శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీలు-సంభాషణా చతురత.

స్త్రీలు-సంభాషణా చతురత.

నిజం చెప్పాలంటే సంభాషణా చతురత స్త్రీల సొత్తు. ఇది నా అభిప్రాయమే కాదు, నా అభిమాన రచయిత శ్రీ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. నా టపా, 21.12.2011 తేది, తెనుగు నేర్పిన తల్లులు చూడగలరు

రామాయణ కాలంలో స్త్రీల సంభాషణ చూదాం.  కౌసల్య రాముడు మారాం చేస్తుంటే, చంద్రునిచూపితే, రాముడు చంద్రుడు కావాలంటాడు, అప్పుడు కౌసల్య అద్దం లో చంద్రుని, రామునికి చూపుతుంది.  కైక, రాముని పట్టాభిషేక వార్త విని సంతోషిస్తూ వుంటే, మంధర తన సంభాషణా నైపుణ్యంతో కైక మనసు మార్చేసింది. వన వాసానికి సిద్ధమవుతున్న రాముడు, సీతను కూడా తీసుకెళ్ళనంటే “మా నాన్న, నన్ను పురుష రూపంలో వున్న స్త్రీకి యిచ్చి పెళ్ళి చేశాడు” అని ఎత్తి పొడుపు మాట అంటుంది. అప్పుడు రాముడు సీతను అడవికి తీసుకుపోడానికి సిద్ధపడతాడు. తరువాతది, తార, ఎంత చెప్పినా తక్కువే తార గురించి. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే తార, వాలిని, వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే మీతమ్ముడు తిరిగి వచ్చాడని, నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చరిస్తుంది. వాలి వినడు, అది వేరు. తన సంభాషణా చాతుర్యం తో, కోపంతో వచ్చిన లక్ష్మణుని చల్లపరుస్తుంది. చెప్పిన మాటలు చూడండి. ” చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా,నేనూ దక్కేము, భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా………….”, అని మత్తుతో కనులు మూసుకుపోతున్న సమయంలో కూడా మాటాడగల్గిన చతుర.  మరి కొంచం ముందుకెళితే కనబడేది, మండోదరి, యీమె కూడా తన సంభాషణా చతురత చూపింది కాని, రావణుని వంటి కాముకుని వద్ద పని చేయలేదు. సుందర కాండలో సీత హనుమల సంభాషణ వొక అద్వితీయ ఘట్టం.  ఇద్దరు గొప్పవారు మాటాడితే యెలా వుంటుంది అన్నది, చదువుకుని ఆనందిచాలి, నాకు చెప్పగల తాహతు లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నా. హనుమ నవ వ్యాకరణ పండితుడట. హనుమ గురించి యిక్కడ చెప్పడం అసందర్భం.

