శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి వివరణ

పెళ్ళి వివరణ.

నిన్నటి టపా తరువాయి…..

శ్రీ తేతలి రాధాకృష్ణా రెడ్డి, శ్రీమతి రమాదేవి పుణ్య దంపతులు.

శ్రీ తేతలి రాధాకృష్ణా రెడ్డి, శ్రీమతి రమాదేవి పుణ్య దంపతులు.

శ్రీతేతలి రాధాకృష్ణా రెడ్డి శ్రీమతి రమాదేవి పుణ్య దంపతులు నింబలక్ష్మీ, శ్రీఅశ్వద్ధనారాయణుల వివాహం వైభవంగా జరిపించేరు కదా ఆ తరవాయి

పెళ్ళికి వెళ్ళి భోజనం చేసి ఇంటికొచ్చేటప్పటికి రెండు దాటింది ఆ రోజు సాయంత్రం మా సత్తిబాబొచ్చాడు. “పంతులుగారు ఉదయం కనపడలేదు ఎక్కడికెళ్ళేరు” అన్నాడు. “అదేనయ్యా! రాధ గారు రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్ళి చేసేరు కదా! పిలిచేరు అక్కడికెళ్ళేను” అన్నా. “ఏమోనండి! మనవాళ్ళింకా మూఢ నమ్మకాలనుంచి బయట పడలేదండి” అన్నాడు, కూచో మని చెయ్యి చూపిస్తూ “మీ అన్నయ్యొచ్చేడోయ్! టీ” అన్నా. “వస్తున్నా” అని లోపలినుంచి ఒక కేక వినపడింది.

“ఏంటన్నావు? మూఢనమ్మకమా, చెట్టుని పూజించడం. ఒక మాట అడుగుతా చెప్పు. మనిషికి కావలసినదేంటి.” “కూడు, గూడు” అన్నాడు. “సరే కూడు కావాలంటే పంట కావాలి కదా!” “పంట కావాలంటే నీరు కావాలండి, నీరు కావాలంటే వర్షం పడాలండి, వర్షం పడాలంటే చెట్టు కావాలండి.” “బలే చెప్పేసేవు, మరి ఇప్పుడు చెప్పు చెట్టు దేవుడేనా, మనల్ని బతికించే వాళ్ళని దేవుడనటం తప్పా.” “మరో సంగతి గీతాచార్యుడేమన్నాడయ్యా

అన్నాద్బవన్తి భూతాని పర్జన్యా దన్నసమ్భవః
యజ్ఞా ద్బవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముధ్భవః భగవద్గీత……అద్యా.౩..శ్లో..14

జీవులన్నియు వర్షము నుండి ఉత్పన్నమగు ఆహార ధాన్యములపై జీవించును. వర్షములు యజ్ఞాచరణమువలన కలుగును. యజ్ఞము విహిత కర్మాచరణవల్ల కలుగును.

అంటే జీవులు బతకాలంటే అన్నం కావాలి. అన్నం పండాలంటే వర్షం కావాలి కదా. వర్షం యజ్ఞం వల్ల కలుగుతుందన్నారు కదా! మరి చెట్టు కాపాడుకోడం యజ్ఞం కదా. అదే విహిత కార్యాచరణ కదా. మరి ఇప్పుడు వీరు చేసినది యజ్ఞమే కదా! అందుచేత చెట్టును రక్షించుకోవాలి. మొన్ననా మధ్య మన హైదరాబాదులో ఒక సభ జరిగిందిట, అదేనయ్యా, జీవ వైవిధ్యం గురించి. దాని సారంశం ఎంతమందికి చేరిందంటావ్,దాని ఉద్దేశం ఏంటి?. అబ్బే! రెండురోజులు పేపర్లలో వచ్చిందండి, మరిచిపోయారండి. ఇప్పుడు ఇక్కడ జరిగినది ఎంత మందికి చేరింది? బహుశః ఒక ఇరవై ఊళ్ళకి చేరిందండి, మొలతాడు కట్టుకున్న బుడ్డోడి దగ్గరనుంచి అందరికీ. ఇప్పటికే చెట్టు కొట్టరండి, పల్లెలో. ఒక వేళ అడ్డొస్తే ఇల్లు కడితే దాన్ని ఇంట్లో ఉంచి కట్టేస్తారండి.” “నేను పాలకొలను లో ఉండగా అటువంటి ఇళ్ళు చూశానయ్యా! చెట్టుకొట్టడం ఇష్టం లేక అలా ఉంచుకుని ఇల్లు కట్టుకున్నారు. మరో సంగతివిను గీతాకారుడు చెప్పినదే, లోకంలో

