శర్మ కాలక్షేపంకబుర్లు-ఏకవింశతి పత్రాణి

ఏకవింశతి పత్రాణి                                                            300th post

వినాయకనవరాత్ర శుభకామనలు .అయిపోయిన పెళ్ళికి బాజాలా, పండగెళ్ళి న తరవాతేమిటి అనద్దు. చవితి మొదలుకొని నవరాత్రులు పూజిస్తాం. పూజలో ఉపయోగించే పత్రాలు ఇరువది ఒకటి అని చెబుతాం. ఇందులో ప్రాంతాల్ని బట్టి కొన్ని మార్పులున్నట్లు కనపడుతూ ఉంది. నేను చెబుతున్న పత్రాలు ఎక్కువ మంది  వాడకంలో ఉన్నవి వాటికి తెనుగు పేర్లు. మొన్న సునీత గారు నన్ను కొన్ని పత్రాలకి తెనుగు పేర్లడిగేరు, వెంఠనే తెలీదని చెప్పేసేను, కాని ఏదో వెలితి కనపడింది. అయ్యో! చెప్పలేకపోయామే, అని. అదీకాక ప్రతి  సారి పూజ చేసేటపుడు పత్రం పేరు చదవడం అది లేక మరొకటి పూజ చెయ్యడం జరిగిపోతూ ఉంది. సునీతగారడిగిన తరవాత అసలు మనకు ఎన్ని దొరుకుతున్నాయో చూడాలనిపించి మొదలెట్టి పత్రి సేకరించడం చేస్తే, నాకు మొత్తం దొరకనివి  ఏడు. అందులో రెండు ప్రయత్నిస్తే దొరుకుతాయి, మిగిలిన ఐదూ కష్టపడినా దగ్గరలో దొరికే సావకాశం లేదు. విచిత్రమేమంటే ఇందులోని మాకు దొరికే పదునాల్గు పత్రాలూ మా చుట్టుపక్కలే ఉన్నాయి. మాకు దొరకనివి, వాకుడు,మఱ్ఱి,దేవదారు,వావిలి, మద్ది.  ప్రయత్నం మీద దొరికేవి, మరువం,దేవకాంచనం (గండకీ పత్రం). తులసితో ఇప్పుడు మాత్రమే గణపతిని పూజిస్తాము, మరెప్పుడు తులసితో పూజ చెయ్యరు, గణాధిపతిని. పల్లెలో ఉన్న మా  పరిస్థితే ఇలా ఉంటే పట్నవాసాలలో ఉండేవారు పత్రికే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసేలా ఉంది. ఖర్చు చేసినా అన్ని పత్రాలూ దొరికే సావకాశం కూడా లేదేమో. నిజంగానే ఈ టపాకి కష్టపడ్డా, ఈ టపా సంఖ్య మూడువందలు కావడం ఆనందం కలగచేసింది. ఈ కింద అన్ని పత్రాలు వాటి సంస్కృత, తెనుగు నామాలూ ఇస్తున్నా. మాకు తెలిసు అన్నవారికి నమస్కారం. పాటలీ పత్రం అడిగారు, తెలియలేదు. గూగులమ్మ ఇచ్చినది ఇస్తున్నా చూడండి.

1.మాచీ పత్రం                                    మాచి పత్రి.
2.బృహతీ పత్రం                                 వాకుడు.బల్ రక్కసి, రక్కీస, రాక్షసి
3.బిల్వ పత్రం                                     మారేడు.
4.దూర్వార యుగ్మం                          గరిక.
5.దత్తూర పత్రం                                  ఉమ్మెత్త.
6.బదరీ పత్రం                                      రేగు.
7.అపామర్గ పత్రం                               ఉత్తరేణి.
8.వట పత్రం                                       మఱ్ఱి.
9.చూత పత్రం                                    మామిడి.
10.కరవీర పత్రం                                 గన్నేరు.
11.విష్ణు క్రాంత పత్రం                         మరొకపేరు లేదు.
12.దాడిమీ పత్రం                               దానిమ్మ.
13.దేవదారు పత్రం                                 ?
14.మరువక పత్రం                            మరువం.
15.సింధువార పత్రం                         వావిలి.
16.జాజీ పత్రం                                  జాజి.
17.గండకీ పత్రం                               దేవ కాంచనం.
18..శమీ పత్రం                                 జమ్మి.
19.అశ్వద్ధ పత్రం                              రావి.
20..అర్జున పత్రం                              మద్ది.
21..అర్క పత్రం                                జిల్లేడు.

