శర్మ కాలక్షేపంకబుర్లు-పల్లె’టూరు’

పల్లె’టూరు’

కార్తీక మాసంలో మూడవ సోమవారం మా చిన్న కోడలుగారి ఊరు వెళ్ళేం కదా, అక్కడ శివలింగం ప్రతిష్ఠ చేసిన ఏటి ఒడ్డుకు చేరేటప్పట్కి ఏట్లో ఈత కొడుతున్న పిల్లలను చూసి చిన్న తనంలో గోదావరిలో ఈత కొట్టిన రోజులు గుర్తొచ్చి, ఇలా క్లిక్ అనిపించా.

ఈత కొడుతున్న పిల్లలు

ఈత కొడుతున్న పిల్లలు

వస్తూ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తే పచ్చగా ఉన్న చెట్టు, చేమలు, చెరుకు తోటలు కనపడ్డాయి. మరి కొంత దూరం వచ్చేటప్పటికి ఇలా ఒక కపిలగోవు కనపడింది.

కపిలగోవు

కపిలగోవు

.మా ప్రాంతం లో కపిల గోవును చాలా శ్రద్ధగా పెంచుతారు. కపిల గోవు ఉన్న అతను చాలా గొప్ప వాడిగా చలామణీ అవుతాడు, అదృష్ట వంతుడు కూడా. మా దగ్గర కపిలగోవును అమ్మరు. ఒక వేళ అమ్మితే మాత్రం ఐదు నుంచి పది లక్షల  మధ్య ఉంటుంది, ధర.

బెల్లం పెనం

బెల్లం పెనం

ఆ తరవాత కనపడింది బెల్లం వండుతున్న పెనం. ఇందులో రసం ఉడుకుతోంది.ఒక్క పది నిమిషాలుంటే చెరుకు పానకం ఇస్తామన్నారు, ఉండలేక వచ్చేశాం.

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే

ఇలా ఆడుతు పాడుతు పని చేస్తుంటే అనే ఇద్దరు కనపడితే,

పండిన వరిచేను, చెరుకుతోటలు

పండిన వరిచేను, చెరుకుతోటలు

నులక మంచం మీద నిశ్చింతపరుడు

నులక మంచం మీద నిశ్చింతపరుడు

మరి కొద్దిగా ముందుకొస్తే ఇలా నిశ్చింతగా నులకమంచం మీద పడుకున్న నిశ్చింతపరుడు కనపడ్డాదు. ఆహా! ఏమి నీ అదృష్టం అనుకుంటూ ఇంటికి చేరేము. కొద్దిగా ఫలహారం తరవాత బయలుదేరేం.

అమ్మాయి నడుపుతున్న పెట్రోల్ బంకు

అమ్మాయి నడుపుతున్న పెట్రోల్ బంకు

సబ్బవరం రోడ్ లో ఒక పెట్రోల్ బంకు లోకి తీసుకెళ్ళేడు ఆటో, వెనక కొండతో పెట్రోల్ బంకు అందంగా కనపడింది, అమ్మాయి డిజిల్ బంకు నడుపుతూ.అక్కడినుంచి ముందు కెళితే ఒక కొండ కనపడింది దానిని బొజ్జన్న కొండ అన్నారు. అక్కడ బౌద్ధం కాలం నాటి అవశేషాలున్నాయన్నారు. మా ఆటో సబ్బవరం మండలంలో ఉన్న దేవీపురం చేరింది. చుట్టూ కొండలు, ఒక కొండ పక్కనుంచి వెళితే అక్కడికి చేరేం.

రాజరాజేశ్వరీ దేవి

రాజరాజేశ్వరీ దేవి

అక్కడ ఒక గుడి ఉంది. కట్టడం గుండ్రంగా ఉంది, రాజరాజేశ్వరీదేవి రెండవ అంతస్థులో ఉన్నారు.అమ్మ ఛాయ కింద ఉంటే ఇలా. గుండ్రంగా ఉన్న ప్రాకారం చుట్టూ ఇలా విగ్రహాలున్నాయి.

బీజాకర్షిణి

బీజాకర్షిణి

ధైర్యాకర్షిణి

ధైర్యాకర్షిణి

రసాకర్షిణి

రసాకర్షిణి

మొత్తం అమ్మ అన్ని పేర్లమీద ఇలా విగ్రహాలున్నాయి. అందులో కొన్ని.పైకి వెళ్ళి అమ్మను దర్శనం చేసుకుని దిగివస్తే

విదేశీయుడు చేస్తున్న హవనం

విదేశీయుడు చేస్తున్న హవనం

కింద ఒక విదేశీయుడు ఏదో హవనం చేస్తున్నాడు.

1356లింగాలు

1356లింగాలు

శివలింగం

శివలింగం

చుట్టూ ఉన్న ప్రకృతి

చుట్టూ ఉన్న ప్రకృతి

అక్కడినుంచి దగ్గరలోనే పదమూడువందల ఏబదియారు శివలింగాలు ఇలా ఉన్నాయి. అక్కడ స్వామిని దర్శించి వచ్చాం. ఇది అనకాపల్లికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నాకు పిక్నిక్ చోటుగా కనపడింది. తిరిగివస్తూ నూకాలుతల్లిని దర్శించి వచ్చాం. రాత్రికి శూలాల సంబరం జరిగింది.

ప్రకటనలు

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పల్లె’టూరు’

  • @పవన్ కుమార్ గారు,
   నా బ్లాగుకు స్వాగతం. పాత టపా చదివి కామెంట్ పెట్టేరే! సంతసం. అందమయినవి పల్లెలేనండి.
   నెనరుంచాలి

 1. పల్లెకు విహార యాత్ర (టూర్) లా ఉన్న మీ పల్లె ‘టూరు ‘ వ్యాసం చిత్రాలతో పల్లెను కళ్ళముందు నిలిపింది. మీ కెమేరా కన్నుతో మరిన్ని వ్యాసాలు ఆశింపవచ్చునా?

  • @మిత్రులు cbrao గారు,
   నా బ్లాగుకు సాగతం, ప్రయత్న లోపం లేదండి.ఏదవ తారీకునుంచి టపాలు చూడండి, మీ మెచ్చుకోలుకి
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్!
   నిన్ను, బుజ్జి పండుని, తీసుకెళ్ళి చూపించలేకపోయాను, కనీసం ఇదయినా చేయకపోతే ఎలా అని 🙂
   ధన్యవాదాలు.

 2. ఎన్ని రోజులకి చూసానో బెల్లం వండుతున్న పెనం. చిన్నప్పుడు, అక్కడే గంటల తరబడి ఉండి వేడి వేడి గా ఆ బెల్లం రసం/పానకం తాగడం ఎంత సరదాగా ఉండేదో!
  బహు చక్కగా చిత్రాలన్ని మా కోసం ఇలా పోస్ట్ చేసిన మీకు ధన్యవాదాలు.

  • @శ్రీ గారు,
   నాకూ ఆ బెల్లం పొయ్యి, పెనం చూసేటప్పటికి చిన్నప్పటి జ్ఞాపకం కదిలి క్లిక్ అనిపించా. మీకూ నచ్చినందుకు మెచ్చుకోలు.
   ధన్యవాదాలు

  • @వెంకట్ గారు,
   మీ చేత మెచ్చుకోలు వచ్చేలా ఫోటో లు తీయగలిగేనంటే, అసలు గొప్ప నాది కాదు లెండి, కెమేరాది 🙂
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s