శర్మ కాలక్షేపంకబుర్లు-ఆ ఒఖ్ఖటీ తెలిస్తే ఎంత బావుణ్ణు!

marriage

Courtesy google

ఆ ఒఖ్ఖటీ తెలిస్తే ఎంత బావుణ్ణు!

విష్ణు మూర్తిగారి ఆఫీసునుంచి ఫైల్ బయలుదేరింది. అది శివయ్యగారి ఆఫీసుకు చేరింది. ఆయన పైల్ లో అన్నీ ఒక సారి చూసి, కిందనున్న యమయ్య గారి ఆఫీసుకి పంపేడు. ఆయన తన సహాయకుడు గుప్తా గారికి పంపితే, ఆ ఒఖ్ఖటీ తన రహస్య పుస్తకంలో రాసేసుకుని, ఫైల్ బ్రహ్మాజీ గారి ఆఫీస్ కి పంపేసేడు. బ్రహ్మాజీ గారు ఆ ఫైల్ చూసి విష్ణుమూర్తిగారి  కొడుకు కంతుడు గారికి నోట్ పంపి తన ఫేక్టరీలో ఉన్న మగ, ఆడ బొమ్మలు రెండిటికి ముడేసేసేడు, ముడేసిన తరవాత కంతుడు గారు పువ్వుల బాణాలు వేసేడు వీరిద్దరిమీదా. ఇద్దరూ గాయపడ్డారు.

ఈలోగా బ్రహ్మజీగారు ఓ చిన్న బొమ్మ తయారు చేసి, దాని ముక్కులో ఓ సారి ఊది, ఆడ సహాయకురాలికి పంపించేసేడు, మగ సహాయకుడి ద్వారా, కంతుడు గారి దెబ్బ తిన్న వారికి, ఆడుకోడానికి.  అదుగోనండి అలా చిన్న బొమ్మకి డి.ఒ.బి తయారయ్యింది. సర్టిఫికటూ తయారు చేసేరు బ్రహ్మాజీ గారు.  బ్రహ్మాజీ గారు నిర్ణయించిన డి.ఒ.బి ని బ్రహ్మగారి ఆడ, మగ సహాయకులు లెక్క చేయక ముందుకో వెనక్కో దాన్ని జరిపేస్తున్నారు. కాని డి.ఒ.డి మాత్రం రహస్యంగా యమయ్యగారి ఆఫీసులో గుప్తా గారి సేఫ్ కస్టడీ లో ఉండిపోతూ వచ్చింది.

mother

Courtesy google

ఈ చిన్నబొమ్మ పెరిగి పెద్దదయితే, బ్రహ్మగారు మరో బొమ్మతో ముడేసేడు. ఈ బొమ్మలు రెండూ నాలుగు రాళ్ళు వెనకేసుకుని, అబ్బో! ప్రపంచంలో సర్వమూ ఈ రాళ్ళే అని, ఆ రాళ్ళ చుట్టూ తిరుగుతూ, ఇదే సర్వస్వం అనుకుని తిరుగుతున్నాయి. బ్రహ్మ గారి ఆజ్ఞ తో, కంతుడి గారి మాయతో, మరిన్ని బొమ్మలని తయారు చేసాయి. అలా పెరుగుతున్న బొమ్మలలో కొందరు కొడుకులని, కూతుళ్ళని,కొందరు కోడళ్ళని, కొందరు అల్లుళ్ళని, మనవలని, మనవరాళ్ళని, మునిమనవలని ఆబ్బో! మిత్రులని, స్నేహితులని, బంధువులని,  ఆత్మ బంధువులని, ఎన్ని రకాలో, ఎంతో గొప్పగానో చెప్పుకుని తిరుగుతుంటాయి. ఇలా తయారయిన గుంపులో కొంత మంది మీద ఇష్టం పెంచుకుని, కొన్ని బొమ్మలతో వైరం పెంచుకుని, ఇష్టమయినవారు మాటాడలేదని ఏడ్చి,ఇష్టం లేనివారు మాటాడేరని ఎడ్చి, ఎదుటివారికి కలిగిందని తమకు లేదని ఏడ్చి,సుఖంకోసం వెంపర్లాడి, ఉన్న దానితో తృప్తి లేక, ఇలా కాలం జరుపుతున్న బొమ్మలకి వయసు పెరుగుతూ ఉంది, డి.ఒ.డి దగ్గరపడుతోంది, అది మాత్రం గుర్తించటం లేదు. వీటికి డి.ఓ.డి ఉందని తెలుసు కాని, ఎప్పుడో తెలియదు. ఇంకా చాలా కాలం ఉందిలే, అనుకుంటూ ఉంటాయి. ఈ బొమ్మలు తమలో ఉన్న నారాయణుని మరచి, ఎక్కడెక్కడో,బయట నారాయణుని కోసం, శాంతి కోసం వెదుకుతుంటాయి. అదెక్కడా కనపడదు. లోపలికి మాత్రం చూడవు, ఈ బొమ్మలు. అది చూసి నారాయణ మూర్తి నవ్వుకుంటూ ఉంటాడు. వీరు చేసే కృత్యాకృత్యాలను, నిత్యమూ మౌనంగా గమనిస్తూ ఉంటాడు. వారొక సారి చూస్తే చాలు తనతో తీసుకుపోదామనుకుంటాడు. ఆబ్బే ఈ బొమ్మలు చూస్తేనా! దీపం తనకింద చూడలేనట్లుంటుంది వీరి స్థితి.

