శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు కష్టసుఖాలు.మన(సు)లో మాట.

బ్లాగు కష్టసుఖాలు-మన(సు)లో మాట.

ఇదివరకు బ్లాగు కష్టాలు చెప్పుకున్నాం కదా! ఇప్పుడు  కష్ట సుఖాలు చెప్పుకుందాం అదే, మన (సు)లో మాట..

చాలా కాలం కితం విడ్జెట్స్ పెట్టిన తరవాత టెక్నికలుగా బాధలు లేవుకాని, వొక సారి టపా వెళ్ళ లేదు. అంతే.  తరవాత నుంచి వున్న బాధ వొకటే. కరంటు రోజుకి పది నుంచి పన్నెండు గంటలు తీసేవాడు. టపా రాసుకోడం బాధయిపోయింది. ఎలారా! భగవంతుడా అనుకుంటే దారి దొరికింది. మా స్నేహితుని  దగ్గర ఇంజను వేసేవారు,  కరంటు పోతే అక్కడ కూచుని టపా రాసుకుని మెయిల్లొ పెట్టుకుని, ఇంటి కొచ్చాకా, కరంటొచ్చాకా, మైల్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని సరి చేసి టపా వేసేవాడిని. ఎందుకింత కష్టం? ఏమో తెలియదు. రాయాలి అంతే.  అలాగే రాశాను. వొక్కొకప్పుడు వారం పదిరోజులకి టపాలు సిద్ధంగా వుండేవి. వొక్కొకపుడు అప్పటికప్పుడు రాసి వేసినవి వున్నాయి. ఏమయినా 108 రోజులికి యీ రోజుతో 111 టపాలు, వెంకన్న బాబన్న మాట. మొదట యీ బాధలు పడి రాయడమెందుకని, మానేదామని అనుకుని అది రాశాను. మిత్రులు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారు, జిలేబి గారు, మానవద్దని సలహా చెప్పేరు. సరే బాధలున్నా రాదామని కొన సాగించాను. మొదట 50  పోస్ట్లు రాసి మానేద్దామను కున్నా. కుదరలేదు. తరవాత అది 100  కి మారింది. వంద తరవాత మానేద్దామనుకున్నా, చాప చుట్టేస్తున్నా అన్నా, మళ్ళీ జిలేబి గారు మానవద్దు, కామెంట్లతో కాలం గడపండి కొద్ది కాలం, రిలాక్స్ అవమన్నారు.  ఇక్కడ బాధ  ఎందుకొచ్చిందంటే  రోజూ  పొస్ట్  వేయడం మూలంగా.  రాయడానికి ఇబ్బంది లేదుకాని, తతిమా ఇబ్బందులు ఎక్కువైపోయాయి, మానేద్దామనుకున్నా. సరే, కుదరలేదు. అసలు యీ టపా వందవ టపాగా వేద్దామనుకున్నా. కుదరలేదు. మరికొన్ని టపాలు వెయ్యాల్సి వచ్చింది. అల్లా టపాలు రోజూ వచ్చాయి.

యీ మధ్య కరంటు బాధ తగ్గింది. వొక వేళ పోయినా వొక గంటలో వస్తూ వుంది. ఇబ్బందులు లేవు. కధ నడుస్తూ వుంది. వందవ టపా భారంగా మనసుని పట్టేసిందని, మనవరాలు తాతని ఇబ్బంది పెట్టింది. నిజంగానే నేనూ చాలా బాధ పడ్డాను, ఆ కధ ఆ సమయం లో పెట్టవలసి వచ్చినందుకు..నా మనవరాలి మనసుకు భారం కలగచేసినందుకు, మరి కొంచం బాధ పెరిగింది. అది నేను ఇష్టంగా రాసిన కధ, మానేద్దామనుకున్న సందర్భంలో వేసానన్న మాట. దానికి ప్రేరణ శ్రీ.వెంకట్.బి.రావుగారు, ఆయన నా శైలైని శ్రీ.శ్రీపాద వారితో పోలిస్తే, వొక కధనైనా అలాగ రాయాలని అనిపించి రాసినది. శ్రీ. రావుగారికి నా కృతఙ్ఞతలు.వారు అన్న కొన్ని మాటలను టపాలుగ కూడా రాసుకున్నా. దానికి వారికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నా. నేను వ్రాసినవన్నీ దయతో చదివి నన్ను ఉత్సాహ పరచిన మీ అందరికి, నా బ్లాగు కుటుంబ సభ్యులకి మరొక సారి పేరు, పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.వొక వేళ ఎవరినైనా గుర్తు చేసుకోలేక పోయి వుంటే, నా సంగతి తెలుసు కనక నన్ను క్షమించమని వేడుకోలు.

