శర్మ కాలక్షేపంకబుర్లు-అతి రుద్రం

 

 

 

అతి రుద్రం

కిందటిసారి భద్రాచలం లో జరిగినది అతిరాత్రం, ఇప్పుడు గోదావరీ తీరం మురమళ్ళలో వేంచేసి ఉన్న భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి సన్నిధిలో జరుగుతున్నది అతిరుద్రం. అతిరాత్రం గురించి ఇదివరలో చెప్పేరు. ఈ అతిరుద్రం ఏమిటీ? అని చూస్తే శ్రీ మార్తి వేంకట రామ శర్మ గారు తమ గ్రంధం యాజుష్మార్తగ్రన్థః అనే పుస్తకం లో ఈ అతిరుద్రం గురించి చెప్పేరిలా!

రుద్ర విధానములు-ఫలములు.

1.ఆవర్తనం:- (ఏకరుద్రం) ప్రతి దినం నమక,చమకాలతో అభిషేకార్చనలు చేయడం ఆవర్తనం అంటారు.-ఫలం గంగా స్నానఫలం మరియు ఏ రోజు పాపములారోజు నశించుట.

2.రౌద్రీ:- నమకం ఒక సారి చెపుతూ ఒక్కొక్క చమకానువాకం చెప్పి అలా పదకొండు సార్లు నమకంతో ఒక చమకం పూర్తి చేయడాన్ని రౌద్రీ (ఏదాశ రుద్రం) అంటారు. ఫలం అనేక జన్మలలో చేసిన పాపం ఆరు నెలల్లో నశించును.

3.లఘురుద్రం:- పైన పేర్కొన్న రౌద్రీ అనగా ఏకాదశ రుద్రాలు పదకొండు సార్లు జరిపితే అనగా 11×11= 121 నమకములు 11 చమకములతో అభీషేకము కానీ జపము కానీ జరిపిన దానిని లఘు రుద్రం లేక రుద్రైకాశినీ అంటారు. ఫలం:- సూర్యలోక ప్రాప్తి, తేజస్సు, విజయము.

4.మహా రుద్రం:- లఘు రుద్రాలు 11 సార్లు జరిపించిన మహారుద్రం అంటారు. 121×11= 1331 సార్లు నమకం 121 సార్లు చమకం ఇందు ఆవృతమగును. ఫలం దరిద్రుడు ధనవంతుడగును, మహా పాపములు పరిహారమగును.

5.అతి రుద్రం:- 14641 సార్లు నమకం 1331 సార్లు చమకం ఆవృత్తం చేసిన అతి రుద్రం అంటారు. అనగా 11 మహా రుద్రాలు చేయడమనమాట. 1331×11= 14,641. ఫలం నిష్కృతి లేని మహా పాప,అతిపాతక, ఉపపాతకములకు ఇదే శరణ్యం.

మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేస్తే పాప పరిహారం,వ్యాధి నివృత్తి, జీవితేఛ్ఛ కలుగుట,సంతాన ప్రాప్తి,ధన ప్రాప్తి, శాంతి, ధైర్య, స్తైర్య,సంతోషములు,ప్రజ్ఞ, జ్ఞాపక శక్తి, ఆరోగ్యము,ఆయుర్దాయము, ప్రియ భోజనము కలుగును. ఇది వ్యక్తులు ఆచరించిన కలుగు ఫలం. అదే సామూహికంగా జరిపితే పై ఫలాలన్నీ సమాజానికి కలుగుతాయి.

హంస మంత్రం

రుద్రాభిషేకాన్ని మహన్యాస రుద్రాభిషేకం అంటాం. న్యాసం చేయకుండా నమక చమకాలు చెప్పి ఉపయోగం లేదన్నారు, పెద్దలు.
తృతీయ న్యాసంలో, హంస మంత్రం చెబుతారు, అదేమంటే

హ కారః పురుషః ప్రోక్తః స ఇతి ప్రాకృతిర్మతా/
పుంప్రకృత్యాత్మకోహంసః తదాత్మక మిదంజగత్//
హంసం సదాశివం ధ్యాయే ద్బింబే లింగాది విగ్రహే/
దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః/
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం ఆవేన పూజయేత్//

