శర్మ కాలక్షేపంకబుర్లు-జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేల?

జగమెరిగిన బ్రాహ్మణుడికి జందెమేల?

జగమెరిగిన బ్రాహ్మణుడికి జందెమేల? అని నానుడి.

దీని అర్ధం మామూలుగా ఐతే ప్రపంచాన్ని తెలుసుకున్న బ్రాహ్మణుడికి జదెం అక్కరలేదనికాని, ప్రపంచం అందరూ ఎరిగున్న బ్రాహ్మణుడికి జందెం అక్కరలేదని చెప్పుకోవచ్చు, కాని అది సరికాదు, కాదు సరిపోదు కూడా. జగమెరిగి ఉండటానికి జందేనికి లంకె ఏమిటీ? అదే ఇది

దీని అసలు అర్ధం ఏమంటే, జాయతే గఛ్ఛతే ఇతి జగం అన్నారు పెద్దలు, అంటే జాయతే అనగా వచ్చేది, గఛ్ఛతే అనగా వెళ్ళేది జగం. వచ్చేదేమి వెళ్ళేదేమి? మరొక ప్రశ్న కదా!

కాలంలో, ఈ ప్రపంచం లోకి ప్రతీది వస్తూ ఉంటుంది, కాలంతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది,అనగా నశిస్తూ ఉంటుంది, ఏదీ స్థిరం కాదు, ఉనికి సాపేక్షం మాత్రమే. ఒక జీవి ఒక రోజులో కొన్ని గంటలు జీవిస్తే మరొకరు కొన్ని వందల సంవత్సరాలు జీవించడం, తాబేలు లాగ ఉండచ్చు, కాని నశింపు తప్పదు.మనం అచలాలనుకున్నవి కూడా పుట్టినవే, అందుచేత నశింపుతప్పదు. అంతెందుకు,” జాతస్య మరణం ధృవం,” పుట్టిన వారు నశింపక తప్పదు. ఇదీ గీతాకారుడు చెప్పిన మాటే. అందుకే దీన్ని జగం అన్నారు, అదే ప్రపంచం. ఈ రాక పోకలంతా మిధ్య, జగమంతా మిధ్య అని తెలిసిన బ్రాహ్మణుడికి, అనగా పరబ్రహ్మ, పరమాత్మ గురించి తెలిసినవానికి, తెలుసుకోగలిగినవాడు,

న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజే త్ర్పాప్య చాప్రియమ్
స్థిర బుద్ధి రసంమూఢో బ్రహ్మవి ద్ర్బహమణి స్థితః……భగవద్గీత… అధ్యా..5..శ్లో..20

అనగా ప్రియమైన దానిని పొందినపుడు సంతోషించక, అప్రియమును పొందినపుడు దుఃఖింపకుండు వానిని, స్థిర బుద్ధిగలవానిని,మోహితుడు కాని వానిని దివ్య జ్ఞానము కలవానిని, దివ్యత్వమందున్న వానిగా తెలుసుకొనవలెను.

ఇటువంటి వానికి, అనగా పరబ్రహ్మ గురించి తెలిసిన, తెలుసుకున్న వానికి, బాహ్య చిహ్నములతో పనిలేదని, లౌకిక భావము. ఇదీ జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమెందుకన్న దాని వివరణ.

బోరు కొట్టిందా?

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేల?

 1. చక్కగా ఉందండీ శర్మ గారూ, మీ వివరణ. ఆ మాటకొస్తే బ్రహ్మణ్యం ఆచరించే వారు బ్రాహ్మణులు అన బడ తారు , కానీ కులం చేత కాదనీ , జంద్యం తో మంచి నడవడికనూ , మంచి అలవాట్లనూ ” ముడి ”పెట్టనవసరం లేదని కూడా అనుకోవచ్చు కదా !

