విశ్రాంతి గృహం
ఒక్కో సంఘటన మన జీవిత గమనాన్ని మారుస్తుందన్నది నిజమే. ఇది పాలకొల్లు లో ఉండగా జరిగిన సంఘటన. ఆఫీసులో విశ్రాంతి గృహం ఉండేది, పెద్ద ఆఫీసర్లు కాని, ఇక్కడకు పని ఉండి వచ్చిన ఇతర ఆఫీసర్లు కాని అందులో బస చేసేవారు. దీని నిర్వహణ బాధ్యతలు నాపై ఉండేవి. ఒక మజ్దూర్ ని ఈ విషయం మీద కేటాయించేవాడిని. దుప్పట్లు చాకలికి వేయడం దగ్గరనుంచి, మార్చడం దగ్గర నుంచి, వసతి గృహానికి కావలసిన అన్ని ఏర్పాట్లూ చూసుకోవలసి వచ్చేది,అతను. చాకలికేసిన దుప్పట్ల వివరం నాచేత రాయించేవాడు. అన్ని దుప్పట్లు తలగడ గలేబులు వచ్చేయోలేదో చూసేవాడు. పని పట్ల అతని శ్రద్ధ చూస్తే, నాకు ముచ్చటగా ఉండేది. అందుకే అనుకుంటా, విశ్రాంతి గృహ నిర్వహణ పై అంత శ్రద్ధ చూపలేకపోయాననే చెప్పాలి. చాకలి పద్దు, ఎప్పుడూ ఇంట్లో రాసి ఎరగను, కాని ఆఫీసులో రాయించేవాడతను, నా చేత. ఆ శ్రద్ధ నేనతిని నుంచి నేర్చుకున్నాననే చెప్పాచెప్పాలి. అతను చిరిగిన దుప్పట్లు రికార్డ్ చేయించి టేబుల్ వగైరా తుడుచుకునే గుడ్డలుగా చేసి వాడేవాడు. అదేమంటే “ఇంట్లో అయితే ఏంచేస్తాం సార్!” అన్నాడొకసారి. విశ్రాంతి గృహ బాధ్యతలుకొరకు కేటాయించినతని పేరు ప్రభుదాసు, ఏ మాత్రం ఫిర్యాదులు లేకుండా చూసుకుంటూ రావడం కూడా ఒక కారణం కావచ్చునేమో. డబ్బులు పట్టుకెళ్ళి కావలసిన వస్తువులు కొని తెచ్చి, బిల్లిచ్చి, నాకు చూపి విశ్రాంతి గృహంలో ఉంచి, జాగ్రత్తగా నిర్వహించేవాడు, ఒకప్పుడు దాని నిర్వహణ గురించిన విషయాలు అతని నుంచి నేర్చుకున్నా కూడా, అంతకు ముందు అటువంటి నిర్వహణ చేయనందున.
మామూలుగా వచ్చేవారయితే సమస్య లేదు. వచ్చిన వారు,మా సెక్షన్ వారయినా, మా సెక్షన్ కి సంబంధించినవారు కాక పోయినా వారు రాగానే ఒక సారి వెళ్ళి పలకరించి రావడం అలవాటు చేసుకున్నా. దీనివల్ల కొన్ని కష్టాలున్నా, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. వచ్చిన ఆఫీసర్ ఇప్పుడు సంబంధం లేని వారయినా, మరొకపుడు ఆయన అధికారిగా వచ్చే సావకాశాకాలు ఉన్నందున, పరిచయాలు ఉపయోగపడేవి. వారికేదేనా అసౌకర్యం ఉంటే చెప్పేవారు, దానిని సరిచేయిస్తే సంతోషించేవారు, కొంత మంది ఆఫీసర్లయితే వెళ్ళిపోయేటపుడు నా ఛాంబర్ కి వచ్చి చెప్పి వెళ్ళేవారు. అంతలా వ్యక్తుల మధ్య పరిచయాలు పెరిగేవి, మానవ సంబంధాలూ బాగుండేవి. కొంతమంది ముందు ఫోన్ చేసి చెప్పేవారు, ఖాళీ లేదంటే కోపాలొచ్చిన సందర్భాలున్నాయి.కొంత మంది నామీద ఫిర్యాదు కూడా చేసేరు. ఆ రోజు ఖాళీ లేకపోతే ఎలా మీకు ఇవ్వగలడని మా ఆఫీసర్ నన్ను సమర్ధించిన సందర్భాలుండేవి. కొంతమంది ఏ అర్ధ రాత్రో వచ్చేవారు, అర్ధరాత్రి వెళ్ళేవారు, దీనితో కొంత చికాకుండేది. విశ్రాంతి గృహం లో బస చేసినందుకు కొద్ది రుసుము కూడా చెల్లించాలి, ఎక్కువమంది రుసుము చెల్లించకుండా వెళ్ళిపోయేవారు.నెలకఒక సారి లెక్క చూసి ఈ డబ్బులు కట్టాలి, అదొక తలనొప్పిగా ఉండేది. కట్టవలసినది మొత్తం పాతిక రూపాయలయినా దానికో పెద్ద తతంగం, చెతి డబ్బులు కట్టుకోడం ఒక బాధ, రుసుము అడగలేం, ఇటువంటి తలనొప్పులు మాత్రం ఉండేవి.
