శర్మ కాలక్షేపంకబుర్లు-అదో తుత్తి

అదో తుత్తి

“మీరు బ్లాగులో రాస్తారుటకదా?, రోజూ,” ఒక మిత్రుని ప్రశ్న. “అవునుకాని, మీకు రాయడానికి ప్రేరణ ఎలా కలుగుతుంది,” అనుమానం వెలిబుచ్చారు. మీ అనుమానం నిజమే, దీనికి ఒక పోలిక, నా అభిమాన రచయిత అన్న మాట దురుసుపోలిక,కవనానికి నా సొల్లు కబుర్లకి,అనగా నక్కకి నాక లోకానికి పోలిక చెప్పినట్లు, సామ్యం చెప్పడం. పెద్దనగారిదిగా చెప్పబడుతున్న ఒక పద్యం చెప్పుకుందాం. ఈ పద్యం నాకు గుర్తురాకపోతే, గురు తుల్యులు, శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారి బ్లాగునుంచి ఎత్తుకొచ్చా. వారు మన్నిస్తారని నమ్మకం.

నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పొరయు రసజ్ఞు లూహ తెలియంగ లేఖక పాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచయింపుమటన్న శక్యమే!

పోలిక దురుసుగానే ఉంది, క్షమించండి. నా సొల్లు కబుర్లకి ఇవి అవసరమా. ఇందులో పెద్దనగారు కావాలన్నవి నాకు దొరికేవి ఏమున్నాయో చూద్దాం. నిరుపహతి స్థలము, ఇది దుస్సాధ్యం, రెండు మూడు గదుల్లో ఇరుక్కుని ఒక మూల కంప్యూటర్ పెట్టుకుని, సంసారం నడుపుకునే వాడికి ఎలా సాధ్యం, కుదరదు. రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చి కప్పుర విడెము, అయ్యో! ఈ మాట వినపడితే ఇల్లాలు చీపురుకట్ట పుచ్చుకుని వెనకపడదూ, డెభ్భయిపైదాటిన వయసులో రమణీ ప్రియదూతిక కావలసి వచ్చిందా? అదీ కప్పురవిడెము కావాలా? అని పట్టుకుని ఝాడిస్తే మన బతుకు బస్ స్టాండు కదా! ఇది అసాధ్య, దుస్సాధ్యం. ఒక వేళ ఎలాగో సాధించుకున్నా, కప్పుర విడెం నమలడానికి పళ్ళేవీ. ఆత్మ కింపయిన భోజనము, ఇదో పెద్ద ప్రహసనం, తిందామని కోరికుంటుంది, తిండానికి పళ్ళులేవు, పొరపాటున తింటే పడదు, ఇంక ఆత్మకింపయిన భోజనం ఏమిటి,నా తలకాయ, అన్నం జావలాగ చేసుకుని తాగడం, చప్పరించడం తప్పించి. ఊయల మంచము అన్నాడు కదండి, ఇరుకు గదుల్లో సాధ్యమా? పరవాలేదు, నాకో పేముతో చేసిన బుట్ట ఉయ్యాలా ఉంది నా గదిలో,నా గది 14/12 అ అందులో ఒక పక్క ఊయల కోసం రింగులు పెట్టించా. అందులో ఒకటి వాడుతున్నా. అదే ఊయల మంచం అనుకుంటూ ఉంటా. చివరికొచ్చేమండి,ఒప్పు తప్పొరయు రసజ్ఞు లూహ……… అన్నాడు కదండీ, మీరంతా నా ఈ కబుర్లు చదువుతున్నారు, తప్పు ఒప్పులు చెబుతున్నారు. ఇదొక్కటీ మాత్రం కుదిరిందండీ. మిగతావి వల్ల కాదు, కాక కాదు కదా.!!!

ప్రస్తుతానికొస్తే ఇది 200 వ టపా, బ్లాగు మొదలు పెట్టిన  225  రోజులలో, మొత్తం వ్యాఖ్యలు  1669  వ్యాఖ్యలు, అందులో సగం నావేననుకోండి, నేటికి వీక్షకులు  23,౦౦౦ పైన. ఈ కబుర్లు ప్రపంచం మొత్తం మీద జపాన్ నుంచి అమెరికా దాక  33 దేశాలలో మన తెనుగు సోదరులు/ సోదరీమణులు చదువుతున్నారు. అసలు మన తెనుగు వారులేరేమో అని అనిపించేవి దక్షణ అమెరికా, చైనా, రష్యా దేశాలు. ఆఫ్రికా లో కూడా ఘనా అనేదేశం నుంచి ఒకరు చదువుతున్నారు, గల్ఫ్ దేశాలవారు కాక, రోజూ. మొదటి రెండు స్థానాలకి పోటీ పడేవారు, భారత, అమెరికా తెనుగు వారు. ప్రపంచంలో ముఫై మూడు దేశాలలో నా పేరు తెలిసినవారున్నారన్నది, అదో తుత్తి. ఇది ఈ మధ్య వర్డ్ ప్రెస్ వారు ఏర్పాటు చేయడం మూలంగా ఫిబ్రవరి నుంచి తెలిసిన వివరాలు. ఆ దేశాలలోని తెనుగు సోదరులు, సోదరీమణులందరికి నమస్కారం,కృతజ్ఞత తెలియ చేసుకుంటున్నాను.