భారతంలో  చెప్పుకోవలసినది  ముఖ్యమైన పాత్ర ద్రౌపది. ఆమె సంభాషణా చాతుర్యం చాలా విశిష్టమైనది.  ధర్మరాజు జూదంలో ద్రౌపదిని వోడినపుడు, సభకు రమ్మని కబురు తెచ్చిన ప్రాతికామితో, సభలో యీ ప్రశ్నకి సమాధానం కనుక్కుని రమ్మని చెబుతుంది.. ఆ ప్రశ్న ” నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడేనా? “నన్ను పందెంలో పెట్టి వోడిపోయాడా? తను పందెంలో వోడిపోయిన తరవాత నన్ను పందెంలో వోడిపోయాడా? కనుక్కు రమ్మంది. చూడండి ఎంత చతుర సంభాషణ. ఆ తరువాత, సభలో కూడా యెవరూ ఆమె ప్రశ్నలకి సమాధానం యివ్వలేక, సమాధానాలు ధర్మరాజునే అడగ మంటారు. ధర్మ సూక్ష్మం యిమిడి వుంది ఆ ప్రశ్నలో!. మరొక సందర్భం. కీచకుడిని చంపవలసి వచ్చినపుడు ద్రౌపది భీముని రెచ్చగొట్టిన విషయం చూస్తే, ఎంత చతురత చూపినది తెలుస్తుంది. కీచకుని వద్ద కూడా, తప్పించుకోడానికి ఆమె సంభషణా చతురతే చూపింది, కాని కాముకుని వద్ద పని చేయలేదు. అదే సమయంలో, సుధేష్ణతోడి సంభాషణ కూడా గమనించవచ్చు. మరికొన్ని ఘట్టాలు వుండవచ్చు. యిందులోనె మరొకరిని కూడా చెప్పుకోవాలి. దుర్యోధనుడు యుద్ధనికి వెళుతూ, తల్లి గాంధారికి నమస్కారం చేసి, ఆశీర్వదించమంటే “యతో ధర్మః తతో జయః” అని అన్నదే కాని “దిగ్విజయమస్తు” అని దీవించలేదు. అంటే ఆమె యుద్ధం పట్ల, అన్యాయం పట్ల తన వ్యతిరేకతని, ఆఖరి నిమిషంలో కూడా దాచుకోలేదు.

నేటి కాలానికొస్తే,సామాన్య స్త్రీలలో, చదువుకోని వారిలో కూడా యిది కనపడుతుంది. వొక సినీకవి “ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే అర్ధాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే” అన్నారు. యిది ప్రేమికుల సంభాషణలో సత్యమే. మనం అంతగా పరిశీలన చేయక తెలియదు. నేను సాధరణంగా స్త్రీల సంభాషణా చాతుర్యం తెలుసుకోడానికి వింటూ వుంటాను. నేటి రోజు, మన బ్లాగులో కూడా అటువంటి చతురత కనపడుతుంది. వొక సందర్భం చెబుతున్నా! యిది ఎవరిని కించపరచడానికి మాత్రంకాదు. యెవరైనా వారికి, వారి సంభాషణ గుర్తుకొస్తే, నవ్వుకోమని నా సవినయ వినతి. వొక అమ్మాయి తన బ్లాగులో వొక బొమ్మ పెట్టి వొక కవిత రాసింది. వొక కొంటె అబ్బాయి కవిత మీదేకాని, బొమ్మ యెక్కడనుంచి కొట్టుకొచ్చారు అన్నారు. దానికి మరొక అమ్మాయి మీకు కొట్టుకొచ్చిన బొమ్మలంటే యిష్టమేగా అని సంభాషణ లో అన్నది. సమయం సందర్భం, శ్లేష ఎంత చక్కగా కుదిరాయి, చూడండి. యీ సందర్భంగా, అది మంచి చతుర సంభాషణ. నేను సాధరణంగా టపా ఎంత చదువుతానో వ్యాఖ్యలు కూడా అంత శ్రద్ధగా చదువుతా. మనమంతా తల్లుల దగ్గర వారు మాటాడగా భాష నేర్చుకున్నాం, ముందుగా. తల్లి మొదటిగురువుకదా. అందుకె యిప్పటికీ కూడా సంభాషణా చతురత స్త్రీల సొత్తే. నా మనవారలు వొకమ్మాయి, మాటలలో తనను గెలవడం చాలా కష్టం. మాట పొందిక, పదాల విరుపు, శ్లేష పద ప్రయోగం, నిజంగా వినాలి కాని చెప్పడం కష్టం. మగ పిల్లలలో యీ పరిశీలన, చతురత కొద్దిగా తక్కువే.

 

36 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీలు-సంభాషణా చతురత.

 1. @
  పకోడి గారు,
  యీ విషయాన్ని యింతటితో ముగిద్దాం.జరిగిన దానికి నా విచారం వ్యక్తం చేస్తున్నా. ధన్యవాదాలు.

