శర్మ కాలక్షేపంకబుర్లు-తనకుమాలిన ధర్మం….

DSCN1608

తనకు మాలిన ధర్మం…….

తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం లేదన్నాడు చిన్నయ సూరి, తన మిత్ర లాభం లోనో మిత్ర భేదం లోనో గుర్తులేదు. అంటే ఏంటిటా?

ధర్మం చెయ్యాలి కాని అది తనను ముంచేసేలా ఉండరాదన్నారు, పెద్దలు. కొంతమంది ఇచ్చేటప్పుడు వెనక ముందులు ఆలోచించక ఇచ్చేస్తారు. నిజంగా వీరు గొప్పవారే! అందుకే చరిత్రలో కూడా మిగిలిపోతారు. రంతి దేవుడు, బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, వీరిలో అందునా ముఖ్యంగా చెప్పుకోవలసినవాడు ధధీచి. రంతిదేవుడు తనకున్నదంతా అతిధికి పెట్టేసి తను ఆకలితో పరమేశ్వరుని చేరుకుంటాడు, బలి చక్రవర్తి తనకున్నది అంతా, సర్వస్వం, గురువు వచ్చిన వాడు విష్ణువని చెప్పినా వినక, భవంతుని చెయ్యి కింద, దానం ఇచ్చేటపుడు నా చెయ్యి పైనుండటం గొప్పకదా! అని అంతా దానం చేసి మూడవ అడుగుకు చోటు లేకపోతే, తన తలను చూపిన మహాత్ముడు. తెలిసిచేసిన దానం. శిబి చక్రవర్తి పావురానికి ప్రాణదానం చేయడం కోసం తన తొడ మాంసం కోసి ఇచ్చిన మహానుభావుడు. ఇంతకు మించిన వాడు ధధీచి అనుకున్నాం కదా! ఎందుకు? దేవేంద్రునికి ఆయుధం కావలసివచ్చింది, ఏది మంచి ఆయుధం అంటే ధధీచి వెన్నెముకతో చేసిన ఆయుధం గొప్పది అన్నారు, వృత్రాసుర సంహారానికి. దేవతలు బయలుదేరి ధధీచి దగ్గరకు వెళ్ళి ఏమని అడిఆగేరు? అయ్యా! మా దేవేంద్రుని కి ఆయుధానికి గాను మీ వెన్నెముక కావాలీ అని. ఆయనేమన్నాడు, సరే తీసుకోండన్నాడు, అదేదో దొడ్డిలో ఉన్న చెట్టుకాయలాగ. ఆ దానం మూలంగా ఆయన తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అందుచేత ఏం చెప్పేరంటే, దానం చెయ్యి కాని నీతాహతుకు మించిన దానం చేయవద్దన్నారు. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం,” అంటే ధర్మం చేయాలంటే ముందు శరీరం కావాలోయ్! అని

DSCN1703

రెందవది మొదలు చెడ్డబేరం. దీన్ని చూస్తే, వ్యాపారం ఎప్పుడూ లాభం కోసమే చేయాలి. లాభం లేని వ్యాపారం జీతం లేని ఉద్యోగం చేయకూడదు. అయితే లాభం అనేది ధర్మబద్ధంగా ఉండాలి. మొదలు చెడ్డ బేరం అంటే, అసలు లాభం మాట దేవుడెరుగు, అసలు ఖరీదు కూడా రాకుండా అమ్మకం చేయకూడదట. అదే మొదలు చెడ్డ బేరం, మరి ఇదిప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే…

