శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి చూపులు

పెళ్ళిచూపులు

“ఇరవైఏళ్ళు ముడ్డికింద కొస్తున్నాయి. పెళ్ళిచేసుకోవచ్చుగా” గణానాంత్వా!!! వొక రోజు భోజనం చేస్తుండగా అమ్మ నా పెళ్ళికి నాంది ప్రస్తావన చేసింది. “సరె నమ్మా” అని సరిపెట్టెశా. ఇక ప్రతి రోజు భోజనం దగ్గర యిదే కొలుపు అలవాటయిపోయింది. వొక రోజు, వుండలేక, “అమ్మా! పెళ్ళి అంటున్నావు, సరేకాని, పెళ్ళాం వస్తే, పువ్వులు కొనిపెట్టే తాహతు కూడా లేదు కదా, అప్పుడే పెళ్ళి గోలెందుకే” అన్నా. “అంటే చేసుకోవా” అంది. “చేసుకోననలేదు, కాని సంపాదన కావాలంటున్నా”, అన్నా. “సంపాదన లేని వాళ్ళు పెళ్ళి చేసుకోరా. నీకు డబ్బులు నేను యిస్తున్నాను కదా, పెళ్ళి చేసుకో” అంది. “సరెలే” అన్నా. అక్కడ దొరికి పోయా. మరునాడు “పాటి మీద బగారమ్మ, బంగారపు బొమ్మ, వాళ్ళ నాన్న, నీకు రెండెకరాల పొలం, పిల్లకి పాతిక కాసుల బంగారం, పెడతాడు. పిల్లని నువ్వు చూసి వుంటావు. రోజూ నీకోసం, అది గుమ్మంలో నే కాపు కాస్తోంది, దాన్ని చూడు” అంది. “అయిపోయా” అనుకున్నా. యీ పాటిమీద బంగారమ్మని యెలా వదుల్చుకోవాలో తెలియలేదు. వుండి వుండి వొక రోజు “అమ్మా! బంగారమ్మ లావుగా వుంటుందేమోనే” అన్నా. “వో కడుపొస్తే చిక్కిపోతుందిరా, పరవాలేదు” అంది. మరి కొద్దిరోజుల తరవాత, “చెరువు గట్టు సత్తెమ్మ నువ్వంటే మోజు పడుతోందిరా. వాళ్ళ నాన్న ఐదెకరాలిస్తాడు. నీ చేను పక్కది. పిల్ల సన్నగ నాజూగ్గా వుంటుంది. మొన్న కనపడి అత్తయ్యా, బాగున్నావా అంది కూడా” అంది..మరి కొద్ది కాలానికి మరో పొలేరమ్మ, ఇలా ఏదో వొకటి చెబుతూనే వుంది, నేనూ ఏదో వొక కారణం చెబుతూనే వచ్చా. పాటిమీద బంగారమ్మ ప్రయత్నాలు ముమ్మరం అయిపోయాయి. వూళ్ళో ఎవరు కనపడినా, బంగారమ్మకి నాకు పెళ్ళి ప్రస్తావనే. యెలా తప్పించుకోవాలో తెలియని పరిస్థితులలో, వొక రోజు నీకు వుద్యోగం యిచ్చాము, వెళ్ళి చేరవయ్యా అని భారత ప్రభుత్వం వారొక కాగితం పంపేరు. యింకేముంది, వొక రకంగా నా కొంప ములిగింది, వొక రకం గా తేలింది. వూళ్ళోంచి వెళ్తాము కనక తేలింది, బయటికి వెళ్ళినా మరికొంచం వత్తిడి పెరుగుతుంది కనక, ములిగింది. పల్లెనుంచి పట్నం లో కాపరం మార్చేలోగా, వూరి పెద్ద కాపు, వొక రోజు కనపడి, “వుద్యోగం వచ్చిందటగా, రా, అలా పొలందా కా వెళ్ళొద్దాము” అని తీసుకుపోయాడు. కూడా వెళ్ళేను. ముంజికాయలు కొట్టించేడు, తింటూ వుండగా బంగారమ్మ గురించి చెబుతూ, “నీ చేలో చేను ఐదెకరాలిప్పిస్తా, ఏభై కాసుల బంగారం పెట్టిస్తా. నీకేమి కావాలో కోరుకో ఇప్పిస్తా, బంగారాన్ని పెళ్ళి చేసుకో” అన్నాడు. “రేపు చెప్పు” అన్నాడు. తిరిగొచ్చాము. మర్నాడు కనపడితే “వద్దు “అని చెప్పాను. “ఏమీ” అన్నాడు. “నా కిష్టం లేదు” అన్నా. ఏదో చెప్ప బోయాడు. పడనివ్వలేదు.