ఇలా జరుగుతుండగా ఒకరోజు మా పెద్దాఫీసర్ గారు వస్తున్నట్లు, రెండు రోజులు ఇక్కడ ఉండేటట్లూ వర్తమానం వచ్చింది, మూడు రోజులముందు. నా పై ఆఫీసర్ జాగ్రత్త వచ్చేవారు ప్రతి విషయం సునిసితంగా పరిశీలిస్తారు, జాగ్రత్తగా ఏర్పాట్లు చూసుకోమని హెచ్చరిక కూడా ఇచ్చారు. రాబోయే అధికారి ఇష్టా ఇష్టాలు, వివరాలు తెలియవు, తెలిసినదల్లా వారు శాకాహారి, అని మాత్రమే. ఇక్కడొక మాట చెప్పుకోవాలి, ఇలా వచ్చిన ఆఫీసర్లలో ఒక్కొకరు ఒక్కొక రకం, ఒకరు శాకాహారి, మరొకరు మాంసాహారి, కొతమందికి కొన్ని ఇష్టం కొంతమందికి కొన్ని అయిష్టం. ఈ వివరాలన్నీ మా ప్రభుదాసే చూసుకునే వాడు, అతనికి ఫలానా వారొస్తున్నారని చెబితే చాలు, ఏర్పాట్లు చేసేవాడు.కొంత మందికి కేరేజి తెప్పించాలి, కొంతమంది వద్దనేవారు, కొంత మంది ఏవిషయమూ చెప్పక, వచ్చిన తరవాత కేరేజి తెప్పించలేదా అని నిష్టురం వేసేవారు. వసతి గృహనిర్వహణ అంటే కత్తిమీద సాములా ఉండేది, పెద్దవారొచ్చినపుడు. పెద్దవారొస్తున్నారంటే ముందురోజే ఆ సూట్ చూసి ఏమేం చేయాలో చూసుకుని ఏ.సి బాగుందో లేదో చూసుకుని బాగోకపోతే బాగు చేయించి, లేకపోతే మరొక యూనిట్ తెచ్చి ఇక్కడ పెట్టి మొత్తం హైరాన పడితే సూట్ తయారయ్యేది.అదిగో అలా మొదలయింది నా హడవుడి, విశ్రాంతి గృహం సరిదిద్దటానికి.
ఇంకా ఉంది
సన్ లైట్ బాగుందండి.
@అమ్మాయ్! అనూరాధ,
మీరేమో గౌరవ వాచకం,గారు అని సంబోధించద్దంటున్నారు, నాకేమో స్త్రీలని పేరు పెట్టి పిలవడం ఎబ్బెట్టుగా ఉంటుంది అందుకు అమ్మాయ్ అనేస్తునా కోపగించుకోవద్దేం.
ఒక రోజు ఉదయమే అలా కనపడితే.
ధన్యవాదాలు.
అయ్యో ! నేనేమీ కోపగించుకోనండి.
నాకు కూడా బ్లాగ్స్ లో ఎవరిని ఏ విధంగా సంబోధించాలో తెలియక చాలా తికమకగా ఉంటుంdi. వాళ్ళ వయస్సు సరిగ్గా తెలియదు. పెద్దవారిని ఎలా సంబోధించాలో ? చిన్న వాళ్ళను ఎలా సంబోధించాలో ? ఇలా చాలా కన్ ఫ్యూజన్ గా ఉంటుంది.
ఇక నా విషయానికి వస్తే, నా పుట్టిన సంవత్సరం 1966
@అమ్మాయ్ అనూరాధ,
ఇక్కడ మనుషులు కనపడరు, మనసులే కనపడతాయి కనక గౌరవం ఇచ్చి పుచ్చేసుకుంటే చాలు కదా! వయసులతో పని ఉండదు.
ధన్యవాదాలు