులూ అన్నారు, మనిషికి. ఇందులో రెండవదైన క్రోధానికిలోనుకాని వారు వుండరు. దాని పర్యవసానమే తిట్టు. మహామహులే దీనికి దాసులైపోయారు. కుబేరుని పుత్రులు మందుకొట్టేసి, స్త్రీలతో నగ్నంగా కొలనులో జలకాలాడుతూవుంటే అటుగా నారద మహాముని వచ్చారు. నారదుడిని చూసిన స్త్రీలు కొలను బయటకు వచ్చి బట్టలు కట్టుకుని మునికి నమస్కారం చేస్తారు. కుబేరపుత్రులు ధన మదంతో పట్టించుకోరు. అప్పుడు నారదుడికి కోపం వచ్చి శాపం ఇస్తాడు. బట్టలు అవసరం లేని జన్మ ఎత్తమని. అప్పుడు మేల్కొన్న కుబేర పుత్రులు కాళ్ళమీద పడితే మద్దులైపుట్టి బాల కృష్ణుని చేత కూల్చబడి మీ లోకానికి చేరతారంటాడు. ఇది వొక వుదాహరణ మాత్రమే. ఇటువంటివి కోకొల్లలు. కోపానికి దుర్వాసో మహామునిని చెప్పుకుని మరొకరిని చెప్పుకోవాలిమరి. బ్రహ్మ శ్రీ చాగంటివారు వీటిని శాపానుగ్రహ వాక్కులన్నారు. తద్వారా తప్పుచేసినవారికి నిష్కృతి లభిస్తుందిట.

తరువాతికాలంలో చాలామంది తిట్లుతిట్టినవారున్నారు. అందులో ప్రఖ్యాతి కాంచిన వారిని మనం స్మరించుకోవాలి కదా! మొదటివాడు తెనాలి రామ కృష్ణుడు. తెలియనివన్ని తప్పులని దిట్టతనాన  పలకగ రాదురోరి, పిశాచపుపాడెగట్ట, నీ పలికిన నోట దుమ్ముపడ ప్రగడరాణ్ణరసా తుసా! బుసా! నాకు పూర్తిగా గుర్తులేదు మరి. ఈ పద్యం అందరికీ వచ్చు అందుకే చెప్పేను. పెద్దవాడి చేత తిట్లు తిన్నా, ప్రగడరాజు నరసకవి పాపం చరిత్రలో నిలిచిపోయాడు, తెనాలి రామలింగని తిట్టుమూలంగా. లేక పోతే ఇతని పేరు ఈనాడు ఎవరూ తలిచేవారు కాదు కదా! తెలుగులో ఇలా తిట్టిన వారిలో ప్రసిద్ధుడు వేముల వాడ భీమకవి పద్యాలు గుర్తులేవుకాని ఈయనా పడతిట్టేడు. పద్యాలెవరేనా చెబితే సంతసం. అదిగో అప్పుడే ఒక అమ్మాయి చెప్పేస్తోంది, పద్యాలు వినండి.

నేటి రోజుల్లో తిట్లు బాగా తిట్టకలిగిన వాడు గొప్ప రాజకీయ నాయకుడు. దీనికి తిరుగులేని సాక్ష్యాధారాలక్కరలేదు. ఇది మన అందరికి పరిచయం కనక. ఎలా  తిట్టుకోవచ్చో మనం ఈ మధ్య రాత్రి రెండు గంటలదాకా టి.వి చూసి నేర్చుకోలా! అమ్మయ్య! అలవాటు చేసుకోండి అవసరం పడచ్చు.   కొంతమందికి కోపం వస్తే మాట పెగలదు. అటువంటివారు నిజంగా అదృష్టవంతులే. ఎందుకంటే తిట్టలేరు కనక. కొంతమంది తిట్టలేరు కాని గొణుగుతారు, కురుపు సలిపినట్లుగా గొణుగుతారు. వీరిని భరించడం చాలా కష్టం. తిట్టినట్లు కనపడరు. పాపం కొంతమందికి కుళాయి తిప్పితే నీళ్ళొచ్చినట్లు నోరు విప్పితే వచ్చేవి, తిట్లే. అవికూడా కోండొకచో బూతులే, అయీ వుండవచ్చు కూడా. కొంతమంది దీనికి ప్రసిద్ధికూడా. కొంత మంది నోటికి జడిస్తే, కొంతమంది కంటికి జడవాల్సిన రోజులొచ్చాయి, అదేనండి ఏడుపుకి. ఈ మధ్య ఈ ఏడుపు, తిట్లకి కూడా ట్రయినింగు ఇస్తున్నారట. అదీ వింతే. కాదు అవసరం మరి. నేడు బ్లాగుల్లో ఈ తిట్లున్నాయిట.