యద్యాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే…భగద్గీత…అధ్యా..౩..శ్లో..21

మహనీయుడైన వ్యక్తి ఏ కార్యము చేయునో వానిని సామాన్యులు కూడ అనుసరింతురు. ఆదర్శ ప్రాయములయిన కార్యములచే అతడే ప్రమాణములను స్వీకరించునో ప్రపంచమంతయు వానిని అనుసరించును.

ఇప్పుడు చెప్పు, మన రాధ గారు రావి చెట్టు,వేప చెట్టులను లక్ష్మీ నారాయణులలా భావించి పెళ్ళి చేసి, చెట్టును పూజించమనే మాట ఆచరించి చూపేరు, శ్రేష్ఠులయినవారిని మిగతావారు అనుసరిస్తారు కదా, అదే జరుగుతుంది, మిగిలినవారూ చెట్టును రక్షించుకోవాలనేది గుర్తుంచుకుంటారు కదా. కోట్లు ఖర్చుపెట్టి నాలుగు గోడల మధ్య ఎన్ని సెమినార్లు పెట్టి ఏమి ఉపయోగం చెప్పు. ఇక వీరికి పుణ్యం వస్తుందని కదా, అదెలాగో చూదాం. పుణ్యం అంటే ఏంటిటా. పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం అన్నారు కదా. వీరు చేస్తున్నది పరోపకారమే కదా! అదెలాగంటావా, వీరు ఈ సందర్భంగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సమాజానికి చేరింది కదా! అదేంటి పరోపకారమేగా, మరొక సంగతి వీరు ఈ కార్యక్రమం చేయడం మూలంగా చెట్లు సంరక్షింపబడి వర్షం కురిసి పంట పండితే ఈయన తింటున్నాడా, అనుభవిస్తున్నాడా? సమాజం అనుభవిస్తూ ఉందికదా దాని ఫలితం, సమాజం ఆనంద పడుతుంది కదా. ఎదుటివారిని ఆనందంగా ఉంచడం పుణ్యమేగా, మరి అదీ పుణ్యమేగా! అంచేత చెట్టును పూజించడం తప్పుకాదు కదా” అన్నా. “పంతులుగారూ మీరు వేలికేస్తే కాలికేస్తారు, మొత్తానికి చెట్టును దేవుడని పూజించడం తప్పుకాదనిపించేరు నాచేత, వస్తా, పనుంది” అని వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చింది ఇల్లాలు టీ పట్టుకుని, “మా అన్నయ్యేడీ” అంటూ, “పని ఉందని పారిపోయాడు,” అన్నా. “మీరు తలంటేసి ఉంటారు పారిపోయాడు” అంది. “పాపం మీ అన్నయ్యకి పోలీస్ టీ చేసేవే ఈవేళ” అన్నా. “కష్టపడ్డారు గా మీరు తాగండి” అని ఇచ్చి వెళిపోయింది లోపలికి.

ఇంత మంచి కార్యం, సమాజ హితం కోసం చేసిన శ్రీ తేతలి రాధాకృష్ణారెడ్డి, శ్రీమతి రమాదేవిలను వేదోక్తంగా ఆశీర్వదించుదాం, గొంతు కలపండి.

