న్యాయదేవత కళ్ళకి గంతలెందుకు కడతారు?
కిందటి నెల చివరలో పెళ్ళికెళ్ళొచ్చిన బడలికతో బద్ధకంగా ఉయ్యాలలో కూచున్నా, కునికిపాట్లు పడుతూ. ఇల్లాలొచ్చింది, బుల్లి మనవరాలిని తీసుకుని. “మనవరాలు ఒక ప్రశ్న వేసింది, సమాధానం చెప్పడం నా వల్ల కాలేదు, మీరు చెబుతారని తీసుకువచ్చా” అంది. “బుల్లి తల్లీ! ఏంటిరా అనుమానం” అంటే, మనవరాలు, ఏడేళ్ళ పిల్ల వేసిన ప్రశ్న ఇది. “న్యాయస్థానంలో, న్యాయదేవత కళ్ళకి నల్ల గుడ్డెందుకు కడతారూ? చేతిలో తక్కెడెందుకూ?” అంది. ఒక నిమిషం నిర్ఘాంతపోయా! చిన్న పిల్లకి రావలసిన అనుమానమా అని. “ఎక్కడ చూశావన్నా?” టి.వి లో చూశాను అంది. నిజమే మనం మొద్దుబారిపోడం మూలంగా కొన్ని అనుమానాలు రావు, రోజూ చూస్తున్నా. పిల్లలికి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ కనక ఇటువంటి ప్రశ్నలే ఎదురవుతాయి.
కొద్దిగా సద్దుకుని, మనవరాలిని ఒడిలో కూచోబెట్టుకుని, “అమ్మలూ! న్యాయదేవత కళ్ళు విప్పి చూస్తే, న్యాయం చేయలేనేమోనని, పక్షపాతం చూపుతానేమోనని అనుకుంటుందిట. అందుకు కళ్ళకి నల్ల గుడ్డ కడతారు, తక్కెడ లో తూచినట్లుగా న్యాయం చెప్పాలని చేతిలో తక్కెడ” అన్నా. “మరియితే చెవులు కూడా మూసుకుపోతున్నాయి కదా అలా కట్టడం మూలంగా, అంటే న్యాయ దేవత గుడ్డిది, చెవిటిదీ కూడానా, అలా అయితే న్యాయం ఎలా చెప్పగలదు, చూడలేనిది తక్కెడ ఎటుమొగ్గినదీ చెప్పగలదా?” అంది. దీనికి సమాధానం నా దగ్గర లేకపోయింది. “తాతా! న్యాయం, దేవత అంటున్నావు కదా! దేవత పక్షపాతం చూపుతుందా? అలా పక్షపాతం చూపితే ఆమె దేవతెలా అవుతుంది?” అని ప్రశ్నించింది. దీనికీ నా దగ్గర సమాధానం లేదు. “నాకూ తెలియదమ్మా” అని చెప్పేను. “సరేలే తెలుసుకుంటా” అని వెళిపోయింది. మీకేమైనా తెలిస్తే చెప్పరూ…
(ఇది నిజంగా జరిగిన సంఘటన, కల్పితం కాదు)
జిలేబీ గారితో ఏకీభవిస్తున్నాను.ప్రశ్నించడం పిల్లలకు నేర్పాలి.మన దగ్గర సరైన సమాధానం లేక పోతే లేదనే చెప్పాలి.మన ముందు తరం వారిలా ప్రశ్నించకూడదనడం తప్పు.ఏదైనా తెలిసి ఆచరించడం తెలియకుండా ఆచరించడం కంటె మేలు కదా. పాఠం భట్టీయం వేయడం కంటె అర్థం చేసుకోవడం మంచిది కదా.
@మిత్రులు గోపాలకృష్ణగారు,
తెలియదు కనక అదే చెప్పేను. మనకు విషయం తెలియక పిల్లలను విసుక్కుంటే వారిలో ప్రశ్నించే శక్తి సన్నగిలిపోతుంది. ఒక్కొకపుడు ప్రశ్నలు ఇబ్బంది కూడా పెడుతున్నాయి. ఓపిక అవసరం.
* బాగుందండి. మీ మనవరాలు చక్కగా అడిగింది.
