శర్మ కాలక్షేపంకబుర్లు-మార్గదర్శకత్వం.

మార్గ దర్శకత్వం.

దగ్గరగా ఏబదేళ్ళకితం, నేను కాకినాడలో చిన్న వుద్యోగంలో గుంటపువ్వులు పూస్తున్నరోజులు.  దగ్గరగా వొకే వయసువాళ్ళం, పది మందిదాకా వుండేవాళ్ళం. ఇదంతా వొక గేంగు. అంతా పాతిక దగ్గర వయసువాళ్ళే. అందరిలో ప్రఖ్యాత కవిగారి పేరున్నతను మాకుపెద్ద,  అతనికి కవిత్వ ఛాయలుండేవి.. అందరూ నన్ను మాత్రం, బాబాయ్, అన్నయ్య, మావ వగైరా వరసలతో పిలిచేవారు. దీనికో కారణం వుంది. మావా! వో వంద కొట్టు అనేవాడొకడు. ఆరోజుల్లో వందంటే యెక్కువే. యెందుకురా? అంటే యేదో చెప్పి పట్టుకుపోయేవాడు. అవసరం తీర్చుకునేవాడు. ఒకటో తారీకున యిచ్చేసేవారులెండి. నేనొక చిన్న సయిజు పెట్టుబడి దారుడిని, అందరికీ.. నా దగ్గర డబ్బులు యెప్పుడు వుంటాయని నమ్మకం వుండేది. నిజంగా వుండేవి కూడా.ఈ గేంగులో మళ్ళీ విభాగాలుండేవి. కొంతమంది కవులు, మాటల రచయితలు, పాటల రచయితలు, నాలాంటివాళ్ళు, మందు కొట్టేవాళ్ళు వుండేవారు. మావా సాయంత్రం అంటే సరే! ఇదీ వరస. మొత్తం అందరం మునిసిపల్ ఆఫీసు యెదురుగా వున్న పార్కు లో కలిసేవాళ్ళం, సాయంత్రం వేళ. ముందుగా కవితా గోష్టి జరిగేది. వొక మిత్రుడు గంగావతరణం చెబితే నిజంగా గంగ, అక్కడ, శివుడి జటాజూటం నుంచి వురికిందా అన్నట్లు వుండేది. తరవాత ఇతను చాలా పెద్ద సినీపాటల రచయిత అయ్యారు, తెనుగులో. మరొకరు మాటల రచయితగా స్థిర పడ్డారు కూడా, తర్వాతి కాలంలో. మునిసిపల్ ఆఫీస్ యెదురుగా కల్పనా టాకీస్ వుండేది. అందులో రాజ్ కపూర్ వీక్ వగైరా వగైరా సినిమాలు వేసేవారు. రాజ్ కపూర్ వీక్ లు తప్పనిసరిగా సినిమాలు చూసేవాళ్ళం, కొందరం. ఇలా పైలా పచ్చీసుగా కాలం వెళ్ళిపోతూ వుంది.

ఆఫీసులో వొక మార్పు వచ్చింది. మాకు అప్పటిదాకా వున్న ఆఫీసర్ స్థానంలో మరొకరు వచ్చారు. ఈ వచ్చినాయన కూడా కొద్ది తేడాతో మా వయసువాడే. వొంటిగాడు. పిల్లల చదువులకోసం సంసారం పాత వూరిలో వదిలేసి యిక్కడ వొంటిగా వుండేవాడు. ఆయన యీ గేంగుని కొద్ది కాలంలోనే గుర్తించేశారు. కారణం, పని దగ్గర నుంచి అన్ని విషయాలలో, యూనియన్లో వీళ్ళే కనపడేవారు. వీళ్ళు అన్నిటిలోనూ ప్రఙ్ఞ చూపడం ఆయనకి నచ్చినట్లుంది. వొకరితో ముందుగా పరిచయం పెంచుకుని, ఆయన కూడా మా గేంగులో చేరిపోయారు,వచ్చిన కొద్ది కాలంలోనే…. మా కార్యక్రమాలు బాగా పరిశీలించే సావకాశం దొరికిందన్న మాట, ఆయనకి…… కొంత కాలం గడిచింది….

