శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకూ పనికిరాడు.

ఎందుకూ పనికిరాడు.

చెప్పేవాడికి వినేవాడు లోకువనేవారు పాత కాలం మాట, నేడు వినేవాడికే చెప్పేవాడు లోకువైపోయాడు. కాలం మారిందా? నిజానికి మారింది కాలం కాదు మనిషి బుద్ధి. సృష్టి లో పనికిరానిదేమైనా ఉందీ అంటే అది మనిషిమాత్రమే. పుడుతూ ప్రతిప్రాణి ఒక గంటలో తనపని తాను చేసుకుంటుంది. లేచి నిలబడుతుంది, నడుస్తుంది, ఈదుతుంది, తల్లి దగ్గర చన్ను కుడుస్తుంది. కాని మనిషి పుట్టగానే చేయగలది ఏముంది ఏడవటం తప్ప ఏదీ చేతకాదే! పాలు తాగడం నేర్పాలి. కావాలంటే పెద్దవారిని అడిగి చూడండి. పుట్టగానే అమ్మమ్మ తేనె వేలుకు రాసుకుని పెదవులకి రాస్తుంది, తెలివితేటలేమాత్రం ఉన్నయో చూడాలని. పెదవులపై తేనె నాక్కుంటే తొందరగా నేర్చుకుంటారు. కొంతమంది అదీ చెయ్యలేరు, అప్పుడు వేలుకు తేనె రాసుకుని నోటిలో పెట్టిచీకడం నేర్పుతారు, నెమ్మదిగా. మూడవ రోజుదాకా తేనె మాత్రమే పెడతారు. మూడవరోజునాటికి ప్రకృతి తల్లిలో పాలు ఏర్పాటు చేస్తుంది. అప్పటికి చప్పరించడం నేర్చుకున్న అర్భకపు ప్రాణిని, తలకూడా నిలపలేని ప్రాణిని, మల్లెపువ్వు కన్న సుతారంగా పట్టుకుని గుండెలకానించి చన్ను కుడపడం కోసం నానా అవస్థా పడుతుంది, తల్లి. ఎలాగయితేనేమి పాలు తాగడం నేర్చుకుంటారు. ఒకటికి పోసుకుంటే చెప్పలేరు, బయటికెళితే చెప్పలేరు. అమ్మకి చెప్పడానికి ఏకైక మార్గం ఏడవడం. అమ్మ చూసుకుంటుంది. పాకడం నేర్పాలి, అన్నం తినడం నేర్పాలి, కూచోవడం నేర్చుకోవాలి, నిలబడటం, అడుగులేయడం నేర్వాలి. మాట్లాడటం నేర్వాలి, అమ్మ చెబితే. చదువు కోవడం చెప్పాలి, ఎలా బతకాలో, ఎలా బతకకూడదో, ఇలా ప్రతి విషయం అమ్మ చెబితే నేర్చుకున్న వారు, పెళ్ళి దగ్గరకొచ్చేటప్పటికి తల్లీ, తండ్రీ అక్కరలేదు. తల్లి తండ్రుల ఆస్తులు కావాలి, హక్కులు కావాలి, ఆ తరవాత అమ్మను ఛీ పొమ్మనవారే,తండ్రిని గెంటేసిన వారే, గుక్కెడు గంజి పోయనివారే. తల్లికేమిస్తే ఋణం తీరుతుంది? ఏం చేస్తే ఋణం తీరుతుంది. కొంతమంది ప్రబుద్ధులు, ఆడ/మగ కూడా ఒక కొత్త మాట కూడా అంటున్నారు. తల్లి,తండ్రులు వారి బయోలాజికల్ నీడ్ తీర్చుకుంటే ఏక్సిడెంటల్ గా పుట్టేం, మేము కనమన్నామా? అంటున్నారు. వీరికి ప్రేమకి కామానికి తేడా తెలుసా?. వారికి జోహారు, నా దగ్గర ఇంతకు మించి మాటలు లేవు ఈ విషయంలో.

