శర్మ కాలక్షేపంకబుర్లు-, కల్తీ ,నకిలీ

DSCN2962

కొండని కోరేస్తున్నారిలా

 కల్తీ,నకిలీ

“కల్తీ” అనుకుంటూ ఉండగా మా సత్తిబాబొచ్చాడు, “ఏంటి పంతులుగారు కల్తీ అంటున్నార”న్నాడు. “మందులలో కల్తీ గురించి మిత్రుడొకరు మెయిలిచ్చార”న్నా. “మా అన్నయ్యోచ్చేడా కాఫీ తెస్తున్నా” అని లోపలినుంచి ఒక అరుపరిచింది ఇల్లాలు.

మా సత్తి బాబిలా అన్నాడు

.”కల్తీ, నకిలీ, మోసం, దగా ఈ మాటలు నిత్య జీవితం లో ఒక భాగమయిపోయాయంటే అనుమానం లేదు. మనిషి చూపులో కల్తీ, మాటలో నకిలీ,మానవ సంబంధాలలోకల్తీ,మాటలో దగా, మనసులో దగా, “నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడమని” నానుడి. బంధువుల,మిత్రుల మాటలలో నకిలీ, ‘ఏంటోయ్! కనపడీ మాటాడకుండా వెళిపోతున్నా’వంటే,  ‘అబ్బే! ఇప్పుడే మీదగ్గరకే బయలుదేరేను, ఊపిరి పీల్చుకోడానికి ఖాళీ లేదంటే నమ్మండి,’ మాట దగా. నవ్వులో…భార్యా భర్తల సంబంధంలో,  తల్లి,తండ్రి బిడ్డల మధ్య సంబంధాలలో ,ఆఖరికి తల్లి ప్రేమలో, తల్లి పాలలో కల్తీ”, “నువు మరీ చెబుతున్నావయ్యా” అంటే ” తల్లి పాలలో కల్తీ లేదండీ, అంటారా. ఆగండి, ఆగండి, తల్లి పాలల్లోనే కల్తీ, ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారపదార్ధాలమీద, పైర్లపై చల్లే పురుగుమందుల విషాల అవశేషాలుండిపోయి, అవి కాస్తా తల్లి పాలల్లో కూడా చేరిపోతున్నాయని, వారెవరు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా గోల పెడుతున్నారట. ప్రతి దానిలోనూ మోసమే.ప్రతి మాటలో, పనిలో దగా, మోసం, ప్రతి వస్తువుకూ నకిలీయే, ప్రతి ఆహారపదార్ధం దగ్గరనుంచి ప్రాణ రక్షణకి ఉపయోగపడే మందుల దాకా అన్నిటిలోను కల్తీ, నకిలీ మామూలయిపోయింది. ఏది అసలు ఏది నకిలీ తెలుసుకోవడానికి కూడా కష్టపడాల్సివస్తూ ఉంది.

నాడు పోతనగారు

’ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెదు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే’….అన్నాడు.

కాని నేడు ఆ పద్యాన్ని ఇలా చదువు కోవాల్సివస్తూంది

’ఇందుగలదందు లేదను సందేహమువలదు కల్తి సర్వోపగతం
బెం దెందు వెదకి చూచిన అందందే కలదు మానవాగ్రణి వింటే’” అన్నాడు.

నాకు ఈ పద్యం మా జిలేబీ గారే చెప్పినట్లనిపించింది.మా సత్తి బాబు కొనసాగించాడు

“పెట్రోల్, డీజిల్లో, కిరసనాయిలు కల్తీ, కంది పప్పులో కల్తీ,ఈ కల్తీ పప్పు తింటే కాళ్ళు పడిపోతాయిట. కాఫీలో చింతగింజలపొడి, టీలో రంపపు పొట్టు, కారంలో కల్తీ, పాలలో కల్తీ,నూనెలో జంతువుల కొవ్వునుంచి తీసిన నూనె కల్తీ, పంచదారలో ఉప్మా నూక కల్తీ, ఆఖరికి పళ్ళలో కల్తీ, నిలవుండటానికి ఫార్మాలిన్ రాస్తారట. ఈ ఫార్మాలిన్ శవాలు నిలవ ఉంచడానికి వాడే మందు. తొందరగా ముగ్గడానికి కార్బైడ్ అనే మందును పచ్చి కాయల మీద చల్లుతున్నారు, అరటి పళ్ళతో సహా. పాలు ఎక్కువగా ఇవ్వడానికి ఆవులు గేదెలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.వీటన్నిటినీ కేన్సర్ కారకాలని చెబుతున్నారు. “ఏంటయ్యా మరీ రెచ్చిపోతున్నావు, ప్రభుత్వం గుడ్డిదేంకాదంటే” “నిజమెనండి బాబూ! ప్రభుత్వం గుడ్డిది కాదు,  ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక పరగణాకి ఒకడు, చట్టాలు కావలిసినన్ని, అమలు చేసేనాధుడే లేడు. ఆఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఉంటాడో అందరికీ తెలిసినదే! ప్రజారోగ్యం గోదారి కాదు గంగ పాలు. బాబోయ్! గంగను కూడా కలుషితం చేసేసేరు. పాపం ఆయనెవరో నిరాహార దీక్ష చేసి, గంగని బాగుచెయ్యాలనుకుని, ప్రాణాలు పోగుట్టుకున్నాడు. మన ప్రభుత్వంది ధృతరాష్ట్ర పరిపాలనండీ బాబూ.