            1.మాచీ పత్రం                                    మాచి పత్రి.

                   2.బృహతీ పత్రం                                         వాకుడు.

                              

                            3.బిల్వ పత్రం                                     మారేడు.                               4.దూర్వార యుగ్మం                          గరిక.

5.దత్తూర పత్రం                                  ఉమ్మెత్త.

6.బదరీ పత్రం                                      రేగు.

7.అపామర్గ పత్రం                               ఉత్తరేణి.

                                  8.వట పత్రం                                       మఱ్ఱి.

9.చూత పత్రం                                    మామిడి.

10.కరవీర పత్రం                                 గన్నేరు.

11.విష్ణు క్రాంత పత్రం                         మరొకపేరు లేదు.

12.దాడిమీ పత్రం                               దానిమ్మ.

13.దేవదారు పత్రం                            

14.మరువక పత్రం                            మరువం.

15.సింధువార పత్రం                         వావిలి.

16.జాజీ పత్రం                                  జాజి.

17.గండకీ పత్రం                               దేవ కాంచనం.

18..శమీ పత్రం                                 జమ్మి.

19.అశ్వద్ధ పత్రం                              రావి.

                               20..అర్జున పత్రం                              మద్ది.

21..అర్క పత్రం                                జిల్లేడు.

పాటలీ పత్రం అడిగారు, తెలియలేదు. గూగులమ్మ ఇచ్చినది ఇస్తున్నా చూడండి.

Google says it is trumpet flower.

Coutesy http://lalithambanlr.blogspot.in/

Google.com

44 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏకవింశతి పత్రాణి

  1. చాలామందిని అడిగాను.

    కానీ మిమ్మల్ని మర్చిపోయాను.

    Pineal Gland అనే వినాళ గ్రంధి గురుంచి మన ప్రాచీన విజానులకి తెలుసా?దానిని మనవాళ్ళు ఏమని పిలిచారు?దనై గురించి ఒక పోష్టు రాద్దామని కూర్చుంటే యోగశాస్త్రంలో దాని ప్రాధాన్యాత్ నుంచి ఆదునిక శరీర ధర్మశాస్తరంలో ఏం చెప్పారు అనేవరకు చాలా విషయాలు తెలిశాయి గానీ సంస్కృత భాషలోని నామధేయం మాత్రం తెలియలేదు.తెలుగులో పోష్టు వేస్తూ ఇంగ్లీషు పేరుతో అఘోరించడం నచ్చక Pineal Gland అనే వినాళ గ్రంధికి సంస్కృతంలోని నామధేయం ఎవరు చెప్తారా అని కాకిలా ఎదురు చూస్తున్నాను.

    తెలిస్తే మీరే చెప్పండి.కనీసం ఎక్కడ వెతికితే దొరుకుతుందో చెప్పండి – ప్లీజ్!

      • హరిగారు,
        ఈ విషయంలో మీరు బుద్ధుడిని కూడా చూడచ్చు. ఆయన ఈ పీనియల్ గ్లాండు ని ‘అవ్యక్త”’

        అన్నట్టు అనుకుంటున్నాను. ఇది నా ఉద్దేశం మాత్రమే!

      • “అవ్యక్త” అనేది దాదాపు సరిపోతున్నట్టుంది.అవ్యక్త గ్రంధి అని వాదతాను.ఒకవేళ అది తప్పని తెలిస్తే అప్పుడే మారుస్తాను.

        నెనర్లు!