నాది ఆర్ధికంగా కలిగిన కుటుంబం కాకపోయినా,హార్ధికంగా చాలా ముందున్నది. మా కుటుంబం వారంతా వొకరి కోసం వొకరు, వొకరు అందరికోసం, అందరూ వొకరికోసం అన్న సూత్రం నమ్మిన వాళ్ళము. అందుకు మాకు కలిమి లేక పోయినా, పెద్ద వుద్యోగాలు లేకపోయినా, పెద్ద చదువులు లేకపోయినా, కలిగినంతలో సుఖంగా బతకాలనే సిద్ధాంతం వున్న వాళ్ళము. మా ఇంట్లొ హెచ్చు తగ్గులు, పొరపొచ్చాలు లేవు, రావు, ఎవరి మధ్యా కుడా. అది మా అదృష్టం గా తలుస్తాము. ఇప్పుడు నా కుటుంబ పరిధి పెరిగింది. కొంత మంది తాతా అనచ్చా అని అడిగారు, కొంతమంది, బాబాయ్ అంటా మన్నారు. ఎవరెలా అనాలనుకుంటే, అలాగే పలుకుతాను. నాకు భేషజం లేదు. మీ అందరితో   70+ వయసులో కబుర్లు చెప్పుకుని ఆనందించే సావకాశం, భగవంతుడు దయ చేసినందుకు, సదా, అమ్మకి కృతఙ్ఞుడను. ఇక్కడ మరొక మాట చెప్పాలి. బ్లాగులో కాని, చదువరులలో కాని, ఎవరేనా 70++ వారుంటే వారందరికి నా నమస్కారం.  70+ వారికి నా అభినందనలు. 70+ లోపు వారందరికి నా మనఃపూర్వక ఆశీస్సులు. ఈ బ్లాగు కుటుంబం ఇలాగే కొన సాగలని అమ్మ, ఆది పరాశక్తి, ఇఛ్ఛా శక్తి, ఙ్ఞాన శక్తి, క్రియా శక్తి స్వరూపిణి అమ్మకి నమస్కారం…అమ్మ రూపంలో వున్న అమ్మలు, అమ్మాయిలు అందరికి నా నమస్కారం.అమ్మనే చెప్పేవు, మరి అయ్యలక్కరలేదా అని అడగచ్చు,అమ్మ, అయ్య వొకటే, రెండు కాదు. నా టేగ్ లైన్ సర్వే జనాః సుఖినోభవంతు.

