శర్మ కాలక్షేపంకబుర్లు-వివేకానంద విగ్రహావిష్కరణ.

శ్రీరామకృష్ణ సేవాసమితి, అనపర్తి    24.01.2013

భారత గణతంత్రోత్సవ శుభకామనలు

శ్రీరామకృష్ణ సేవాసమితి, అనపర్తి

కార్యవర్గం
అద్యక్షులు               సర్వశ్రీ  తేతలి సుందరరామా రెడ్డి
ఉపాద్యక్షులు                        P.Y.N.V  సతీష్ (లండన్.)
ఉపాద్యక్షులు                       సత్తి వెంకట రెడ్డి (బుల్లితమ్ము)
ప్రాఅన కార్యదర్శి                  నల్లమిల్లి సుబ్బా రెడ్డి.
కార్యదర్శి                            మల్లిడి శ్రీనివాస రెడ్డి
కోశాధికారి                            దాట్ల సత్యప్రభాకర తిరుపతి వర్మ (ప్రతాప్)
మరియు సభ్యులు

రామకృష్ణ సేవా సమితి అనపర్తి వారి పై కార్యవర్గం మా మూడు రోడ్ల కూడలిలో వివేకానందుని విగ్రహం ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని శ్రీ జయ ప్రకాష్ నారాయణ్ చే ఆవిష్కరింపచేసేరు. ఆ సందర్భంగా జరిగిన విశేషాలు. 

మంగళ వాద్యాలతో జె.పి మరియు రామకృషణ మిషన్ స్వామిజీలను విగ్రహం దగ్గరకు తోడ్కొని రావటం.

విగ్రహావిష్కరణ సభలో ఆసక్తిగా పాల్గొన్న గ్రామీణ మహిళ, ఆసక్తిగా స్వామి గురించి తెలుసుకోవడం ఆనందం కలిగించింది.

జె.పి చే విగ్రహావిష్కరణ

కీ.శే. శ్రీ పినిశెట్టి రామమోహనరావు,శ్రిమతి సరోజిని దంపతుల జ్ఞాపకార్ధం కుమారుడు P.Y.N.V సతీష్ C.E.O,  ADVAITA CONSULTING LIMITED (LONDON)  కాంస్య  విగ్రహదాత

పక్కనే ఉన్న జి.బి.ఆర్ కళాశాలలోని సభలో ప్రసంగిస్తున్న జె.పి.

డబ్బు చాలా మంది దగ్గరుంటుంది. దానికి సద్వినియోగం జరిగినపుడు, పది మందికి అనగా సమాజానికి ఉపయోగపడినపుడే దాని సార్ధకత.అదే ఇక్కడా జరిగింది. ఒకరు విగ్రహం చేయిస్తే మరొకరు శ్రీ సుబ్బారెడ్డి గారు నాలుగు లక్షలు విరాళమిస్తే, చాలా మంది వారికి తోచినది వారిస్తే ఒక మంచి పని జరిగింది, దానికి కొనసాగింపు కూడా ఉంది. ఈ రామకృష్ణ సేవాసమితి రామకృష్ణ మిషన్ వారితో అనుబంధింపబడటం, యువత ఆసక్తి చూపడం, ముదావహం

సభకు హాజరయిన అశేష జనసందోహం లో ఒక భాగం.

మా ఇంటినుంచి బయటకు వచ్చి రెండడుగులు వేస్తే స్వామి విగ్రహం కనపడుతుంది. జానెడు చోటు కనపడితే, ఒక విగ్రహాన్ని నిలబెడుతున్న నేటి రోజులలో, ఒక పల్లెలో మంచి కూడలిలో వివేకానందుని విగ్రహాని నెలకొల్పడం ఎంతయినా శ్లాఘనీయం. ఇప్పుడు విద్యార్ధులలో కూడా ఎక్కువ మందికి మన జాతిని నడిపించిన మహనీయుల జీవితాలు తెలియటంలేదు, చరిత్ర మొదలేలేదు. చరిత్ర వక్రించబడింది, అది కూడా నేడు వద్దంటున్నారు, మనదైన సంస్కృతి తెలియదు, తెలుసుకునే సావకాశం జన బాహుళ్యానికి లేకపోతున్న నేటి అరోజులలో ఒక పల్లెలో అందునా ఒక కళాశాలకు దగ్గరలో వివేకానందుని విగ్రహం ప్రతిష్టింపబడటం, మావూరికే గర్వ కారణం గా తలుస్తున్నాను. మావూరి పౌరులందరినీ అభినందిస్తున్నాను. విగ్రహ ప్రతిష్ఠ చేసి ఊరుకోకుండా పక్కనే ఒక చిన్న పార్క్ తయారు చేస్తున్నట్లు తెలిసి చాలా అనందించాను.మార్పు మాతోనే మొదలయిందేమో అనుకుంటున్నా.

ఆవిష్కరణానంతరం ఠీవిగా నిలిచిన స్వామి విగ్రహం.

కనులవిందు,నిత్యం ఒక పూబాలకోసం చూస్తూనే ఉండండీ.!

స్వామికి నేటి నా పుష్పార్చన.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వివేకానంద విగ్రహావిష్కరణ.

  • @వనజ గారు,
   వస్తాం, వస్తాం అని ఆశ పెడుతున్నారు. మేమేమో దూర ప్రయాణాలు చెయ్యలేము,రండి, రండి, రండి దయచేయండి, తమరిరాక మాకెంతో సంతోషం…… ఎదురు చూస్తూ ఉంటాం, రాముని రాకకు వేచిన శబరిలా.
   ధన్యవాదాలు.

   • అయ్యో..ఎంత మాట మాస్టారూ.. ! మీ మాటల్లో హృదయంలో ఉన్న గొప్పదనం కి నేను తగనేమో!
    ఇప్పుడే మీ సమాధానం చూసాను.

    తప్పకుండా ..మిమ్మల్ని చూడటానికి మీ నుండి నాలుగు విలువైన విషయాలు వినిపోవడానికి తప్పకుండా వస్తాను. ఈ నెలలో ..అడ్రెస్స్ తెలియక రాలేక పోయాను. .మరీ మరీ ధన్యవాదములు మాస్టారూ!

 1. దీక్షితులు గారు,

  ఇక అనపర్తి లో మీ ఇల్లు కనుక్కోవడం చాలా సులభమని చెప్పండి. రిక్షా ఎక్కి, ‘స్వామి’ వారి పద సన్నిధి కి వెళ్ళ వోయ్, అంటే, శర్మ గారి గృహ సన్నిధి కి వెళ్లి నట్లే నన్న మాట!

  రేపే అనపర్తి విజిట్!

  చీర్స్
  జిలేబి.

  • @జిలేబి గారు,
   రండి, రండి, రండి, దయచేయండి. తమరిరాక మాకెంతో సంతోషం సుమండి! ఈరోజే అన్నారు, ఎదురు చూస్తున్నాం, ఇల్లాలు నేనూ. మీ రాకతో మా గృహము పావనమే కదా!, మా మానసము ఆనంద కందళిత సందోహంబున మునకలేయదా!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s