శర్మ కాలక్షేపంకబుర్లు-నమ్మకం/సెంటిమెంటు.

నమ్మకం/సెంటిమెంట్

నమ్మకం/సెంటిమెంట్  అనేది  వొక్కొక్కరికి  వొక్కొక్కవిధంగా  వుంటుంది.  ఆ! మాకేమీ సెంటిమెంట్  లేదనేవారికి  కూడా  ఏదో వుంటుంది, అయితే  వారు  చెప్పరు  కనక తెలియదు.  ఇది  మూఢనమ్మకమని  అంటారు.  ఏమో మరి!  చెప్పలేను.  దీని వల్ల ఎవరికి బాధ లేదు,కనక ఇబ్బందిలేదు.

చిన్నపుడు పరిక్షకి వెళ్ళేటపుడు, అమ్మ ఎదురొస్తే బాగా రాస్తానని, అమ్మని శకునం రమ్మనేవాడిని, అదో సెంటిమెంటు.  పరిక్ష పేపరు  కుడి చేత్తో  పుచ్చుకోడం  వొక నమ్మకం.  ఆన్సరు  పేపరు  రెండు పక్కల  మార్జిన్ వుండేలా  మడతపెట్టి  ఆ మధ్యలో రాయడం  అలవాటు.  అలాగే  బండి  కుడి వైపు నుంచి  స్టార్ట్ చేసిన  తరవాత  ఎడమ వైపునుంచి  బండి మీద కూచోడం నమ్మకం.  డబ్బు  లెక్కపెట్టేటపుడు  కుడి చేత్తో పట్టుకుని  ఎడమ చేతికి  మార్చుకుని  లెక్క పెట్టడం  నమ్మకం.  బట్టలు తొడిగేటపుడు చొక్కా ముందు తొడగడం సెంటిమెంటు.  అబ్బో! ఎన్నో  చెప్పుకుంటూ  పోతే చాలా వున్నాయి.  నేటి  రోజుల్లో  బ్లాగు  రాయడం  మొదలెట్టిన  తరవాత,  ముందుగా వెయ్యవలసిన  పోస్ట్  రెడీగా  వుంచుకుని  అప్పుడు  బ్లాగ్ ఓపెన్  చెయ్యడం నమ్మకం, టపా పేలుతుందని.  బ్లాగులు చూసేటపుడు ఎవరో తెలిసినవారి బ్లాగ్ చూసి అప్పుడు మిగిలినవి చూడటం సెంటిమెంటు.  ఇదేమిటి,  ఇలా చెయ్యడం తప్పా?.  కాదు, వొక సారి అలా చేసినపుడు మంచి జరిగింది కనక అల్లా చేయడం మంచిదనిపిస్తుంది. మరొకలా  చేసినా  బాగానే వుంటుంది, కాని వొక సారి బాగా జరిగింది, కనక, మనసుపెట్టి చేశాము కనక అలా చేయడం లో తప్పులేదు.  దీని వల్ల  నమ్మకం మరింత పెరుగుతుంది.  అయితే యిది మూఢ నమ్మకం స్థాయికి దిగి పోతే ప్రమాదం.

