శర్మ కాలక్షేపంకబుర్లు- సోంబేరులు

బద్దహం! సోంబేరులు.

అయ్యా! పొద్దుటే బద్దహం మీద టపా రాశా కదా, అందులో చెబుదామనుకున్నది బద్ధకించి మరిచిపోయా ఇప్పుడు చెబుతున్నా.

తంజావూరు సంస్థనాన్ని ఒక రాజు గారు పాలించేటపుడు ఆయనకి ఒక అనుమానం వచ్చి మంత్రిని అడిగేడు. మంత్రి గారు మన దేశంలో బద్ధకస్తులున్నారా? ఉంటే వారెవరూ? అని. దానికి మంత్రి రాజా, ఐతే ఒక సత్రవు కట్టిస్తానండి అన్నాడట. సరే ఏమికావాలంటే అది చేసి నాకు సోంబేరులను చూపించమన్నాడట. సత్రవు కట్టించి ఒక ప్రకటన ఇచ్చాడు మంత్రి. బద్ధకస్తులు వచ్చి అందులో చేరచ్చని, అన్ని సదుపాయాలూ కల్పించబడతాయని. రోజూ వేల కొలది జనం జేరిపోతున్నారు. రాజు గారిది చూసి ఏంటయ్యా అంటే చూడండి మహరాజా, అని ఒక రోజు సత్రవుకి నిప్పు పెట్టించాడట. అందులో సోంబేర్లుగా చేరిన వారంతా ఎప్పుడయితే సత్రవు అంటుకుందో, అప్పుడు పారిపోయారట. ఇద్దరు మాత్రం మిగిలారు. ఒకడు మరొకడితో ఒరేయ్ సత్రవు అంటుకున్నట్లుందిరా అన్నాడు. ఎటువేపు అని అడిగాడు రెండవవాడు. ఏమో మెడ తిప్పి చూడటానికి బద్ధకంగా ఉంది అన్నాడు. రెండవ వాడు సరే మన దాకా రానీ చూద్దామని పడుకున్నాడట. వీళ్ళ దాకా వచ్చింది కాలుతూ, మంట. ఒక కర్ర వీళ్ళ మీద పడిందట, మండుతున్నది. రెండవ వాడు తుళ్ళిపడి లేచి పారిపోయాడు. మొదటివాడు పారిపోతున్నవాడితో ఒరేయ్! ఈ మండుతున్న కర్ర పక్కకి పారేసిపోరా అని కేక వేశాడట. అప్పుడు మంత్రి గారు వీణ్ణి బయటికి తీసి రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళి అసలైన బద్దకస్తుడు వీడేఅని చెబితే వాడికి రాజు సత్కారం చేశాడట.

అయ్యా! నేను టపా లో చెబుదామనుకుని బద్దకించి, ఇప్పుడు చెప్పేనుకదా….ఇప్పుడు నేనెవరూ……

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- సోంబేరులు

  • @Sri gaaru
   బద్ధకం కదండీ! రెండు సార్లు రాశా టపా!! బద్ధకంగా!!! ఈ కధ రాద్దామని టపా రాసేటపుడనుకున్నా! కరంటు పోయి వస్తుండటంలో కధని కాకెత్తుకుపోయింది బుర్రలోంచి. తరవాత, ఇదెలాగా బద్ధకం టపాకదా, ఈ ప్రక్రియ కొత్తగా ఉంటుందని అప్పటికప్పుడు రాశా.
   ధన్యవాదాలు.

  • శర్మగారి కథను కొంచెం మార్చుదాం లెండి. ఊళ్ళన్నీ తిరిగి రాజభటులు సోంబేర్లని బిరుదులు పొందిన వాళ్ళని పోగుచేసారు. ఇప్పుడు సరిపోతుంది కదా.

   అన్నట్లు, శర్మగారూ, మీరు పాపం టపా పెద్దదయిపోతోందని సంశయించి ఉంటారు. అందుకే రెండు దఫాలుగా వచ్చింది విషయం. బద్దకించకుండా మొత్తం చెప్పేసారుకదా, మిమ్మల్ని సత్రంలో వెయ్యము లెండి!

   • @మిత్రులు శ్యామల రావు గారు,
    టపా రాయక ముందు ఈ కధ రాయాలనుకున్నా. కరంటు పోవడంతో కధ ఎగిరిపోయింది బుర్రలోంచి. ఆ తరవాత గుర్తుకొచ్చింది అయ్యో రాయలేదేమని, ఫరవాలేదు, ఇది బద్ధకం మీద టపా కనక మరొకటపా రాస్తే బాగుంటుందని అప్పటికపుడు ఉదయం తొమ్మిదిన్నరకి కరంటు రాగానే రాసి వేశా.
    ధన్యవాదాలు.

  • @gpvprasad gaaru
   నా బ్లాగుకు స్వాగతం. మిత్రులు శ్యామలరావుగారు సద్దేశారు. నిజంగానండీ ఆ ప్రకటన వచ్చేదాకా వాళ్ళు బాగానే ఉండి ఉంటారు, అందరిలాగా. ఒక సారి సువారంలో పడి తినడం అలవాటయిన తరవాత అలా అయిపోయివుంటారు. మన చీలచ్చిమి వగైరాల లాగా, ఏమంటారు?
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s