  2. నమస్కారం. బ్లాగ్ స్పాట్ ఇప్పుడే చూస్తున్నాను . ఇప్పుడు, ఇంత కాలానికి స్పందించటం సబబో, సమంజసమో నాకు తెలియదు కానీ – నాకు కూడా ఉన్న కోరిక ఈ అన్ని పత్రాలతో పూజించటం కాబట్టి, నా ప్రయత్నం కూడా పాక్షికంగా సఫలం అయిందని తెలుపుకుంటున్నాను. పోతే, కొన్ని చిన్న విషయాలు : 1. బృహతీ పత్రం / వాకుడు కు “ముళ్ళ గన్నేరు” అనే మరో పేరు కూడా ఉన్నట్లు విన్నాను. 2. దూర్వార పత్రం ఫోటోలో ఆకు చిత్రం స్పష్టంగా లేదు; పూవు బాగానే కనిపిస్తోంది. 3. దత్తూర పత్రపు పూవులు తెల్లగా కూడా ఉంటాయి.కాయ గుండ్రగా, ఆకుపచ్చ రంగులో 2-3 మిల్లీమీటర్లపొడుగు ముళ్ళతో ఉంటాయి. జీవితకాలం ఎక్కువ కనుక వాటిని చూసి కూడా గుర్తించ వచ్చు. 4. దేవదారు టేకు కాదు. ఆంగ్లం లో పైన్ అంటారు. శీతల ప్రాంతాలలో పర్వత సానువుల్లో లేదా సముద్ర తీర ప్రాంతాలలో కూడా చూడొచ్చు. ఆకులు ఎప్పుడు కూడా రాలవు. సతత హరితాలు. 5. విష్ణుక్రాంతానికి బొటనికల్ పేరు “Evolvulous species”. ఇంకా బొటానికల్ పేర్లు, ఇంగ్లీష్ పేర్లూ ఇచ్చి పొడుగు చేయవచ్చు కానీ గ్రంధ విస్తరణ భీతి. మన్నించాలి . ఎవరికయినా ఇంటరెస్ట్ ఉంటే… చూద్దాం.

    • డా.రాజగోపాల్ గారు,

      నమస్తే!

      ఈ బ్లాగులో తొమ్మిది సంవత్సరాలు రాశాను,పదకొండు వందల పైగా టపాలున్నాయి. సంవత్సరం పైగా ఉపేక్ష చేశాను, నేటికీ రోజుకో ౫౦ హిట్లు ఉంటాయి.మీ కామెంట్ కి ధన్యవాదాలు. స్వడబ్బా కదా మన్నించండి.

      నేనా చదువుకోని వాడిని, తెలుగు రాష్ట్రమా చాలా పెద్దది. ఒకే పత్రికి వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లూ ఉన్నాయి.ఇక గఱికపువ్వు ఫోటో అరుదు అందుకు దానిని ఉంచాను, ఉమ్మెత్తలో రెండు రకాలు నల్లది,తెల్లది.పువ్వులు రంగులోనూ తెల్లగానూ కూడా ఉంటాయి. దేవదారుని పొరపాటుగా బూరుగు అనుకున్నా,సరి చేశారు. బొటానికల్ పేర్లు, సంస్కృత పేర్లు,తెనుగులో పేర్లు ఇస్తే ఆనందమే మరి.

      ఈ బ్లాగులో మరల టపాలు మొదలు పెట్టలేను, వయసు, ఓపిక రీత్యా. మన్నించండి.
      ధన్యవాదాలు.

  3. విష్ణు క్రాంత పత్రము- ఈ మొక్కను ఇవాల్వులిస్ ఆల్సినాయిడిస్ అని బోటనీ లో చెపుతారు. ఇది కన్వాల్వులేసి కుటుంబానికి చెందినది. ఆకులు చిన్నవిగా ఎలుక చెవుల మాదిరి ఉంటాయి. తెలుపు లేదా లేత నీలి రంగులో చిన్న చిన్న పూలు పూస్తుంది. ఇది నేలబారుగా పాకే తీగ. తేమఉన్న చోట బాగా ఎదుగుతుంది.

