శర్మ కాలక్షేపంకబుర్లు-ఉ(యు)గాది అనే తెనుగు సంవత్సరాది శుభకామనలు

DSCN2127

విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

“‘చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'”
ఉగాది అంటే సంవత్సరాలలో మొదటిదైన ప్రభవ లో మొదటి ఋతువు వసంతం లో మొదటి నెల చైత్రం లో మొదటి రోజు పాడ్యమినాడు,బ్రహ్మ కల్పం ప్రారంభమయే, అది మొదలు ఈరోజు  (యు)ఉగాది చేసుకోవడం అలవాటు.శివ శక్తుల కలయికే సృష్టి. ఆ సృష్టిలో అన్ని జీవరాసులతో మానవులూ పుట్టారు. మానవుడికి మేధను ప్రసాదించిన దేవుడు, మంచి చెడుల విచక్షణా జ్ఞానం ఇచ్చి ప్రకృతిననుసరించి బతకమన్నాడు. ఆ అనుసరణ లో భాగమే ఈ పండుగ..

DSCN2413

భూమి రెండు అర్థగోళాలుగా ఉంది. ఉత్తరార్ధం లో భూభాగం ఎక్కువ, దక్షణార్థంలో లో తక్కువ. భూమి అక్షం మీద వంగి ఉండటం మూలంగా ఋతువులు ఏర్పడ్డాయి.  వసంతం, గ్రీష్మం, వర్షం,శరత్తు,హేమంతం,శిశిరం. ఒక్కొకదానిలో రెండు నెలలు ( యుగ్మం).చిత్రా నక్షత్రం తో కూడిన పున్నమి కల మాసం చైత్రం, విశాఖ..వైశాఖ మాసం, జ్యేష్ట.. జ్యేష్ట మాసం, పూర్వ,ఉత్తర ఆషాఢలతో ఆషాఢ మాసం,శ్రవణం తో శ్రావణమాసం, పూర్వ ఉత్తరాభాద్రలతో..భాద్రపద మాసం, అశ్వినితో..ఆశ్వయుజమాసం, కృత్తికతో కార్తీక మాసం, మృగ శీర్షతో మార్గశీర్ష మాసం, పుష్యమితో పుష్య మాసం, మఖతో మాఘమాసం, పూర్వ ఉత్తర ఫల్గుణితో ఫాల్గుణమాసం అంటాం. ఇవన్నీ చాంద్రమానం ప్రకారం గా వచ్చేవే, తెలుగు నెలలు.

జనవరి 14 నాటికి మకర రేఖమీద ఉన్న సూర్యుడు మార్చ్ 21 నాటికి భూమధ్య రేఖ మీదకి చేరడంతో ఉత్తరార్థ గోళానికి సూర్య కాంతి ఎక్కువ సమయం చేరుతుంది. పగలు నిడివి పెరుగుతూ ఉంటుంది.ఈ సమయానికి  మనం ఉన్న తెలుగు నేల సూర్యునికి అభిముఖంగా వస్తూ ఉంటుంది.ప్రకృతి నూతనంగా ఉంటుంది, చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయిప్రకృతి శోభాయమానంగా సమ శీతోష్ణంగా ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. మరి అలా ఉన్నపుడే కదా పండగ. .

DSCN2998

దేనికయినా పుట్టుకతోనే ప్రారంభం. ఈ కాలం లోనే ప్రకృతి కొత్తగా పుడుతూ ఉంటుంది. మరో సంగతి వసంతఋతువులో ఆడపిల్ల పుట్టింట ఉండకూడదు, ఆషాఢమాసం లో అత్తింట ఉండకూడదు. మిగిలిన కాలాలలో వాతావరణం వర్షంగా గాని, శీతలంగా కాని, మరొకలా ఉండచ్చు. అందుకు ఈ ఋతువును తీసుకున్నారు, వసంతం, మొదటినెల చైత్రం, మొదటిరోజు పాడ్యమి అదిన్నీ అమావాస్య వెళ్ళిన తరవాతి పాడ్యమి, వెన్నెల పెరుగుతూ ఉంటుంది. అందుకు ఈ రోజు ఉగాది, తెనుగు సంవత్సరాది. మనతో మరికొందరు కూడా ఈ పండుగ ఈ రోజు చేసుకుంటారు. కొంత మంది మేష సంక్రమణాన్ని పండుగగా చేసుకుంటారు, తమిళులు సంక్రమణాన్ని ఉగాదిగా చేసుకుంటారు. వారు సూర్య మానం పాటిస్తే మనం చంద్రమానం పాటిస్తాం.