 2. “దానికి మరొక అమ్మాయి మీకు కొట్టుకొచ్చిన బొమ్మలంటే యిష్టమేగా అని సంభాషణ లో అన్నది. సమయం సందర్భం, శ్లేష ఎంత చక్కగా కుదిరాయి, చూడండి. యీ సందర్భంగా, అది మంచి చతుర సంభాషణ.”

  ఆ అమ్మాయి సమాధానం ఎటో వెళ్ళింది, నిజానిజాలు చూస్తే, కొట్టుకొచ్చిన బొమ్మ అని తాను అంగీకరించింది. అబ్బాయికి కొట్టుకొచ్చిన బొమ్మలు ఇష్టం అని ఆమె ఎలా చెప్పగలిగింది? ఆవిడ అంత పరిచయస్తురాలా? ఇందులో చతురత ఏమిటో అర్థం కాలేదు. మీరే వివరించాలి. నేను బ్లాగుల్లో కామెంట్లనే చూస్తాను, వ్యాసం కూడా వీలుంటే రెఫర్ చేస్తా. 🙂

 3. విఙ్ఞులందరికి విన్నపం.
  నాకు సంబంధించిన విషయాలు నేను చెప్పేను. మిగిలిన విషయాలు మాటాడు కోవాలనుకుంటే మీరు వేరు వేదికపై మాటాడు కోమని సవినయ మనవి.

 4. లేకుండానే చెరుకు గడలు విడవడాలు, మీసాలు మెలేయడాలు ఎందుకు సార్… I told you many times talk to me straight.. But, you lost my support.

  Thanks
  and face the music from THE HINDU

 5. @
  భా.రా.రెగారు,
  నమస్కారం,
  నేను మిమ్మల్ని మట్టి బుర్ర అనలేదు. మీరు నన్ను నమ్మింది యెందులోనో అర్ధం కాలేదు.

  ధన్యవాదాలు

 6. శర్మగారు మీ టపా నిజమే ఆ చతురత లేకుంటే ఆడవారిని మింగేస్తారు కచ్చితంగా అది ఉండి తీరాలి ఈ కాలంలో… ఇక విషయానికి వస్తే మీ టపా కంటెను విమర్శలనే ఎక్కువగా చదివాను 🙂 ఏమనుకోకండి . మట్టి బుర్రనా కాదా అనే వాదన బాగా నచ్చింది. నాకు తెలిసి జన్మ తరహా ఎవ్వరు మట్టి బుర్రలు కారు ఎందుకంటే మాటలు నేర్వడం, నడవడం, దోగాడటం అన్ని అందరు మాములుగానే నేర్చుకుంటారు చిన్న తనంలో ఇంక ఈ సమాజం లోకి వచ్చినప్పుడు ఎవరి చేతిలో మన బుర్ర పెట్టాలో తెలియక తికమకతో మట్టిలా చేస్కుంటారు . అ మట్టితో బొమ్మలు చేయాలో లేక కుండలు చేయాలో లేక గోడలు కట్టలో లేక పంచాలో తెలియక వద్దు మట్టిని మళ్ళీ బుర్రగా చేస్కున్దాం అనే నిర్ణయానికి వచ్చేసరికి వయసౌతుంది . మళ్ళీ మన చిన్నవాళ్ళు ఎక్కడ మట్టి బుర్ర అంటారో అని బయపడి అనుభవం అని చెప్పుకొని తిరుగుతారు. ఇది అబ్బాయిగా నాకు తెలిసినది. బామ్మల సంగతి శర్మ గారు చెప్పేశారు గా అందులో కించిత్ కూడా సందేహం లేదు.

 7. దీక్షితులు గారు,

  మొత్తం మీద కొంత లేజీ తనం వదలి కానీ పెట్టేసాను, పట్టేసానండీ, భారారే వారిని కామెంటు చెండు తో ‘కడలి’ వేగం తో పద కేళీ విలా సముతో కొట్టిన వారిని. !

