శర్మ కాలక్షేపంకబుర్లు-మరక మంచిదే!

మరక మంచిదే!

మరక అంటే అక్కరలేని, అసహ్యమైన మచ్చ, అది వ్యక్తిత్వంపై కూడా కావచ్చు, కాని నేడు మరక మంచిదే అంటున్నారు :), వ్యాపారస్తులనుంచి, రాజకీయనాయకులదాకా. మనం మాత్రం ఎందుకు కాదనాలీ? ఐతే అదెలాగో చూద్దాం.

భాగవతం లో సత్రాజిత్ అనేఆయన సూర్యుడిని మెప్పించి “స్యమంతకమణి” అనే మణిని సంపాదించుకుని మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటే, దాని వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోయి, కృష్ణుడి వద్దకుపోయి, సూర్యుడు మన రాజ్యంలో తిరుగుతున్నాడని చెబితే, కృష్ణుడు, కాదయ్యా, అది స్యమంతకమణి, అతను సత్రాజిత్ అని చెబుతాడు. సంగతి తెలిసిన తరవాత కృష్ణుడు సత్రాజిత్ వద్దకు వెళ్ళి ఆ మణిని రాజుకు సమర్పించమని చెబుతాడు, ఎందుకంటే అది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది కనక. దానికి సత్రాజిత్,

అమ్మణి యాదవ విభునకు నిమ్మని హరియడుగ నాతడీక ధనేఛ్ఛన్
బొమ్మని పలికెను జక్రికి నిమ్మణి యీకున్న మీదనేమౌ ననుచున్….భాగవతం.దశ ఉత్తర భాగం.53

మణి ఇవ్వను, ఇవ్వకపోతే ఏమవుతుందని అన్నాడు. ఆ తరవాత అతని తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటకు వెళతాడు. అక్కడ ఒక సింహం అతనిని సంహరించి మణి మాంసఖండమని ఎంచి తీసుకుపోతుండగా జాంబవంతుడు సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుపోయి కుమారునకు/కుమార్తెకు ఆడుకునే బంతిగా ఇచ్చాడన్నారు పోతనగారు.

కని జాంబవంతు డా మణిగొనిపోయి సమీప శైలగుహ జొచ్చి ముదం
బున దనకూరిమి సుతునకు (సుతకును) ఘన కేళీకందుకంబుగా జేసె నృపా!..భాగ..దశ..ఉత్తర.56

ఇది తెలియని సత్రాజిత్తు, కృష్ణుడు మణి అడిగి ఉన్నాడు కనక తమ్ముడుని చంపేసి మణి పట్టుకుపోయాడని కృష్ణుని పై మరక ( నింద ) పడేశాడు.

మణి కంఠంబునదాలిచి నేడడవిలో మా వాడు వర్తింపగా
మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదంచుదూ
షణముం జేయగ వాని దూషణము గంసధ్వంసి యాలించి యే
వ్రణమున్ నాయెడలేదు నిందగలిగెన్ వారించుటేరీతియో…భాగ..దశ..ఉత్తర…58

ఇలా నింద పడిన కృష్ణుడు, తనవారు ప్రసేనుని జాడలు చెప్పగా వారిని వెంటబెట్టుకుని అడవికిపోయి చూస్తే, చచ్చి పడిఉన్న గుఱ్ఱం, అలాగే ప్రసేనుడిని చంపిన సింహం కళేబరాలు కనపడ్డాయి. ఆ తరవాత జాడలనుబట్టి ముందుకెళ్ళి ఒక గుహముందుకు జాడలు చేరగా, కూడా వచ్చిన వారిని అక్కడే ఉంచి, కృష్ణుడు గుహలోపలికి పోయి మణిని చూసి, తీసుకోడానికి ప్రయత్నించగా, జాంబవంతుడు అడ్డుపడి యుద్ధం చేయగా, ఇరువది ఎనిమిది రోజులు బాహాబాహీ యుద్ధం జరిగితే, ఆ తరవాత జాంబవంతుడు ఓడిపోతే, మణిని , దానితో తన కుమార్తె జాంబవతిని సమర్పించాడు. నామీద నింద పడితే దానిని మాపుకోవడనికి వచ్చాను తప్పించి, మణి పట్టుకుపోవాలని కాదని చెబుతాడు. పరమాత్మ జాంబవతిని, మణిని తీసుకువచ్చి, జాంబవతిని వివాహం చేసుకుని, రాజసభకు సత్రాజిత్తును పిలిచి, జరిగినది చెప్పి మణిని ఇచ్చి వేశాడు. జరిగినదానికి వగచి సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను, మణిని కృష్ణునకు సమర్పించాడు. అప్పుడు కృష్ణుడు సత్యను స్వీకరించి మణిని తిరస్కరించాడు. తనపై పడిన నిందను నిజంకాదని నిరూపించుకోడానికి కృష్ణుడు ఈ పని చేశాడు. మరకపడిన మూలంగా, దానిని తొలగించుకునే ప్రయత్నంలో, కళ్యాణాలు జరిగి లోక కళ్యాణం జరగడానికి నాంది పడింది కదా!. అప్పుడు లోకులు స్వామీ మీ పై మరక ఎందుకు పడింది, మీరు సమర్ధులు కనక నింద బాపుకోగలిగేరు మా పరిస్థితి ఏమీ అంటే, కృష్ణుడు ఇలా అన్నాడు.