ఏవో కొన్ని ఈ పుస్తకాల్ని జమ చేసేను. కొన్ని చదివేను, చదువుతున్నాను. వీటిని నలుగురితో పంచుకోవాలని ఆశ పడి బ్లాగులోకి ఎక్కించా కష్టపడి, కరంట్ ససిగా లేకపోయినా, ఓపికగా. ఒక లింక్ పెట్టి ఒక పాతిక పుస్తకాలు ఉంచా. అది మొదలు నాకు బాధలు మొదలయ్యాయి. 🙂 అదేంటి గ్రంధాలయం లింకిస్తే మీకు బాధేంటి అనచ్చు. అది మొదలు నా బ్లాగు నాకు కాకుండా పోయింది. ఎంత సేపూ లోడ్ అవుతుంది కాని పేజి తెరుచుకోదు. టపా వేయడానికీ కష్టపడాల్సి వచ్చింది, మూడు రోజులు బాధ పడ్డా, ఎందుకిలా జరుగుతోందని ఆలోచించా. ఊహు! కారణం తెలియలేదు. చించగా చించగా అప్పుడు బోధ పడింది.లింక్ లు పీకెయ్యడానికే కష్టపడాల్సివచ్చింది, అంత సమయం పట్టింది, బ్లాగు స్వాధీనం లోకి తెచ్చుకోడానికి. . అబ్బో! అప్పుడు అనుభవం లొకి వచ్చింది,’ కన్నుపోయేటంత కాటుక పెట్టుకోకూడదని’ నానుడి, ఇది తనకు మాలిన….ఎవరో అన్నారు…’మరో బ్లాగు’….చాల్లెద్దురూ! ‘ఈ పులుసుతో ఇ ముద్ద దిగనిద్దురూ’ మరో నానుడి. ‘ మింగ మెతుకులేదు కాని మీసాలకి సంపెంగ నూనె’ అని మరో నానుడి. ….

DSCN1603

ప్రకటనలు

25 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తనకుమాలిన ధర్మం….

 1. “తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం ” అన్న సామెతకు అంతరార్ధం తెలుసు అందరికి మరియు నాకు తెలిసిన వారందరికీ. కాకపోతే ఒక 1.5 సం!! క్రితం నేను అందరిని ఈ సామెతకు అంతరార్ధం కాకుండా అసలు అర్ధం చెప్పమని అడిగాను.. నాకు ఎవ్వరు సమాధానం చెప్పలేదు సరి కదా తమకు తోచినట్టు చెప్పి ఉచిత సలహా ఒకటి ఇచ్చారు “details లోకి వెళ్ళద్దు disturb అవుతావు” అని. ప్చ్ ప్చ్.

  మీ దయవల్ల నాకు కలిగిన ఈ కుతూహలం వీడిపోయింది. మీకు మనఃపూర్వక ధన్యవాదములు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   ఈరోజు కాముని పున్నమి, మదనోత్సవం, యువత పండగ కదా! అందుకే అలా అలవోకగా సామెతలు, నానుడులు వచ్చేశాయి.
   నెనరుంచాలి.

 2. tatagaru, anukokunda rendu masamulu krindi mi blog loki vachanu, aroju nunchi prathi roju mi blog chaduvutunnanu.antaga alavatu padipoyanu ante office ki ragane mundu mi blog lo ami rasaro chudakunda na office pani modalupettanu.
  miru inka anno manchi vishayalu malanti vallaki teliyacheyali ani korukutunanu.

  • @సర్వారాయుడు గారు,
   మీరు రాసినదానిని బట్టి చూస్తే మీ మనసు, అభిమానం కొట్టొచ్చినట్లు కనపడు తున్నాయి, మాటలలో. ఇటువంటి అభిమానులను, బంధువులను కలిగివున్నందుకు ఆనందిస్తున్నాను, ఈ స్థితి కలగ చేసిన అమ్మకి నమస్కారం. మీ అభిమాన వర్షం లో తడిసి ముద్దయ్యాను.
   నెనరుంచాలి.

  • @జలతారు వెన్నెలగారు,
   సాధారణం గా చెయ్యను, మనసు కోతిలాటి కదండీ, అందుకు ప్రయోగాలు. 🙂
   నెనరుంచాలి.

 3. బాబాయ్ గారు, మీ బ్లాగ్ ఏమయిపోనందుకు సంతోషంగా ఉంది. పూల తోటలు చాలా బాగున్నాయి. గ్రంధాలయం లేకపోయినా పర్లేదు. మీ కబుర్లు మాత్రం తప్పకుండా కావాలి. మీకు హోళీ శుభాకాంక్షలు.

  • @జయగారు,
   నా బ్లాగుకేం కాదండీ! కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం!!కబుర్లంటారా, వాటికిలోటేం లేదండీ, అమ్మ దయ ఉన్న వరకూ 🙂
   నెనరుంచాలి.

