శర్మ కాలక్షేపంకబుర్లు-వివేక ముక్తిరథం

వివేక ముక్తిరథం

DSCN2846

మా ఇంటికి దగ్గరలో వివేకానందుని విగ్రహం నెలకొల్పిన విషయం ఒక సారి చెప్పేను, అదిగో ఆ శ్రీరామకృష్ణ సేవాసమితి వారి ఆధ్వర్యవంలో వివేక ముక్తి రథం నిర్వహించడానికి, మంచి సేవా కార్యక్రమం చేపట్టేరు. అమలాపురం శ్రీకామాక్షీ పీఠాధిపతులు కామేశమహర్షి దీనిని ప్రారంభించారు. శ్రీ సత్తి సత్తిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ ముక్తి రధం కానుకగా ఇచ్చారు.

DSCN2843

ముక్తి రథం ఏమిటీ అనచ్చు. ఇది ఒక ఓపెన్ బాడీ ఉన్న నాలుగు చక్రాల మోటారు బండి. చనిపోయినవారి పార్ధివ శరీరం శ్మశానానికి తీసుకెళ్ళేందుకు ఉపయోగించేది.

DSCN2859

శ్రీ కామేశ మహర్షి ఈ వాహనాన్ని ప్రారంభించారు.

DSCN2872

శ్రీ కామేశ మహర్షి

అమలాపురం శ్రీ కామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి. వీరిగురించి, వీరు చేసే నిస్వార్ధ సేవ గురించి చెప్పాలంటే ఒక టపా సరిపోదు. కొద్దిగా పరిచయమైనా చేయకపోడం నా తప్పే అవుతుంది. శ్రీ కామేశ మహర్షి అమలాపురంలో కామాక్షీ పీఠం అనే సేవా పీఠాన్ని స్థాపించి అనాధ పిల్లలను ప్రేమ మందిరం లో పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేసి వారికి పుట్టిన ఇల్లు లేదన్న భావన లేకుండా పెంచిన, పెచుతున్న మహా మనీషి. ఇప్పుడు ఇంతకన్న చెప్పలేను మరొక టపా ప్రయత్నం చేస్తా. http://www.kamarshium.org  

DSCN2862

బుల్లి తమ్ము అని ముద్దుగా పిలవబడే శ్రీ సత్తి వేంకటరెడ్డి ముక్తి రధ దాత

డబ్బు చాలా మంది దగ్గర చాలానే ఉంది,కాని దానిని సద్వినియోగం చేసిన వారే చరిత్రలో మహానుభావులుగా మిగిలిపోతారు. 

నేటి కధానాయకుడు, నా కధానాయకుడు అయిన శ్రీ సత్తి వేంకటరెడ్డి, తండ్రి పేరునశ్రీ సత్తి సత్తిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ , ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు నడుపుతున్నవ్యక్తి.  108 ప్రారంభించక ముందు, ఇతను ఇక్కడ మా ఊళ్ళో అత్యవసర సేవలకొరకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇతనిని అభినందిస్తూ ఫోన్ లో మాట్లాడుతూ, నేనొక సూచన చేశాను. ఎవరైనా వ్యక్తి చనిపోయినపుడు ఆ పార్ధివ శరీరాన్ని శ్మశానానికి తరలించడానికి చాలా మంది చాలా ఇబ్బందులు పడ్టం గమనించా.ఆ ఇబ్బందులు తొలగించడానికి ఒక ముక్తి రధం ఏర్పాటుచేస్తే బాగుంటుందేమో ఆలోచించమని,ఈ రకమైన ఒక వాహనం ఏర్పాటు చేయడం అవసరం గురించి చెప్పేను. ఓపికగా విన్నాడు. ఇదిగో ఈ రోజు దాన్ని సాకారం చేశాడు. నేను కలిసి అభినందించినపుడు, మీరు చెప్పినపుడు చేయలేకపోయా, ఆర్ధిక స్తోమత సరిపోక, నేటికి చేశాను, మీ మంచి సూచన అమలు చేయడానికి ఆలస్యమైనందుకు సిగ్గుపడుతున్నానన్నాడు. మీ సూచనకి ధన్యవాదాలు అన్నాడు. నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది, ఒక సూచనను ఇంతకాలం గుర్తులో ఉంచుకుని అమలు చేసినందుకు అతన్ని మనసారా అభినందించా. ఈ వాహనం రామకృష్ణా సేవాసమితి వారి ద్వారా శ్రీ కామేశ మహర్షి ప్రారంభించారు. కబుర్లు చెప్పడం, ఉపన్యాసాలివ్వడం, సలహాలు సూచలివ్వడం తేలిక. పని చేసి చూపడం కష్టం.  ఇంతకంటే బాగా చెప్పలని ఉంది కాని నా భావవేశం కన్నీటి పొరగా కళ్ళను కప్పేసింది, మనసు మూగపోయింది, మాట రావడం లేదు.      

