శర్మ కాలక్షేపంకబుర్లు-మనం మరచిన కూరలు.

Courtesy you tube

మనం మరచిన కూరలు.

మనం మరచిన కూరలా? కాదు, నిజంగా ఇప్పుడు మనకు దొరకని కూరలు.మనం అడవులను నిర్లక్ష్యం చేయడం మూలంగా, నరికేస్తున్నందు మూలంగా అంతరించిపోతున్న కూరలు. నిజం చెప్పాలంటే పల్లెలలో కూడా ఇవి దొరకటం లేదంటే పరిస్థితి ఎలా ఉన్నది తెలుస్తుంది. ఈ నెల 7 వ తారీకు టపాలో సునీత గారు వ్యాఖ్య రాస్తూ, వాక్కాయలు,షీకాయి ఆకు, నల్లేరు ఎలా ఉంటాయో చిత్రాలు పెట్టమన్నారు. అంటే వారికి పేర్లూ తెలియవు, అదేగాక వాటిని చూడను కూడా లేదని తెలుస్తూ ఉంది కదా. ఇటువంటి వారు ఎంత మంది ఉన్నారో చెప్పడం కష్టం కనక ఈ టపా లో వాటిని పెడుతున్నా. నాకూ గలిజేరు దొరక లేదు. దాని లింక్ ఇస్తున్నా చూడండి.https://kastephale.files.wordpress.com/2012/08/photo220007.jpg గలిజేరుని సంస్కృతం లో భృంగామలక, పునర్నవ అంటారు. ఇందులోని నల్లేరు సంపాదించడానికి నాకు పదిరోజులు, పది మందితో చెబితే, దొరికిందంటే పరిస్థితి ఊహించవచ్చును. పల్లెటూరి వారు తెలిసి ఉపేక్ష చేస్తున్నారు. పట్నవాసం వారు తెలియక మానేస్తున్నారు. పల్లెనుంచి తెస్తే కదా తెలిసేది, పట్నంలో. షీకాయాకు కొద్దిగా పుల్లగా ఉంటుంది,చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి, కొద్దిగా వేడి చేస్తుంది.

లింకిస్తున్నా చూడండి మనం మరిచిన కూరలెన్నో, దగ్గరగా ఏభయి ఉన్నాయి. బొమ్మలు వాటి పేర్లు, వాటి శాస్త్రీయ నామాలిచ్చారు.

కొండ మామిడి, అడవి మామిడి అసలు తెలియవు. వెదురు చిగుళ్ళు కూర వండుకుంటారు. వెదురు బియ్యం మంచి శక్తి నిస్తాయి,అన్నంలా వండుకోవచ్చు, వ్యాము దుంప గర్భ నిరోధాని మందుట, మాకూ తెలియదు. అడవి పెండలం విని ఉండరు, మగసిరిగడ్డ పేరే చెబుతోంది చూడండి. గొడ్డు కూర నేనూ వినలేదు, చామ కూర వాడుతాము, పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. గురుగు కూర నేత్రాలికి మంచిదిట. సప్పి కూర పుల్లగా ఉండి దీర్ఘరోగాలికి మంచిదిట. చికిలింత కూర నేను ఎరుగుదును, నేత్రాలు, ఊపిరి తిత్తులకు మంచిదిట. పొన్నగంటి కూర బలుసు కూర ఇవి దొరికే సావకాశాలున్నాయి. పొన్నగంటి కూర మూత్ర రోగాలకి, బలుసు కూర ఇనుముకి ప్రసిద్ధి. గాజు కూర డయాబెటిస్ కి మందు. తిప్ప తీగ, దీనిని సంస్కృతంలో అమృత అంటారు, డయాబెటిస్ కి మరి చాలా వ్యాధులకి మందు, ఆకు హృదయాకారంలో ఉంటుంది. ముళ్ళ వంగ, అడవి కాకర రెండూ మందులలా కూడా ఉపయోగిస్తారు. కారు నిమ్మ చూశారా ఎలా వుందో. ఎర్ర చిత్రమూలం చికెన్ తో తింటే బాగుంటుందిట. ఉత్తరేణి, ఇది చాలా గొప్ప మందు, ఇది ఉన్న చోటికిపోతే ముళ్ళలా ఉన్నవి పట్టుకుంటాయి, వీటిని ఉత్తరేణి బియ్యం అంటారు,ఎండిన వాటిని బాగుచేసుకుని, పరమాన్నం వండుకు తింటే, బాగుంటుంది. తెలగ పిండి కూర దొరుకుతుంది, ఇది తింటే మూత్రపిండాల రాళ్ళు కరుగుతాయి. మన దగ్గర దొరికేది, నిర్లక్ష్యం చేసేవి, అరటి పువ్వు, అరటి దూట. దూట రసం తాగితే మూత్రపిండాల రాళ్ళు కరుగుతాయి. లైన్ తోటకూర మంచి ఆకు కూర తెలుసా?. గోగుపువ్వు డిప్పలు పచ్చడి బాగుంటుంది. మెక్సికో లో పండుతుందిట, రకరకాల రంగులలో మొక్క జొన్న వింత కదా, ఈ వేళ చూశా పేపర్లో. చూడండి మీకు దొరికేవాటిని ప్రయత్నం చేయండి, లేదా మొక్కలు దొరికితే పెరట్లో వేసుకోవచ్చు, వీలున్నవారు..