మందులో కల్తీ, అది తాగి వందలమంది ఛస్తే ఇచ్చే పరిహారం లో నకిలీ. మందు కొట్ల లైసెన్స్ లలో నకిలీ. తెల్ల రేషన్ కార్డ్ వారు మందుకొట్టు యజమానులు, ఆదాయపన్ను కడుతున్నారు. ఇదేమంటే? అభివృద్ధి కాదా? తెల్ల రేషన్ కార్డ్ వారిని ఆదాయపు పన్ను కట్టే స్థాయికి తీసుకొచ్చాం కదా, ఇది అభివృద్ధి కాదా? అని అడుగుతున్నారు. ప్రాణ రక్షణచేసే మందులలో కల్తీ, మందు వేసుకున్నవాడు  హరీ అనవలసినదే.” అని ఆగి ఊపిరి పీల్చుకున్నాడు, అప్పుటికి కాఫీ తెచ్చింది, నా ఇల్లాలు అలసిపోయిన అన్నగారికివ్వడానికి, అదుగో అలా అనకుండా, నకిలీ మందులుని పట్టుకోడానికి ఒక సాధనం అని, ఒక మెయిల్ పంపేరొక స్నేహితులొకరు. చూడండి ఏమయినా ఉపయోగపడుతుందేమో!

KNOW U R MEDICINES ORIGINAL OR DUPLICATE…

IF YOU WANT TO KNOW THAT THE DRUG WHICH YOU BROUGHT FROM THE STORE ARE ORIGINAL OR DUPLICATE IS JUST BY EASY 3 STEPS ….. BY DR.TRILOK RAVAL

BEHIND THE EACH MEDICINE THERE IS ONE NINE DIGIT NUMBER WHICH IS THE UNIQUE ID NUMBER ………

JUST MSG THAT NUMBER TO 9901099010

AFTER 10 SEC. YOU WILL GET ONE RESPONSE MSG ……..

IF THE MEDICINE IS ORIGINAL THEN YOU WILL GET THE REPLY WITH THE PROPER BATCH NUMBER AND THE NAME OF THE PHARMA COMPANY …..

WHICH YOU CAN CROSS CHECK WITH YOUR STRIPS OR ANY MEDICINE WHICH YOU BROUGHT ……

AND IF THE NUMBER IS NOT MATCHING THEN YOU JUST HAVE TO RESEND THE SAME MSG SO THE COMPLAINT WILL BE REGISTERED ……..

PLZ SHARE TO ALL..

DSCN2991

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-, కల్తీ ,నకిలీ

 1. కల్తీ , నకిలీ గురించిన మీ టపా మాత్రం స్వచ్చం గా ఉంది !
  ఈ కల్తీ కల్చర్ తో పాశ్చాత్యం కూడా కల్తీ అవుతుంది. ఇక్కడ అమ్మే కోడి మాంసం లో ఇంజెక్షన్ ద్వారా నీరు నింపి, బరువును పెంచి, అమ్మారు ఇటీవల ! అట్లాగే తాజాగా , గేదె మాంసం ( అధిక శాతం బ్రిటిష్ వారు రోజూ తినే ఆహారం ! ) లో గుర్రం మాంసం కలిపి అమ్మారు. దీనితో దేశం మొత్తం లో ” హాహాకారాలు ” చెలరేగాయి ! ఇక్కడికి ( ఇండియా నుంచి ! ) దిగుమతి అయిన కారం లో కూడా ఒక క్యాన్సర్ కారక రంగు కలిపి ఉండడం గుర్తించి , ఆ దిగుమతులను నిషేధించారు ! ఇక్కడ కొన్ని మార్కెట్ లలో పేరున్నబట్టల కంపెనీల లేబుళ్ళు అతికించి , చౌక రకాలు అమ్మే వారిని, తరచూ పోలీసులు పట్టుకుంటారు !
  భారత దేశం లో ఇంకో మహా కల్తీ కూడా ఉంది కదా ! రహదారులూ , వంతెనలూ , ఆనకట్టల కల్తీ ! ఒక తుఫానో , భారీ వర్షమో వస్తే అవి కనపడకుండా , కొట్టుకు పోవడం తరచూ భారత దేశం లో జరిగే సంఘటనలే కదా !
  ఎక్కడైనా , ఈ కల్తీ ” సంప్రదాయానికి ” కారణం ఒకటే ! మనుషుల ఆలోచనలూ కల్తీ అయిపోవడమే ! కానీ ఈ కల్తీ చేసే మానవులు చాలా తెలివైన వారు ! వారి ( కల్తీ ) చర్యలను, ” కల్తీ ఆహారం తినడం వల్లనే ” వారి ఆలోచనలు మారాయని కూడా సమర్ధించు కోగలరు !

  • @సుధాకర్ గారు,
   ఈ తెగులు ఈ దేశం లోనే అనుకున్నా. అక్కడా ఉందా? మానవ మనస్తత్వం ఎక్కడయినా ఒకటే కదూ.అక్కడ కొంత నియంత్రణ అయినా ఉందేమో, ఇక్కడంతా స్వరాజ్యమే.
   నెనరుంచాలి.

  • @జిలేబి గారు,
   కల్తీ, నకిలీల మూలంగా అందరమూ నష్టపోతాం కదా. సొమ్మూ పోయి దిమ్మూ పట్టినట్లు.
   నెనరుంచాలి.

 2. కల్తీలతో శాల్తీలు లేచిపోగలవని చక్కగా తెలియచేశారు .

  ధృతరాష్టుడి పాలన అనుకొంటే సర్దుకుపోగలం ,
  వేఱేమీ ఆశించక , మఱెవ్వరినీ దూషించక.

  నా ఆలోచనల పరంపర

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s