పట్నంవెళితే శశిరేఖలు,బాలాకుమారిలు తయారయ్యారు. మా అమ్మ వత్తిడి పెరిగిపోయింది. ఎక్కడికో వొక చోటికి పెళ్ళి చూపులుకి వెళ్ళక తప్పని పరిస్థితి యేర్పడింది. మరొక పట్నంలో పెళ్ళిచూపులకెళితే, పిల్ల పాట పాడింది, “జయ మంగళ గౌరీ దేవి…….ఇద్దరు తల్లుల ముద్దుల పాపకి బుద్ధి ఙ్ఞానము లిమ్మా” అని. ఇలా ముఫై మూడు మంది పెళ్ళి కూతుళ్ళని చూశా. యేదో వొకటి చెప్పి తప్పించేస్తున్నా. వోరి నాయనో! పెద్ద గొడవొచ్చి పడిందని, అసలు పెళ్ళిగురించి అలోచన, అప్పుడు చేశా.

నేను చిన్నపుడు, అనగా నా తొమ్మిదో యేట నా మేనమామ యింటికెళ్ళా. అక్కడొక నాలుగేళ్ళ యెర్ర పిల్లని చూశా. అదెందుకో మొదట నామీద కయ్యిమంది. ఆ రోజు సాయంత్రం నా దగ్గరకొచ్చి “బావా ఆడుకుందాం రా” అని తీసుకుపోయింది, రాత్రి దాకా కలిసి ఆడుకున్నాం. మూడవ రోజు వెళ్ళిపోయాం, ఆ తరవాత అమ్మ, అన్నయ్య యింటి గడప తొక్క లేదు. యీ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాల లేదు. పెంచుకున్నమ్మ వత్తిడి పెరిగిపోతూ వుంది. నెమ్మదిగా విషయం చెప్పా. “బాగుందిరా, మీ మామయ్య పిల్లనిస్తానని రాడు, నువ్వేమో ఆ పిల్ల కావాలంటావు,యెలా” అంది. మా ఇంటి మాస్టారు విషయం తెలిసి, “నేను మాటాడతా” అని బయలుదేరి వెళ్ళి,మాటాడి, పిల్లని ఇస్తానని చెప్పడానికి, మామయ్య వచ్చేయేర్పాటు చేశారు. అమ్మయ్యా! అనుకున్నా. మామయ్యొచ్చాడు, “నేను కట్న కానుకలివ్వలేను, ఇతనికి ఐదెకరాల పొలం ఏబది కాసుల బంగారంతో పిల్లనివ్వడానికి వస్తున్నట్లు తెలిసి, నేను రాలేక మానేశా” అన్నాడు. మా మాస్టారు “వొక పని చేయండి పిల్లని తీసుకుని మీరు యిక్కడ కొచ్చెయ్యండి. పెళ్ళి కర్చులు కూడా మేమే పెట్టి పెళ్ళి చేసుకుంటాం, మీరేమీ కట్న కానుకలివ్వక్కరలేదు” అన్నాడు. తరవాత “మీ అమ్మాయిని చూడడానికి, పెళ్ళి చూపులకి వస్తాము” అని కూడా చెప్పేడు. నేను మా మాస్టారు, నా మేన మామ కూతురుని, పెళ్ళిచూపులు చూడడానికి వెళ్ళేను….సభ యేర్పాటయింది. పెళ్ళి కూతురుని తీసుకొచ్చి కూచో బెట్టేరు. నా మనసు గుమ్మటంలా యెదిగినట్లు చూశాను. వాళ్ళు మాటాడుకుంటారు వదిలెయ్యండర్రా అన్నారెవరో! యేమి వదిలేశారు!, యీ పక్కనుంచి ఆ పక్కనుంచి చూస్తూనే వున్నారు. నా మనసు కళ్ళెత్తి చూసింది, నేనూ చూశా,అంతే కళ్ళు మాటాడుకున్నాయి. నాకేదో అయిపోయింది. కుర్రాడు పొడుగు, ఆరడుగుల అందగాడు, యెర్రగా బుర్రగా వున్నాడు, పిల్ల పొట్టిగా వుంది, చెవులదాకా అయినా వస్తుందా అన్నారెవరో. మరొకరు దగ్గరగా నిలబెట్టండి చూద్దామన్నారు, మరొకరు. యిద్దరం దగ్గరగా నిలబడ్డాము. నా చెవుల దగ్గరకొచ్చింది, పరవాలేదు!, చెవి కొరక గలదని మరొకరు మేలమాడేరు, మరొకరు. మొత్తానికి గాల్లో తేలుతూ వచ్చేశాం. కాని యేదో వదిలేశాననే ఫీలింగ్. మొదటినుంచీ నా దగ్గరలేని మనసు మళ్ళీ పోగొట్టుకున్నా, ఆ రోజు.