ఇన్ని టపాలు ఇంత తక్కువ సమయంలో రాయగలగడానికి, మీరిచ్చిన సహాయం, అమ్మలగన్నయమ్మ దయ తప్పించి నా ప్రజ్ఞ లేశమాత్రం లేదని మనవి. ప్రేరణకి, ఒక మాట, ఒక అభినందన, ఒక అభిశంశన,ఒక సంఘటన, అనుభవాలు, జ్ఞాపకాలు, ఇవే కారణాలు. నా బ్లాగును బెస్ట్ బ్లాగ్ గా రాయడం మొదలుపెట్టిన నెలలో గుర్తించి స్ఫుటంగా తెలియ చేస్తున్న టాప్ తెలుగు బ్లాగస్ బ్లొగ్ స్పాట్.కాం వారికి కృతజ్ఞత తెలియ చేసుకుంటున్నా. అలాగే హారం వారు తమ సైడ్ బార్లో ఎక్కువగా చదివిన టపాలు, వీటినో లుక్కెయ్యండి లో రోజూ ఏదో ఒక దానిలో నా టపా ఒకటి కనపడుతూనే ఉంది. హారం వారికి ధన్యవాదాలు. సుజన మధురం బ్లాగులో డాక్టర్ మధురవాణి, సాయి సుజన గార్లు నా బ్లాగుకు అత్యున్నత స్థానమిచ్చి గొప్పగా పరిచయం చేస్తూ, అందరూ చదివితీరవలసిన బ్లాగని కొనియాడారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందరో మహాను భావులు/ మహానుభావిణులు, అందరీకి వందనము.

ఈ బ్లాగు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, మానసికం, శారీరికం, రక రకాలు.ఎందుకింత తొందరగా రాస్తారని ప్రశ్నించారొక మిత్రులు. ఈ ప్రపంచంలోకి రావడం ఆలస్యం, ఉన్న కాలమెంతో తెలియదు, ఉన్నంతలో రాయాలని తపన. ప్రపంచం మూడిటి పై ఆధారపడి తిరుగుతూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయాలు, ఆరోగ్య రీత్యా వాత, పిత్త, కఫాలు, కాలం లో భూత, భవిష్య, వర్తమానాలు. ఏదయినా కాలంతో పాటుదే. ఏదీ శాశ్వతం కాదు, అలాగని ఏ ప్రయత్నమూ మానకూడదు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఊపిరి చొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు అన్నారో సినీకవి. జరగ బోయేది, మరు క్షణం మాది కాదుకదా! అందుకీతొందర. ఈ మధ్య టపాలలో కొద్దిగా వేడి తగ్గిందనే అనుకుంటున్నా. ఓపిక తగ్గుతూ ఉంది కదా.

ఒకో సారి ఐదారు టపాలు రాసినవి ఉంటాయి, అవి నచ్చక, ఉన్న టపాలు వేయకుండా అర్జంటుగా మరొకటి అప్పటి కప్పుడు రాసి వేసినవున్నాయి, ఇప్పుడు రాసి ఉంచిన టపాలు లేవు లెండి. అనివార్య పరిస్థితులలో రాయలేకపోయినపుడు, ఎదో తప్పు చేసినట్లుగా బాధ పడిన రోజులున్నాయి. నవ్వకండి మరి, వ్యాఖ్యలు పెట్టలేదని బాధ పడిన రోజులున్నాయి. అదుగో నవ్వుతున్నారు మరి, నిజమే చెబుతున్నా, ఇదంతా మనసు చేసిన చిత్రం. నేను రాసిన వాటిలో ఎక్కువ భాగం టపాలు మనసువే ఉంటాయి. వాటిని మీరు చాలా ఆదరించారు కూడా. నందో రాజా భవిష్యతి ముందు జరగబోయేది నా చేతిలో లేదు.