old couple

Coutesy google

ఇలా డి.ఒ.డి తెలియనివ్వకపోవడం చాలా అన్యాయం, డి.ఒ.డి ని ప్రతివారికి ఆధార్ కార్డ్ లాగా,వెంఠనే, రైట్ టు ఇన్ఫర్ మేషన్ కింద ఇవ్వాలిసిందే అని గోల చేసినా,ఉద్యమం చేసినా, గుప్తా గారు లెక్క చేయటం లేదు,చలించటం లేదు. యమయ్య గారికి అపీల్ చేద్దామంటే భయం, వణుకు,దడ మరి. ఏం చేయాలో తోచటం లేదు. ఆ ఒఖ్ఖటీ తెలిస్తే ఎంతబావుణ్ణు.

తెలిస్తే ?………………

స్వస్తి

ప్రకటనలు

32 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆ ఒఖ్ఖటీ తెలిస్తే ఎంత బావుణ్ణు!

 1. D.O.D. తెలియకపోవడమే మంచిది.ఎప్పుడో అప్పుడు తప్పదని తెలుసుకుంటే చాలు.ఎవరో “కంతుడు ” అంటే ఎవరని అడిగారు.కంతుడు అంటే ‘మన్మథుడు ‘లేక కామదేవుడు అని అర్థం.(Cupid ).

  • @డాక్టర్ రమణరావు గారు,
   మీ వ్యాఖ్య స్పాం లోకి వెళిపోయింది. వెతికి పట్టుకున్నా, అందుకు ఆలస్యమయింది సమాధానమివ్వడం, మన్నించండి.నోటితో అందరూ చెబుతున్నారండి ఏదో ఒక రోజని కాని దానికి తగినట్లు ప్రవతించడం లేదు కదా! అలా ప్రవర్తించాలని నా ఊహ.
   ధన్యవాదాలు

  • @అమ్మాయి ధాత్రి,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   నిన్న ఉదయమే వచ్చాను, తిరిగి ఈ వేళ టపా చూడమ్మా! :). అభిమానానికి కృతజ్ఞతలు
   ధన్యవాదాలు

  • @మోహన్జీ,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   అది బ్లాంక్ టికట్ కాదు, దానిమీద తారీకు మనకి కనిపించదు, ఆయనకే తప్ప. ఆ రిజర్వేషన్ రోజు బలవంతాగానే తీసుకుపోతాడు, రానన్నా,మొరాయించినా.
   ధన్యవాదాలు

 2. ఆ ఒక్ఖటీ తెలియక పోతేనే మంచిది కదండీ శర్మ గారూ !
  జీవించి ఉన్నంత కాలం బ్రతికే ఉంటాం !
  ఆ ఒక్ఖటీ తెలిస్తే , బ్రతికున్నంత కాలం చస్తూ ఉంటాం !
  కానీ, తమకు అసలు మృత్యువే ఉండదనే మూర్ఖత్వం తో
  చాలా మంది, ఇతరులను అనేక విధాలు గా హింసిస్తూ ఉంటారు,
  బ్రతికున్న వారికి మరణం చూపుతూ ఉంటారు !
  అదే పాపం ” మూట గట్టుకు, పోతూ ఉంటారు” కూడా !
  పాప పుణ్యాలు ఖాతరు చేయని వారికి, మూటలలో ఏమున్నా పరవాలేదు కదా !

  • @సుధాకర్ గారు,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   అదెలాగా తెలియదు, తెలిస్తే ఎలా ఉంటుందీ అని 🙂
   ధన్యవాదాలు

   • మీరు పూజ్యులూ, సర్వజ్ఞులు శర్మ గారూ , మన్నించ మని అడగకండి !
    మీ టపా బాగుంది. కానీ మీ ప్రశ్న అందరికీ యక్ష ప్రశ్నే కదా !

   • @సుధాకర్ గారు,
    సర్వజ్ఞుడు సర్వేశ్వరుడొక్కడే, అమ్మకి (లలిత) సర్వజ్ఞ అని ఒక పేరు.మన్నింపు అడగడం లౌకిక మర్యాద కదా!
    ధన్యవాదాలు.

