శర్మ కాలక్షేపంకబుర్లు-నరకం

 

నరకం

గల్ఫ్ దేశాల్లో ఇలా కష్టపడి బయట పడిన వారు ముగ్గురిని ఎరుగుదును. వారి కష్టాలు వింటే మనసు ద్రవిస్తుంది. ఇందులో ఒక మహిళ కష్టాలయితే చాలా ఘోరం. వినడానికి చెప్పడానికి కూడా సహ్యం కానిది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామంటోది కాని అవి వీరిని రక్షించేలా లేవు. ఈ అభాగ్యులు దళారులబారి పడుతూనే ఉన్నారు. ఏంటో! నాకీ మధ్య అన్నీ ఇటువంటి వార్తలే కనపడుతున్నాయి.

ఇలా కష్టాలు పడుతున్న వారు చాలా మంది కనపడుతున్నారు. వీరి కష్టాలకి నివృత్తి లేదా?

 

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నరకం

 1. ఏబ్రాసి ఎంబసీ…

  జిలేబీ గారూ, జంధ్యాల గారి లెవెల్లో తిట్టారండీ.

  • @బోనగిరిగారు,
   ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోనే యీ రకమైన దోపిడీ, స్త్రీలపై లైంగికమైన హింస ఎక్కువగా జరుగుతోంది. కడుపునింపుకోడానికి వెళ్ళిన వాళ్ళంతా నిరక్షరాస్యులు. వీరికి ఏరకమైన ప్రభుత్వ సహాయం అందటం లేదని నా వ్యధ.
   ధన్యవాదాలు.

 2. ఇలాంటి దయనీయ గాథలు ఎన్నో ఉన్నాయి..కానీ కొంత మంది మాత్రమే బయటికి చెప్పుకుంటున్నారు తాత గారూ.బయటపడనివి ఎన్నో…

  • @సుభ,
   తెలియనివి ఎన్నో వ్యధాభరితాలు, తెలిసిన వాటికి సానుభూతి తెలుపుదాం.
   ధన్యవాదాలు

 3. దయనీయమైన కథ.

  ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అన్ని దేశాలలో మన ఎంబసీ లు వుండండం, వారు ఏ పాటి సహాయమూ చెయ్యక పోవడం. వీళ్ళనేమనాలి ? ఈ పై సంఘటన లో ఆ సత్యనారాయణ గారికి ఎక్కడా ఇండియన్ ఏబ్రాసి ఎంబసీ సహాయం చేసినట్టు అగుపించట్లేదు, మూర్తి ఆచూకి కనిబెట్టడం లో. ఖచ్చితం గా ఇది మన గవర్నమెంటు వారి నిర్లక్ష్య వైఖరి యే, వీటి కన్నిటికి మూల కారణం.

  జిలేబి.

  • @జిలేబి గారు
   భారత ప్రభుత్వం వారికి చాలా పనులుంటాయి.మిగతా దేశాలవారు వారి పౌరులకు విదేశాల్లో రక్షాణ కోసం చూస్తాయి. మనవారు రూల్స్ చూస్తారు అంతే తేడా.ధన్యవాదాలు

   • శర్మగారూ చాలా బాగా చెప్పారు.

    బీదవాళ్ళు యేవో కాసిని రూకలు పోగేసుకుందాం కుటుంబంకోసం అని తాపత్రయ పడతారు.
    మన ఎంబసీలు బీదభారతీయుల అభాగ్యభారతీయులకు సేవ చేసి తరించాలనుకోవుగదా.
    వాళ్ళేమీ వీళ్ళ మూతులూ చేతులు తడపలేరుకదా.
    అందుకే నిర్లక్ష్యం.

    మన చదువుకున్న వాళ్ళు ఇతరదేశాలకు సేవ చేసి డబ్బులు నొల్లుకుందాం అక్కడే స్థిరపడిపోదాం అనే యావలో పడి ఇక్కడ స్వదేశంలో ఉన్న కుటుంబాలను మరచి పోతారు. (అప్పుడప్పుడు హలో అంటారు లేండి)
    వారికి మన ఎంబసీలతో సకృత్తుగా పని బడుతుంది.
    అంతా డబ్బున్నోళ్ళే కదా, పెద్ద తిప్పలుండవు.

వ్యాఖ్యలను మూసివేసారు.