శర్మ కాలక్షేపంకబుర్లు-నమశ్శంభ వేచ…పట్టిసీమ

నమశ్శంభవేచ…పట్టిసం.

 

రుద్రాభిషేకం చేసుకోలేకపోయినా మహాన్యాసం వినండి

కార్తీక మాసం రాగానే అబ్బాయి పిలిచాడు. “బాబయ్యా! 25 వ తారీకున మన ఇంట్లో లింగార్చన, మరునాడు పట్టిసం స్వామి దర్శనం, ఇలా నిర్ణయం చేసేడు స్వామి ఈ సంవత్సరం, మీరంతా రావాలి సుమా, నాన్న కూడా పిలుస్తాడు” అన్నాడు. “నాన్న ముందే చెప్పేడురా, వచ్చేస్తున్నాం,” అన్నా. ఆదివారం ఉదయమే బయలుదేరి ఎనిమిదిలోపు చేరుకున్నాం. లింగార్చనకి రాత్రి భోజనాలికి పిలుపులెళ్ళిపోయాయి. ఋత్విక్కులొచ్చేశారు, యదావిధిగా ప్రారంభమయిపోయింది కార్యక్రమం, పిల్లలు సత్యనారాయణ వ్రతం చేసుకోడంతో. పీటల మీద కూచోడానికి ముందే, పెద్దలం మాకు నూతన వస్త్రాలతో సత్కారం చేసేశారు.

లింగార్చన తరవాత కొలువు తీరిన స్వామి వారు అమ్మవారు

లింగార్చన తరవాత కొలువు తీరిన స్వామి వారు అమ్మవారు

వ్రతం తరవాత లింగార్చన ప్రారంభమయింది, నమశ్శంభవేచ మయో భవేచ, నమశ్శంకరాయచ, మయస్కరాయచ, నమః శ్శివాయచ, శివతరాయచ, నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం, విభూది,ఫలరసాలు, తేనె, ఆవుపాలు, చక్కెర,వట్టివేళ్ళతో, శుద్ధ జలంతో జరిగింది. మధ్యలో కొద్దిగా సమయమిచ్చి అభిషేకం పూర్తి చేసి, అమ్మకి సహస్రనామ పూజ చేసి ( లలిత )అమ్మవారిని, స్వామి వారిని అలంకరించి, వారు వేంచేసివున్న కొలువులో వేద పారయణ, రాజోపచారాలతో పూర్తి చేసి, బంధు మిత్రులతో భోజనాలు పూర్తి చేసేటప్పటికి రాత్రి పదకొండు.

చిలుకు ద్వాదశినాటి రాత్రి చంద్రుడు

చిలుకు ద్వాదశినాటి రాత్రి చంద్రుడు

ఆ రోజు చిలుకు ద్వాదశి కూడా, దీనినే కైశిక ద్వాదశి అని కూడా అంటాం. చంద్రుడిని చూడండి, ఎంత బాగున్నాడో. ఇంట్లోని స్త్రీలంతా కైశిక ద్వాదశి పూజ, లలితా సహస్రనామ పూజ చేసుకున్నారు,తృప్తిగా.

పడవలో

పడవ.

మరునాడు ఉదయమే లేచి గోదావరిలో, సంకల్పం చెప్పుకుని, ఇల్లాలితో సరిగంగ స్నానం చేసి, ఉపవాసానికి సంకల్పం చెప్పుకున్నాం. పడవలో వెళదామంటే ఆ సావకాశాలు లేవని అబ్బాయి చెప్పడంతో బస్సుకి బయలుదేరి, రేవులో దిగి, గోదావరిదాటి స్వామి సన్నిధికి చేరున్నాం. నేను కొద్దిగా వెనకబడటంతో అబ్బాయి లఘున్యాసానికి టిక్కట్లు తీశాడు.

భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం

భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం

గణపతిని దర్శించి స్వామి దర్శనం, లఘున్యాసానికి నిలబడితే పది నిమిషాల్లో లోపలికి చేరుకున్నాం. ఈలోగా అబ్బాయి, “బాబాయ్! అందరికి ఇక్కడ కొచ్చినా చిత్తం శివుడి మీద ధ్యానం చెప్పుల్లోనూ ఉంటోంది” అన్నాడు. సరే ఒక సారి “హరహర మహదేవ శంభో శంకరా” అని అరిచా. “అరిస్తే పలుకుతాడా అందొ”క పడుచు. “బిడ్డ ఏడిస్తేనే కదా తల్లి దగ్గరకి తీసేది అంచేత ఆర్తితో ఆరుద్దాం, ఉమాపతి పలుకుతా”డన్నా. ఆ తరవాత నమః పార్వతీపతే అంటే హరహర మహాదేవ అని బదులిచ్చేరు. లోపలికెళ్ళేం. అక్కడ పూజారి గారు మా గోత్ర నామాలు తీసుకునే లోగా ఒక పని చేశా. “నమశ్శివాయ” ఇది సిద్ధ మంత్రం దీని పారాయణకి ఉపదేశం అక్కరలేదు, పలకండని నమశ్శివాయ జపం చేయించా, పూజారి గారు పూజ చేస్తున్నంత సేపూ నామజపం చేశాం. పూజారిగారు మరి కాస్త హుషారు చేసేడు. పూజ తరవాత బయటికి ప్రత్యేకం గా వచ్చి అందరికి తీర్ధ ప్రసాదాలిచ్చారు. అరిస్తే పలుకుతాడా అన్న పడతి “బాబాయ్ గారు ఈవేళ దర్శనం బాగా సంతృప్తిగా జరిగింద”ని నమస్కారం పెట్టబోయింది. అప్పుడు చెప్పేను, గుడిలో ఎవరికీ నమస్కరించకూడదు, అక్కడ దేవుడికే నమస్కారం.
అమ్మ భద్రకాళికి వస్త్రం సమర్పించి, క్షేత్రపాలకుని దర్శించి,

సరంగు

సరంగు

కొవ్వాడ కాలవ నీరు గోదావరిలో కలిసే చోటు.

కొవ్వాడ కాలవ నీరు గోదావరిలో కలిసే చోటు.

ఆంజనేయ స్వామి (రేవులో)

ఆంజనేయ స్వామి (రేవులో)

తిరుగు ప్రయాణంలో రేవులో ఆంజనేయాస్వామికి, కొవ్వాడ కాలవ గోదావరిలో కలిసేందుకు కట్టిన ప్రాజెక్ట్ ఫోటోలు తీసుకుని ఇంటికి జేరేం.గోదావరిపై నాల్గవ వంతెన

గోదావరిపై నాల్గవ వంతెన

రెండు గంటలికి బస్సుకోసం వస్తే, బస్సు రాకపోతే చిరాకొచ్చి ఆటో మీద బయలుదేరి వస్తుంటే,  తాతగారూ! నాకు మూడే బ్రిడ్జీలు కనపడ్డాయన్న మనవరాలు సుభ మాట గుర్తొచ్చి నాల్గవ వంతెన ఫోటో తీసుకుని ఇంటికి చేరేం.

ప్రకటనలు

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నమశ్శంభ వేచ…పట్టిసీమ

 1. మనిషి విషయంలో కూడా మనం చేస్తున్నది అదే! బాహ్య రూపాన్ని చూసి, ఏముంది మనిషి? రక్త , మాంసాలు, ఎముకల గూడు ఇంతే కదా! అనేస్తున్నాం అంతే కానీ, ఆ ఎముకల పంజరం లోపల ప్రపంచమంతా వ్యాపించిన ఆకాశం ఒదిగి ఉందన్న సత్యాన్ని విస్మరిస్తున్నాం. యోగులు, మహర్షులంతా ‘నీలోకి నువ్వు చూడు’ అని పదే పదే ఎందుకు చెబుతారు?

  • మిత్రులుrathnam.B గారు,
   గురువు గురించి చాలా సార్లే రాశాను. ఇక శరీరం గురించి దానికి ముక్తికి ఉన్న సంబంధం గురించి మొన్న ఆరువందలవ టపాగా వేద్దామని రాశాను, కాని ఎందుకో వేయాలనిపించక పబ్లిష్ చేయలేదు. ఆ టపాలో స్వంత డబ్బా కొంత ఉంది దానిని తగ్గించి పబ్లిష్ చేస్తాను.మీ ప్రశ్నలే చాలా జటిలమైనవి కదా! నేనా సామాన్యుడిని చదువురాని వాడిని, అందునా తెనుగు తప్ప మరో భాష రానివాడిని. జీవితమే నా బడి, దాని అనుభవ సారమే నా గీత. దానినుంచి రాసినదే వేస్తున్నా!, తొందరలో. తప్పులుంటే దయ చేసి మన్నించి సరి చేయగలందులకు ప్రార్ధన.
   ధన్యవాదాలు.

