శర్మ కాలక్షేపంకబుర్లు- సుఖమా! ఎక్కడ నీ చిరునామా?

Courtesy youtube

 సుఖమా! ఎక్కడ నీ చిరునామా?

ఆయుర్వర్ష శతం నృణాం పరిమితం,రాత్రౌ తదర్ధం గతం,
తస్యార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వవృద్దత్వయోః
శేషం వ్యాధివియోగదుఃఖసహితం సేవాదిభిర్నీయతే,
జివే వారితరఙ్గచఞ్చలతరే సౌఖ్యం కుతం ప్రాణినామ్…..భర్తృహరి

ఆయువు నూరువత్సరము,లందు సగంబుగతించె నిద్రచే,
నాయఱలో సగంబు గతమయ్యెన్ బాల్యజరాప్రసక్తిచే
బాయక తక్కినట్టిసగ బాలు గతించు బ్రయాసవృత్తిచే,
నాయువు చంచలం,బుడుగు బ్రాణులకెట్లు సుఖంబు చేకురున్…..ఏనుగు లక్ష్మణ కవి.

మనిషి జీవితకాలం వంద సంవత్సరాలు, అందులో సగం నిద్రలో జరిగిపోతుంది, మిగిలిన సగంలో సగం బాల్యం,ములితనంలో జరిగిపోతుంది. ఇంకా మిగిలిన పాతికేళ్ళలో వ్యాధి, వియోగాలు,దుఃఖం, పొట్టకూటికి సంపాదనతోనే సరిపోతుంది, ప్రాణమా నీటి అల వంటిది, మరి ఇక సుఖమెక్కడ? అని కవి హృదయం.

పరిశీలిస్తే కవి మరీ నిరాశాపరుడా? కాదు నిజం చెప్పేడు, అది ఒప్పుకోడానికి మన మనసు ఒప్పుకోదు 🙂 అసలు మినహా,అనగా నిద్రలో ఏబదేళ్ళు+బాల్య వృద్ధావస్థలలో పాతికేళ్ళు మొత్తం డెభై ఏళ్ళు పోగా మిగిలిన పాతికేళ్ళలో, పాతికేళ్ళ పగళ్ళేసుమా!, అంటే మూడు వందల నెలలు, సుమారుగా తొమ్మిదివేల రోజులలో, అనగా 1,08,000 గంటలలో,  72,000 కడుపు నింపుకోడానికి, చదువు, వృత్తిలకు పోతే, మిగిలిన 36,000 గంటలలో పునరుజ్జీవనానికి 9,000 గంటలు పోతే, మిగిలిన 27,000 గంటలలో దుఃఖం, విరహం, వ్యాధులకు 18,000 గంటలు పోతే పోతే,మిగిలిన దానిలో 9,000 గంటలు ప్రయాణాలలో పోతే, సుఖం అనుభవించడానికి సమయమేదీ? ఒక వేళ సుఖం అనుభవిద్దామన్నా, దొరికినదానితో సంతృప్తి లేదు, యోగమున్నది దొరుకుతుందన్న గుర్తులేదు, ఏదో కావాలని కోరిక,తపన,తృష్ణ, అది దొరకదు, ఒకవేళ దొరికితే, దానితో కొద్దికాలం గడిపిన తరవాత వెక్కసమై, మరొకదానికోసం మనసు ఆరాటం, మళ్ళీ కొత్తదానికోసం పోరాటం, మళ్ళీ అవే పరుగులు, ఎండమావిలో నీటి వేట. మనల్ని కావాలనుకున్న వారితో, మనతో మాటాడటానికి ఉత్సాహం చూపేవారితో మాటాడం, ఎవరో మన ముఖం చూడని వారికోసం ఆరాటం. మనల్ని కావాలనుకున్న వారి దగ్గర సుఖపడతామన్న విచక్షణ వదిలేస్తాం, లేని దాని గురించి ఏడుస్తాం. ఇదంతా మనసు చేసే చిత్రంకదా! అసలు సుఖమంటే ఏమిటి? ఏది సుఖం? త్యాగరాజు అన్నారు నిధి చాల సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా? తెల్పవే ఓ మనసా అన్నారు. కాని అది మనం ఒప్పుకోటంలేదు. పంచ భూతాత్మకమైన ఈ శరీరం తో అనుభవించే,శ్రవణ, స్పర్శ,నేత్ర,జిహ్వ,ఘ్రాణ ఇంద్రియాలతో అనుభవించేవి సుఖాలనుకుంటున్నాం, అసలు అవన్నీ సుఖాలేనా? అసలు అనుభూతి ఎవరిది? మనసుది కదా? మరీమనసెక్కడ కనపడింది? ఏదీ కనపడదే అలా కనపడకుండా మనల్ని ఆడిస్తున్న మనసు ఎవరు? మన మీద అధికారం చెలాయించమని ఎవరిచ్చారీ అధికారం ఆ మనసుకి. అసలు మనసే మనమా? కాదే, మనమెవరూ? సమాధానం లేని ప్రశ్నా? కాదు. నేతి, నేతి (న+ఇతి= నేతి) నేను, ఇదికాదు ఇదికాదు అని ఎలిమినషన్ ప్రోసెస్ లో అనుకుంటూ నేను ఇదికాదు, చివరికి మనసు కూడా నేను కాదు కదా? మరి అసలైన నేనెవరూ? అదే ఆత్మ. అదే నీవైన పరమాత్మ. పరమాత్మ ఎక్కడో లేడు,

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థితః,
అనన్తమవ్యయం కవిగ్ం సముద్ద్రేన్ఽ తం విశ్వశమ్భువమ్,

పద్మకోశ ప్రతీకాశగ్ం, హృదయంఛాప్యధో ముఖమ్,
అధోనిష్ట్యా వితస్యాన్తే నాభ్యాముపరితిష్ఠతి………..

