శర్మ కాలక్షేపంకబుర్లు-చిరుచేతి వాటం.

చిరు చేతివాటం.

చిరు, చేతిని వాటంగా వేసుకున్నాడని కాదు.. చిరుని, చెయ్యి వాటంగా వేసుకుంది, అది కాదిపుడు ప్రస్తుతం.

చిరు వస్తువులను పట్టుకుపొవడం కొంతమందికి అలవాటు. నిజంగా, వారు దొంగతనం చేయాలనుకోరు, కాని వారికది అలవాటు. బేంకులు, పోస్ట్ ఆఫీసులకి వెళ్ళినపుడు సాధరణంగా ఎవరో వొకరు పెన్ కావాలని అడగడం సహజం. అలా తీసుకున్నది వారు మరల మనకి తిరిగి యివ్వడం మరిచిపోతారు, వొక్కొక సారి. కాని కొంతమంది కావాలని పట్టుకుపోతారు. సాధారణంగా, నేనయితే పెన్ ఇచ్చి కేప్ నా దగ్గరవుంచుకుంటా. మనమూ మన పనిలో బిజీగా వుంటాముకదా, వారు మరిచిపోకుండా గుర్తుకోసం కేప్ తీసుకుంటానన్న మాట. కొంతమంది ఇలా కేప్ తీసి ఇచ్చినా బాల్ పెన్ పట్టుకుపోయిన సంఘటనలున్నాయి…ఇది మగవాళ్ళకే పరిమితం అనుకోవద్దు. ఆడవారిలో కూడా యీజబ్బు ఎక్కువే. జడ పిన్నులనుంచి, జడగంటలు, ఇప్పుడు లేవులెండి, కర్చీఫులు, పౌడర్ పఫ్ లు, కుంకుమభరిణెలు, దువ్వెనలు, సెంటు సీసాలు, నైల్ పాలీష్ లు, బొట్టు బిళ్ళలు,అనుకుంటే బాగోదు బ్రాలు, మొదలైన చిన్న చిన్న వస్తువులు, పట్టుకుపోతుంటారు. పోనీ వీరు, అయ్యో! ఆ వస్తువు కొనుక్కోలేనివారు కనక వాడుకోడానికి పట్టుకుపోయారేమో అనుకోడానికి లేదు. వాళ్ళు నిజంగా చాలా చదువుకున్నవాళ్ళు, పెద్ద పెద్ద వుద్యోగాలు చేస్తున్నవాళ్ళు., సంఘంలో పెద్ద స్థితిలో వున్న వాళ్ళయి వుంటారు. మా స్నేహితుని దగ్గరకి నేను తరచుగా వెళతా! అవసరాన్ని బట్టి అప్పుడపుడు వొక కవరు తీసుకుంటా. అక్కడ మేనేజరు గారికి యిలా కవరు తీసుకున్నానని చెబితే ఆయన ” బాబాయ్! నువ్వు కవరు తీసుకున్నానని చెప్పాలా” అంటారు కాని నాకెందుకో, చెప్పకుండా వుండలేను.