వొక రోజు బీచ్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడి అటుగా సైకిళ్ళపై పోయాం. చాలా సేపు ఆటపాటలతో గడిపేశాం. వొకరు ఫోటోలు కూడా తీసిన గుర్తు. ఆ తరవాత మా కొత్త మిత్రుడైన ఆఫీసర్ గారు మమ్మలినందరిని సమావేశపరచి వొక విషయం చెప్పేరు. ఆ మాట విని అందరం నోట మాట రాక, యేం చెప్పాలో తెలియక, నిశ్శబ్దంగా వుండిపోయాం. ఆయన కూడా మీరు అలోచించుకోండి, అన్నారు తప్పించి యెవరినీ వత్తిడి చేయలేదు. అందరిలో గుస గుస ప్రారంభమయింది. సాఫీగా సాగుతున్న బతుకుల్లో పెద్ద తుఫాను లా అనిపించింది. మరునాడు నేను మొదటగా స్పందించి పుస్తకాలుచ్చుకుని సాయంత్రం మా స్థావరానికి చేరుకున్నా. మిగిలిన వారెవరూ యేమీ తేలా. మా ఆఫీసర్ గారు గురువు అవతారంయెత్తి లెక్కలు చెప్పడం మొదలెట్టేరు. నాకు చెవులు మెదిలేయి. కారణం, చదువుకునేరోజులలో నేను లెక్కలు చేసుకోడానికి పడిన బాధలు గుర్తొచ్చాయి. నేను ములిగిపోయా. గురువుగారు పుస్తకాలిచ్చారు. నా లోకం మారిపోయింది. సినిమాలు బంద్, షికార్లు బంద్, మందు బంద్, చదువు ముందు, ఇదీ కార్యక్రమం. కడుపే కైలాసం, యిల్లే వైకుంఠం, ఆఫీసు, యిల్లు, చదువు, తప్పించి మరొకటి కనపడలా.! మా కోట బీటలు వారింది. కొంతమంది నాతో చేరేరు. చదువు ఇష్టం లేని వారు వేరు వ్యాసంగం చేస్తూ వుండేవారు. కొద్దికాలం తరవాత గురువుగారు వొక సడలింపు యిచ్చారు. రోజూ కలవడం, అందరం. వొక గంట కబుర్లు, కాలక్షేపం. తరవాత, వారం కి వొక సారి సినిమా. ఇదీ బాగుందనుకున్నాం. కొన సాగించాం. కొద్ది రోజులలో కాంపిటీటివ్ పరీక్షలకి అభ్యర్ధులనుంచి అప్లికేషనులు కోరింది ప్రభుత్వం. ఇచ్చేశాం. చదువు ముమ్మరం చేసేశాం. వున్న తక్కువ ఖాళీలలో మొదటి పేరు మనదే వుండాలి అదీ ధ్యేయం, పట్టుదలగా పరీక్షలు రాశాం. మొదటి ప్రమోషన్ కొట్టేశాం. కొత్త గోదావరి నీటికి, సముద్రం నుంచి గోదావరిలోకి యెదురొచ్చే విలస చేప, కొత్త గోదావరి నీరు తాగి పులస అయినట్లుగా, చదువు మత్తు కమ్మేసింది. మొదటి సారి ముగ్గురం ప్రమోషన్ పొందాం. తరవాత అది కొన సాగించాం, యెక్కడ వున్నా, మరు సంవత్సరం రెండవ ప్రమోషన్ కొట్టేశా.. మరి తిరిగి చూడలేదు. నా జీవితంలో మరిచిపోలేని ఆ మార్గదర్శి, శ్రీ. కొలచన వేంకట శర్మ గారికి వందనాలు. వారిలా నిస్వార్ధంగా యెంతమందికి చదువు చెప్పేరో….. చెప్పడం కష్టం..

ప్రకటనలు

23 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మార్గదర్శకత్వం.

  • @
   జ్యోతిర్మయి,
   మంచి మనసున్నవారు చెబుతారు. వినలేకపోవడం మన దౌర్భాగ్యం. యెప్పుడొ కొద్దిగా పుణ్యం చేసుకుని వుంటాము అందుకే మాట విన్నాం. జీవితంలో సుఖపడ్డాం. ధన్యవాదాలు.

  • @
   మాలా.పి.కుమార్ గారు,
   ఆ రొజు వారు చేసిన మార్గదర్శనం మూలంగా, జీవితం ఆనందంగా గడచింది కదండి. అదృష్టం వుంటే తప్ప అటువంటి వారు దొరకరు.

 1. శర్మగారూ, మీ కోసం, జిలేబీ గారికోసం, యింకా అనేకాకానేక రసికపాఠకులకోసం మరో రెండు పద్యాలు జిలేబీ శతకంలో:

  కం. అడిగిన తడవుగ పద్యం
  బొడుపుగ రాకున్న దాని కొక విలువున్నే
  నుడులన్ సరసత గలిగిన
  యెడలన్ పద్యంబు మెరయ నేర్చు జిలేబీ

  కం. ఒక మంచి భోజనమునకు
  నొక చక్కని పద్యమునకు నుర్విని సామ్యం
  బొకటే రసికుల రసనలు
  ప్రకటించెడు మెచ్చుకోలు పలుకు జిలేబీ
  ………………………… (జిలేబీ శతకం)

 2. స్వామీ అండ్ శ్యామీ!!!!

  ట్విట్టర్ విన్నాను ట్వీటింగు విన్నాను!

  ఈ ట్విట్టర్ ట్వీటింగు ఇలా జిలేబీ ‘స్వీటింగు’ అవునని ఎదురు చూడలేదు !

  నెనర్లు ! జిలేబీ నీ జన్మ ధన్య మయ్యె!

