శర్మ కాలక్షేపంకబుర్లు-నేస్తమా! ప్రియనేస్తమా!!

నేస్తమా! ప్రియనేస్తమా!!
నేస్తమా! ప్రియ నేస్తమా!!
ఇప్పుడే వస్తానని,నవ్వుతూ వెళ్ళిపోయావ్!!
మాటలేదు, పలుకులేదు,
నా హృదిని దోచి, నీ మదిని దాచి,
కనపడకుండా పోయి కన్నీళ్ళే మిగిల్చావ్!!
న్యాయమా! నీకిది ధర్మమా!!
జ్ఞాపకాలేమిగిల్చావా?
నాకున్న వ్యధ నీకులేదా? వ్యధను మదిని దాచావా?
స్వాతి వానకు ముత్యపు చిప్పలా
నీ క్షేమ వార్త కోసం, ఎదురు చూసే!
మోడువారిన మనసుపై
చిరు జల్లు కురిసిపోవా!! నేస్తమా! ప్రియ నేస్తమా!!

మిత్రుని దగ్గరనుంచి కబురుకై ఎదురు చూపు. చిరు ప్రయత్నం.తప్పులు మన్నించగలరు.

 

 

 

 

 


ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నేస్తమా! ప్రియనేస్తమా!!

 1. తాతగారూ అన్యాయం ఇది.. మాకు పోటీయా? ఇంత చక్కగా వ్రాసేసి మళ్ళీ తప్పులుంటే మన్నించండి అంటారా? ఐనా ఇలా వ్రాసిన తరువాత ఆ వార్త రాకుండా ఉంటుందంటారా? తప్పకుండా వస్తుంది.

  • @సుభ,
   అమ్మో! మనవరాళ్ళతో పోటీయా! ఓడిపోయా!! విరమించుకుంటా. !!!
   సు+భాషిణి = తేనె పలుకు తల్లి, సరస్వతి. అమ్మ కరుణిస్తే నా మిత్రునికి, నాకు లోటు లేదు కదా! వార్త కోసం ఎదురు చూస్తా.!!
   ధన్యవాదాలు.

 2. ఇక్కడా కన్నీళ్ళే?

  ఏమిటి వరసబెట్టి అందరూ కన్నీళ్ళ ధారావాహిని మొదలెట్టారు !(ఇప్పుడే ఫణీంద్ర గారి టపాలో కన్నీళ్ళని పలకరించి వస్తున్నా!)

  మీ మిత్రుని తిరిగి రాక తో మీకు మళ్ళీ మలయ మారుత ఆనంద కన్నీళ్లు కలుగు గాక !

  సర్వ రోగ నివారిణీ నయన ధారా వాహిని నమోస్తు నిత్యం పరిపాలయామాం !

  జిలేబి.

  • @జిలేబి గారు,
   నా మిత్రుడు మళ్ళీ క్షేమంగా తిరిగొస్తే మీ పేరు చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటా. 🙂
   ధన్యవాదాలు.

  • @శ్రీ గారు,
   నా బ్లాగుకు స్వాగతం.నాకు పేర్లు గుర్తు ఉండని వ్యాధి ఉంది. మీరిదవరకే వచ్చి ఉంటే మన్నించండి. వ్యాఖ్యకు,
   ధన్యవాదాలు

 3. చిరు ప్రయత్నమంటూనే చక్కగా రాశారు…
  మదిలో మిత్రభావనికిచ్చిన అక్షర రూపం మీ మిత్రుని కబురు త్వరలోనే మోసుకొస్తుంది చూడండీ…

  • @చిన్ని ఆశ గారు,
   నా బ్లాగుకు స్వాగతం. వచ్చిన మొదటిరోజు మంచి వార్త వస్తుందన్నారు. ఆశాజీవిని.
   ధన్యవాదాలు

వ్యాఖ్యలను మూసివేసారు.