శర్మ కాలక్షేపంకబుర్లు-నా అమ్మ…. నాతల్లి…నీయమ్మ…

DSCN2129

నా అమ్మ…. నాతల్లి…..నీ యమ్మ...

’బాబ్బాబు కరువు భత్యం కంతులు రెండు, ఏడు నెలలనుంచి రాలేదు, నా మటుకే, చూసి చెల్లింపుచేయండి. దయ ఉంచండి’ అని ఫోన్ లో అంటుండగా, ఈ నెల ఒకటో తారీకున మా సత్తి బాబొచ్చాడు. ’చెల్లెమ్మా!’ అని ఒక కేకేసి కూచుంటూ, ’ఏంటి కరువు భత్యం కంతులు, బాబ్బాబు, బతి మాలుతున్నారు, ఎవరినీ?’ అని అడిగాడు. ’మాకు ప్రతి మూడు నెలలకి ఒక సారి కరువు భత్యం సవరిస్తారు. అలా సవరించిన కరువు భత్యం కితం సంవత్సరం అక్టోబర్ నెలనుంచి చెల్లించ లేదు, ఆ తరవాత కిస్తు, జనవరి నెలనుంచీ చెల్లించలేదు, మొత్తం పదివేల దాకా రావాలి, అందరికి ఇచ్చేసేరట, నాకే ఇవ్వలేదు’ అన్నా. ’అదేం! మీరు అడగలేదా?’ అన్నాడు ’అడిగేనయ్యా! ఇదిగో అదిగో అంటూ జరుపుతున్నాడు ఆ అక్కౌంటెంట్’ అన్నా. ’ఏదీ! ఇందాకా అడిగినట్లుగా అడిగారా?’ అన్నాడు. ’అవును’ అన్నా. ’పంతులుగారు మీకు కోపం రాదా?’ అన్నాడు. ’రాకేం, వస్తుంది, పేదవాని కోపము పెదవికి చేటు అన్నారు కదా! అసలే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళంటే లోకువ. ఆ డ్రా చేసేవారు వీళ్ళింకా బతికుండి మనల్ని చంపుతున్నారు, ప్రతి నెలా పెన్షన్ కోసం, పెన్షన్ ఇవ్వడమే దండగనుకుంటే, మధ్యలో ఈ కరువు భత్యం కిస్తులొకటి మా ప్రాణానికి, అన్నట్లు ఉంటాయయ్యా వారి మాటలు. ఏం చేయగలం, బతిమాలడం తప్పించి’ అన్నా. ’ఇలా జరుగుతోందని ఫిర్యాదు చేయలేకపోయారా?’ అన్నాడు. ’కితం సంవత్సరం ఇలా చేస్తే కోపం తెచ్చుకుని ఫిర్యాదు చేశా, దాని ఫలితమే ఇది, బతిమాలుతున్నా’ అన్నాను. ’అన్నయ్యా! కాఫీ! అని పట్టుకొచ్చి ఇస్తూ, ఏంటో అన్నయ్యా! ఆ డబ్బులు రావాలంటారు. ఆ అక్కౌంటెంట్ ఎప్పుడడిగినా కోర్ట్ వాయిదాల్లా, వాయిదాలేస్తాడు తప్పించి ఇవ్వడు, ఇదింతేలే,’ అంది ఇల్లాలు. కాఫీ తాగి మాసత్తి బాబు మొదలెట్టేడిలా.

DSCN2117

’పంతులుగారు మంచితనం ఉండాల్సిందే, కాదనను. ఏడు నెలలనుంచి ఇవ్వవలసిన డబ్బులు, మీ తోటి వాళ్ళందరికీ ఇచ్చేసి, మీకు ఇవ్వక,బాధ పెడుతోంటే, ఇలా బతిమాలడం నాకు నచ్చలేదు. ఒక పని చేస్తారా? ఆ డిపార్ట్మెంట్ వెబ్ ఓపెన్ చెయ్యండి, ఇప్పుడు ఫిర్యాదు చేయండి,అని ఫిర్యాదు చేయించి, రేపు సాయంత్రం మళ్ళీ వస్తాను, ఏం జరిగిందీ చెప్పండి’ అంటూ, ’ నడవండి, కురుపు గురించి డాక్టర్ దగ్గరకెళ్దామని ఆటో లో తీసుకెళ్ళి డాక్టర్ కి చూపించి, తీసుకొచ్చి దింపేసి వెళిపోయాడు.

మర్నాడు మధ్యాహ్నం డబ్బులివ్వవలసిన ఆఫీసు పై ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీ తాలూకు రావలసిన సొమ్ము డ్రా చేసేరు, రేపు మీకు మీ ఊళ్ళో ,చేరతాయని, చెప్పేరు. సాయంత్రం మా సత్తి బాబొచ్చి ఏమయిందన్నాడు. ఇలా జరిగిందని చెప్పేను. వెబ్ ఓపెన్ చెయ్యండి చూద్దామంటే, చూశాను, నాకు చెప్పినదే సమాధానం అందులోనూ కనిపించింది. అప్పుడు మా సత్తి బాబు.