జిలేబిగారు, రసఙ్ఞల సందేహానికి సమాధానం……… మిగతా రేపు………

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి చూపులు

 1. @
  పకోడి గారు,
  నేనేదీ, యెవరినీ కించపరచాలని, యెద్దేవా చెయ్యాలని రాయలేదు. నా బ్లాగుకు వచ్చినందుకు సంతసం. సంక్రాంతి శుభకామనలు.
  ధన్యవాదాలు

 2. భరారేది టపాకు సంబధించిన వ్యాఖ్యలా లేదు, ఏదో నషా దిగక అలా అనివుంటారులేండి. జిలేబి గారి హాస్యం కొంచెం వెగటుగానే వుంటోంది. తమ బ్లాగుకు ఎవరూ రావట్లేదని ఇలా కామెంట్లతో తెగబడటం, బాధాకరమైన విషయమే.

 3. @
  జిలేబి గారికి,
  భా.రా.రెగారు మీ వ్యాఖ్యలపై బాధపడుతున్నారు. మీరు సరదాకి రాశాను అంటున్నారు. మీరందరూ తెలిసివున్న వారని నేను కలగ చేసుకోనందుకు వారు నన్ను తప్పు పట్టేరు. ధన్యవాదాలు

  • గౌరవనీయులైన శ్రీ దీక్షితులు గారికి,

   నేను చేసిన కామెంట్లలో ఏదైనా తప్పులున్న క్షమించవలె.

   నా వరకు ఇక్కడ ఎవ్వరూ నాకు తెలిసిన వాళ్ళు లేరు.

   నే నేదో సరదాకి రాసుకుంటున్నాను.

   ఇందులో కామెంటు చెండులు చిందులు గా మారి భోగి మంట కి మారటం నేను వూహించ జాలని విషయం, గ్రహించ జాలని విషయం .

   @భారారె వారు,

   మీరు బాధ పడి వున్న యెడల క్షమాపణలు ఇవే మీకు.

   ఇందులో ఎవరినీ కించ పరిచే వుద్దేశం లేదు.

   సర్వదా లేదు అని కీబోర్డు పధం గా ఇదే జిలేబి వివరణ.

   చీర్స్
   జిలేబి.

 4. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు…..

 5. మాష్టారు,

  మీరు కూడా సీరియల్ మొదలెట్టేసారు !!?? రేపటి దాక వేచి వుండాలన్న మాట !

  @భారారె వారు,

  ఏమిటో మరీ సూక్ష్మం గా రాస్తున్నారు ! ఏమీ ‘అర్ధం’ కావడం లేదు. అంగీ మరీ కారం గా వున్నట్టుంది !

  సమ్యక్ క్రాంతి శుభాకాంక్షలతో

  జిలేబి.

  • @
   జిలేబి గారు,
   నమస్కారం,
   మీరు అడిగిన సందేహానికి నా స్వానుభవం రాశాను.రేపు వేసే టఫా కూడా, నా జీవితంలో జరిగినది కల్పితంకాదు. మీరు నా బ్లాగులో చేసిన వ్యాఖ్యలకి భా.రా.రె గారు బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. మీరు సరదాగా అన్నాను అంటున్నారు.మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

   • గౌరవనీయులైన శ్రీ దీక్షితులు గారికి,

    నేను చేసిన కామెంట్లలో ఏదైనా తప్పులున్న క్షమించవలె.

    నా వరకు ఇక్కడ ఎవ్వరూ నాకు తెలిసిన వాళ్ళు లేరు.

    నే నేదో సరదాకి రాసుకుంటున్నాను.

    ఇందులో కామెంటు చెండులు చిందులు గా మారి భోగి మంట కి మారటం నేను వూహించ జాలని విషయం, గ్రహించ జాలని విషయం .

    @భారారె వారు,

    మీరు బాధ పడి వున్న యెడల క్షమాపణలు ఇవే మీకు.

    ఇందులో ఎవరినీ కించ పరిచే వుద్దేశం లేదు.

    సర్వదా లేదు అని కీబోర్డు పధం గా ఇదే జిలేబి వివరణ.

    చీర్స్
    జిలేబి.

 6. @
  భాస్కర రామి రెడ్డిగారు,
  నమస్కారం. మీరొక కొత్త మాటాడేరు. అందుకు వెంటనే స్పందిస్తున్నా. నేను దేనికీ బాధ పడలెదు. మరి మీరెందుకలా అనుకున్నారో తెలీదు. మీరు రాయదలుచుకున్నది యెప్పుడైనా రాయచ్చు. మరొకమారు చెబుతున్నా! నాకు యెవరిపైనా యీర్ష్య, ద్వేషాలు లేవు. నేను బ్లాగులో కొత్త, నా కెవరితోనూ తగువులు లేవు. సరదాగా నవ్వుకోవడమే నా ప్రధాన వుద్దేశం. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

 7. మీరు వ్రాసేదంతా వ్రాయండి. అప్పటిదాకా నేను ఏమీ మాట్లాడను. పెద్దలుగా మీ బాధ చెప్పండి ఆ తరువాత నేను చెప్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s