శర్మ కాలక్షేపంకబుర్లు-గోదావరి వంతెనలు.

గోదావరి వంతెనలు.

Coutesy C.R.Sekahar

చూస్తున్నారు కదా! ఎడమవైపున్నది గోదావరి మీద మొదటగా కట్టిన రెయిలు వంతెన. ఆ తరవాత రెండవదిగా రయిలు రోడ్ వంతెన కట్టేరు. మూడవదిగా రయిలు వంతెన కట్టేరు. నాలగవది నిర్మించబడుతూంది. ఈ వంతెనలన్నీ రాజమంద్రి దగ్గర వున్నవే. ఇవన్నీ అఖండ గోదావరిపై తూ.గో.జి ప.గో.లను కలుపుతున్న వంతెనలు.

Coutesy http// saisatyablogspot.com. Constuction started on 11.11.1897.

opened on 30.08.1900

జ్ఞాపలలోకి పోతే నా పద్నాలుగ ఏట నుండి తూ.గో.జి ప.గో.ల మధ్య ప్రయాణం ఎక్కువగా చేసేవాడిని. అప్పటికి రయిలు వంతెన ఒకటే ఉండేది. దానితో గోదావరి దాటడానికి లాంచీ ని ఆశ్రయించేవాడిని. లాంచీ మాత్రం గంటకి ఒకటి తిరిగేది. నిండా జనం గోదావరి పై ప్రయాణం, అదొక మధురానుభూతే, కాని ప్రయాణం ఆలస్యమయ్యేది, ఇది ఇబ్బందిగా ఉండేది. అటు రయిలు పై ప్రయాణం చెయ్యాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. రయిలెప్పుడో కాని ఉండేదికాదు. ఆ వచ్చిన రయిలు మీద వందలమంది కొవ్వూరు గోదావరి స్టేషన్ల మధ్య ప్రయాణం చేసేవారు. ఫుట్ బోర్డ్ మీద నిలబడటానికి కూడా చోటుండేది కాదంటే ఆశ్చరం లేదు. ఇంత చరిత్ర ఉన్న గోదావరి రయిలు వంతెనను హేవ్ లాక్ బ్రిడ్జ్ అంటారు. ఆ పేరు ఆ నాటి మద్రాస్ గవర్నర్ ది. ఈ వంతెనను 11.11.1897 లో మొదలుపెట్టేరు. దీనిని 30.08.1900 లో వాడుకలోకి తెచ్చేరు, అప్పటివరకు మద్రాస్ కలకత్తాల మద్య సరాసరి రయిళ్ళు నడవలేదు. మద్రాస్ నుంచి కొవ్వూరుదాకా కలకత్తా నుంచి రాజమంద్రి దాకానే రయిళ్ళు నడిచేవిట. మూడవది రయిలు బ్రిడ్జ్ దీనిపై మరొక మార్గం ఏర్పాటు చేసుకోడానికి సావకాశం ఉన్నదిట. నాల్గవ వంతెన దూరంలో నిర్మాణంలో ఉన్నది.

ఇంత ప్రఖ్యాతి గాంచిన మొదటి రయిలు వంతెనను పది సంవత్సరాల కితం వాడకం మానేశారు. అప్పటినుంచి ఇది అలాగే ఉంది, దీనిని ప్రత్యామ్నాయ మార్గాలలో వాడుకోవాలని, ఒక మంచి కట్టడాన్ని చారిత్రిక ప్రాధాన్యాన్నిచ్చి ఉపయోగంలో కి తెచ్చుకోవాలనే ప్రజల ఆశలు నెరవేరలేదు. దీని గురించి శ్రీ. పెంటపాటి పుల్లారావు గారు కొంత పరిశ్రమ చేసేరు కాని ఉపయోగపడలేదు. మా జిల్లాల రాజకీయనాయకులకిది పట్టినట్లు లేదు. రోడ్ బ్రిడ్జ్ మీద రద్దీ చాలా ఉంది దానిలో స్కూటర్లపై వెళ్ళేవారు ఎక్కువ ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఈ వదలివేసిన బ్రిడ్జ్ ని రెండు చక్రాల వాహనదారులు మాత్రమే ఉపయోగించుకునేలా చేసి వంతెనను సంరక్షించి, చారిత్ర ప్రాధాన్యాన్ని కూడా నిలుపుకోవచ్చు. ఘనతవహించిన భారత ప్రభుత్వం వారెప్పటికి మేల్కొంటారో మా గో.జి ల రాజకీయనాయకులకు ఎప్పటికి మెలుకువ వస్తుందో భగవంతునికే తెలియాలి.

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గోదావరి వంతెనలు.

 1. క్షమించాలి, ఇంతకీ ఇది ఏ ఊరు? రాజమండ్రీనా రాజోలా? పాత జ్ఞాపకాలు, అందులో గోదావరి కథలు వింటుంటే బావుంటుంది 🙂

  • @బిందు గారికి
   స్వాగతం. గోదావరి తీరంవాళ్ళకి గోదావరి కబుర్లు ఎన్ని చెప్పుకున్నా తనివితీరదండీ! జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నాడండి శ్రీరాముడు. అలాగే మనమూనూ 🙂 ఇవ్వన్నీ రాజమంద్రి దగ్గరవేనండి.
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్ సుభా!
   మూడు చూసేవు కదమ్మా! మూడవ బ్రిడ్జ్ కి పోలవరం వైపు దూరంగా ఒక కొత్త రోడ్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ సారి ఇటునుంచి వెళ్ళేటపుడు చూడు.
   ధన్యవాదాలు.