DSCN2842

ముక్తి రధం

ఈ ముక్తి రధం శ్రీరామకృష్ణుల జన్మ దినాన ప్రారంభించబడటం ఆనందదాయకం.ఇతరులని కష్టాలలో ఆదుకోవాలనే తలపు మళ్ళీ మా పల్లెలలోనే ప్రారంభం కావడం మరీ ఆనందదాయకం.   మా పల్లెలలో కూడా నేడు సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే వదాన్యులు ఉన్నందుకు, వారు బయటికి వచ్చి సంఘనికి సేవ చేస్తున్నందుకు జేజేలు పలుకుదాం.మనం మళ్ళీ మూలాలు వెతుక్కుంటున్నాం. కాదంటారా?

ప్రకటనలు

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వివేక ముక్తిరథం

 1. డబ్బు చాలా మంది దగ్గర చాలానే ఉంది,కాని దానిని సద్వినియోగం చేసిన వారే చరిత్రలో మహానుభావులుగా మిగిలిపోతారు. ప్చ్… నిజం!!! . శ్రీ సత్తి వేంకటరెడ్డి గారికి నమ్మస్సులు. మంచి సలహా ఇచ్చిన మీకు కూడా అభినందనలు.

  • @జలతారు వెన్నెలగారు,
   ఆ రోజే చెప్పేను నా హీరో బులితమ్ము అనే వేంకట రెడ్డికి, ఇలా బ్లాగులో పెడుతున్నానూ అని, అతనికి ఎంత అర్థమయిందో తెలియలేదు. మరొక సారి కలిసి మీ అందరి అభినందనలూ అందచేసి వస్తా.
   ధన్యవాదాలు.

 2. మంచి సలహాను అందించేవాళ్ళు ఉంటే మరెన్నో మంచి పనులు జరుగుతాయనిపిస్తోంది.

  మంచి సలహాను సూచించిన వాళ్ళు, అమలుచేసిన వాళ్ళు అభినందనీయులు.

  • @అనూరాధ,
   సూచనలకేం ఎన్నో చేసేస్తో ఉంటాం. మంచివారే వాటిని గుర్తుంచుకుని ఆచరిస్తారు.
   ధన్యవాదాలు.

 3. శర్మ గారూ , మీ కధానాయకుడు సత్తి వెంకట రెడ్డి గారు అభినందనీయులు ! మీ విలువైన సలహాను గుర్తుంచుకోవడమే కాకుండా , ‘వెంటనే అది అమలు చేయ లేక పోయినందుకు సిగ్గు పడుతున్నా’ అని సవినయం గా మీకు తెలియ చేశాడు !’ తులసీ వనం లో గంజాయి మొక్క’ ను మార్చి గంజాయి వనం లో తులసి మొక్క అనవచ్చు నేమో సత్తి వెంకట రెడ్డి గారి లాంటి వారిని !

  • @సుధాకర్ జీ,
   మీరు చెప్పిన మాట నిజం. గంజాయివనం లో తులసి మొక్కే. దీని విత్తనాలతో గంజాయివనం తులసి వనంగా మారుతుందని ఆశ.
   ధన్యవాదాలు.

 4. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ నిజంగా నమ్ముతారో నమ్మరో కొందరు ఉల్లిపాయ నిషేధం.

   • మా బంధువుల గృహప్రవేశం రోజున ఆహారం మిగిలి పోయింది, ఇద్దాము అని వెళితే ఉల్లిపాయ లేనివి మాత్రమే స్వీకరిస్తాము అని అన్నారు, ఇంత నియమంగా కొన్ని కామొద్రేకాలు తెప్పించే వాటికి దూరంగా ఉన్నారు అని చెప్పడానికి వ్రాసానండి.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   శవాన్ని తీసుకువెళ్ళడానికి వాహకులు లేక కొన్ని కుటుంబాలు పడిన బాధ చూసి మంచి సమయమని అతనికి ఈ సూచన చేశా. అది అతను గుర్తుపెట్టుకుని నెరవేర్చాడు,గొప్పవాడు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s