మరి కొంత మంది హొటళ్ళలో స్పూన్లు, చిన్న చిన్న వస్తువులు తెచ్చేసుకుంటూ వుంటారు. నాకు తెలిసిన వొక పెద్దాయన వొక సారి వొక ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు. ఆ లగేజి నేను తీసుకుని, సద్దించవలసి వచ్చింది. అందులో నాకు వొక వస్తువు వింతగా కనపడింది. నిజానికి అవి ఏమిటో కూడా అప్పటికి నాకు తెలియదు. తరవాత తెలిసింది, అవి హోటల్ లో యిచ్చిన పేపర్ నేప్కిన్లట. ఆఫిసుల్లో పనిచేసేవారు కొందరు, రోజూ ఏదో వొకటి ఇంటికి పట్టుకు పోతుంటారు. అది పేపరు, కార్బన్, పెన్సిల్, ఎరేజర్, షార్పెనెర్, ఆఖరికి నాలుగు పిన్నులయినా కావచ్చు. పెద్ద పెద్ద మాల్ లలో, బట్టల దుకాణలలో, బంగారపు షాపులలో , చిన్న చిన్న వస్తువులు తెచ్చేసుకున్న, పెద్ద పెద్ద వాళ్ళున్నారు. సాధారణంగా షాపువారు వీరిని అనుమానించరు. వొక వేళ చూసినా, ఏమీ అనలేరు. అందుకే నేడు పెద్ద మాల్స్, స్టోర్లలో వీడియో కెమీరాలు పెడుతున్నారు. ఐనా ఇబ్బందులు తప్పటం లేదు. ఇందుమూలంగా అక్కడ పని చేసే చిరు వుద్యొగులు బలైపోతున్నారు. దీనిని క్లెప్టో మేనియా అంటారట, నిజమేనా, తెలిసినవారు చెప్పగలరు. నిజంగా యిది మానసిక దుర్బలత్వం తప్పించి మరేమీ కాదు.

కొంతమందికి పుస్తకాలు పట్టుకుపోయే అలవాటు. వొక వేళ అడిగి పట్టుకెళ్ళినా తిరిగి యివ్వరు. అడిగితే పంపుతానంటారు, కాని పంపరు. యీ బాపతు జనాలకి యెదుటివారి వస్తువు యేదో వొకటి తెచ్చుకోవాలనే కోరిక బలంగా వుంటుందనుకుంటాను. కొంత మంది పురుషులు స్త్రీల వస్తువులు దొంగిలించి దాచుకుంటారు. దీనికి ఏదో పేరు కూడా వుంది. మరి స్త్రీలు అలా పురుషుల వస్తువులు దొంగిలించి దాచుకుంటారో లేదో తెలియదు. సాధరణంగా స్త్రీలు ఆ పని చేసినా దొరికే సావకాశాలు తక్కువ. యిది వారికి భగవంతుడిచ్చిన వరం మరి. యీ చిన్న దొంగతనాలలో కూడా స్త్రీలదే పైచేయి. నేనూ చిరు చేతివాటం వాణ్ణే. కవిత రాయాలంటే బుర్ర కావాలి, చిత్రం గీయాలంటే చెయ్యి విరిగుండాలి, అదేనండీ! చెయ్యి తిరిగుండాలి. అదీ యిదీ చెయ్యలెనపుడు, పది మంది చేత గుర్తింపబడాలంటే ఘటం భిత్వా, పటం చిత్వా అన్నాడు శాస్త్ర కారుడు. అంటే నాలుగు రోడ్ ల మధ్య నిలబడి కుండ పగలకొట్టు, లేదా చొక్క చింపుకో, పది మందీ నిన్ను గుర్తిస్తారు, విచారిస్తారు. అలాగ, మీరూ, మీరూ, మాట్లాడుకున్న మాటలు, పూర్వకవులు చెప్పినవి, పట్టుకొచ్చి రాసేస్తో వుంటాను. యిది కూడా వొక రకమైన చిరు చేతి వాటమేగా. మొన్న వొక కామెంటులో వొక పద్యం రాసాను. వొకాయన నాకు మెయిలిస్తూ పద్యం చాలా బాగా రాసారు అన్నారు. అప్పుడు వారికి చెప్పేను, అయ్యా! ఆ పద్యం నాది కాదు, మను చరిత్రలో పద్యం అని చెప్పేను. దానికి వారు బదులిస్తూ, నాకు అది తెలుసు, కొంతమంది యీ మధ్య వారివి కానివి, కొట్టుకొచ్చి, వారివిగా చెప్పుకుంటున్నారు. మీరు కూడా ఆ కోవకి చెందేరేమోనని అడిగా అన్నారు. అయ్యా! అదండీ సంగతి.

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చిరుచేతి వాటం.