సన్తాపయతిస్వం దేహమాపదతలమస్తగః
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వావ్యవస్థితః.

నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా
నీవార సూకవత్తన్వీ పీతాభా స్వస్త్యణూపమా,

తస్యా శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః.

ఇంత స్పష్టంగా పరమాత్మ మనలో ఎక్కడున్నాడో చెబితే ఇంకా అనుమానమా?
వస్తున్నా….అదేంటో చెప్పి వెళ్ళమంటారా? ఏంచేయను మనవరాలు అరగంట నుంచి ఆడుకోడానికి పిలుస్తూంది, 24 నుంచి 27 దాకా  శలవులండి బాబూ! వెళ్ళకపోతే అలుగుతుంది, ఏడుస్తుంది, అది భరించలేను మరి……..అదే వాసనంటే! దాని గురించి మరోసారి. 🙂

                    నేటినుంచి కనులవిందు మొదలు, చూస్తూనే ఉండండి.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- సుఖమా! ఎక్కడ నీ చిరునామా?

  • @కల్యాణి గారు,
   బాగున్నారా? చాలా కాలం తరవాత. అమ్మ రాయించేసింది అలా,ఆ శ్లోకం చదివినపుడు రాయాలని పించింది. అది అమ్మ వైభవం, నాది కాదని మనవి.
   ధన్యవాదాలు.

   • Sarma garu, nenu bagunnanu. mee aarogyam kshemam ani thalusthanu. meeru nannu ammayi ani pilavandi chalu. mee post lu roju chaduvuthune vunnanu kanee spandinche samayam vundatledhu. meeru raase prathi vishayam chaduvuthunte naaku jeevitham lo kotha paatham nerchukunnattu anipisthundhi. aa devudu meeku eppatiki ila raaya galige shakthi ivvalani manaspoorthiga korukuntu… Mee manavaralu – Kalyani

   • @అమ్మాయ్ కల్యాణి,
    ఒక్కొకపుడు పేర్లు గుర్తురావు. ఒకరిని పలకరించబోయి మరొకరిని పిలిచేస్తానేమో నని, 🙂 బాగోదు కదా అదన మాట. మరొక మనవరాలు, నా కుటుంబంలో, చాలా సంతోషం.అభిమానం ఉన్నపుడు వ్యక్తం చెయ్యాలి లేకపోతే అవతలి వారికి ఎలా తెలుస్తుంది? దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘాయుష్మాన్భవ

 1. దీక్షితులు గారు,

  దీనిని విశదీకరిస్తారూ కాస్త మరింత విస్తారం గా మాలాంటి వారి కోసం?

  “పద్మకోశ ప్రతీకాశగ్ం, హృదయంఛాప్యధో ముఖమ్,
  అధోనిష్ట్యా వితస్యాన్తే నాభ్యాముపరితిష్ఠతి………..”

  జిలేబి.

  • @జిలేబి గారు,
   అర్ధం స్థూలంగానే చెబుతున్నా సుమా.
   బయటా లోపలా, అంతటా వ్యాపించి ఉన్న నారాయణుడు, అనంతుడు అవ్యయుడు. అటువంటివాడు మానవ శరీరంలో హృదయానికి కింద బొడ్డుకి పైన సూక్షమైన అణుమాత్రంగా పద్మంలాటి చోట ఉన్నాడు, విద్యుత్ శిఖలా ఉన్నాడు, నివ్వరి ముల్లంత ( నివ్వరి ధాన్యం గింజ చిన్నది దాని అగ్రంలో గింజ పై ఉండే ముల్లు బాగా సన్నగా చిన్నగా ఉంటుందిట)అదిగో అక్కడ పరమాత్మ ఉన్నాడని నారాయణ కవచం చెబుతోంది.వేదం పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పింది. దీనినే మనం మంత్ర పుష్పం అంటాం. పొరపాట్లుంటే సరి చేయగలరు
   ధన్యవాదాలు.

 2. నిద్ర, తిండి, శృంగారం, పని, ప్రయాణం.. వీటిలో ఏ సుఖమూ పొందకుండా, అన్నింటికీ లెక్కగట్టి సమయం తీసేసిన తరువాత – “నాకింక సుఖపడటానికి మిగిలిన సమయమెక్కడ?” అని వాపోయేవాడు, ఏమి చేస్తూ సుఖపడదామని?

  • @వర్మ గారు,
   కవి ఉత్ప్రేక్ష చేసేడు. ఈ పంచేంద్రియాలతో పొందేది సుఖం కాదు శాశ్వతమైన సుఖం అంటే భగవంతుని తలచడం, సారూప్యం, సాలోక్యం,సాన్నిధ్యం, చివరిది సాయుజ్య ముక్తి అదికావాలని కోరిక.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s