“ఇన్ద్ర శ్శ్రేష్ఠాని ద్రవిణానిధేహి చిత్తిందక్షస్య సుభగత్వ మస్మే/పోషంరయీణా మరిష్టింతనూనాం స్వాత్మానం వాచస్సుదినత్వమహ్నామ్//ఇన్ద్ర శ్త్రేష్ఠాని శ్రేష్ఠాని ద్రవిణాని ద్రవిణాని ధేహిచిత్తమ్ చిత్తిందక్షస్య దక్షస్య సుభగత్వం/సుభగవత్వమస్మే/సుభగత్వమితి సుభగత్వమ్/అస్మే ఇత్యసే/ పోషం రయీణామ్/ రయీణామరిష్టిమ్/అరిష్టింతనూనామ్/ తనూనామ్ స్వాత్మానమ్/ స్వాత్మానమ్ వాచః/ వాచ సుదినత్వమ్/ సుదినత్వమహ్నామ్/ సుదినత్వమిది సుదినత్వమ్/ ఆహ్నమిత్యహ్నామ్// తతోను దేతాం ద్వంద్వమిన్ధ్రేణ దేవ తాశ్శస్యసే/ ద్వంద్వంవైమిధునం తస్మాద్వంద్వాన్మిధునం ప్రజాయతే/ ప్రజాత్యైప్రజాయతే/ ప్రజాయాప శుభిర్యఏవంవేద//

సహస్రాక్షేణ శతశారదేన శతాయుషాహర్.షమేనమ్/ శతం య ధేమ౧శరదోన యతీన్ద్రో విశ్వస్య దురితస్యపారమ్/ శతంజీవ శరదో వర్ధమాన శ్శతం హేమన్తాం ఛ్ఛతమువసన్తాన్/ శతమిన్ద్రాగ్నీ సవితా బృహస్పతి శ్శతాయుషా హవుషేమం పునర్దుః/ అహామ్ షన్త్వా విదాన్త్వా పునారాగాః పుర్నవ/ సర్వాజ్ఞ సర్వన్తే చక్షు స్సర్వమాయశ్చతేమిదమ్// శతంజీవం శరదో వర్ధమానా ఇత్యపినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనా వర్ధయన్తి శతమేనమేన శతాత్మానం భవతి శతమనంతం భవ తి శతమైశ్వరయం భవతి శతమితి శతం దీర్ఘమాయుః//
శతమానూచ్య మాయుష్కామస్య శతా యుర్వైపురుష శ్శతవీర్యశ్శ తేన్ద్రియ ఆయుషేవైనం తద్వీర్య ఇన్ద్రియే దధాతి.”

రంగవల్లి

రంగవల్లి

ఈ కార్యక్రమం మీద అన్ని ఫోటో ల కొరకు ఈ లింక్ లో చూడండి.

లోకాస్సమస్తాః  సుఖినో భవంతు
స్వస్తి

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి వివరణ

 1. పనివత్తిడి వల్ల టపాను ఆలస్యంగా ( అంటే కొద్దిసేపటి క్రితమే ) చదివానండి.

  నిజమేనండి. మీరన్నట్లు , ప్రకృతితో బతకమని మనవారు చాలా ఆచారాలు పెట్టేరు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   నిజమే. చాలా ఆచారాలు మీదాకా కూడా రాలేదు. ఆధునికులమయ్యాం కదా. చెట్టు, పుట్ట, పాము, దేవుడేంటి, మీరంతా అనాగరికులు అంటే,అవును మాప్రభో, మేము అనాగరికులం అంటున్నాం. ఇప్పుడు వారు చెట్టును రక్షించుకోండీ ఆంటే అవునంటున్నాం.మనదైనది మనం మరిచిపోయాం. వందలమంది చదివారు, ఒకరూ స్పందించలేదు, మీరిద్దరు తప్పించి.
   ధన్యవాదాలు.

 2. ఎక్కదికి పారిపోతున్నామో తెలియని రోజుల్లో మేము చేస్తున్న పరుగులో ప్రకృతిని ఎలా అగౌరవ పరుస్థున్నామో తెలిపారు.

  • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   ప్రకృతితో బతకమని మనవారు చాలా ఆచారాలు పెట్టేరు, వాటిని మూఢాచారాలని వారన్నారు, మనం అవునని బుర్రూపుతున్నాం. స్పందించినందుకు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s