  • @మిత్రులు వర్మ గారు,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   ఆ ఒఖ్ఖటీ కనుక్కుందామని బయలుదేరా!మీ అభిమానానికి కృతజ్ఞతలు
   ధన్యవాదాలు

  • @జిలేబి గారు,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   కులాసాయే, మీ అభిమానానికి కృతజ్ఞతలు
   ధన్యవాదాలు

  • @మిత్రులు వర్మ గారు,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   తెలిస్తే ఎలా ఉంటుందో కూడా చూద్దాం.
   ధన్యవాదాలు

 3. టపా వెరైటీగా వ్రాసారు.
  కంతుడు ఎవరో అర్థం కాలేదు.
  ఆ ఒక్కటీ తెలిస్తే క్లైమాక్స్ తెలిసిపోయిన సస్పెన్స్ కథలా జీవితం బోరు కొడుతుంది.
  అందుకని “ఆ ఒక్కటీ అడక్కు” అన్నారు ఇవివి గారు.

  • @మిత్రులు బోనగిరి గారు,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   కంతుడు అంటే మన్మధుడు.బోర్ కొట్టదండి! అదీ చూద్దాం.
   ధన్యవాదాలు

 4. భలే వారండీ శర్మ గారు,

  ఆ విషయం తెలియక పోవడం ఏమిటి ? అందరికీ తెలుసు. కాని మరిచి పోతాం. అంతే. కొంచం దీర్ఘం గా ఆలోచించి చూడండి. ఈ విషయం ఏ వయసులో తెలుస్తుంది ? ఏ వయసులో మరిచి పోతాం అన్నది అవగతమగును !

  జిలేబి.
  (అబ్బా, ఈ జిలేబీ రాతలు ఎప్పటికి విశదమగును?)

  • @@జిలేబి గారు,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   మా జిలేబి గారెప్పుడూ బెస్టే! ఎప్పుడు తలుస్తామో ఎప్పుడు మరుస్తామో అందరికీ తెలుసు.
   ధన్యవాదాలు

 5. భలే వెరైటీగా వ్రాసారండి.
  ఆ ఒఖ్ఖటీ తెలిస్తే ….. లోకం గందరగోళం అయిపోతుంది.
  కొన్ని విషయాల గురించి తెలియకుండా ఉండటమే మంచిది కదండి.

  • నాకు మళ్ళీ ఏమనిపించిందంటేనండి, ఆ ఒఖ్ఖటీ ముందే తెలిస్తే , కొంతకాలం వాయిదా వేయటానికి అవకాశం ఉంటుందేమో అనిపించిందండి. .( దైవప్రార్ధన ద్వారా..)

   • @అమ్మాయ్ అనూరాధ!
    మరణం కూడా భగవత్ ప్రసాదం కదా తల్లీ! దానినుంచి మరల లేము, కుదరదు కూడా. చిరంజీవులు ఏడుగురే!!

 6. మనం ‘బ్రతుకు’తున్నది మరణం వల్లనే శర్మగారూ! ఒకసారి అదెప్పుడో తెలిసిపోయాక, మనం ప్రత్యేకంగా ‘బ్రతకా’ల్సిన పనిలేదు, ఎలాగూ అప్పటిదాకా ‘బతికే’ వుంటాం గనుక! అందుగల్ల, అందుగురించిన అజ్ఞానానికే మనమెప్పుడూ కృతజ్ఞులమై వుండాలనుకుంటాను!

  ధన్యవాదాలు!

  • @మిత్రులు వెంకట్.బి.రావు గారు,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   కొంత అజ్ఞానం ఆనందదాయకమేకాని తెలిస్తే కూడా చుద్దాం, మరి ఏమంటారు?
   ధన్యవాదాలు

 7. ఆ ఒక్కటీ తెలియకే ఈ జీవితం ఇష్టమైనా,కష్టమైనా ఇలా సాగదీస్తున్నాము కదా తాత గారు.. మీకు మామయ్య దగ్గర నుంచి విషయం తెలిస్తే ఆ సమాచారం ఎలా పొందాలో మాకు కూడా చెప్పాలి మరి… 😛 😀
  ఇలాంటి అవిడియాలు మీకు మాత్రమే వస్తాయి .. 🙂

  • @అమ్మాయి చిన్ని,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి.
   ఏడుస్తూ బతకద్దు, నవ్వుతూ సంతోషంగా బతికేద్దాం, తెలిస్తే ఎలావుంటుందో కూడా చూద్దాంగా
   ధన్యవాదాలు

  • @అమ్మాయి జ్యోతిర్మయి,
   అనివార్య కారణాలవల్ల ఆలస్యమయింది, మన్నించాలి,
   తెలిస్తే బాగుంటుంది, ఎలగో చెబ్తాగా 🙂
   ధన్యవాదాలు

  • @అబ్బాయి ప్రసాదు,
   అనివార్య కారణాలవల్ల ఆల్స్యమయింది, మన్నించాలి,
   నెట్ లో డవున్ లోడ్ చేసుకున్నాం. ఇంకా టపాలో రాలేదు.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s