ఇలా పుట్టిన మానవులకు ప్రకృతి అన్నీ ఏర్పాటు చేసింది, వాటిని వాడుకుని బతకమంది. మానవుడేం చేస్తున్నాడు? ఉన్న ప్రకృతిని పాడు చేసి ఏదో ఘన కార్యం చేసేనంటున్నారు. దేనివెనకో పరుగెడుతున్నాడు, అది మృగతృష్ణ అని తెలియక. ఏం చేసేరు, ప్రకృతిలో లేని ఒక మొక్క సృస్టించగలిగారా? ఒక కొత్త ఆహారపు వస్తువు సృష్టించ గలిగారా? ఒక కొత్త ప్రాణికి రూపు దిద్దగలిగారా? ఉన్న ప్రాణులను సంకరం చేసి గుఱ్ఱానికి గాడిదకి గోడిగను పుట్టించగలిగేరు. అంతకుమించి చేసిన ఘనకార్యం ఏముందో తెలియలేదు. మరింకేమి చేసేరు? మారణయుధాలను కనుగొన్నారు, పక్క వాడిని చంపడానికి, ఇదీ ఒక ఘనకార్యమేనా? సాటి మనిషి ఆకలితో చస్తూంటే ఒక పూట కడుపునిండా కూడు పెట్టలేని నిర్భాగ్యులం. లేదా? ఉంది, మరి, పెట్టేందుకు మనసులేదు. ఎందుకుంది మనసు, దోచుకోడానికుంది, దాచుకోడానికుంది. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం , ఎదుటి వారిని శారీరకంగా కాకపోతే మానసికం గా నయినా హింసించే మనసు మాత్రం ఉంది. భగవంతుడిచ్చిన నోటి వెంట మంచి మాట రాదు, భగవంతుని పలుకురాదు. శంకరులు చెప్పిన భజగోవిందం తెలియదు, ఎందుకు పుట్టేం, తెలియదు,ఎందుకు బతుకుతున్నాం? తెలియదు, ఎందుకు చస్తున్నాం, అదీ తెలియదు. కూడా ఏదీ రాదని చెబుతాం, పక్కవాడి అవసరానికి ఆదుకోం. ప్రమాదమొస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి కారివ్వం. ఎందుకో ఈ సంపద? తెలియదు. చస్తే బయట పారెయ్యలి, లేదా కాల్చిపారెయ్యాలి, అందుకు పుట్టిపుల్ల దండగ. పుట్టి పుల్లలెక్క, అంతుంటే కాని పూర్తిగా కాలదు శరీరం, కాని శరీరంలో భాగాలు కూడా పనికిరావు. మూత్రపిండాలు ముఫ్పయవ ఏటే పోయాయి, కాలేయం నలభయ్యవ ఏటపోయింది, కళ్ళు చిన్నప్పుడే పోయాయి చెయ్యకూడని పనులు చేయడం మూలంగా, మందు తాగడం మూలంగా, మార్ఫిన్ లాటి మత్తు మందుల మూలంగా. మనిషి ఎందుకు పనికొస్తున్నాడు. తనని తాను తగలేసుకుంటున్నాడు, ఎందుకూ పనికిరానివాడు. ఇది నిరాశ కాదు, నిజం

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకూ పనికిరాడు.

 1. ఆంతా బాగుంది కాని మన ప్రారబ్దానికి, ఖర్మకూ శాస్త్రవిజ్ఞానాన్ని ఆడిబోసుకోవడం సరికాదు, అని నా ప్రగాఢ నమ్మకం. 🙂
  ఆ విజ్ఞానం వల్లనే కనీసం ప్రకృతికి మనం చేస్తోన్న డేమేజి తెలుసుకున్నాము. మా తాతగారి కాలంలో గ్లోబల్ వార్మింగులేదు, వార్నింగు లేదు, ప్రకృతిని పరిరక్షించాలి (శాస్త్రీయంగా) అన్న నాథుడూ లేడు. సంకర జాతులను పుట్టించడం ఓ అద్భుతమైన ఘనకార్యం. వాటితో రోగ నిరోధక శక్తి కలిగిన, అధిక మాంస/పాడి పశువులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. శాస్త్రం పుణ్యాన మెడిసన్ అభివృద్ధి చెందింది. లేదా ఏ వాతం, పిత్తం అంటూ కానా కషాయాలను గొంతులో పోసుకుని పూర్వం కాలం చేసే వారు. మాతాత గార్లు 60-70ఏళ్ళకు మించి, ఆరోగ్యంగా బ్రతికిన దాఖలాలు లేవు. ఈకాలంలో 80-90ఏళ్ళు. “మన గ్రహచారం అలా ఏడుస్తూవుంటే, ఖుదా క్యా కర్తా” అన్నది మా వూరి సాయబు గారి సూక్తి, నిజమే! 🙂 ఆడిపోసుకోవాలనుకుంటే దేవుడెలా పనికి వస్తాడో, శాస్త్రం కూడా అలానే పనికొస్తుంది. 😉

  • @Snkr గారు,
   ఆంతా బాగుంది కాని మన ప్రారబ్దానికి, ఖర్మకూ శాస్త్రవిజ్ఞానాన్ని ఆడిబోసుకోవడం సరికాదు
   మొత్తం మూడు ముక్కల్లో బలే చెప్పేసేరు 🙂
   ధన్యవాదాలు.

 2. వామ్మో,

  శర్మగారు ఇంత గా ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన ఏమి సమాధానం చెప్పగలం మరి

  యథో కర్మః తథో ఫలః.
  జిలేబి.

 3. డైనమేట్ పేల్చినట్లు ఉన్నాయి ప్రశ్నలు.

  ఎవరికీ వారు ఆత్మ విమర్శగా చేసుకుంటే.. . తప్పిదాలు తెలుస్తాయి. ఇలా అడిగే వాళ్ళు ఉండాలి.

 4. కష్టేఫలే అన్ననీతి మనిషి మరచిపోయిన రోజునుంచీ ఈ బాధలు మొదలయ్యాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s