ఇప్పుడు మరొక కొత్త సరదా, ముసలి వయసుకి ముచ్చట్లు లావని, లేటు వయసులో ఘాటు ప్రేమ , ఇవి నా మనవరాలికి బాగా నచ్చిన నా మాటలు. అలాగ యీ మధ్య నా శ్రీమతి, బ్లాగు టపా రాసుకుంటూ వుంటే కాఫీ, టీలు టిఫిన్లు కంప్యూటర్ దగ్గరకేతెస్తోంది, ఆవిడ కూడా నా టపాలు చదివేస్తోంది.కామెంట్లు చెప్పేస్తోంది. మీతొ కలిసి అల్లరి చేసేసావకాశం నాకూ వచ్చి, నేను కూడా చిన్నవాడినయి, మీతో కలిసి పోయినందుకు నాకు ఆనందం. మీరంతా ఎంత అల్లరి చేసినా లిమిటులో, సభ్యత మరచిపోకుండా చేస్తున్నందుకు ఆనందం. నాకు కొత్తగా మా బంధు వర్గంలోనే అభిమాన సంఘం ఏర్పడిందిట. నాతో ఎవరూ మాట్లాడరు కారణం, నేను కవిని కనక.( కనపడదు, వినపడదు ) అందుకు వాళ్ళు నా ఇల్లాలితో మాట్లాడి మామయ్య, తాతయ్య, బాబయ్య, పెదనాన్న, రాసినవి బాగున్నాయి, చదువుతున్నాము, రాయడం మానేస్తానంటున్నాడు, మానేయద్దని చెప్పమని ఆవిడ దగ్గర చెప్పేరట. ఆమెను కాకా పట్టినట్లున్నారు. ఆమె నా దగ్గర నెమ్మదిగా విషయం చెప్పి, రాయడం మానవద్దని, అందరూ బాగున్నయని అంటూ వుంటే మానేసానంటారేమి అని నిలతీసింది. హోం మినిస్ట్రీ ఆర్డర్ని అధిగమించగలమా?వారే ఫైనాన్స్ కూడా యీ మధ్య. మరి మనకి డబ్బులు కావాలంటె అక్కడికే వెళ్ళాలి కదా. ఇంట్లో వాళ్ళంతా వొకే మాటగా చెబుతోంటే ఏమి చేయాలి. యీ సొదంతా ఇప్పుడెందుకూ అంటే చాలా కలంగా మన(సు)లో మాట చెప్పుకోవాని వుంది. కుదరలేదు కనక నేడు…….తప్పదు కదా.మరి మీరేమంటారు.

ప్రకటనలు

23 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు కష్టసుఖాలు.మన(సు)లో మాట.

 1. తాతగారు, మీరు ఎన్నో టపాలు రాసి మాతో కలసి మీ అలోచనలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. మీ లాంటి పెద్ద వాళ్ల ఆశీస్సులు మాకు ఎంతో అవసరం.

  • @
   లాస్యారామ కృష్ణ,
   ఆశీస్సులు, నా బ్లాగుకి స్వాగతం.
   ఎప్పటి టపా, నెలరోజుల పైన కితం టపా నా మీద అభిమానంతో చదివి వ్యాఖ్య పెట్టినందుకు,
   ధన్యవాదాలు.

 2. @
  సుభా!
  కధ భారమైనదన్న విషయం తెలిసినదే. అయ్యో! తెలిసి మనవరాలి మనసు భారం చేసానని బాధ పడ్డాను. నువ్వు వ్యాఖ్య పెట్టి నా మనసు తేలిక చేసావు. ధన్యవాదాలు.

 3. కథలో అంత విషయం ఉంది కాబట్టే నా మనసులో మాట అలా వచ్చింది తాతగారూ.. మీ మీద కోపమా? పైగా ఇన్ని మంచి మంచి సంగతులు చెప్తుంటేను.. ఇలాగే మీరు మరిన్ని సంగతులు చెప్పాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా.. ఈ రోజే టపాలన్నీ చూస్తున్నా.. అందుకే ఇప్పుడు పెడుతున్నా కామెంటు. బాగా లేట్ కామెంట్స్..

 4. @

  సుభా.
  నీవిక్కడ వ్యాఖ్య చేయకపోయినా, నీకు చెప్పాలని,నీవు ఆ రోజు మనసు భారం చేసేరు తాతగారు అన్నపుడు, నిజంగానే బాధపడ్డా. ఏ పరిస్థితులలో ఆ కధ ప్రచురించినది చెప్పేను కనక తాతమీద కోపం పోయిందనుకుంటున్నా.ఆ కధ నిన్ను అంత కదిలించిందంటే నిజంగా కధలో, కధనంలో కొంత విషయం వున్నట్లేకదా.
  ధన్యవాదాలు.

  • @

   శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారికి,
   నమస్కారములు. మీరు దయతో చేసిన సూచన వుపయోగపడి, నేను యింత దూరం రాగలిగాను.మీకు నేనెప్పటికి ఋణపడివుంటాను.
   ధన్యవాదాలు.

 5. శర్మ గారూ!
  కరగదీసేశారు, మనస్సుని, మాటల్తో!
  బాగుంది, చాలా బాగుంది!!
  So, ఇప్పుడిక, మనసులో మాట చెప్పేశారు గదా…ఒక పనైపోయింది! Enjoy blogging….leisurely!!
  శుభాకాంక్షలతో,
  వెంకట్.బి.రావు.