  • @సుధాకర్ గారు,
   బ్రాహ్మణత్వం అనేది కులంతో వచ్చేదికాదు. నడవడితో, ఆచరణతో, తపస్సుతో దానిని సాధించుకోవాలి, ఈ సంగతి నేను చాలా సార్లు ఇదివరలో చెప్పివున్నాను, నా బ్లాగులో. సత్వగుణ ప్రధానంగా బతికేవారే బ్రాహ్మణులు.
   ధన్యవాదాలు.

  • @జిలేబి గారు,
   అమ్మో! జిలేబిగారు టపా రాయనంటే ఎలా? గుమ్మం దగ్గర ధర్నా చెయ్యనూ!!! 🙂
   ధన్యవాదాలు

 2. I guess you missed the actual pun in that proverb. When people are walking in street, public identify If a person is a Brahmin or not by checking if that person has jandhyam or not. This usually helps a poor Brahmin to advertise and tell all who he is so that he get some work for marriage etc religious acts to earn thier livelihood. Now if a Brahmin is wellknown & famous, he does not need any jandhyam to identify himself as a Brahmin. When you generalize this concept, whoever excelled in thier profession/work they don’t need any introductions as their work speak for itself but not the person’s roots pedigree etc.

  • @చాతకం గారు,
   నాకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం పూజ్యం. కూడబలుక్కుని చదివేను. నాకర్ధమయిన కొలది.

   ఆ నానుడిలో శ్లేష లేదనే నా అభిప్రాయం. అది ముందే మనవి చేసేను.
   బ్రాహ్మణులొక్కరే జందెం వేసుకోరు, గాయత్రి ఉపాసించేవారంతా వేసుకుంటారు. ఉదాహరణకి క్షత్రియులు, వైశ్యులు, విశ్వ బ్రాహ్మణులు, అగ్నికులక్షత్రియులు , తెలుకుల వారు కూడా గాయత్రిని ఉపాసించుతారు, జందెం వేసుకుంటారు. మీకు గుర్తుచేసేను. మరికొందరూ ఉండచ్చు, నేను మరచి ఉండచ్చు.

   జందెం వేసుకున్న బ్రాహ్మణులంతా వివాహాలూ జరిపించలేరు.

   వృత్తి నైపుణ్యం అన్నది కాదని, సంగతి వేరని ముందే చెప్పేను. మీరలా అనుకుంటే మీ దృష్టికోణం నేనెందుకు కాదనాలి. నా దృష్టి లోపమేమో.
   ధన్యవాదాలు

   • @చాతకం గారు,
    మీరు స్పందించినందుకు సంతసం. ఆంగ్లం మూలంగా ఇబ్బందిపడ్డానంతే! మీరు అలా అని ఉండకపోతే విషయం చెప్పి ఉండేవాదిని కాదేమో కదా.
    ధన్యవాదాలు.

  • “people are walking”, “public indentify “, “who he is so that ”
   హ హ ఇంకోసారి మీరు ఇంగ్లీషులో రాస్తే నామీద ఒట్టు, అంతే.

  • @ ఎందుకో ‽ ఏమో ?! గారు,
   ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపేవారింకా ఉన్నారు.
   ధన్యవాదాలు

 3. పూజించడం దగ్గర నుంచీ తిట్టే స్థాయికి వచ్చారు, స్వయం కృతాపరాధం అని గమనించని వాళ్ళను మార్చడానికే మనం చాలా మార్లు సమయం వెచ్చిస్తుంటాము :(.

  • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   ఎవరిని మాత్రం మనం ఎందుకనాలండి, ఎవరి కర్మ వారనుభవించక తప్పదుకదా.
   ధన్యవాదాలు

 4. `పుట్టిన వారు నశింపక తప్పదు,` అని ఈ టపాలో మీరు రాసిన దానికీ, `చావులేదు – అయితే ఏంటట?` అనే నాటపాకీ భావసారూప్యత ఉంది. గమనించారా? మీ పోస్ట్ చాలా బాగుంది.

  • @వర్మగారు,
   మీ టపా చూశాను, బాగుంది.అనుకోకుండా ఒక రోజు ఒక విషయం మీద రెండు కోణాలలో చర్చ జరిగింది.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s