నాలాంటి  వాళ్ళమాటెలా వున్నా, పెద్ద పెద్ద వాళ్ళకే  పెద్ద పెద్ద సెంటిమెంట్లున్నాయి. వొక రాజకీయ నాయకుడు మా వూరినుంచి ప్రచారం మొదలు పెట్టేవారు, మొత్తం రాష్ట్రానికి. మరొక నాయకుడు, చెల్లెలి నియోజక వర్గం నుంచి మొదలుపెట్టేవారు. మన రాష్ట్రంలోని వొక ఎం.ఎల్.ఎ గారు ప్రచారానికి ముందు మేనమామ ఇంటికి వెళ్ళి ఆయనచేత చెంప దెబ్బతిని అప్పుడు ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ. సినీతారలు, మేటి ఆటగాళ్ళకి యీ విషయంలో పట్టింపులు ఎక్కువేనంటారు.  సచినుడు బేటింగుకి వెళ్ళేటపుడు కుడి కాలికి ముందు పేడ్ కట్టుకోవడం సెంటిమెంటుట.  మా స్నేహితుడొకడు, మేము మందు కొట్టే రోజులలో అనగా  50  ఏళ్ళకితం మందు బాటిల్  కింద  చేత్తో కొట్టి  ఓపెన్ చేసేవాడు. ఏమయ్యా! అంటే అలా ఓపెన్ చేస్తే కిక్ బాగుంటుందనేవాడు.  మరొక మిత్రుడు బాటిల్ ఖాళీ అయిన తర్వాత అందులో వొక అగ్గిపుల్ల  గీసిపడెసి  ది డెవిల్ ఈజ్ ఔట్ అనే వాడు. ఎందుకంటె అదంతే అనేవాడు.  అప్పటికి  డెవిల్  మన  వంట్లోకి  చేరిపోయి, ఆ మంట సీసాలో వచ్చినట్లే మనలో వస్తుందని తెలుసుకోడానికి, పదేళ్ళుపట్టింది. ఇదేమిటి తాత మందు కొట్టేవాడా! అని అశ్చర్య పోవద్దు. వొకప్పుడు ఈ తాత కూడా యువకుడేగా. ఇప్పుడు  మీరు చేస్తున్న అన్ని పనులు యీ తాతా చేసేడు.  కొంతమందికి వుదయం లేవడంతో  భార్య ముఖం చూడటం సెంటిమెంటు.  మా వూళ్ళో యెవరు యే వ్యాపారం మొదలెట్టినా  ప్రారంభొత్సవం మాత్రం మా కంటి డాక్టరు గారు చెయ్యాలిసిందే.  ఇది మా వూరి సెంటిమెంటు.  మా స్నేహితుడు యేదయైనా కొంటే అగ్రిమెంటు రోజు వెయ్యి రూపాయలు బజాణాగా ఇవ్వడం నమ్మకం.  కావాలంటే మరునాడు మిగిలిన సొమ్మిస్తాడు తప్పించి ఆ రోజు ఇవ్వడు.  మరొక స్నేహితుడు యెవరైనా ఫోన్ చేస్తే, పోన్ పక్కనే వున్నా నాలుగైదు రింగులొస్తేకాని ఫోన్ యెత్తడు.

ఇవి మన దేశానికే పరిమితం అనుకోవద్దు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇంతకంటే ఎక్కువ సెంటిమెంట్లున్నాయిట.  కొత్త వోడని నీళ్ళలో దింపటానికి స్త్రీ మాత్రమే అర్హురాలట. నీళ్ళలోకి  దింపేందుకు ముందు మందు బాటిల్ వోడకేసి బద్దలు కొట్టిస్తారట.
ఇవన్నీ చిత్రంగా అనిపించినా, అలవాట్లు. వొకప్పుడు బాగా, అనగా మనసుకు నచ్చినట్లు జరిగింది కనక అన్ని సార్లు అలా జరగాలని లేదు. జరగదుకూడా. అయినా ఈ నమ్మకం మాత్రం పోదు. నమ్మకం లేదనేవారిని నమ్మద్దు.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నమ్మకం/సెంటిమెంటు.

 1. నాకు పరీక్ష హాలులోకి కాని ఏదయినా పోటీకి కాని వెళ్ళే ముందు అమ్మ all the best చెప్పవలసినదే ఇప్పటికి కూడా! అమ్మ చెప్పాకనే నేను లోపలకి అదీ గుడిలోకి అడుగుపెట్టినట్టు దణ్ణం పెట్టుకుని వెళతాను అది నా అలవాటో, నమ్మకమో తెలియదు. అలానే నిద్ర లేస్తూనే అరచేతులు చూసుకుని స్తోత్రం చదువుకుని శ్రీరామ అని వ్రాయటం కూడా ఒక అలవాటు మరి అది నమ్మకమో కాదో నాకు తెలియదు! మీరే చెప్పాలి!

 2. దీక్షితులు గారు,

  భగవంతుడు నమ్మకం. వాడు కాపాడుతాడనడం సెంటిమెంటేమో !

  జిలేబి.

 3. @అమ్మాయ్! సుభా
  మంచి జరగాలని అలవాటుగా చేసే పని తప్పులేదు.ఇది కనక మూఢ నమ్మకంగా మార్చేసుకుని, అయ్యో ఇందుమూలంగా పని చెడిపోయిందనుకుంటే తప్పు. నేను చెప్పదలచుకున్నదదే. ధన్యవాదాలు.

 4. @ అబ్బాయ్! అమీర్
  ఇది మగవాళ్ళకి, అమ్మాయ్! ఇది ఆడవాళ్ళకి నా సామాన్య సంబోధన. నన్ను తాతా అన్నందుకు చాలా అనందపడుతున్నా. నా బ్లాగు చదువుతున్నందుకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s