  శ్యామలీయం మాష్టారు వెంట ఇక నేను పడాలి శతక భాగాలను వెదుకు కుంటూ!!!

  ఇక యత్ర యత్ర జిలేబి నర్తనం తత్ర తత్ర శత ‘కక్ష’ దర్శనం కాకుంటే అదే పది వేలు !!

  చీర్స్
  జిలేబి.

  • @
   మిత్రులు తాడిగడప శ్యామలరావుగారు,
   నిజంగా పద్యాలు బాగున్నాయండి.రెండవసారి చెప్పినది మరీ బాగుంది.ధన్యవాదాలు.

  • @
   మిత్రులు జిలేబి గారు,
   పదివేలు!!! నా డైలాగు, మీరువాడేస్తున్నారు. కక్ష యెందుకండీ, నవ్వు కుందాం కాసేపు.
   ధన్యవాదాలు.

  • కం. నా కెందుకమ్మ కక్షలు
   మీ కోసం పద్యవిద్య మెరిపిస్తుంటే
   స్వీకారానికి కూడా
   షోకా శతకమ్ము నీకు సొమ్ము జిలేబీ
   ………………………… (జిలేబీ శతకం)

   • @
    మిత్రులు తాడిగడప శ్యామలరావుగారు,
    బాగుంది.మరొక్క రెండు పద్యాలు జిలేబి మీదవి వదిలిపెట్టండి.
    ధన్యవాదాలు.

   • శ్యామలీయం వారు, శర్మ గారు,

    అక్కడ కక్ష లు అన్నది క నించి క్ష వరకన్న మాట !

    అచ్చులు మీవి ‘హల్లులు’ మావి !

    ( ఈ జిలేబి ఎలా రాసినను దానికి వేరే అర్థం వుంటుందేమిటి చెప్మా – బాగా సర్దేశానా మాష్టారు, కక్ష లని ?)

    ఇక స్వీకారానికి షోకా అన్నారు ! మహరాణీ ‘పోషకులమై’ స్వీకరిస్తాం మాష్టారు ! ధన్యోస్మి !

    చీర్స్
    జిలేబి.

  • @
   మిత్రులు జిలేబిగారు,
   మిత్రులు శ్యామలరావుగారు శతకం నుంచి పద్యాలు వదుల్తున్నారు. నేను జాగ్రత్త పెట్టుకుంటున్నా, నా బ్లాగులో.
   ధన్యవాదాలు.

 3. చక్కని స్నేహం బొక్కటి
  దక్కినచో జీవితంబు ధన్యము గాదా
  పెక్కురు సామాన్యులతో
  చిక్కిన అది బ్రతుకు తీపి చెరచు జిలేబీ

  కొంచెము గానైనను తగు
  మంచి తనము గతము నందు మన కగుపించెన్
  మంచికి రోజులు కావివి
  ముంచే స్నేహాలు పెద్ద ముప్పు జిలేబీ
  …………………………… (జిలేబీ శతకం)

  • @
   మిత్రులు తాడిగడప శ్యామలరావుగారు,
   రెండు అమృతపు చినుకులు జిలేబి శతకం నుంచి విదిల్చినందుకు కృతఙ్ఞుడను. అవసరం మేర మిగిలినవి కూడా పంచగలరని ఆస. అవసర స్నేహాలు ముంచు జిలేబీ….ధన్యవాదాలు..

   • శర్మగారు,
    ఈ పద్యాలు మీకు నచ్చినందుకు సంతోషం.
    మీరు జిలేబీ వెంటబడితే జిలేబీశతకం పద్యాలన్నీ మీ కంటబడతాయండీ.
    యత్ర యత్ర జిలేబి నర్తనం తత్ర తత్ర శతకశ్చ దర్శనం.
    జిలేబీగారు వీటిని పదిలపరుస్తున్నారేమో తెలియదు.

  • శ్యామలీయం వారు,

   చక్కని స్నేహంబు, ఒక్క చిక్కని టీ, దక్కినచో జీవితంబు ధన్యమే!

   (శర్మ గారి మునిసిపలు ఆఫీసు ఎదుటి పార్కు దగ్గిర టీ కొట్టు కూడా వుండి వుంటుందను కుంటాను )

   చీర్స్
   జిలేబి.

   • @

    జిలేబిగారు,
    నిజమే టీ కొట్టుకూడా వుండేది. మరిచిపోయా.మీరూ చూసినట్లుందే. ధన్యవాదాలు.

 4. శర్మ గారు,

  బాగుందండీ. టర్నింగ్ పాయింట్స్ ఇన్ లైఫ్ అన్న మాట.

  మార్గ దర్శకత్వం ఈ రోజుల్లో చాలా తక్కువే.

  ఇచ్చే వారు అక్కడక్కడా కాన వచ్చినా వినేవారు వున్నారా అంట?

  జిలేబి.

  • @
   జిలేబిగారు,
   చెప్పేవారూ తగ్గిపోతున్నారు, వినేవోపికలేదనుకుంటా. అంతా వురుకులూ, పరుగులూ.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s