శర్మ కాలక్షేపంకబుర్లు-ఆపద.

ఆపద

అననగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక మఱ్ఱి చెట్టు. ఆ మఱ్ఱి చెట్టు కింద కలుగులో ఒక ఎలక,పేరు పలితుడు, చెట్టు మీద రోమశుడు అనే పిల్లి ఉంటున్నాయి.ఆ దగ్గరలోనే ఒక వేటగాడు ఒక వల వేసిపోయాడు. అది చూసుకోని పిల్లి తిరుగుతూ అందులో చిక్కుకుపోయింది, ప్రమాదవశాత్తూ. అక్కడ ఆహారం కోసం తిరుగుతున్న, పలితుడు చూశాడు. ఈ లోగా చంద్రకుడు అనేగుడ్లగూబ,హలికుడనే ముంగిస ఎలకని పట్టుకుని తినడానికి ప్రయత్నం చేశాయి. ఇది చూసిన పలితుడు, వెంటనే రోమశుని దగ్గరకెళ్ళి నిన్ను వలనించి విడుదల చేస్తాను, వలను కొరికుతాను, రక్షిస్తాను, అని చెబుతుంది, నువ్వు నాతో స్నేహంగా ఉండాలని అంటుంది. గూబని, ముంగిసను చూస్తే నాకు భయంగా ఉంది అంటుంది. ఇది విన్న రోమశుడు ప్రాణాపాయం తప్పుతున్నందుకు సంతోషించి, పలితినితో, నువ్వు నన్ను ఉరి నుంచి రక్షిస్తున్నావు కనక దైవ సాక్షిగా నీకు అపకారం చెయ్యను, నేను విడుదలైతే వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు అని చెబుతుంది. ఎలక నిశ్చింతగా అక్కడ ఉంటుంది.

ఈ సంగతి చూసిన గూబ, ముంగిస ఓహో! వీళ్ళిద్దరూ స్నేహపడిపోయినట్లుంది, పిల్లి కనక విడుదలయితే ఎలక మనకి దక్కదు సరికదా మనకి కూడా ప్రమాదమని అక్కడనుంచి తప్పుకున్నాయి. మనం ఇక్కడున్నప్పటికీ కూడా ఎలక దొరికే సావకాశం లేదు కనక ఇక్కడ ఉండటం అనవసరమని నిశ్చయించుకుని, వెళ్ళిపోయాయి. కాని అన్న ప్రకారంగా ఎలక మాత్రం వలని కొరకటం లేదు. కొరుకుతున్నట్లుగా నాటకం ఆడుతోంది. ఇది చూసిన పిల్లి భయంతో, నీకు అపకారం చెయ్యనని చెప్పేను కాని నువ్వు, వలని కొరకడానికి ఆలస్యం చేస్తున్నావు, ఇలా చేయడం నీకు న్యాయమా, ఇది కృతఘ్నత కాదా అని ఎలకతో అంటుంది. అప్పుడు ఎలక, రోమశుడా! వేటగాడు కనపడిన మరుక్షణం నేను వల కొరికి నిన్ను రక్షిస్తాను అని చెబుతుంది. ఈ లోగా వేట కుక్కల అరుపులు వినపడతాయి, వేటగాడు కనపడతాడు, అప్పుడు పిల్లి అదుగో కుక్కలొచ్చేస్తున్నాయి, వెనక వేటగాడొస్తున్నాడు, వెంటనే వలకొరుకమని కంగారు పెడుతుంది. అప్పుడు వెంటనే పలితుడు వల కొరుకుతాడు. పిల్లి ప్రాణ భయంతో గబగబా చెట్టేక్కేస్తుంది. ఎలక కలుగులో దూరిపోయి పొంచి చూస్తూ ఉంది. వేటగాడు, కుక్కలు వచ్చి చూస్తే, వల తెంచుకుని పిల్లి పారిపోయినట్లు కనపడుతుంది. వేసిన వల వ్యర్ధమైనదనుకుని వేటగాడు వల సద్దుకుని పట్టుకుపోయాడు.

వేటగాడు వెళ్ళిన తరవాత పిల్లి ఎలకతో, మిత్రుడా రా! కలిసి తిరుదాం, కలసి బతుకుదాం, నీవు భయపడక్కరలేదని అంటుంది. అప్పుడు ఎలక మిత్రులు, శత్రువులను గుర్తించటం జరగాలి. ఒకప్పుడు శత్రువు కూడా మిత్రునిలా కనపడతాడు. నీతో కలిసి తిరగడం క్షేమం కాదు. బలవంతులైన శత్రువు కూడా ప్రయోజనం కోసం ఒకప్పుడు ఒడబడవచ్చును. అంతలో అతనెప్పుడూ మిత్రుడని అనుకోకూడదు. నేను నీకు భోజనాన్ని, ఏమో ఎప్పుడు నీ మనస్సు ఎలా ఉంటుందో చెప్పలేముకదా, రాత్రి అంతా వలలో ఉన్నావు, ఆకలితో, నా మీద పడి తింటే నేనేమైపోవాలి. అంటే పిల్లి నీ వల్ల కదా బతికేను, నీకు కీడు చేస్తానా అని వగస్తుంది. అప్పుడు ఎలక నమ్మతగని వారిని ఎప్పుడూ నమ్మకూడదు, నమ్మ తగిన వారిని కూడా నమ్మినట్లుండాలే కాని నమ్మకూడదు సుమా! అని చెప్పి మరుసటి రోజు ఆ కలుగు వదిలేసి మరొకచోటికి పోయింది, ఎలక.

నిత్య జీవితంలో కూడా మనకీ ఇటువంటి సంఘటనలు తగులుతూ ఉంటాయి, పలితుడు లాగా తెలివిగా బలమైన శత్రువుని కూడా ఉపయోగించుకుని మన ఆపద నుంచి తప్పించుకోవచ్చు. ఎవరిని అతిగా నమ్మవద్దని కూడా ఈ కధను బట్టి తెలుస్తూ ఉంది. ఇది భారతం లో భీష్ముడు ధర్మరాజు, బలవంతులయిన ఎక్కువ మంది శత్రువుల మధ్య బలహీనుడు ఆపదనుంచి ఎలా తప్పించుకోడం అని అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానం, ఈ కధ.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆపద.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s