శర్మ కాలక్షేపంకబుర్లు-భోజరాజు/ కాళిదాసు.

భోజరాజు-కాళిదాసు.

భోజరాజుకి ఒక సారి కోపం వచ్చి కాళిదాసును తన ఆస్థానంనుంచి వెళ్ళిపోమన్నాడు. కాళిదాసు వెళ్ళిపోయిన తరవాత చాలా బాధపడతాడు. ఈ వియోగం తట్టుకోలేక భోజరాజు మారు వేషంలో కాళిదాసును వెతకడానికి బయలుదేరి వెళతాడు. కాళిదాసు ని చూస్తాడు. భోజరాజును కాళిదాసు గుర్తించలేడు. ఎక్కడనుంచి వస్తున్నావని భోజరాజుని అడుగుతాడు. నేను భోజరాజు రాజ్యం నుంచి వస్తున్నా అని చెబుతాడు. అదేమి కవి, పండితులను ఆదరించే భోజరాజు సంస్థానంనుంచి ఎందుకు వెళ్ళిపోతున్నా వని అడుగుతాడు. దానికి భోజరాజు, భోజరాజు చని పోయాడు అందుకు వెళ్ళిపోతున్నా అని చెబుతాడు. కాళిదాసు వెంటనే యీకింది శ్లోకం చెబుతాడు.

ఆద్యధారా నిరాధారా నిరాలంబా సరస్వతీ
పండితాః ఖండితా సర్వే భోజరాజే దివవంగతే

శ్లోకం పూర్తి అయిన వెంటనే భోజరాజు మరణిస్తాడు. అప్పుడు కాళిదాసు, చనిపోయినది భోజరాజుగా గుర్తించి మళ్ళీ ఈ కింది శ్లోకం చెబుతాడు. ఆపుడు భోజరాజు పునర్జీవితుడవుతాడు.

ఆద్యధారా సదా ధారా సదాలంబా సరస్వతీ
పండితాః మండితా సర్వే భోజరాజే భువంగతే

భానుగారి బ్లాగులో భోజనం దేహిరాజేంద్ర చూసిన తరవాత రాయలనిపించింది. వారికి నా కృతఙ్ఞతలు

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భోజరాజు/ కాళిదాసు.

  1. దివవంగతే (దివంగతే కి ముద్రారాక్షసం) మరియ భువంగతే సరైన పదాలు కావని నా అనుమానం.
    బహుశః సరయిన పదాలు దివంగతః మరియు భువంగతః అయి ఉండవచ్చునేమో.

    • తాడిగడప శ్యామలరావుగారికి,
      నాకూ సంస్కృతం తెలియనిదే!. ఈ శ్లోకాలు శృత పాండిత్యమే. ఎవరేనా తెలిసినవారు చెప్పాలి, ఇందులో తప్పు వొప్పులు. నాకు ఇందులో నచ్చినది ఒకటి రెండు అక్షరములు మార్పుతో మొత్తం భావం మారిపోవడం. ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.