DSCN2131

’మంచితనం చేతకానితనం అనిపించుకోకూడదు. అతిమంచితనమూ పనికి రాదు. ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదులు చేయడం లక్షణం కాకపోవచ్చు. మీ ఒక్కరికే ఇవ్వకపోవడానికి కారణాలు లేవు, వివక్ష తప్ప. ఇటువంటి వివక్షని చూసి చూడనట్లు ఉపేక్ష చేయడం కూడా నేరమే సుమండి, మనం పల్లెటూరి వాళ్ళం, మొరటువాళ్ళం, మాటాడటం చేతకాని వాళ్ళం, లౌక్యాలూ తెలియవు, అందుకు బతిమాలేటపుడు ’నా అమ్మ… నా తల్లి’ అని బతిమాలుతాం కదా, కోపమొస్తే ’నీయమ్మ…నీతల్లి…’ అనికూడా తిడతాం, మరీ అంత మొరటుగా కాక పోయినా, అవసరమైనపుడు చురక తగిలించడమూ అవసరమే మరువకండి, అన్నాడు, ఇల్లాలిచ్చిన కాఫీ తాగుతూ.

మా సత్తి బాబు చెప్పినది నిజమేనంటారా………?

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నా అమ్మ…. నాతల్లి…నీయమ్మ…

 1. అంతర్జాల మహిమ పని చేస్తున్నట్టుంది ! ఈ పాటికి మీకు రావలసిన కరువుభత్యం మీ చేతికి అందిందా ?!!! కేవలం అంతర్జాలం లోనే ఉందా ?
  పర్సెంటేజీ కమీషన్ లేకుండా మీకు మీ కరువు భత్యం వస్తుందంటే నమ్మ శక్యం కాకుండా ఉంది !!!

  • @సుధాకర్జీ,
   పర్సంటేజి గొడవలేదు లెండి, వీళ్ళకి ఇచ్చేదే పుణ్యానికి మళ్ళీ కంప్లయిట్ ఒకటా అని వారి భావం. అంతర్జాలం బాగానే పని చేసిందండి.
   ధన్యవాదాలు

 2. స్వచ్చమైన వేప పువ్వు, కొత్త బెల్లం, చెరుకుముక్కలతో నిండిన ఉగాది పచ్చడి గిన్నె పిన్నిగారి చేతిలో కనబడుతోంది. మీకు మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు బాబాయి గారు.

  • @అమ్మాయి జ్యోతిర్మయి,
   మీ పిన్ని అడిగేనని చెప్పండి, కొంటె పిల్ల కనపడటం లేదు అంటోందమ్మా!
   ధన్యవాదాలు

 3. బాగా వ్రాశారు.
  నిజమేనండి. అవసరమైనపుడు చురక తగిలించడమూ అవసరమే .

  అవసరమైనపుడు కఠినంగా లేకపోవటం వల్లే ఇప్పుడు సమాజంలో ఎన్నో సమస్యలు పెరిగిపోయాయి.

  • @అనూరాధ,
   సరియైన మాట చెప్పేవమ్మా! తప్పు చేసినపుడు దండించక వదిలేయడం తప్పు. దీని మూలంగానే నేటి సమాజం లో ఉన్న చాలా వికృతులు.
   ధన్యవాదాలు

 4. మంచితనాన్ని చేతకానితనముగా తీసుకోవడం అన్నది పరిపాటి అయిన విషయం మనందరికీ తెలుసు.

  కాకపోతే చేతకానితనముగా తీసుకున్తున్నవాళ్ళు సరిగ్గా అర్ధం చేసుకోవడం ఎప్పటికీ జరగటంలేదు మంచితనం వున్నవాళ్ళు మటుకు తమ మంచితనం అతి మంచితనముగా ఫీల్ అయ్యి వీళ్ళు మారుతున్నారు అంతే …..ప్చ్ ….

  సత్తిబాబుగారు చెప్పింది నిజమో కాదో మీరే చెప్పాలి గురువుగారు ….

 5. ఏమో తాతగారు, నిజానికి ధరలు పెరగడానికి కారణం మనిషిలోని అత్యాశ అనిపిస్తుంది కొన్నిసార్లు, ఏమంటారు?

 6. నిజమే. మీరు చెప్పినది మీ సత్తి బాబు చెప్పినది నిజమే. పరిస్తితిని బట్టి పల్లెవాడి భాష ‘వాడి’తనం మారే మాట నిజమే. మారాల్సిన అవసరమూ నిజమే. అసలు భాష మూలం మారకుండా ఉండాలన్నది అసలు నిజం. :))

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s