* అయితే, మన ప్రాచీనకాలపు న్యాయదేవత బొమ్మ కళ్ళకు గంతలు ఉన్నాయో లేవో నాకు తెలియదు.
* Images of Justice (The Goddess) * ఈ లింక్ లో చూస్తే వివిధ ప్రాంతాలలో కళ్ళకు గంతలు లేని న్యాయదేవతల విగ్రహాలు , ఇంకా మరి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చండి.
…………………………………..
* కళ్ళకు గంతలు ఉన్న న్యాయదేవత బొమ్మ గురించి మీరు చెప్పిన సమాధానం బాగుందండి.
* ఇంకా, మనం ఇలా కూడా అనుకోవచ్చనిపిస్తోంది. ఆమె దేవత కాబట్టి , గంతలు కట్టుకున్నా అన్నీ చక్కగా గ్రహించగలదు.
* ఆమె దేవత కాబట్టి , కళ్ళకు గంతలు కట్టుకున్నా తక్కెడ ద్వారా తీర్పును చక్కగా ప్రకటించగలదు.
* ఎదుటివారు దేవత ఇచ్చే తీర్పును తక్కెడ ద్వారా తెలుసుకోవచ్చు.
……………………….
* కళ్ళకు గంతలు ఉన్న న్యాయదేవత బొమ్మ ఉన్న విధానాన్ని బట్టి మనం imkaa ఏం తెలుసుకోవచ్చంటే,
1..బాధితులు, నేరస్తులు తనకు బంధువులా ? కాదా ? డబ్బున్నవాళ్ళా ? పేదవాళ్ళా ? వంటి తేడాలను చూడకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయవాదులు న్యాయాన్ని బట్టి మాత్రమే నిష్పక్షపాతంగా తీర్పును ఇవ్వాలి. అని తెలుసుకోవచ్చు.
2. కళ్ళతో చూసింది ఒకోసారి నిజం కాకపోవచ్చు, చూసిన దాని వెనుక ఉన్న కారణాలను కూడా విశ్లేషించి , బాగా ఆలోచించి చక్కటి తీర్పును ఇవ్వాలి. అని తెలుసుకోవచ్చు.
@అనూరాధ గారు,
మీ సమాధానాలు అధ్యయనం చేయాలి.
ధన్యవాదాలు.
‘మోహన్ తాతా , శివా జేజ చాలా బాడ్ కదా?’
‘లేదమ్మా,అలా అనకూడదు.’
‘మరి చిన్న అబ్బాయి తల తీసి
ఏనుగు తల పెడితే ఎలా?’
భోళా శంకరుణ్ణి ఎలా తప్పించాలో
నాకు జవాబు తోచలేదు.
@మోహన్జీ,
ఈ మధ్య పిల్లలనుంచి ఈ రకమైన ప్రశ్నలు చాలా వస్తున్నాయి. కొన్నిటికి సమాధానం చెప్పలేకపోతున్నాం.
శివుడు చేసిన కార్యానికి కారణం, తన వారిని కలవడానికి అడ్డు తగిలిన తొలగించారు, ఎంత అమ్మ ఆఙ్ఞ అయినా తనవారిని కలవ నివ్వని శిరస్సును చేధించి తనతో నిత్యం ఉండాలి అనే భక్తుడి కోరికను మన్నించారు కూడా ఏనుగు తల అలంకరించి.
న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టినది న్యాయం నిలబెట్టడానికి ఆమె మీ కళ్ళతో చూస్తుంది అని చెప్పడానికి. ఇక తక్కెడ ఎందుకు పెట్టరంటే నువ్వు ఎంత మోసం చేసినా ఎప్పటికీ న్యాయం నిలుస్తుంది అని చెప్పడానికి.
@ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
ధన్యవాదాలు. చెప్పిన దానిని అధ్యయనం చెయ్యాలండి.
శర్మ గారు,
This gives us a confidence to us that the next generation is far better than ourselves and India will move into better hands! Amen!
cheers
zilebi.
@జిలేబిగారు,
మీరు us అనే పదాన్ని రెండు సార్లు నొక్కి వక్కాణించిన తరవాత కూడా కాదనుకోగలనా:) అస్తు.