శర్మ కాలక్షేపంకబుర్లు-రాజమంద్రి సోమాలమ్మ.

రాజమంద్రి సోమాలమ్మ.

నాకూ రాజమంద్రికి జన్మ జన్మల ఆత్మ సంబంధం ఉందనుకుంటా. ఎంత కాదనుకున్నా రాజమంద్రి వెళ్ళక తప్పటంలేదు. కిందటి నెలలో ఆఖరున రాజమంద్రిలో మా వాళ్ళు మీటింగ్ పెడితే వెళ్ళేను. అదెక్కడా అంటే శ్యామలా నగర్ లో అన్నారు. రాజమంద్రి చాలా మారిపోయింది కదండి అదెక్కడా అంటే సోమాలమ్మ గుడి దగ్గరా అన్నారు. బాఉందే! అనుకుని వెళితే అది కాస్తా అమ్మ గుడి దగరే అయ్యింది. ఇంత దూరం వచ్చాం, అమ్మ దర్శనం ఉదయమే చేసుకోకపోడమేమీ అని లోపలి కెళ్ళి దర్శనం చేసుకుని గుడిని పరిశీలిస్తే అది పాతకాలపు గుడేనని అనిపించింది. ఇది కూడా గ్రామ దేవత గుడే.

అయితే గ్రామ దేవతగా ఒకరే తప్పించి ఇద్దరు ఉండరు. ఈ మధ్య ఇద్దరు, ముగ్గురునీ కూడా పెడుతున్నారు, ఒకే గ్రామంలో. ఈ ఆలయం ఎప్పటిదని చూస్తే ఇది రాజరాజనరేంద్రుని కాలంది లాగా అనిపించింది. ఇది కోటలోపలి గ్రామదేవత గుడి, ఇప్పుడు రాజమంద్రి రెయిల్వే స్టేషన్ దగ్గరున్న కన్నమ్మ దేవాలయం పొలిమేర దేవత అనుకుంటా. ఈ గుడి కోటలోది అని చెప్పడానికి అధారాలేమిటి అని చూస్తే, రాజమంద్రి నైసర్గిక స్వరూపం చూడాలి. ఎక్కడనుంచి మొదలు పెడదాం. అమ్మ గోదారి దగ్గరనుంచే, ఇప్పుడు పుష్కర రేవు పక్కనున్న హైస్కూలు రత్నాంగి మేడ అంటారు. ఇది ఒక కొండ అంచున ఉంది జాగ్రత్తగా గమనిస్తే. దానికి ముందుగా పాత బ్రిడ్జ్ ఉందికదా అదే గోదావరి స్టేషన్ లోకి వెళుతుంది కదా అలా రయిలు కట్ట కొండను దారి చేసుకుని వెళుతుంది, అదే పాతకాలపు కందకం, ఇప్పటికీ అక్కడ రోడ్ ని కందకం రోడ్ అనే పిలుస్తారు. ఈ కందకం అలా ముందుకు రయిల్వే దారిన నడిచి ఇప్పుడు రోడ్ కం రెయిల్ బ్రిడ్జ్ కి వెళ్ళే రయిల్ దారిలో ఒక బ్రిడ్జ్ వస్తుంది అక్కడ, ప్రస్తుతం పోస్టాఫీసు పక్క నుంచి మరలా గోదావరిలో కలిసేదనమాట. ఇది ఒక కొండ అంచు. అందుకే పోస్టాఫీస్ పక్క రోడ్ లోపలికి దిగి మరలా పైకి ఎక్కుతుంది చూడండి, అది కందకపు చివర భాగం. ఇప్పుడు ఈ గుడి మిగిలిన రాజమంద్రి అంతా ఈ కందకపు లోపలి కొండ మీద ఉంది.కోట గుమ్మం అని పిలిచేచోటు చర్చ్ దగ్గరది, అక్కడినుంచి ముందుకు చూస్తే జాంపేట, చివరగా కోట అవతలి శివాలయం.రాజమంద్రి వీధులన్నీ ఇరుకే, ఈ వీధి చాలా విశాలం, రాజవీధి కనుక. చర్చ్ దగ్గరే కోట గుమ్మం. పుష్కరాల రేవునుంచి ఉత్తరంగా వెళితే కోర్ట్ కాంప్లెక్స్ వెనక్కి వెళితే అదొక కొండ అంచు అక్కడే ఉన్న భవనాన్ని చిత్రాంగి మేడ అంటారు.అలా ముందుకెళితే క్లబ్ పక్కనుంచి కిందికి వాలు ఉంటుంది ఫైర్ స్టేషన్ దాకా ఇది కొండ అంచు. ఇలా చూస్తే ట్రయినింగు కాలేజ్ నుంచి దేవి చౌక్ దగ్గరకి వచ్చే వీధి కొండ అంచే. ఒక్క సారి పరిశీలనగా చూడండి. ఇప్పుడు చిన్నాంజనేయ స్వామి ఆలయం గోదారి గట్టున్న ఉన్నదే. పెద్ద మసీదు ఒకప్పటి పెద్దాంజనేయ స్వామి ఆలయమే. ఇలా చూస్తూ పోతే ఎన్నో వింతలు కనపడతాయి. కాని రోజూ చూస్తుంటాం కనక చారిత్రిక ప్రాధాన్యం కనపడదు. రత్నాంగి, చిత్రాంగి రాజరాజనరేంద్రుని భార్యలు.  రాజమంద్రి భౌగోళిక స్వరూపం తెలియనివారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది,మన్నించ ప్రార్ధన.

శ్యామలాదేవి అయిన సోమాలమ్మ గుడిలో ఎదురుగా కనపడే ఈ పద్యం పోతన భాగవతంలో ప్రధమస్కందంలో 8 వది. ఈ పద్యం విజయవాడ దుర్గ గుడిలో కూడా ప్రముఖంగా కనపడుతుంది. ఈ పద్యంలో అమ్మ బీజాక్షరాలు నిక్షిప్తమయి ఉన్నాయట.

ఇక గుడి ప్రాంగణంలోని కపిలగోవు, గోవు, గోవత్సాలు.ఇక్కడొక బోర్డ్ పెట్టేరు ఆవులకి అరటి పళ్ళు పెట్టవద్దు గడ్డి పెట్టండి అని, అంటే మనవారు చేస్తున్న పనేమిటో తెలిసింది.

 

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రాజమంద్రి సోమాలమ్మ.

  • @అమ్మాయ్ అనూరాధ,
   దయగల తల్లి, మూల విరట్టుకి ఫోటో తీసుకుంటానంటే అడ్డు చెప్పలేదు, అందుకే ఫోటో పెట్టగలిగాను.
   ధన్యవాదాలు

 1. తాతగారు, మనవరాలుని తీసుకు వెళ్ళకుండా అందరు దేవతల దర్శనంలో మునిగి తెలుతున్నట్టున్నారు!

  • @అబ్బాయ్ ప్రసాదు,
   మనవరాళ్ళలో ఎవరికి ఖాళీ లేదయ్యా! నాతో మాటాడటానికి కూడా. దగ్గరున్న చిన్న మనవరాలు పుస్తకాల బస్తా పట్టుకుని బడికి పోతుంది.
   మీటింగ్ కెళ్ళేను కదా అందుకు ఒక్కణ్ణే వెళ్ళా.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s