శర్మ కాలక్షేపంకబుర్లు-మా కార్తీక వన సమారాధన.

మా కార్తీక వనసమారాధన.

నిరుడు కార్తీక మాసంలో వనసమారాధన జరగలేదు, వర్షాలమూలంగా. అదీ మంచికే జరిగింది, యాజమాన్యం యావత్తూ యువకుల చేతికి వెళిపోయింది.

రవి శంకర్ కార్యక్రమ సారధి

రవి శంకర్ కార్యక్రమ సారధి

ఇదిగో ఈ యువకుడు ఒక పాతిక మంది సహకారంతో కార్యక్రమం నిర్వహించాడు.

పెద్దవారొకరు ఉసిరి మొక్కనాటి ఉంచారు, వారి గోడౌన్ వద్ద ఖాళీ స్థలం ప్రతి ఏటా వన సమారాధనకి, మాకు ఇవ్వడం అలవాటు. ఆ స్థలంలో,యువకులు మరు రోజుకు కావలసిన   ఏర్పాట్లు చేసుకున్నారు. మరు రోజు ఉదయం, యువకులు వారితో పాటు యువతులు పాల్గొన్నారు. అక్కడికి కావలసిన సంబారాలన్నీ చేర్చుకున్నారు. వంట బ్రాహ్మలకి పురమాయించేరు. ఆర్ధిక నిర్వహణలో కొత్త పోకడ చూపేరు. ప్రతి కుటుంబం వనసమారాధనకు రావాలి. ఇవ్వగలిగిన వారు సొమ్మివ్వచ్చు, లేకపోయినా పాల్గొని తీరాలి, ఇది చెప్పేరు అందరికీ.ఇవ్వకలిగిన వారు అనుకున్నదానికి ఎక్కువ సొమ్మిచ్చారు. కొంత మంది, సమారాధనకి పట్టే బియ్యం లాటి వాటిని ఇచ్చారు. ఇంకేమీ లోటులేదు. మొత్తం 158 మంది కుటుంబాలు పాల్గొన్నాయి.సమారాధన అన్న మాటకి అర్ధం నిర్వచనం అలా క్రియలో చూపించారు.

అందరి తరఫున సంకల్పం చెప్పుకున్న దంపతులు

అందరి తరఫున సంకల్పం చెప్పుకున్న దంపతులు

ఈ దంపతులు అందరి తరఫునా రుద్రాభిషేకానికి సంకల్పం చెప్పుకున్నారు.

పుట్ట మట్టితో చేసిన శివలింగం

పుట్ట మట్టితో చేసిన శివలింగం

మహాదేవుడు లింగ రూపంలో మృత్తికతో

గోముఖం తో క్షీరాభిషేకం

గోముఖం తో క్షీరాభిషేకం

దీనిని గోముఖం అంటారు, పొడుగు కాడ చివర ఆవు తల ఉంటుంది జాగ్రత్తగా చూడండి, దీనితో అభిషేకం చేస్తే శివునికి ప్రీతి

క్షీరాభిషేకం

క్షీరాభిషేకం

మహన్యాసం,నమక చమకాలు మా నోట్లో ఉన్నవే కదండీ, మాకు భవంతుడిచ్చిన ఆస్తి, డబ్బులేకపోయినా. ఇంకేంలోటూ చెప్పేసేం. రుద్రాభిషేకం చేసుకున్నాం.

శంఖం తో క్షీరాభిషేకం

శంఖం తో క్షీరాభిషేకం

ఇది శంఖం, శంఖంలో పోస్తేనే తీర్ధం అవడమిదే, అనగా శంకరునికి అభిషేకార్హత వస్తుందనమాట, ఆ జలానికి.

కుంకుమ తో అభిషేకం

కుంకుమ తో అభిషేకం

ఒట్టి వేళ్ళ తో అభిషేకం

ఒట్టి వేళ్ళ తో అభిషేకం

ఈ ప్రకృతిలో శివుడు కానిదేదీ? వట్టి వేళ్ళు తడిపితే చల్లగా ఉంటుంది, సుగంధం ఇస్తుంది, ఇది శివునికి ప్రీతి.

గౌరీ శంకరుల ప్రతిమ

గౌరీ శంకరుల ప్రతిమ

లింగానికి పుష్పమాలాలంకారం

లింగానికి పుష్పమాలాలంకారం

లింగానికి పుష్పమాలాలంకారం

లింగానికి పుష్పమాలాలంకారం

కార్తీక దామోదరుడు

కార్తీక దామోదరుడు

శివాయ విష్ణు రూపాయ,శివ రూపాయ విష్ణవే. శివశ్చ హృదయం విష్ణుః, విష్ణుశ్చ హృదయం శివః

కార్తీక దామోదరార్చన చేస్తున్న మహిళలు

కార్తీక దామోదరార్చన చేస్తున్న మహిళలు

వంటలు

వంటలు

మాదేముందండీ అల్ప సంతోషులం, పప్పు, పులుసు,ఊరగాయ, కందా బచ్చలి కూర,కాబేజీ కొబ్బరి కోరు, ఒక స్వీటు హల్వా, పులిహోర ఇంతే.చివరిగా పెరుగండోయ్!

తంబోలా ఆడుతున్నవారు

తంబోలా ఆడుతున్నవారు

ఐకమత్యమే బలము

తంబోలా ఆడుతున్నవారు

తంబోలా ఆడుతున్నవారు

ఎంత చెట్టుకు అంతగాలి

తంబోలా ఆడుతున్నవారు

తంబోలా ఆడుతున్నవారు

సంతోషం సగము బలము

వడ్డనలు

వడ్డనలు

చివరగా నేటి కార్యక్రమ సమీక్ష. ఇక ముందు అందరికీ అన్ని సమాచారాలు సరిఅయిన వేళ,అందించేందుకు నిర్ణయం, దానికి అందరి దగ్గరా అడ్రస్ లు సెల్ నంబర్లు సేకరించారు.

కలౌ సంఘ్హే శక్తి అన్నారు, కృష్ణ పరమాత్మ, తెలుసుకోలేకపోతే ఎలా…..

చిన్న సవరణ:- కార్యక్రమం తొమ్మిది ఆదివారం జరిగింది. పొరపాటున కెమేరాలో తారీకు పదిగా ఉండిపోయింది.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మా కార్తీక వన సమారాధన.

  • @లలిత గారు,
   భగవంతుడు హెచ్చు భోగ భాగ్యాలివ్వకపోయినా, ఆయననుంచి మరలని దీక్ష ఇచ్చాడు, అందుకే చేసుకోగలిగాం, మీకు నచ్చినందుకు
   ధన్యవాదాలు

 1. చాలా బాగున్నాయ్ శర్మగారూ….చాలా చాలా బాగున్నాయ్! పోస్టు నిండుగా ఉత్సవం కనబడుతోంది. పంచుకున్నందుకు ధన్యవాదాలు!

  • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   అయ్యో! పాల్గొనలేకపోయానన్న భావాన్ని తుంచెయ్యకండి. మరు సంవత్సరం తప్పక పాల్గొంటారు.
   ధన్యవాదాలు

  • @తెలుగు భావాలు గారు,
   గోముఖం ఉపయోగం ఇక్కడ ఎక్కువే. ప్రయత్నించండి హైదరాబాద్ లో దొరుకుతుంది.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s