హంస మంత్రం లోని హ కారము పురుష రూపము. సకారము ప్రకృతి అని చెప్పబడినది.ప్రకృతి పురుషాత్మకమైన మంత్రము హంస మంత్రము. అహం అనగా నేను( జీవుడు)అని అర్థము. సః అనగా అతడు ( పరమేశ్వరుడు). నేనే పరమేశ్వర స్వరూపుడను అని భావించుట. కావుననే ( శరీరము) దేవాలయముగానూ శరీరములోని చైతన్యము (జీవుడు) పరమేశ్వరునిగానూ భావించి, మనోబుద్ధి,చిత్తాహంకారములగు అంతఃకరణము నందుగల దుర్భావములు,విపరీత కోర్కెలు,ఈర్ష్యా, అసూయాది మాలిన్యములను తొలగించి, నేనే పరమాత్మను అనెడి భావముతో పూజించవలెను. యోగ శాస్త్రమందు ” హకారేణ బహిర్యాతి, సకారేణ విశేత్పునః” అని ఉన్నది. మానవుడు రోజుకు 21,600 పర్యాయములు శ్వాస తీసుకొనునని చెప్పబడినది. ఈ శ్వాస క్రియ మన ప్రయత్నములేకనే క్రమబద్ధముగా జరుగును. నిద్రించుచూ,సుషుప్తి అవస్థలో ఉండిననూ శ్వాస ప్రక్రియ జరుగుచునే ఉండును. శ్వాస పీల్చినపుడు హ కారముగా శబ్దము కలుగును. వదలినపుడు స కారముగా శబ్దము కలుగును. హంస మంత్రము భావనతోనే జ్ఞానమును తద్వారా మోక్షమును ఇచ్చును. ఎవరైతే ఎల్లపుడు సోహం,సోహం అనెడి ఏకమైన భావనతో ఉందురో వారే పరమాత్మ యగుదురు.

ఈ అతిరుద్రం లో అమ్మని (నారాయణి) కూడా పూజిస్తారు, అమ్మ అన్నగారయిన నారాయణుని కూడా పూజిస్తారు.

ఇంతటి గొప్ప అతిరుద్రం దగ్గరలోనే జిల్లాలో మురమళ్ళలో జరుగుతోంటే వెళ్ళలేకపోయా. మొదలయ్యే సరికి వెంకన్న బాబు దగ్గర ఉన్నాను.వచ్చాకా రెండు రోజులు అలుకు తీర్చుకు బయలుదేరుదామనుకుంటే అనివార్య అవాంతరం తో కుదరలేదు. 25 న పూర్ణాహుతి అయిపోయింది. ప్రాప్తం, యోగం లేవు, అంతే!

 

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అతి రుద్రం

 1. ఇంతటి గొప్ప అతిరుద్రం దగ్గరలోనే జిల్లాలో మురమళ్ళలో జరుగుతోంటే వెళ్ళలేకపోయా…వెంకన్న బాబు దగ్గర ఉన్నాను….ప్రాప్తం, యోగం లేవు, అంతే!

  దీక్షితులు గారు,

  బ్రహ్మ కడిగిన పాదము చెంత నుండి పోయారు కదా ఇక ‘అతి’ రుద్ర మేల !

  జిలేబి.

  • శివుడికి కేశవుడికి తేడా లేదు, అక్కడ ఉండిపోయినందుకు బాధా లేదు; కాని మరొకసారి శివుణ్ణి దర్శిస్తే బాగుండేదేమోనని ఒక చిన్న కోరిక; అంతే; ఆశ కదా 🙂
   ధన్యవాదాలు

  • నా టపా లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను వెళ్ళి ఉంటే మరికొన్ని ముఖ్యమైన ఫోటో లు తెచ్చి ఉండేవాడినేమో; అతిరుద్రం గురించి చెప్పగలిగేను కాని అక్కడ జరిగింది చెప్పగలిగితే బాగుండునన్నదే అసలు సంగతి.
   ధన్యవాదాలు

  • అతిరాత్రం, అతిరుద్రం రెండు మాటలూ పోలికలు దగ్గరగా ఉండటంతో కొద్దిగా గందరగోళం;అందుకే చెప్పేను. దగ్గరలో జరిగిందికదా అని; అసలు తెలుసుకుంటే పరమేశ్వరుడు నాలో నీలో లేడూ!

   ధన్యవాదాలు

 2. అతిరాత్రం ..అతిరుద్రం. గురించి చక్కగా వివరించారు.
  రధసప్తమి సమయంలో తిరుమల దర్శనం కూడా ఎంతో అదృష్టమండి.
  ఇంకోసారి మీ ఊరికి దగ్గరలో అతిరుద్రం నిర్వహిస్తే వెళ్ళిరావచ్చు.

  • దగ్గరలో జిల్లాలో జరిగింది; కనక వెళ్ళలేదే అని బాధ అనిపించింది. నిజం గా రథసప్తమి నాడు స్వామి దర్శనం ఆనందాన్నే ఇచ్చింది. మరో సారికోసం ఎదురుచూపే!

   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s