DSCN2310

 యమ దంష్ట్రలని చైత్ర,ఆశ్వయుజాలని చెబుతారు. అంటే ఈ నెలలో, ఆ నెలలో మరణాలెక్కువని భావం. అకాల మరణాలు, వ్యాధులతో మరణాలు తగ్గించుకుని ఆరోగ్యం పెంపొందించుకోడానికి ఉగాది పచ్చడి తింటాం. జీవితం లో వచ్చే ఒడిదుడుకులకి ప్రతీక, పచ్చడిలో వేసే దినుసులు, ఆరోగ్యం సంరక్షించుకునేవి కూడా, ఈ కాలం లో కలిగే వ్యాధులనుంచి. అందు ప్రధానమైనది నింబ కుసుమం, అదే వేపపువ్వు.సంవత్సరాది రోజు చేసేపనులు, చేయవలసిన పనులు

తైలాభ్యంగనం
నూతన సంవత్సరాది స్తోత్రం
నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
పంచాంగ శ్రవణం
గోదావరి జిల్లాలలో చేసే ఉగాది పచ్చడి చాల రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగాముగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారము-చిటెకెడు,ఉప్పు-అరస్పూను,శనగ(పుట్నాల)పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయంత , కొద్దిగా చెరుకుముక్కలు,వేయించిన వేరుశనగపప్పు-అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.

ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక –
బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
పచ్చి మామిడి ముక్కలు – పులుపు – కొత్త సవాళ్లు
ఉప్పు – జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

ఇవన్నీ ఈ కాలం లో దొరికేవి, మన ఆరోగ్యాన్ని సంరక్షించేవి కూడా. మరొక సంగతి హోలీ పూర్ణిమ మరునాడు చూత కుసుమ భక్షణం అని మామిడిపూత తినే పండగ చేసుకునేవారం, మానేశాం. ఇది కూడా ఆరోగ్య సాధనమే. పంచాంగ శ్రవణం మనుష్యులకు ఆశావహ జీవితాన్ని ప్రసాదిస్తుంది, నేటి positive thinking ఇదే.

ఋతువులు మారిపోతున్నాయంటున్నారు నిజమా? అవుననే చెప్పాలి. వసంత ఋతు ఛాయలు మనకు మాఘమాసం లోనే కనపడ్తున్నాయి.అంటే ఒక ఋతువు ముందుకు జరిగిపోయింది. నిజంగా ఇప్పుడు మనం గ్రీష్మఋతువని చెప్పుకోవాలి.. నిజంగానే మనకు ఇప్పుడే ఎండలు దంచేస్తున్నాయి. మే 24 రోహిణి కార్తె వచ్చేటప్పటికి ఎండలు మిక్కుటమే. ఐతే ఇది ఏమాసమని చెబుతున్నాం, వైశాఖమనే,వసంత ఋతువనే. ఇదిలా ఎందుకు జరుగుతోందని ఆలోచిస్తే, శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నదొకటే,ప్రకృతి సమతుల్యాన్ని చెడకొట్టుకోడం మూలంగా ఏర్పడినదే ఇది. దీనినింకా ఇలాగే కొనసాగిస్తే మనకు మిగిలేవి కొన్ని ఋతువులే. గ్రీష్మం,వర్ష, హేమంతాలు.

తస్మాత్ జాగ్రత. పర్యావరణాన్ని రక్షించండి. ప్రకృతికి దగ్గరగా జీవించండి.ఎక్కువ కాలం ఆనందంగా జీవించండి.

DSCN2347

శతంజీవం శరదో వర్ధమానా ఇత్యపినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనా వర్ధయన్తి శతమేనమేన శతాత్మానం భవతి శతమనంతం భవ తి శతమైశ్వరయం భవతి శతమితి శతం దీర్ఘమాయుః//

లోకాస్సమస్తాః సుఖినోభవంతు.

.

ప్రకటనలు

22 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉ(యు)గాది అనే తెనుగు సంవత్సరాది శుభకామనలు

  • @మోహన్జీ,
   ఆలస్యం సమస్యలేదు. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు.
   నెనరుంచాలి.

 1. ‘పర్యావరణాన్ని రక్షించండి. ప్రకృతికి దగ్గరగా జీవించండి.ఎక్కువ కాలం ఆనందంగా జీవించండి.’ — ఉగాది సందేశాన్ని ఒడిసిపట్టుకుని మాకు అందించినందుకు ధన్యవాదాలు. యుగాది శుభాకాంక్షలు.

 2. శర్మ గారు ,
  నమస్తే. పండితుల ఉగాది ఎలా ఉంటుందో చక్కగా సెలవిచ్చారు.

  మీకు ,మీ కుటుంబ సభ్యులకి , మన పాఠక దేవుళ్ళకి ,మన బ్లాగు మిత్రులకి , మమ్మల్ని పరోక్షంగా చేయూతనిస్తూ ప్రోత్సహిస్తున్న శ్రేయోభిలాషులకు ఈ విజయ నామ సంవత్సర ఆది శుభాకాంక్షలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s