  • @పద్మగారు,
   చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, పుస్తకం కొనుక్కొ, అడుక్కునయినా చదువుకో, వీటిని గుర్తుంచుకోవాలండి. చదవడానికి, విజ్ఞానం సంపాదించడానికి వయసుతో నిమిత్తం లేదండి. మానవుడెప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలి. సోది చెప్పేసేనా? 🙂
   నెనరుంచాలి.

 4. గెల్లి గారు,

  తాత గారి పుస్తకాలన్నీ వారి ‘తల’ లో నిక్షిప్తమై ఉన్నవి! మన ప్రశ్నల ని బట్టి అవి టపా రూపేణ సాక్షాత్ కరించి మనకు జ్ఞాన బోధనా టపా భాండాగారమై అలరాడు చున్నవి !

  కావున కామెంటు ‘ప్రశ్నల’ పూచెండు లతో వారి మీద బాణం ఎక్కు పెడితే, వారి ‘వాణి’ బ్లాగ్ టపా పూబోణి అయి మనకు ముచ్చట గొలుపును !!’

  చీర్స్
  జిలేబి.

 5. అవును తాతగారు ఎక్కడ పెట్టారు పుస్తకాలు??
  మొన్నిలాగే నేను కూడా ఎదో టెంప్లేట్ డవున్లోడ్ చేస్తే బ్లాగు స్లో అయిపోవడమే కాకుండా..అన్నీ Adds వచ్చేసాయి.మళ్ళీ పూర్వపు పెట్టడానికి కష్టపడాల్సి వచ్చింది..:)

  • @ధాత్రి,
   బ్లాగులోనే చివరి ఫోటో కింద లింకిచ్చా, పుస్తకాలు మరో చోట ఉంచా. లింక్ మీద నూక్కితే పుస్తకాల లిస్ట్ కనపడుతుంది. పుస్తకం పేరుమీద నొక్కితే పుస్తకం లోడ్ అవుతుంది.రేపు లింక్ టపా పైన ఇస్తా. ఒక్కరోజే సుమా! మళ్ళీ తీసేస్తా ముందే చెబుతున్నానమ్మాయ్. ఆ(
   నెనరుంచాలి.

   • @ధాత్రి,
    నిన్న సాయంత్రం లింక్ ఇచ్చి, ఈ రోజు టపా రాసిపెట్టేను. చూడు! అప్పటినుంచి నా తిప్పలు, మళ్ళీ బ్లాగు నా చేయిదాటిపోయింది. రెండు గంటలు తిప్పలు పడి మళ్ళీ స్వాధీనం చేసుకున్నా. లింక్ పెట్టలేను, నిరాశ కలగ చేసినందుకు చింతిస్తున్నాను. క్షంతవ్యుడను.
    నెనరుంచాలి.

 6. శర్మ గారూ,, అయ్యా నమస్కారమ్.. మీ కబుర్లు మా మామయ్య గారిని గుర్తు తెస్తున్నాయి .. ఆ సామెతలు మన జీవితాలకి , మన చుట్టూ తిరిగే జీవితాలకీ అద్దం పడతాయి.. ధన్యవాదాలతో

  • @రుక్మిణీ దేవిగారు,
   స్వాగతం, సుస్వాగతం నా బ్లాగుకు, ముసలాళ్ళంతా అంతేనంటారా? ఛాదస్తం పెరిగిపోయి 🙂 ఇహ నానుడులు సామెతలంటారా? అంతా అమ్మల చలవ. అమ్మల నోట ఆలవోకగా మాటకోసామెత చెప్పేవారు, అవన్నీ అస్తి గతమైపోయాయి మరి, వద్దనుకున్నా వచ్చేస్తోవుంటాయి.
   నెనరుంచాలి.

  • @ప్రసాదు,
   బ్లాగులోనే చివరి ఫోటో కింద లింకిచ్చా, పుస్తకాలు మరో చోట ఉంచా. లింక్ మీద నూక్కితే పుస్తకాల లిస్ట్ కనపడుతుంది. పుస్తకం పేరుమీద నొక్కితే పుస్తకం లోడ్ అవుతుంది.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s