    • govindaraju Satyanarayana గారు
      నేను చదువుకో లేదండి, అందుకు శాస్త్రీయ నామాలు తెలియవు. ఇంత పాత టపా చదివి స్పందించిన మీకు
      ధన్యవాదాలు

  4. I have not yet loaded telugu font in my laptop. Please bear my English. I’ve come across many books on Vinayaka Pooja and finally landed in a doubt. Is it Vatave namah or tulasee patrena namah? Please clarify me.

    The blog is very good and informative and the work behind is superb.

    Meeku ide naa namassumaanjalulu.

    • @ఉమ శ్రీ గారు,
      నా బ్లాగుకు స్వాగతం. కొన్ని చోట్ల వటవే చెబుతారు, మరికొంత మంది తులసి చెబుతారు. ఒక చిన్న విశేషం మాత్రం ఉంది. వినాయకునికి తులసితో చవితి రోజులలో మాత్రమే పూజ చేస్తాం. మిగిలిన రోజులలో చేయ కూడదని పెద్దలు చెబుతారు. అందుచేత ఈ నామం తులసి అని నాఉద్దేశం. మీరు పాత టపా చదివి స్పందించినందుకు సంతసం. చదువుతూనే ఉండండి…:)మరి స్పందించడం మరవద్దు.
      ధన్యవాదాలు.

  5. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు- కామెంటడం తేలికా? కిం కర్తవ్యం? | కష్టేఫలే

  6. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు- కామెంటడం తేలికా? కిం కర్తవ్యం? | కష్టేఫలే

    • @రవి గారు,
      అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
      వయసు పెరిగింది కాని బుద్ధి పెరగలేదు 🙂
      ధన్యవాదాలు

  7. మాస్టారు..చాలా శ్రద్ద తీసుకుని,ఓపికగా.. చిత్రాలతో సహా పోస్ట్ అందించారు. చాలా పత్రీ తెలుసు..కాని మారు పేర్లు,వాటి రూపం చూసి ..ఇవేనా.. అనుకున్నాను.:) గణ నాధుని ఆశీస్సులు లభించి వచ్చే సంవత్సరం ఇవన్ని సేకరించి ఆయనకి సమర్పించాలి .అనుకున్నాను.
    ధన్యవాదములు. గణపతి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు.

    • @వనజగారు,
      మన చుట్టు పక్కల తెలిసి పద్నాలుగు రకాల పత్రి దొరుకుతుంది. వాటిని తెలిసి ప్రయత్న పూర్వకంగా సేకరించుకుని పూజ చేస్తే ఆనందం కదండీ. :))
      ధన్యవాదములు.

    • @ ఫాతిమగారు,
      మన వాళ్ళు బోటనీ పాఠాలు నిత్య జీవితంలో కలిపేసేరు. అదీగాక ఇవన్నీ మనకు పనికి వచ్చే మందులు. గరిక మూత్ర రోగాలకు మంచి మందు. చాలా మందికి తెలియదు. గడ్డే కదా అనుకుంటారు.
      ధన్యవాదాలు.

  8. చాలా బాగా వివరించారు శర్మ గారు ….ఫోటోలు కూడా పెట్టారు..నాలాంటి తెలీనివాళ్ళకి కూడా గుర్తించటం తేలిక అయ్యింది 🙂
    ఇక్కడే కొన్ని మీరు చెప్పిన ఆకులతో పటు ఏవో పిచ్చిమొక్కలు కలిపి అమ్మేస్తున్నారు 😦 వచ్చే సంవత్సరం అయినా నాన్న కి ఇవన్ని చూపించి ఊరి నుండి తెప్పించుకోవచ్చు…థాంక్స్ అండి 🙂

    • @ kaavya గారు,
      మీరు కావ్య చందనగారేకదూ.వారు కాకపోతే స్వాగతం వారే అయితే పునః స్వాగతం.తెలిసిన తరవాత ప్రయత్నం చేసి పత్రి తెప్పించుకోగలిగితే ఆనందం కదా. 🙂 ఇవన్నీ మనకు నిత్యంలో వచ్చే వ్యాధులకు మందులు.రక్కీస కంటికి మందు. 🙂
      ధన్యవాదాలు.