 2. బాగా వ్రాశారు శర్మగారూ! గోదావరికి అటూ ఇటూ దాదాపు పదేళ్ళపైనే కనీసం నెలకొక సారన్నా తిరిగిన జ్ఞాపకాలున్నాయి నాకు… ఇందులో చాలా ఎక్కువభాగం పూనా నుంచి వైజాగుకు కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో…వైజాగుకు వెళ్ళేటపుడు సాయంత్రం అయిదున్నర ఆరూ ప్రాంతాలకు రాజమండ్రి చేరుకునేది. ఆ సాయం వేళలో గోదావరి చూడడానికి చాలా బాగుండేది. కొత్త వంతెనమీదుగా రైలు వెళుతున్నపుడు పక్కనే పాత వంతెన కనుపించేది. అప్పుడూ ఇలానే ఈ వంతెనను పాదచారులకు, ఇంకా రిక్షా లాంటివాటికి ఉపయోగిస్తే బాగుంటుంది గదా అని అనుకునేవాడిని!

  అదలా వుంచితే, ఫోటోలతో సహా పోస్టులను వేయడం మొదలెట్టారు…బాగుంది. ఈ ఫోటోలు కూడా బాగున్నాయి. 2 మెగా పిక్సెల్ లెన్స్ వున్న మొబైల్తో తీసిన ఫోటోలనుకుంటాను….ఆ లెన్సుకున్న లిమిటేషనుకు లోబడి (మొదటి ఫోటో) బాగానే వచ్చింది.

  ధన్యవాదాలు!

  • @వెంకట్. బి.రావు గారు,
   మొదటి బ్రిడ్జ్ ని ఇప్పటికైనా ద్విచక్ర వాహనదారులకు మాత్రమే పరిమితం చేసినా పుణ్యం, పురుషార్ధం దక్కుతాయండి. ఉప్చ్ జరిగేలా లేదండి.
   నిజం సుమండి. అందం తగ్గినపుడు ఆడంబరాలు పెరుగుతాయి చూడండి 🙂 అదనమాట, ఈ ఫోటో లు పెట్టడం 🙂 అన్నయ్య గారబ్బాయిని ఫోటో తీసిపంపమంటే పంపేడు అదే ఇది. రెండవది రాధిక గారి బ్లాగునుంచి ఎత్తుకొచ్చేసేనండి.
   ధన్యవాదాలు.

  • @జిలేబి గారు,
   మీతో వచ్చిన చిక్కే ఇది, మరో టపా రాయించేస్తున్నారనమాట, నా చేత :). నిజమేనండీ అమ్మ గురించి ఎంత చెప్పుకుంటే తరుగుతుందండీ!! తనివితీరదు!!!
   ధన్యవాదాలు.

 3. మా చిన్నప్పుడు రాజమండ్రి వెళ్ళాలంటే కొవ్వూరు లో లాంచీ ఎక్కి వెళ్ళేవాళ్ళము.ఎప్పుడన్నా ట్రైన్ ఎక్కుదామన్నా చాలా టైం పడుతుందని ఎక్కేవాళ్ళముకాదని మా నాన్నగారు అస్తమానూ అంటుంటారు. .ఈ మధ్య రోడ్ కం రైల్ బ్రిడ్జి రిపేర్ చేస్తుంటే కొవ్వురు నుండి లాంచీ లు తిరిగాయి పిల్లలను లాంచి ఎక్కించి సరదాగా రాజమండ్రి వెళ్దామనుకున్నా కానీ కుదరలేదు.

  • @రాధిక గారు,
   హేవ్ లాక్ బ్రిడ్జ్ గురించిన ఫోటో మీ బ్లాగ్ నుంచి తస్కరించి సద్వినియోగం చేసేననుకుంటా. నిజమే ఆ రోజులలో లాంచి తప్పించి మరో మార్గం ఉండేది కాదు. రయిలెప్పుడొస్తుందో వచ్చినా ఎక్కగలమా? ఇవ్వన్నీ ప్రశ్నలే. అయ్యో! ఆ సరదా మీరు తీర్చుకోలేకపోయారా? నేను తీర్చేసుకున్నానండి ఆ సమయంలో 🙂
   ధన్యవాదాలు.

 4. గన్నవరం(రాజోలు దగ్గర) మీద పాత వంతెన ౧౦౦ సంవత్సరాల పైబడే చరిత్ర ఉంది, దాన్ని బాలయోగి మంత్రిగా ఉన్న సమయంలో కొత్త వంతెన కట్టి ఈ వంతెన ఒక park లాగా చేస్తాము అని అన్నారు మీరు చెప్పినట్టుగానే అది అంతే అదే స్థితిలో ఉంది.

  • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   ఈ చరిత్ర కలిగిన కట్టడాలని ఇంకా ఉపయోగించుకోవచ్చు, రక్షించుకోనూ వచ్చు. ఉప్చ్ మనకు రాజకీయాలే తప్పించి మరేమీ పట్టవు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s