శర్మ కాలక్షేపంకబుర్లు-అద్వైతం

Courtesy youtube

అద్వైతం

సాధారణంగా ఇద్దరు స్త్రీలు కలిస్తే కబుర్లకి లోటుండదంటారు. అది నిజమో ఏమో కాని మగవాళ్ళు కూడా దీనికేం మినహాయింపు లేదు. సాధారణంగా బాగున్నారా తో ప్రారంభమవుతాయి కబుర్లు. ఒక్కొకరు ప్రత్యుత్తరంగా ఆ బాగనే ఉన్నాం, అంటారు సాగదీస్తూ. మరి కొందరు బాగానే ఉన్నాం మీదయవల్ల అనేవారు, ఏం బాగోలెండి తెల్లారిలేస్తే అన్నీ గోలలే, గొడవలే అని ప్రపంచంలోని బాధలన్నీ వీరే భరిస్తున్నట్లు మాట్లాడతారు, కొందరు. ప్రశ్నగా పలకరింపుకి సవ్యంగా సమాధానమిచ్చేవారు చాలా తక్కువ మంది. కొంత మంది ఆ! నీతో మాతాడేదేమిలే అన్నట్లుగా ఇస్తారు సమాధానం. ఒహో! పొరపాటుగా పలకరించేం వీరిని అనుకోవాలన మాట.

పూర్వకాలంలో స్త్రీల సంభాషణలో చీరలు నగలు, పిల్లలు, పెళ్ళిళ్ళు వగైరా చోటు చేసుకునేవి. కాలం మారి ఏకాలేజీలో చేర్పించారు, అమ్మాయి పెళ్ళికి ఏం ఏర్పాట్లు చేస్తున్నారో గొప్పగా చెప్పడం దగ్గరనుంచి, అమ్మాయి ఎంత కష్టపడుతోందోనుంచి, కోడలు ఎంత కష్టపెడుతోందో దాకా, వైభవం వెళ్ళబోసుకొడానికే సమయం సరిపోతూఉంది. లేదా మా అమ్మాయి అమెరికాలోనూ అబ్బాయి రష్యాలోనూ ఉన్నారని గొప్ప చెప్పుకోడానికి సరిపోతూఉంది. పని చెసే స్త్రీలయితే ఒకరి గోడు ఒకరికి వెళ్ళబోసుకోడానికి, ఇల్లు పిల్లలు, శ్రీవారు వగైరా కబుర్లు, ఆఫీస్ లో శంఖిణి మేనేజర్ రాత్రి అయినా వదిలిపెట్టని వెట్టి చాకిరీ గురించి చెప్పుకుని ఓదార్చుకోడం సరిపోతూ ఉంది. మగవాళ్ళయితే పాతకాలంలో, ఎక్కడ చవకగా స్థలం దొరుకుతుంది, ఏపక్క పెరుగుతుంది, పే కమిషన్ ఎప్పుడొస్తుంది, బాస్ ఏమన్నాడు, తను రాసిన డ్రాఫ్ట్ బాస్ ఎంత మెచ్చుకున్నాడు, వగైరా వగైరా నడిచేవి. నేడు వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు, నలుగురి పని ఒకడితో చేయిస్తున్నాడు, రోజు కూలీల కంటే దీనమయిన స్థితి కనపడుతోందని బాధ పడటం ఓదార్చుకోవడం, లేకపోతే తాను చాలా హాయిగా ఉన్నట్లు పైకి కనపడేలా ప్రర్తించడంతో సరిపోతూ ఉంది. ప్రతి సారి, ప్రతివారు మనసుపై ఒక పరదా కప్పుకుని మాట్లాడుతున్నట్లుంటోంది. నా లాటి వాళ్ళకి మనవరాళ్ళు, మనవల కబుర్లు చెప్పుకోడం సరిపోతూ ఉంది. అన్నిటిలోనూ ఒక సామ్యం కనపడుతుంది. అది ఒకటే, గొప్ప చెప్పుకోడం, బాధ పంచుకోవడం.

శంకరుడు అద్వైతం అని పేరు పెట్టేరు, తన అలోచనకి. మతం అంటే ఆలోచన అని అర్ధంకదా. అద్వైతం అంటే అర్ధం రెండు కానిది, అంటే ఒకటే. రెండు కానిది అయినపుడు మూడు కావచ్చు కదా అని అనుమానం రావచ్చు, రెండే కానిది మూడెలా అవుతుంది? అందుచేత అది ఒకటే. అంటే ఒక మనిషి తల్లికి తండ్రికి కొడుకు,భార్యకి భర్త,కోడలికి, అల్లుని కి మామ ఎలా అవుతారో, అలాగన మాట.ఒకేవ్యక్తి ఇంతమందికి వేరువేరుగా కనపడతారు కాని ఒకరే కదా. ఇలా అనుకుంటూ ఉంటే మా రసజ్ఞ తాతా! జ్యోతి, నిప్పు,బడబాగ్ని,వగైరా వగైరా చెబుతూ తేడా ఏమిటంటావ్ అంది, అమ్మలూ, వెలుగిచ్చేటప్పుడది జ్యోతి,కడుపులో ఉంటే జఠరాగ్ని, ఇలా ఎక్కడ ఉంటే దానికి ఒక విశేషణం ముందుంటుంది కాని అన్నీ మూలంలో ఒకటేనయ్యా, అదే అగ్ని అన్నా. సూర్యుడు సమస్త జీవులకు కనపడతాడు, ఎవరికి వారికి వేరువేరుగా, కాని ఒకడేకదా.అడిగేసి వెళ్ళిపోయింది, సమాధానం విందో లేదో పిచ్చి పిల్ల.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అద్వైతం

  1. ఈ టెక్నాలేజీ పెరిగాక కూడా చెప్పే వారు , వినే వారు ఉన్నందుకు సంతోషించాలి . మళ్లీ పాత రోజులు వస్తాయని, రావాలని కోరుకుంటున్నాను. చెప్పడం వినడం వల్ల ఎనో మానసిక సమస్యలు దురమవుతాయి … ఈ మధ్య ఐ టి రంగం లోని కొందరు యువ జంటల ఆత్మహత్యల వార్తలు చూడండి . సమస్యను చెప్పుకోలేక, వినే వారు లేకనే అలా జరుగుతుందేమో అనిపిస్తుంది . చాలా చిన్న సమస్యలకే అత్మయత్య వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం బాధ కలిగిస్తోంది

    • @మిత్రులు మురళిగారు,
      ఓపికగా వినడం అలవాటు చేసుకుంటే చాలా సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. అదే లోపిస్తూ ఉందని బాధ. ఎవరనుకున్నది అదే నిజమనుకుంటే ఎలా. బంగారంలాటి జీవితాలు పాడు చేసుకోవడం బాధ కలిగిస్తూ ఉంది.
      ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s