    • @వెంకట్ గారు,
      చాలా కాలానికి కనపడ్డారు.ఎన్ని దొరుకుతున్నాయో చూదామని మొదలెడితే టపా అయిపోయింది.
      ధన్యవాదాలు.

    • @సునీత గారు,
      దేవదారు అంటే టేకి కాదండి. టేకి ఆకు చాలా పెద్దదిగా ఉంటుంది. మా ఇంటి పక్క స్థలంలో నాటి పెంచుతున్నా గత పాతికేళ్ళుగా.దేవదారు అంటే బూరుగ చెట్టు బొమ్మ పెట్టేను. గోదావరి నదీ పరీవాహక ప్రదేశంలో కూడా పెరిగింది. నేను చిన్నప్పుడు ఈ చెట్టును చూశాను. ఇప్పుడు కూడా ఉన్నదనే అనుకుంటున్నా.మద్ది చెట్టు తప్పించి అన్నీ చూశాను.
      ధన్యవాదాలు.

    • @
      గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు
      నిరాశపడక్కరలేదండి. అన్నీ దొరుకుతాయి. ఉన్నాయి కూడా.
      ధన్యవాదాలు.

  9. ఇందులో కొన్ని మా చుట్టుపక్కల ఉన్నా అవని తెలియక కోయలేదు. వచ్చేయేడాది వాటిని పత్రికోసం సేకరించాలి. అన్నీ వ్రాసిపెట్టుకు౦టున్నాను బాబాయిగారు. ధన్యవాదాలు.

    • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
      తెలిసిన తరవాత, మళ్ళీ సంవత్సరానికి దొరికిన పత్రి పూజ చేసుకుంటే అదో తృప్తి కదా.
      ధన్యవాదాలు.

  10. బృహతీ పత్రాన్ని వాడుకలో వాకుడు, బల్ రక్కసి, రక్కీస, రాక్షసి పేర్లతో పిలుస్తారని నా ఇల్లాలు చెప్పింది. అచ్చంగా ఈ వ్యాఖ్య ఆమెదే.

    • బలు రక్కసి మొక్క పూవులు పసుపుపచ్చ గా ఉండి ఒక రకమైన వికారమైన వాసనతో కూడి, మొక్క భాగాలనుండి గిల్లితే పాలు వస్తాయి . వీటి కాయలను తేలుకొండి కాయలు అంటారు. నీటి సదుపాయం లేని బీడులలో ఇవి బాగా ఎదుగుతాయి.

      • govindaraju Satyanarayana గారు
        ఈ మొక్క ఏ భాగాన్ని తుంచినా కొద్దిగా పసుపురంగులో పాలు కారతాయి. ఈ మొక్క గోదావరి లంకలో నీరులేకపోయినా పెరిగేది. ఈ మొక్క పాలు కళ్ళకలకకి మందుగా వాడేవాళ్ళం. చాలా పాత టపా చదివి స్పందించినందుకు
        ధన్యవాదాలు

  11. చాలా మంచి పోస్ట్ శర్మ గారూ!
    మీరు టపాను సమర్పించిన విధానమే చెప్తోంది
    మీరు ఎంత శ్రద్ధగా సేకరించారో…
    చాలా మంది ఇందులోని కొన్ని చూడలేదు అంటే…అది అతిశయోక్తి కాదేమో…
    అభినందనలు…
    శ్రీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు…అభివాదాలు…
    @శ్రీ

    • @శ్రీ గారు,
      పట్టణీకరణతో అదే జరుగుతోంది. చూసివుండకపోవచ్చుకనక ఎక్కడేనా కనపడితే నయినా చూస్తారని పెట్టేను. నవరాత్ర శుభకామనలు.
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s