  • @

   వెంకట్.బి.రావు గారు,
   నమస్సులు. మీరు అన్న మాటలని నేను వుపయోగించుకుని,
   కొద్దిగా చెప్పేనేమో అనిపించుకున్నాను. మీ సహయానికి నా కృతఙ్ఞతలు.
   ధన్యవాదాలు.

 6. తాతయ్యా …..నేనోచ్చేసా,,,,,

  .నిజంగా ఎప్పుడో …ఎక్కడో చేసుకున్న పుణ్యం ఇలా బ్లాగ్లోకం లో ఇంతమంది కలవడం , మాట్లాడుకోవడం , అభిమానించుకోవడం…..తాతయ్య …dont worry …మీరు ఇంకా 100000 పోస్టులు రాస్తారు…..ఆరోగ్యం జాగర్త….

  • @

   రాఫ్ సన్,
   మీ సూచన గమనించాను. నిజమే ఎప్పుడొ ఎక్కడొ చేసిన పుణ్యమే, మనను యీ గడ్డమీద పుట్టేలా చేసింది.మీ అభిమానానికి..
   ధన్యవాదాలు.

 7. శర్మగారూ,

  ప్రతిరోజూ ఒక పోష్టింగు చేయాలని నియమం పెట్టుకున్నారా యేమిటి. అలాంటి నియమాలు లేనిపోని వ్యగ్రతకు కారణం అవుతాయేమో. మీకు వీలు దొరకి నపుడల్లా వ్రాస్తూ ఉండండి సరిపోతుంది. ఇప్పటికి ఇన్ని అయాయి అన్ని అయాయి అన్నవి కేవలం లెక్కలు. అక్కరకొచ్చేవి కావు. ఆలాంటివి పట్టించుకోకండి.

  • @

   తాడిగడప శ్యామలరావుగారికి,
   నమస్కారం. రోజూ వొకటి రాయాలని, లేక ఏదో సంఖ్య కోసం రాయడం చేయలేదు. మీరు సహృదయంతొ చేసిన సూచన గమనించాను. ధన్యవాదాలు.

 8. శర్మ గారూ,

  ఇప్పుడు అర్ధం అయిందా, అంతర్జాలంలో ఉన్న ” మజా” ఏమిటో? మొదట్లో మిమ్మల్ని బ్లాగులు వ్రాయండి మహప్రభో అంటే, అదేమిటో “తప్పు” చేయమన్నట్టు భావించేశారు! నా సంగతే చూడండి, ఇప్పటికి ఏడు వందల పైచిలుకి వ్రాశాను. ఇది ఎలాటిదంటే ” మాఫియా” లాటిది. ఒకసారి ప్రవేశించామంటే, బయటకి వెళ్ళడం మన చేతుల్లో లేదు! అలాగని “చెడు” మాఫియా కాదు. సహృదయులైన మాఫియా !!!!

  • @
   ఫణిబాబు గారికి,
   బ్లాగు గురువులకి వందనం. మీరు బ్లాగులు అనే సముద్రం దగ్గరైకి తీసుకొచ్చి, ఇది సముద్రం, మీకు కొద్దిగా యీత వచ్చు. అవసరం మరికొంత నేర్పుతుంది. ప్రయత్నించండి, అన్నారు. నేను భయపడి మీకు వొక టపా పంపి ఏదో చేశాను. మొత్తానికి మీ మాట నిలబెట్టినందుకు, నాకు సంతసం. శిష్యుడు పెద్దవాడవుతున్నందుకు, మీ అభిమానం మాటలలో తెలుస్తూంది. మీరు దీనిని మాఫియా, అన్నారు. నేను మరొక మాట అంటున్నా. ఇది “మనసు మాఫియా”జీవితంలో మీలాంటి మిత్రుడిని సంపాదించుకున్నందుకు గర్వ పడుతున్నా.
   ధన్యవాదాలు.