వందవ టపా ఒకరికి అంకితమిచ్చా, అంతే వారు బ్లాగులోకంలో కనపడటంలేదు, రెండు నెలలనుంచి, మొన్నీ మధ్య ఒక టపా ఒకరికి అంకితమిచ్చా, అంతే వారు పది రోజులనుంచి కనపడటం లేదు బ్లాగులోకంలో, అందుకు ఈ టపా ఎవరికీ అంకితమివ్వటం లేదు, నాకే అంకితమిచ్చుకుంటున్నా.

స్వస్తి

 

ప్రకటనలు

30 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అదో తుత్తి

 1. శర్మ మాస్టారికి ,
  మీరు రెండు వందల టపాలు , మీ బ్లాగులో ఆసక్తి కరంగా, ఓపిక గా రాశారు. అందుకు అభినందనలు.
  మీ టపాలు, యువతకు మార్గ దర్శకాలు. స్ఫూర్తి దాయకాలు.
  ఆరోగ్యం బ్రంహాండం గా ఉన్నప్పటికన్నా, ఆరోగ్య జీవన సమరం చేస్తూ ,
  మంచి రచనలు అందించడం ఒక బృహత్కార్యం.
  ఆ బృహత్ కార్యం లో మీరు సంపూర్ణం గా కృత క్రుత్యులయారని చెప్ప గలను నేను.
  మీరు ఇలాగే మీ అమూల్యమైన టపాలను పోస్టు చేస్తూ , కాచి వడ పోసిన మీ జీవిత సత్యాలను తెలుపుతూ ఉండాలని కోరుతూ,
  అభినందనలతో
  Dr.సుధాకర్ ( ఇంగ్లండు నుంచి ).

 2. మీ బ్లాగుకు సంబంధించిన అంకెలు, సంగతులూ అన్నీ బాగానే ఉన్నాయి, శర్మగారూ! రాస్తూ ఉండండి!
  అభినందనలు! శుభాకాంక్షలు!!

  • @వెంకట్ గారు,
   మీరు కూడా అలా అనేశారా! అయ్యో!! ఒక్కరూ చాలులేవయ్యా అనలేదే!!!
   ధన్యవాదాలు

 3. మీరిలానే ఎన్నో మంచి టపాలు వ్రాయాలని కోరుకుంటూ…
  200 వ టపాకి అభినందనలు..

 4. శుభాకాంక్షలండి
  మీరు మరెన్నో చక్కటి టపాలు వ్రాయాలని, వ్రాస్తారని ఆశిస్తున్నానండి.

  • @anrd గారు,
   మీ అభిమానానికి ధన్యవాదాలు. మీమన్నింపులు ఎక్కువైపోయాయి, తగ్గించండి బాబూ.:):);)
   ధన్యవాదాలు.

 5. Deekshithulu gaaru,

  Your ‘amkitham’ to yourself is cancelled! Please continue to write for long time!
  Double cheers to your upcoming event of the month as well!!

  cheers
  zilebi.

  • @ జిలేబిగారు,
   మమ్మల్ని బ్లాగుల్లో ఉండండి అని మీరు గాయబ్ అయిపోతే ఎలా? అందుకే అంకితమిచ్చుకున్నా. అబ్బే పెరటి చెట్టు మందుకు పనికిరానట్లయిపోయింది, నా అంకితం. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 6. అభినందనలు… మీ టపా మీకే అంకితమిచ్చుకున్నారు కాబట్టి మరింత ఉత్సాహంగా మీరిలానే ఎన్నో మంచి మంచి టపాలు వ్రాయాలని కోరుకుంటూ……

  • @జ్యోతి గారు,
   నాది ఐరన్ లెగ్గండి బాబు. మౌళిగారికి చెప్పినట్లుగానేనా అవుతుందేమోనని ఆశగా అంకితమిచ్చుకున్నా. పెరటి చెట్టు వైద్యానికి పనికిరానట్లు, నాది నాకు పనికిరాలా. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 7. వందవ టపా, … మరో టపా అంకితం తీసుకున్న వారు కనిపించడం లేదని చెబుతూనే ఇప్పుడు మీ టపా మీకు అంకితం ఇచ్చుకోవడం న్యాయమా ?

 8. 200 వ టపాకి అభినందనలు. ఇలాగే మరెన్నో వందల టపాలు మీ దగ్గరినుంచి వస్తాయని ఆశిస్తున్నాను.

  కాలక్షేపం కబుర్లు అని పెట్టినా అవసరమైనవి, ఆచరించాల్సినవి చాలానే చెప్పారు. మీ టపాలు చదివి ఎంతో కొంత నేనూ నేర్చుకున్నాను. ధన్యవాదాలు.

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   ఓపిక ఉండటం లేదండి, రాయాలని ఉంది, ఆ పై అమ్మ దయ, మీ అభిమానం. మీరు నేర్చుకునేలా చెప్పేనంటే జన్మ ధన్యమే!