 1. అయ్యా శర్మ గారు..
  మీ బ్లాగ్ ‘కష్టేఫలే’ అంటే ఏవో నీతులూ, గట్రా రాసుకునే పెద్దమనుషుల ప్రాంతమని.. ఇటుగా రాలేదు.
  ఈ టపా చదవగా.. మనమంతా సజాతీయులమేనని అర్ధమయింది.
  టపా సరదాగా, హాయిగా ఉంది.
  అభినందనలు.

  • @
   yaramana గారు
   నేనూ అలాగే అనుకున్నా సుమండి.ఎంతయినా మీరు చెప్పినట్లు సజాతీయ పక్షులం కదా!
   ధన్యవాదాలు

 2. శ్యామల రావు గారు,

  పేరులోనే మేఘ శ్యాముని పెట్టుకుని శ్రీ కృష్ణుల వారిని వెతుకుటయా ! ఎందెందు వెతికిన అందందే కలడు శ్రీ కృష్ణుడు ఒక్కడే కాని అనంతం, వారు ప్రతి ఒక్కరికీ ‘త్వమేవాహం’ సో, ప్రతి ఒక్కరు ‘మా’ శ్రీ కృష్ణుల ‘ వారనొచ్చు!

  జిలేబి.

 3. జిలేబీ, “మా శ్రీ కృష్ణుల వారు” అనేశారే! అలాగయితే యెలా? కొంచెం మాక్కూడా పంచండి.

 4. ఎప్పుడో అప్పుడు మనం అందరం చిరు చేతి వాటం గాళ్లమే. పక్కింటి జామ చెట్టు కాయల తోటి మొదలై నెలాఖరులో భార్యా మణి పోపుల పెట్టి కోశాగారం దాకా ఎదిగి పోతాము.

  • >>> భారారె గారు,

   It goes without saying!! ఒట్టి మట్టి బుర్ర సుమండీ! ముద్ద మందారం లో కూడా రమ్ము ఉందే దీనికేమంటారు ?

   చీర్స్
   జిలేబి.

   ________________________________________________________________
   జిలేబీ, to be frank I guess this is the problem with you. First you need to control what you write. Not sure what experiences you had, but this is absolutely pushing you to the corner.

   If you wish you can publish it. If not it’s an advise to you. I am getting late. Talk to you later.

   _____

   • అయ్యా భారారే వారు,

    నేనేదో సరదాకి రాస్తున్నాను. మీరు సీరియస్ గా తీసు కుంటున్నట్టున్నారు. హృదయ పూర్వక క్షమాపణలు మీరు వేరే విధం గా భావిస్తే.

    ఇక మీ కామెంటు పబ్లిషింగు మాటంటారా, అది నా చేతుల్లో లేదు, ఈ బ్లాగు నాది కాదు-మరీ గమ్మత్తు గా వుంది మీ ఈ కోరిక !

    చీర్స్
    జిలేబి.

 5. శర్మ గారు,

  మా శ్రీ కృష్ణుల వారు గోపికల ని చూస్తే చాలు వారి హృదయాలు కొల్ల కొట్టబడి కొత్త బడి పోతాయిట

  వారి చలవే ఇంకా కొనసాగుతోందను కుంటాను !

  రెండు మీ టపాల తో మా కామెంట్లు చిరు చేతి వాటం గా మీరు తీసుకుని పోతున్నారు !
  దీనికేమంటారు !

  చీర్స్
  జిలేబి.

  • జిలేబి వారూ, అంటే అమ్మాయిలొచ్చి ముద్ద మందారాలు విసిరేస్తే మగవాళ్ళు పడిపోతారంటారు 🙂 భలే విశ్లేషణండీ.

   • భారారె గారు,

    It goes without saying!! ఒట్టి మట్టి బుర్ర సుమండీ! ముద్ద మందారం లో కూడా రమ్ము ఉందే దీనికేమంటారు ?

    చీర్స్
    జిలేబి.

 6. మాష్టారూ, నేనైతే ఆఫీసులో రోజూ అక్కడండే చిరుతిండ్లన్నీ చేతివాటమే 🙂 అంతమాత్రానికి ఇలా పేద్ద టపా వ్రాస్తారా?

వ్యాఖ్యలను మూసివేసారు.