శర్మ కాలక్షేపంకబుర్లు-మంచివాడు.

మంచి వాడు.

ఎండలు మండిపోతున్నాయి. సూరిబాబు గారు చాలా ఉగ్రంగా ఉన్నాడు, ఉండాలి కూడా. లేకపోతే తిండిలేదు, తిండిలేకపోతే బతుకులేదు. నృసింహ శతక కారుడు లక్షాధికారయిన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడని అన్నాడు కదా. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, కోటికో పడగెత్తినా తినేది బువ్వే, తాగేది నీరే. ఇది జీవులన్నిటికీ సమానం అన్నారు శాస్త్ర కారులు. సంవత్సరం పొడుగునా, ప్రత్యేకించి ఈ వేసవిలో ప్రభుత్వాన్ని, కరంటు వారిని,దీవించని వారు, దీవించని రోజు ఉండదంటే నమ్మ శక్యంకాదు. అధికారంలో ఉన్న వారికి ఈ బాధలుండవు. వారికి కరంటు పోవడం, దాని వల్ల కలిగే బాధ తెలియదు కదా. బాధ పడేవారికే తెలుస్తుంది.ఈ వేడిమి మూలంగా అలోచన కూడా స్థిరంగా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. ఒక దానిలోంచి మరొక దానిలోకి పోతున్నా కదా.

నిత్యావసరాలు, వాటి నిర్వహణ సరిగా లేకపోతే ప్రజలకి మిగిలేది అగచాట్లే. ప్రభుత్వం ప్రజలకి ముఖ్యంగా ఏర్పాటు చేయవలసిన మౌలిక సదుపాయాలు మంచి నీరు, కరంటు, తిండి గింజలు, వైద్యం.ఇందులో ఏ విషయం చూసినా ప్రభుత్వ నిర్లక్ష్యం, చేత కానితనం, బయట పడుతూనే వున్నాయి. ఈ విషయంలో పల్లెలకి పట్నాలకి పెద్ద భేదం లేదనుకుంటా.

కరంటులేదు, పోతూ ఉంది, తిట్టుకుంటాము తప్పించి రేపు మళ్ళీ ప్రభుత్వాని కొత్తగా ఏర్పాటు చేసుకునే సమయంలొ దీని గురించి అలోచించటం లేదు.అలాగే ప్రతి విషయంలో నూ జరుగుఇతోంది.

సామన్యుడి కష్టాలు ప్రభువులికి తెలియవు. మొన్న ఫిజిక్స్ పరిక్షలో కిరి కిరి చేస్తే పొలో మని పోయి గొడవ చేస్తే మళ్ళీ పరిక్ష పెడతాం ఫీజులు కట్టండి అన్నారు. కట్టేము. కొంతమందికి హాల్టికట్లు ఇచ్చారు కొంతమందికి లేదు. ఏమండి అంటే మాటాడరు. కోర్టుకు పోతే కోర్ట్ అందరికి పరిక్ష పెట్టమంది. కాలేజీల వాళ్ళు వివరాలు అప్లోడ్ చెయ్యలేదు అందుకు పరీక్ష పెట్టలేమంది ప్రభుత్వం. ఏంటో వాళ్ళు చేసిన తప్పులికి, ఎవరో చేసిన తప్పులికీ కూడా ప్రజలే బాధ పడాలి. ఇదీ సంగతి.చెప్పుకుంటూ పోతే కావలసినన్ని. ప్రతీ మనిషికి ఒక కధ ప్రభుత్వం వారితో.కోర్టుల్లో ఉన్న కేసుల్లో ముప్పాతిక కేసులు ప్రభుత్వంకి వ్యతిరేకం గా ప్రజలు వేసినవే ఉంటాయి. లేదా ప్రభుత్వం వారు ప్రజలమీద వేసినవి ఉంటాయి. ఇదేమీటీ! న్యాయం చేయవలసిన ప్రభూత్వం లిటిగెంటు లా వ్యవహరించడం. అదంతే.
ఇంత కష్టం లోనూ ఒక కొసమెరుపు, మా పంచాయతీవారు మంచి నీళ్ళుసరఫరా చేయడానికి ఒక కాంట్రాక్టర్ కి అప్ప చెప్పేరు. అతను కరంటు సరిగాలేకపోయినా, ఎప్పుడు వస్తే అప్పుడు నీరు తోడి పట్టి రోజూ రెండుపూటలా తక్కువలో తక్కువ అరగంటయినా నీరు వదలుతున్నాడు. అతనేమీ పంచాయతీ దగ్గర మొబలైజేషన్ అడ్వాన్స్ లు తీసుకోలేదు. ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు చెబుతూ కబురు పంపాను. మంచి వాళ్ళని మెచ్చుకోకపోవడం కూడా తప్పే.

నిన్న ఒంట్లో నలతగా ఉండి టపా రాయలేదు. అలవాటుగా టపా వేద్దామంతే రాసిన టపా లేదు. పాతవి వెతికితే ఇది కనపడింది. ఎందుకు వెయ్యలేదబ్బా అని ననుకుని ఇప్పుడు సరి చేసి వేసినది.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మంచివాడు.

 1. మంచి వాళ్ళని మెచ్చుకోకపోవడం కూడా తప్పే.
  అవును, అది చెడ్డవాళ్లకు ఊతమివ్వడమే,
  ఆరోగ్యం జాగ్రత్తండి, బ్లాగులు, పోస్టులు అంటూ హైరానా
  పడకండి, సర్.

  • భాస్కర్ గారు,
   చెడ్డవాళ్ళకి భయపడుతున్నాం. మంచివాళ్ళని మెచ్చుకోవడం మానేస్తున్నాం .రెండూ తప్పే. వయసుతో చిన్న చిన్న అనారోగ్యాలుంటాయి, కొత్తగా నడక మొదలు పెట్టేను, అదీ బాధ. కొద్ది కాలం శలవు తీసుకోవాలని ఉంది.
   ధన్యవాదాలు.

 2. తాతయ్యా ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? బాలేనప్పుడు రెండు రోజులు విశ్రాంతి తీసుకుని టపాలు వెయ్యండి తాతయ్యా..మరేం పర్వాలేదు. కాకపోతే మేము చూస్తూనే ఉంటామనుకోండి మీ టపాల కోసం..

  • @అమ్మాయ్ సుభ,
   కొత్తగా నడక మొదలెట్టేనుకదా, దాని అనుభవం, కొద్దికాలం శలవు తీసుకోవాలని ఉంది.
   ధన్యవాదాలు.

 3. మనిషి మరిచిపోతున్న అనేక విషయాలు, మానవత్వం మళ్ళీ నిలబెట్టడానికి మీ కృషి అభినందనీయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s