   ధన్యవాదాలు.

 9. మీరు ఇంకా 2000 టపాలకు పైగా నిరాటంకంగా రాయాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అభినందనలతో,
  శ్రీలలిత..

  • @శ్రీ లలిత గారు,
   మరీ ఎక్కువ కోరేసేరేమో దేవుణ్ణి, ఎందుకేనా మంచిదని

   ధన్యవాదాలు.

 10. ముందుగా మీకు శుభాకాంక్షలు తాతగారూ! అన్నట్టు ఆ పద్యాన్ని మీరు ఎక్కడనుంచో ఎత్తుకురావటం దేనికి? ఇంట్లో ఉన్న నా పుస్తకంలో http://navarasabharitham.blogspot.com/2011/07/blog-post.html ఈ పుటలో చూస్తే కనిపించేదిగా! మీరిలానే ఎన్నో మంచి మంచి టపాలు వ్రాయాలని కోరుకుంటూ……

  • @అమ్మాయి రసజ్ఞా,
   పద్యం ఇంట్లో దొరుకుతుంది, తెలుసు. నువ్వేమో పరీక్షలు బిసి, నాకా కనపడలేదు, అవసరం, నిన్ను పలకరిస్తే కోపపడతావేమో నని 🙂 🙂 🙂 గూగులోణ్ణడిగితే గురువుగారిని చూపించాడు. ఎత్తుకొచ్చేశా.

   ధన్యవాదాలు.

 11. ఇంత తక్కువ సమయంలో ఇన్ని పోస్ట్లు, అదీ ఆరోగ్య సమస్యలు, పవర్ కట్ లు అధిగమించి…ఇన్ని మంచి విషయాలను మాకు అందించినందుకు ధన్యవాదాలు బాబాయి గారూ..

  • @అమ్మాయి జ్యోతిర్మయి,
   ఓపిక లేదు, మీ అభిమానం కూచోబెడుతోంది నన్ను, ఇదో వ్యసనమైపోయిందమ్మా.
   ధన్యవాదాలు.

 12. ఈ బ్లాగు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, మానసికం, శారీరికం, రక రకాలు.ఎందుకింత తొందరగా రాస్తారని ప్రశ్నించారొక మిత్రులు. ఈ ప్రపంచంలోకి రావడం ఆలస్యం, ఉన్న కాలమెంతో తెలియదు, ఉన్నంతలో రాయాలని తపన. ప్రపంచం మూడిటి పై ఆధారపడి తిరుగుతూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయాలు, ఆరోగ్య రీత్యా వాత, పిత్త, కఫాలు, కాలం లో భూత, భవిష్య, వర్తమానాలు. ఏదయినా కాలంతో పాటుదే. ఏదీ శాశ్వతం కాదు, అలాగని ఏ ప్రయత్నమూ మానకూడదు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఊపిరి చొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు అన్నారో సినీకవి. జరగ బోయేది, మరు క్షణం మాది కాదుకదా! –

  ఈ మాటలు అక్షరసత్యాలు. అందుకే ఎన్నాళ్ళ నుంచో అపి వున్న భావాలను నేను కూడా వెను వెంటనె టపాలుగా వెలువరిస్తున్నా.
  ఇంతటి వయస్సులొను శారీరక ఆరొగ్య సమస్యలను అధిగమించి కూడా మీరు ఈ కార్యక్రమము జరపగలిగారంటే, మీ ప్రయత్నము అపై అసర్వేశ్వరుడి అనుగ్రహము ఇది మీకు నిరంతరాయము అందాలని కొరుకుంటునాను. ఇక 200 పొస్ట్ శుభాకాంక్షలు.

  • @రమేష్ బాబు గారు,
   నా బ్లాగుకు స్వాగతం. అమ్మ దయ ఉన్నంతవరకు, మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 13. మీ టపాలు చదవటం మార్చ్ లో మొదలుపెట్టినా ప్రతి టపా చదివాను. నాకు టైం తక్కువ వుంటే నేను మీ టపా చదవను, ఎందుకంటే నేను ఇష్టం గా టైం చూసుకుని, సమయం ఉన్నప్పుడు తీరిక గా ప్రతి టపా చదివాను. నాకు తెలియని విషయాలు, దేవయాని కథ, మంచి మాటలు, జీవిత అనుభవాలు ఎన్నో చదివాను. అప్పుడప్పుడు పాత టపాలు కూడా తిరిగేస్తున్నాను. మీరు ఇంకా రాయండి.మాలాంటి ఎందరో మీ టపాలు సమయం దొరికినప్పుడల్లా చదువుతూనే ఉంటారని నా అభిప్రాయం.మీ ఈ 200th టపా కి మీకు ధన్య వాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s