వాక్కాయలు

షీకాయ చిగురు

షీకాయ చిగురు-1

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనం మరచిన కూరలు.

 1. ఆహా ఏమి రుచి…
  అంటూ చాలా కూరల గురించి చెప్పారు శర్మ గారూ!
  చిత్రాలు వాటి లింక్ లు కూడా బాగున్నాయి…
  అభినందనలు….
  @శ్రీ

 2. మొక్కల గురించి చాలా విషయాలను ఫొటోలతో సహా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.

  చెన్నైలో రకరకాల ఆకుకూరలు, సరస్వతీ ఆకు కూడా అమ్ముతారు . ఆకుకూరలు తెచ్చేవాళ్ళను అడిగితే , సరస్వతీ ఆకు తెచ్చి ఇచ్చేవారు.

  సరస్వతి ఆకు కొంచెం చేదుగా ఉంటుంది కానీ, పెసరపప్పుతో కలిపి వండుకోవచ్చు. జ్ఞాపకశక్తి, చదువు బాగా రావటం కోసం సరస్వతీ లేహ్యం కూడా షాప్స్ లో అమ్ముతారు.

 3. శర్మగారూ,

  ఆశ, నిరాశలమీద రెండురోజులక్రితం మీరు రాసిన టపాను, ఆరోజు టైమ్ లేకపోవడంతో ఇవాళ సావకాశంగా చదివాను. చాలా బాగుంది. మీ అనుభవాల, జ్ఞాన‌ సారాన్ని టపాల రూపంలో అందిస్తున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు.

  • @తేజస్వి గారు,
   నా టపా మీరింత శ్రద్ధ తీసుకుని చదివినందుకు సంతసం. అది గత పదిహేనురోజుల నా జీవితానుభవ సారం.
   ధన్యావాదాలు.

  • @సునీత గారు,
   మీరు అడగబట్టి, వీటిగురించి ప్రయత్నం చేశా, నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి, నాకా సావకాశం ఇచ్చినందుకు, ఒక టపా రాయించినందుకు.
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   లింక్ లికి కష్ట పడలేదమ్మా! నల్లేరు కోసం వారం రోజులు తిరిగాను.
   ధన్యవాదాలు.

 4. సర్, నిజమే మీరన్నది పట్నం వారికి తేలలేక తినటం లేదు.
  వీటిలో చాలా వరకు నేను ఎరిగినవే,
  ముఖ్యంగా ” నల్లేరు” మేము చిన్నప్పుడు “కలిగి ” పొదలలో ముళ్ళు కూడా లెక్క చేయక తెచ్చేవాళ్ళం.
  మంచి విషయం చెప్పారు.

  • @ఫతిమా గారు,
   కొన్నయినా ప్రయత్నం మీద పెంచుకుని వాడుకుందాం, ఆరోగ్యానికి ఆరోగ్యం, కొత్తకూర ఏమంటారు?
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s