ఇంక నా విషయానికొస్తే నాకు కోపం రాదు, మా శ్రీమతి నడగద్దు. ఆవిడని అడిగితే వచ్చే సమాధానం నేనే చెప్పేస్తే పోలా!….. మా అయన చాలా బుద్ధిమంతుడండి. ఎప్పుడు కోపం రాదు, కాని సంవత్సరానికి రెండు సార్లే వస్తుందండి, కోపం. అలా వచ్చినకోపం ఆరు నెలలుంటుందండి. అంటుంది. మరి నాకు కోపం లేదుగా……. అదిగో మీరలా అనుమానంగా చూస్తేమరి……..కొంతమందికి వున్న మాటంటె వులుకెక్కువని………వచ్చేస్తుంది. నిజం చూడండి… ఈ టపా నీ మోహంలా వుందంటే నాకు ఆనందంకదూమరి………నా మొహం బాగోలేదా! బాగుందిగా! అందుకు మీరు ఇది బాగోలేదనరు. ఏడుపు మొహంతో వున్న శ్రీమతిని/ శ్రీ వారిని నువ్వు ఏడుపులోకూడా అందంగా వున్నావోయ్ అనండీ…….ఆవిడ/ ఆయన చేతిలో ఏమీ లేకుండ చూసుకుని కొద్ది దూరంగా వుండి మరీ అనండి. తరవాత జరిగేదానికి నా బాధ్యతలేదు మరి. కోపమున బుద్ధి కొంచమై ఉండును …. అన్నాడు శతక కారుడు.

ఇక సాధారణంగా నీళ్ళు కుళాయి దగ్గర, నీళ్ళు దొరకవేమో అనే బాధతో ముందు పట్టుకోవాలనే తపనలో జరిగే గొడవలో తిట్లదే అగ్రస్థానం. ఆ తిట్టుకునేటప్పుడు వారూ స్త్రీలే అయినా తిట్టేతిట్లు వినడానికి కూడా భయంకరంగా వుంటాయి. ఇక పల్లెలలో కోపంవస్తే నడిచేది బూతు పంచాంగం. సినిమాలలో తిట్లుగురించి చెప్పలేను కాని హాస్య బ్రహ్మ జంధ్యాలవారి తిట్లదండకం బాగా గుర్తు….. ఇప్పుడు మీరయినా తిట్టండి….మరెందుకూ ఆలస్యం……

ప్రకటనలు

17 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు

 1. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు – కష్టేఫలే(పునః ప్రచురణ)

 2. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు – కష్టేఫలే(పునః ప్రచురణ)

 3. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు – కష్టేఫలే(పునః ప్రచురణ)

 4. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు – కష్టేఫలే(పునః ప్రచురణ)

 5. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు – కష్టేఫలే(పునః ప్రచురణ)

 6. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు – కష్టేఫలే(పునః ప్రచురణ)

 7. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపం కబుర్లు-తిట్లు – కష్టేఫలే(పునః ప్రచురణ)

 8. @
  శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారికి!,
  చాలా రోజులనుంచి దర్శనంలేదు. బ్లాగర్లంతా గగ్గోలెత్తిపోతున్నారు. బుజ్జిపండు చదువు రోజున మీగురించి చాలా విచారించాము. దర్శనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వ్యాఖ్య చేసినందుకు వేనవేల నమస్కారాలు.

 9. తిట్టడం లో పెద్దన గారు చెప్పిన పద్యం,

  గంతుల్మానుము కుక్కుటాధమ, దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
  ప్రాంతోలూఖల మూల తండుల కణగ్రాసంబునన్ క్రొవ్వి
  దుర్దాంతా భీల విశేష భీషణ ఫణాంతర్మాంస సంతోషిత
  స్వాంతుడైన ఖగేంద్రు కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే

  పెద్దన గారు తననే అన్నారనుకొని ధూర్జటి గారు రోషం తో వెంటనే అన్నారట

  స్థాన విశేష మాత్రమున తామరపాకున నీటిబొట్ట నిను
  పూనిక మౌక్తికం బనుచు పోల్చిన మాత్రన ఇంత గర్వమా
  మానవతీ శిరోమణుల మాలికలందున గూర్ప వత్తువో
  కానుక తీయ వత్తువో, వికాసము దెత్తువో, విల్వదెత్తువో

  (పద్య పాదములలో కానీ మరేమైనా కానీ తప్పులున్న మన్నించవలెను.)

 10. బాగుంది తిట్లోపాఖ్యానం! అదిగో అప్పుడే ఒక అమ్మాయి చెప్పేస్తోంది, పద్యాలు వినండి. ఆ అమ్మాయిని నేనే అయితే ఇదిగో వినండి మరి! ఈ పద్యాన్ని నేను వివరించక్కర్లేదు సందర్భం బాగా తెలిసిందే కనుక ఇలా చదివేయండి.

  గొప్పలు చెప్పుకొనుచూ నన్ను కూటికి పంక్తికి రాకు మంచూ ఈ
  త్రిప్పుడు బాపలందరును తిట్టిరి కావున నొక్క మారు ఈ
  అప్పములన్ని కప్పలయి, అన్నము సున్నముగాగ మారుచున్
  పప్పును శాకముల్ పులుసు పచ్చడులున్ చిరు రాళ్ళు కావుటన్.

 11. కోపమున బుద్ధి కొంచమై ఉండును …. అన్నాడు శతక కారుడు. అసలు అన్నింటికంటే అవలక్షణం ఇదే కదూ…తిట్లకు మూల కారణమూ ఇదే..వదలడం కష్టమైనదీ ఈ కోపమే. పురాణాలకు లంకె పెట్టి చెప్పిన విధానం బావుంది బాబాయిగారూ.. ఈ విశేషాలు పిల్లలకు కథల్లో చెప్పుకుంటాము.

 12. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని ఉంది కాని సమయాని కేవీ గుర్తుకొచ్చి చావటంలా! తీరిగ్గా తిడతాను లెండి ప్రస్తుతానికి మీ వ్యాసాన్ని ఆనందించనివ్వండి మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s