 2. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
  గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః

  అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు
  ఆత్మ విచారణ సర్వత్రఆత్మానుభూతి సర్వకాలాలకు చెందిన బ్రహ్మ. భావమే నిజముక్తి సిద్ధిస్తుంది. భ్రాంతిని వదలాలి. ఇది అసలైన ఆత్మ తత్త్వం దర్శించాలి
  ఆత్మచైతన్యం బహిర్గతమవడం గ్రహించాలి యథార్థమైన సంతృప్తి కలుగు తుంది. లేకపోతే గొప్పనష్టం వాటిల్లుతుంది
  ఆత్మయే నేను. ఎరుక (జ్ఞానం)యే నీవ్ఞ. ”ఎరుక స్వరూపం ఏమిటి? ఎరుక స్వరూపం సదానందం. మన అసలు స్వరూప దర్శనం ఎప్పుడు కలుగుతుంది

 3. నిత్య పూజ –గురువు సహాయము కోరు! గురువును సహాయము కోరు గురువు లేని ప్రయాణము ప్రమాదభరితమయినది. సద్గురు సహాయము లేకుండా మనస్సును జయించగలవాడు యెవ్వడు ? వలదిక ఇలలో ఇసుమంతైననూ సందేహం గురువు లేనిదే దుర్లభమోయీ భవతరణం ! గురువు వినా రుద్రాక్షలు దండగ ! గురువు వినా దనమ్ములు దండగ ! గురువు వినా ప్రతీయత్నము దండగ ! ఉందీ సత్యం పురాణాల నిండుగ !! గురువు లక్షణాలు ! పరోపకార భావన , జప పూజాదుల ఆచరణ , సార్ధకమయిన పలుకు , శాంత స్వభావము , వేద వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసి యుండుట , యోగ శాస్త్ర సిద్దాంతాలను సులువుగా బోధించగలుగుట , దేవతల మనస్సులను సంతోష పెట్టగలిగియుండుట మొదలయిన సుగుణాలతో పరిపూర్ణుడైన వాడే సద్గురువు !

  • మిత్రులు rathnam.B గారు,
   స్వాగతం. ఎప్పటిదో దగ్గరగా రెండేళ్ళ కితం టపా చదివి వ్యాఖ్య పెట్టినందుకు చాలా ఆనందమయింది. మీలాటివారి పరిచయ భాగ్యం కలిగినందుకు సంతసం.
   అది సిద్ధ మంత్రమని దీనికి గురుబోధ అవసరం లేదంటే అలా చెప్పించేను తప్ప గురువులేక తిమిరం పోదు. గురువులేని విద్య కొరగాదని తెలుసు.మీ వ్యాఖ్య చాలా బాగుంది
   ధన్యవాదాలు.

 4. గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు.

  • @తృష్ణగారు,
   నా బ్లాగుకు స్వాగతం. నేను మీ బ్లాగుకు పాతకాపునే. 🙂 మీవి ఎక్కువ బ్లాగులున్నట్లున్నాయి, పేర్లు గుర్తుండక 🙂 పట్టిసీమలో మీరు తీసిన మరికొన్ని కూడా చిత్రాలు తీశాను, సెల్ ఫోన్ తో, మసకగా ఉన్నాయని పెట్టలేదు.
   ధన్యవాదాలు.

 5. వంకాయవంటి కూరయు
  పంకజముఖి సీతవంటి భార్యామణియున్
  లక్ష్మణుడి వంటి తమ్ముడును

  శంకరునివంటి దైవము ఇహలో కలరే
  నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర

  అని నేఅన్నట్టు పట్టిసం వీరభద్రుడికి తెలియజేయండి , శర్మగారు. 🙂

  • @ Snkrగారు,
   స్వామి నిశ్చలంగా ఉన్నట్లు కనపడతాడు కాని ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. మీ మాటా విన్నాడు.
   ధన్యవాదాలు.

 6. Thank u babayya for bringing on your blog the photographs of your trip to Pattisam and the Lingarchana we performed at our native place collectively. Here is a small piece of suggestion. If possible, kindly throw some light on the historical importance and spiritual significance attached to ‘Pattisam’ duly quoting some slokas and stotras besides enumerating what the Puranas said about ‘Pattisam’. This would enable the readers to understand better about the spiritual hub- Pattisam. Otherwise, people who do not know about Pattisam would identify that place with a scene in the picture directed by ‘Viswanadh’. Hope this suggestion would be on an acceptable note. Regards, bujji.

  • @చి. బుజ్జి
   కితం సంవత్సరం శివరాత్రికి పట్టిసీమ విశేషాలతో టపా రాశాను. రాసినదే మళ్ళీ రాయడమా అనేదొక సంశయం. ఇప్పటికే టపా
   పెద్దదయిపోయింది కదా. నీ సూచన గమనించా. వీలు వెంబడి అమలు చేస్తా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s