  వీరు మీ చెవుల తుప్పును వదిలించడం ఇప్పుడు కాకతాళీయమా లేక విధి విలాసమా !

  చీర్స్
  జిలేబి.

 8. @
  సుభా!
  టపా అంతగా నచ్చినందుకు ధన్యవాదాలు. నిజంగా అంత కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్ మని నా బ్లాగులో యెవరూ కేక వేయలేదు. నిజంగా నా చెవుల తుప్పు వదిలిపోయింది. ధన్యవాదాలు.

 9. తాతగారూ… కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్… నేను చాలా ఆలస్యంగా చూసాను ఇది.నాకు నవ్వు ఆగడం లేదసలు.మొత్తానికి సూపర్ టపా పేల్చారు.నాకు ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. ఏదేమైనా మీ మాటల్లో చతురత ఉందిలెండి.. వాళ్ళందరూ అలానే అంటారు. అవేమీ పట్టించుకోకండి :):):)

 10. అయితే రెండో చాన్సు మాష్టారు, పద్మార్పిత గారు ! ఇదీ తప్పితే ఇక జిలేబీ బీలేజీ !!

  చీర్స్
  జిలేబి.

  • @
   జిలెబిగారికి,
   మీ అంచనాలు కూడా తప్పుతున్నందుకు నిజంగా విచారంగా వుంది.మీరు బీలేజీ అయిపోయారు.
   ధన్యవాదాలు

 11. ఇప్పుడు అర్థం అయ్యింది ఆ సంభాషణ లో మట్టి బుర్ర ఎవరని! – ఆ రెండో బెష్టు బుర్ర ఎవరో? ఇంకెవరు వుంటారు, రసజ్ఞ యే వుండాలి !

  చీర్స్
  జిలేబి.

 12. 🙂 ఈ సంభాషణ లో నేనే కదా :))). నేను ఆ లైను చదివి తెగ నవ్వుకున్నాను.
  శర్మ గారూ ఆడవారితో నిజంగానే జాగ్రత్తగుండాలి. వాళ్ళు అసలు మనకు మాటాడే ఛాన్స్ ఇవ్వరు :)))

  • @
   భాస్కర రామిరెడ్డిగార్కి,
   యీ విషయాన్ని మీరు సహృదయంతో తీసుకున్నందుకు
   ధన్యవాదాలు. నేను అక్కడే సంభాషణ చూసి, అది నన్ను ఆకర్షించినందున చెప్పేను తప్పించి, ఎవరినీ నొప్పించాలని కాదు. మీ సహృదయానికి మరొక మారు ధన్యవాదాలు. స్త్రీలతో సంభాషణలో పురుషులు సరి తూగరన్న, నా అభిమాన రచయిత మాట నిజమైనందుకు నాకు అనందంగా వుంది. ధన్యవాదాలు.

 13. @
  జిలేబి గారు, రసఙ్ఞ,

  యిద్దరికి పెద్ద జవాబే చెప్పాలి, టపా రాసేటంత, మరి యిక్కడ టూకీగా,పెళ్ళి చూపులనాడు మనసు పోయింది, సప్తపదిలో చిటికిన వేలు లంకె వేసినపుడు బుర్రలోంచి సగం జారిపోయింది. మూడు నిద్రలలో మొదటి నిద్ర లేచిన రోజు ఏమీ మిగలలేదు. తెలిసిందా? యిది యింతే. అనుభవమైతే కాని తత్వం వంట పట్టదండీ.