 9. అలాగ యీ మధ్య నా శ్రీమతి, బ్లాగు టపా రాసుకుంటూ వుంటే కాఫీ, టీలు టిఫిన్లు కంప్యూటర్ దగ్గరకేతెస్తోంది,
  ———————————-
  ఆ తెలిసింది రహస్యం. అన్ని పోస్టులకు కారణం. ఆ విధంగా జరగాలంటే ఏమి చెయ్యాలో చెప్పండి. నాకూ అలా పోస్టులు వ్రాయాలని ఉంది. (మనలో మనమాట నాకు నిజంగా అలా శ్రీమతి చేత చేయించుకోవాలని ఉంది)

  • @
   రావు.లక్కరాజు గారికి,
   ధన్యవాదాలు. మీరడిగినది రహస్యం. చెప్పక పోతే తప్పు, చెబితే ముప్పు అని సామెత. నన్ను ఆ పరిస్థిలో పెట్టేరు. ఏమైనా చెబుతా.
   మీరు మీ శ్రీమతికి నిజంగా సహాయం చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు వారు మిమ్మలిని పని ముట్టుకోనిస్తే అడగండి.మనం వాళ్ళు చేసుకుంటారని అశ్రద్ధ చేస్తాము. వాళ్ళు చాలా…….. పిచ్చి వాళ్ళండి బాబూ…మన మీద ఎనలేని……..దానితో పాపం ఇబ్బంది పడుతుంటారు.ప్రయత్నించి చూడండి. నిజమే చేబుతున్నా. అదే నా విజయ రహస్యం..చెప్పేశా… ధన్యవాదాలు.

 10. బాబాయిగారూ మీ ఈ టపా చదవగానే మనసెందుకో భారంగా అయిపోయింది. ఎక్కడి అనుబందాలో ఇవి. మీ బ్లాగులో టపా చూడగానే మిమ్మల్ని చూసిన ఆన౦దం కలుగుతుంది. మీరిలాగే అనేక టాపాలు రాయాలని మనసారా కోరుకుంటున్నాను.

  తాతయ్య గారూ,
  నమస్కారములు. అమ్మ మీగురించి చెప్పింది. మీరు రాసిన కొన్ని కథలు వినిపించింది. చాలా బావున్నాయి.
  బుజ్జిపండు

  • @
   జ్యోతిర్మయి,
   యీ అనుబంధాలే మనుషుల్ని కట్టి పడేస్తున్నాయి. మీ అభిలాష తప్పక భగవంతుడు నెరవేరుస్తాడని, నా ద్వారా, నమ్ముతున్నాను.
   ధన్యవాదాలు.

   చిరంజీవి బుజ్జిపండుకి,
   నా కబుర్లలో వున్న రామాయణ, భారత, భగవత కధలు అమ్మ చెప్పగా విని నువ్వు, నన్ను తలుచుకుంటున్నందుకు చెప్పలేని సంతోషం. నా మూడవ నాల్గవతరాలు, నేను చూసాను. మీరంతా బాగుండాలని నా కోరిక.ఆశీస్సులు…శతమానం భవతి…..

 11. నిస్సందేహంగా, నిస్సంకోచంగా ఇలానే కొనసాగిస్తూ మమ్మలనందరినీ అలరించాలని ఎన్నో మంచి విషయాలు, విశేషాలు చెపుతూ ఉండాలని ఆశిస్తున్నా..

 12. చిర్రావూరిభాస్కరశర్మ అనే మాచనవఝులవేంకటదీక్షితులు గారికి,

  నమో నమః !

  ఉభయ 70+ లోపరి! మీరీలాగే వెంకన్న దయ చే రూఢి గ మరిన్ని వెంకన్నలు లాగించ వలె ! అవి బ్లాగ్ లోకమునందు తిరు నామములై విలసిల్లవలె! అప్పుడే కదా బ్లాగ్శోభాయమానము !

  చీర్స్
  జిలేబి.

  • @
   జిలేబి గారికి,
   నమస్సులు. మీ ఆసరా లేకపోతే బహుశః మానేసి వుండే వాడిని.సమయానికి మీరు బులుసుగారు చేసిన వ్యాఖలు నా మీద పని చేసిన మాట నిజం.మీ కు 70+ అభినందనలు. ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s