ఒకనాడు కైలాసంలో గణపతి పెద్ద బొజ్జతో ఆనందతాండవం చేస్తూంటే, చూసిన చంద్రుడు నవ్వేడు. దానికి కోపించిన గణపతి నిన్ను భాద్రపద శుక్ల చవితి రోజు చూసిన వారు అపనిందలపాలగుదురని శాపమిచ్చాడు. దానికి దేవతలు ప్రార్ధించగా భాద్రపద శుద్ధ చవితిరోజు నా వ్రతం చేసి అక్షతలు ధరించిన వారికి ఇది వర్తించదని సడలింపు ఇచ్చాడు. నేను గణపతి వ్రతం చేయలేదు, పైపెచ్చు చవితిరోజు పాలు పితుకుతూ చంద్రుడిని పాలలో చూశాను అందుకు నాకీ అపనింద వచ్చింది, కనుక మీరు కూడా వినాయకుని పూజించండని చెప్పేడు. మరక పడటం మంచిదే అయి అది నిజం కాదని నిరూపించుకోడంలో ఇద్దరు కన్యారత్నాలను పొందేరు కన్నయ్య.

నేడు మరక మంచిదే, మనం సంపాదించుకున్నది మనదగ్గరుండగా, 2జి కాని, బొగ్గు మసి కాని, భూ ఆక్రమణలు కాని, ఏదైనా. ప్రజలు అనుకుంటారంటే, బోఫోర్స్ మరిచిపోలేదా ప్రజలు అలాగే ఇదీ మరిచిపోతారు. గజం మిధ్య పలాయనం మిధ్య అంటున్నారు షిండేగారు. మరొక సంగతేమంటే ఒక గీతను ముట్టుకోకుండా చిన్నది చేయడం తిమ్మరుసు చెప్పేడుకదా! అలాగే మరొక పెద్ద సమస్య సృష్టిస్తే ఈ సమస్య మరుగున పడుతుంది కదా! ఇప్పుడు గేస్ సిలిండర్లు ఆరు మాత్రమే ఇస్తాము, డీజిల్ ధర పెంచేము,ఆయిల్ కంపెనీలకి నష్టాలొస్తున్నాయి మరి. అందుకు ధరలు పెంచేము,చిల్లర వర్తకం లో విదేశీ పెట్టుబడికి అనుమతిచ్చాము, మాకు కావలసిన పని మాకయిపోతే చాలు, ఎవరేమనుకుంటే మాదేం పోయింది. ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటారు? మరక గురించా? ఇప్పుడు మరక తొలిగించుకునే ప్రయత్నం కూడా చెయ్యటంలేదు, బుకాయింపు తప్ప. అన్నయ్య చెప్పేరు షేక్స్పియర్ హేమ్లెట్ నాటకంలో “స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ డైవెర్సిటీ” అని. ఇప్పుడు చెప్పండి మరక మంచిదేగా!

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మరక మంచిదే!

 1. మరక అంటారు గాని, మరక మర్మంబు బార్బరుండెరుగు, ఇది చదవండి:
  “While cutting hair, the official Barber asked the Minister Kapil Sibal, ‘’What’s this Swiss Bank issue?”
  Kapil Sibal shouted, “YOU, you are cutting hair or conducting an inquiry?”
  Barber: Sorry Sir, I just asked.
  Next day, while cutting the hair, he asked President Pranab Mukherjee, “Sir, what’s this Black money issue?”
  Pranab shouted, “Why did you ask me this question?”
  Barber: Sorry Sir, just asked you
  Next day, CBI interrogated the Barber, “Are you an agent of Baba Ramdev?”
  Barber: No Sir.
  CBI: Are you the agent of Anna Hazare?
  Barber: No Sir.
  CBI: Then while cutting the hair, why do you ask Congress Ministers about Swiss Bank and Black money issues?
  Barber: Sir, I do not know why, when I ask about Swiss Bank or Black money, Congress Ministers’ hairs stand up straight; and that helps me to cut the hair easily; that’s why I keep asking.”

 2. నిజమే తాతగారు, చిన్నగీత ప్రక్కన పెద్దగీత తగలబోతుంది – దాని రూపం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా Banks అనే పేరుతొ ఉంది.

  • అవును ఫణి గారు syndicate bank లో పనిచేసేనా మిత్రుడొకడు ఫోన్ లో మాట్లాడుతూ ఇదే మాట చెప్పాడు ….. యూరప్ తరహా సంక్షోభం మనకి త్వరలోనే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అని

   • ఇప్పుడు జరుగుతున్న మోసాలు మీరు రాజుగారి చేపల చెరవు చిత్రం చూడండి. అన్ని Banks లో ఒక్కోటి ఉన్నాయి………

   • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు
    నేను సినిమాలు చూడటం మానేసి ముఫై ఏళ్ళు అవుతోంది. మీ సూచన మేరకు ఇది చూడటానికి ప్రయత్నం చేస్తా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s