 14. ద్రౌపది ప్రసక్తి వచ్చినది కాబట్టి చెబుతున్నాను. ధర్మరాజుగారు శ్రీకృష్ణుని కౌరవుకవద్దకు ‘ఐదు ఊళ్ళిచ్చినా చాలు’ అనే రాయబారసందేశంతో వెళ్ళమంటాడు. నల్లనయ్య అందరి అభిప్రాయాలూ అడుగుతూ కృష్ణామహాదేవినీ అడుగుతాడు నీ వేమంటావమ్మా అని. ఇక చూస్కోండి ఆవిడ వాగ్ధాటి. తిక్కనగారు ఈ ఘట్టాన్ని యెంత అద్భుతంగా మలచారో. ద్రౌపది ధర్మావేశం యెంత గొప్పగా ఉంటుందో చదువవలసినదేగాని వర్ణింప నలవిగాదు. ఇక్కడనేకాదు మహాభారతేతిహాసంలో అడుగడుగునా ఆవిడ సంభాషణాచాతుర్యం కనిపిస్తూనే ఉంటుంది. వాల్మీకిమహర్షి మాటల్లో రామాయణం ‘సీతాయాశ్చరితం మహత్’ అయితే నా దృష్టిలో మహాభారతం ‘ద్రౌపద్యాశ్చరితం మహత్’

  • @
   మిత్రులు తాడిగడప శ్యామల రావు గారికి,
   మీరు చాలా బాగా గుర్తు చేశారు. అందుకే మరికొన్ని వుండచ్చు అన్నా.
   ధన్యవాదాలు

 15. రసజ్ఞ వారు,

  సందేహం వలదు. ఖచ్చితం గా జన్మతః అబ్బినదే! కాకుంటే ఫలదీకరణం కావడానికి అంత సమయం పడుతుందన్నమాట! (exceptions ఉంటారనుకొండీ, మీ తాతయ్య వారిలా – చాలా రేర్ అన్న మాట )

  చీర్స్
  జిలేబి.

  • తమరిది మట్టిబుర్రో, తుంగబుర్రో కాని మీ కామెంట్లను బట్టి చూస్తే మాత్రం మీరొట్టి వాగుడుకాయ అని చెప్పవచ్చు. వాగుడుకాయలు తుంగబుర్రలయ్యే అవకాశం ఎక్కువ అని అదేదో విశ్వవిద్యాలయం వారు 1992-2000 మధ్య కాలంలో ఓ వ్యాసం ప్రచురించారని విన్నాను. అది వెలికి తీసి మీ బుర్రని నిరూపించుకోగలరు.

   • @
    పకోడి గారు
    యెవరూ మట్టి బుర్రలౌ తుంగబుర్రలూ లేరు. అందరూ గట్టి బుర్రలే .యీ విషయం ఇంతతో ముగిద్దాం.జరిగిన దానికి నా విచారం వ్యక్తం చేస్తున్నా. ధన్యవాదాలు.

 16. తాతగారూ నాకు గుర్తోచ్చేసిందిగా! నిజంగా నేను కూడా వ్యాఖ్యలు వదలకుండా చదువుతా టపా ఒక ఎత్తయితే వ్యాఖ్యలు మరొక ఎత్తు!
  అరె వహ్! జిలేబీ గారూ నేను కూడా ఇదే చెపుదామనుకున్నా అంతా మట్టి బుర్రలే కదా అని! కాని వారు పెళ్ళయ్యాక మట్టి బుర్రలవుతారా? లేదా ముందునించీ అంతేనా?

  • అవున్లెండి రసఙ్ఞ గారూ…. నాకు తెలిసి ముందు నుండే మట్టిబుఱ్ఱలు లేకుంటే పెళ్ళిళ్ళెందుకు చేసుకుంటారసలు చేసుకున్నాక లాగిపెట్టి డొక్కలో ఎందుకు పొడిపించుకుంటారూ!

   • @
    అచంగగారు,
    నమస్కారం, నా బ్లాగుకి స్వాగతం. మకర సంక్రాంతి శుభకామనలు. అందరూ గట్టి బుర్రలేనండి. మట్టి బుర్రలు లేవు. ధన్యవాదాలు.

 17. >>>మగ పిల్లలలో యీ పరిశీలన, చతురత కొద్దిగా తక్కువే.

  అసలు ఉందా అని ? ఒట్టి మట్టి బుర్రలండీ బాబూ

  చీర్స్
  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s