శర్మ కాలక్షేపంకబుర్లు-నేస్తమా ఓ ప్రియ నేస్తమా!

నేస్తమా! ఓ!! ప్రియ నేస్తమా!!!


అనుక్షణం నిన్ను తలిచా
నీ తలపులో నన్ను మరిచా,
నా ఆర్తి నిన్ను చేరలేదా!,
నీ ఒక్క మాట చాలదా!

మడులెందుకు, మాన్యాలెందుకు!
వద్దు కోపం, స్నేహం మాత్రం కాదనకు,
ఏ శిక్షకైనా సిద్ధం, మాట మాత్రం మానకు,
నీ మనసు వెన్న, కానీ శిల నేడెందుకు

నానుంచి ఏదో దాస్తున్నావా?
పంచుకో వ్యధయితే! దాచుకో సుధయితే!!
కనికరంలేదా? నీ నేస్తాన్ని కానా?
నిన్ను మరిచే వరమైనా ఇవ్వలేవా?

నాపై రాదు నాకు కోపం
అదే నాకు పరితాపం
నీపైనా రాదు కోపం
అదేమో చిత్ర విచిత్రం.

మరెందుకు నీ మౌనం!
మౌన మెంత భయంకరం,
నేను భరించలేని నరకం
లాభంగా తిరిగిరావా!తెలుపవా క్షేమం!!

మిత్రుని వార్తకోసం ఎదురు చూపు. ఇదీ చిరు ప్రయత్నం. తప్పులు మన్నించండి.

(కరంటు పదే పదే పోతుండటంతో, కాగితం పైరాసి మీ బుర్రలు తింటున్నా.మళ్ళీ సారికి బొమ్మేస్తా) 🙂

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నేస్తమా ఓ ప్రియ నేస్తమా!

 1. ఏమండీ ‘టెలీ’ కామ్ శర్మ గారు,

  ఈ మొబైళ్ళ లో అదేదో ఐ ఎం ఈ ఐ వంటి వి వుంటాయట. మొబైళ్లు మనల్ని వదలి వెళ్లి పోతే వీటి ద్వారా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చట

  అట్లాగే మనకు కూడా ఓ ఐ ఎం ఈ ఐ ఉంటే బాగుండేది. వెంటనే మన నేస్తాలు ఎక్కడ ఉన్నారో తెలిసి పోయేది.

  టెలికాం వారు ఇట్లాంటి ఒక చిప్పు వెంటనే హ్యూమన్ జీన్ లోకి పెట్టేటట్టు (నేట్టేటట్టు) కనిబెట్ట వలె !

  మీ నేస్తం స్థానికం లోనే ఉన్నారు. త్వరలోనే దర్శనం !

  చీర్స్
  జిలేబి.

 2. బాగా రాసారు.

  మీ నేస్తం దగ్గర నుండి తొందరలో వస్తుంది సమాచారం
  అని నాకు ఎందుకో అనిపిస్తుంది ఈ క్షణం
  మంచి స్నేహితులను విధి కూడా విడదీయలేదన్నది సత్యం

వ్యాఖ్యలను మూసివేసారు.