శర్మ కాలక్షేపంకబుర్లు-మనమంచికే

DSCN2595 మనమంచికే                                                     నిన్నటి తరువాయి

బుద్ధి:రేపు చెబుతానన్నావుగా!

మనసు:నేను నాగురించి ఏం చేసుకోలేకపోయాననుకుంటున్నా, మానవుడై పుట్టి ముక్తికి మార్గమైనా వెతికే ప్రయత్నం చేయటం లేదని నా మధన . రోజూ వ్రాసే వ్యసనం మానుకోలేకపోతున్నా.

బుద్ధి:వ్యసనం మానుకోమనలేదే, కరంటు ఉండటం లేదు కనక మరల్చుకోమన్నా.

మనసు: అర్ధమయింది.ఈ రోజు చైత్ర శుద్ధపంచమి, మంచిరోజు, నారదులవారు చెప్పిన ముహూర్తం.మంచి పనిమొదలెడుతున్నా.రోజూ రాసుకుంటా,వేరొకచోట. రజోగుణంనుంచి మరలే ప్రయత్నం చేస్తా. రాసుకుని జాగ్రత్త పెట్టుకుని తరవాత ఉపయోగించుకుంటా.

DSCN2561

బుద్ధి:ఎక్కడ వ్రాస్తావు,ఏం వ్రాస్తావు?

మనసు:పుస్తకంలో రాసుకుంటా ముందు, వీలుబట్టి కంప్యూటర్ కి ఎక్కిస్తా.   మొన్ననొక ప్రయివేట్ బ్లాగ్ చూశా అనుకోకుండా, అలా రాసుకుంటా.నా ఇష్టం వచ్చినపుడు ప్రచురించుకుంటా.

బుద్ధి: ఇక్కడ నీ మిత్రులు, బంధువులు ఉన్నారు, కొంతమందయినా నువు రాసినది చదవాలనుకోవచ్చుగా.

మనసు:నిజమే.రజో ప్రవృత్తినుంచి పోవాలంటే ప్రయివేట్ బ్లాగ్ అవసరం. కావాలనుకున్నవారడిగితే అడ్రస్ చెబుతా,అక్కడ వారు చదువుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా చాప చుట్టేయటం లేదు. వీలు కుదిరినపుడు రాస్తా. చేసే పని నియమ బద్ధంగా ఉండాలనీ, ప్రతిరోజూ ఒకే సమయానికి బ్లాగులో రాయడం అలవాటు. అది కుదరదని తేలిపోయింది కదా! కరంటు రోజుకి ఎనిమిదినుంచి పదిగంటలు ఉండటం లేదు. ఇకముందుకూడా ఉండదు. మన ముఖ్యమంత్రిగారు మంచి వర్షాలు పడాలని భగవంతుని ప్రార్ధిద్దామన్నారు. అప్పటిదాకా కరంటు ఇంతే అని చెప్పేసేరు. భగవంతుని ప్రార్ధించడమనే పనేనా చేద్దామని ఆలోచన. అందుకు వీలుకుదిరినపుడు వ్రాసుకుని నాలుగు రోజులకొకసారి ఒక టపా వేస్తాను ఇక్కడ, తప్పక.

DSCN2635

బుద్ధి:శలవా? విరామమా?రాయడానికేం లేకపోడమా?అదేలే సరుకయిపోయిందా? వైరాగ్యమా? విసుగా?చేతకాని తనమా 🙂

మనసు: ఏవీ కాదు,విధి విపర్యయము. నువ్వేం ఎగతాళీ చెయ్యక్కరలేదు. ఇప్పుడు ఈ పళంగా చూస్తే పది విషయాలున్నాయి రాయడానికి, తలకట్టుపెట్టినవికరంట్ ఉంటే రాయటం లేదేంటి. నీకు మరీ లోకువైపోయాను, నీ పై అధికారి ’అహం’గారితో చెబుతానంతే.  అన్నీ సమకూడినా పనిజరగకపోవడమే విధి విపర్యయం అంటారు కదా అదే ఇది, నీకూ తెలుసుగా.సంవత్సరమున్నర నుంచి రాయలేదేంటి?

బుద్ధి:అరే!బుస్ మని బలే  కోపమొచ్చేసిందే.చిన్న విషయానికే కోపం వస్తే అది రజోగుణం కాదా! సరదాగా అన్నానులేవోయ్, 🙂 మరీ అంత బిగుసుకుపోతే ఎలా తడిసిపోయిన నులకమంచంలాగా, కరంటుపోతూ ఉండటం నీ మంచికిగా మలుచుకోమన్నానంతే.  మంచిపని మొదలు పెట్టడానికేగా,ఇప్పుడుచెప్పు ఇది నీ మంచికేగా?   మరీ కొప్పడిపోకు ఆలోచించమన్నానంతే. 🙂 ఇది చూడు

జ్ఞాతే వస్తున్యపి బలవతీ వాసనాఽనాదిరేషా 
కర్తా భోక్తప్యహమితి ధృఢా యాస్య సంసారహేతుః
ప్రత్యగ్దృష్ట్వాత్మని నివసతా సాఽపనేయా ప్రయత్నా
న్ముక్తిం ప్రాహుస్తదిహ మునయో వాసనాతానవం యత్….వి.చూ…..268

ఆత్మ వస్తు పరిజ్ఞానము కలిగిననూ ’నేను కర్తను,నేను భోక్తను’ అనునట్టి రూపములో ధృడముగా నిలిచియుండి (జనన మరణ రూపకమగు)సంసారమునకు కారణమైనట్టి ప్రబలమైన అనాదివాసన యేది కలదో దానిని ప్రత్యగ్దృష్టితో (అంతరిక దృష్టి) ఆత్మ స్వరూపమునందు స్థితుడైయుండి మానవుడు ప్రయత్నపూర్వకముగా తొలగించుకొనవలెను. ఏలనగా లోకములో వాసన క్షీణించుటనే మునులు ముక్తి అని తెలిపినారు.

శ్రుతే శతగుణం విద్యాన్మననం మననాదపి
నిదిధ్యాసం లక్షగుణమనంతం నిర్వికల్పకమ్….వి.చూ….365

వేదాంత విషయములను కేవలము శ్రవణము చేసి ఊరకుండుట కంటె దానిని మననము చేయుట నూరురెట్లు మేలు. ఆ మననము కంటె నిదిధ్యాసము అనగా తన చిత్తమునందు ఆత్మ భావనను స్థిరపరచుకొనుట లక్షరెట్లు మేలు. ఆ నిదిధ్యాసనము కంటే నిర్వికల్ప సమాధికి అనంతగుణమైన మహత్వమున్నది. ( దానివలన చిత్తమునందు ఏర్పడిన ఆత్మస్వరూప భావము ఎన్నడును చలింపదు)

అస్తు.  శుభం భూయాత్.

DSCN2709

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనమంచికే

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   నియమంగా చేయాలని తప్పించి, మిత్రులు వెతుక్కుని అయినా చదువుతారు. మీరు సతీ సమేతంగా ఎప్పుడు వస్తున్నదీ చెప్పలేదు.
   నెనరుంచాలి.

 1. శర్మ గారు, మీ వీలుని బట్టి రాయండి టపాలు. రోజు వ్రాయాలని కాని, ఒకే టైం కి రాయాలని కాని అలా అనుకోవద్దు.ప్రైవేట్ బ్లాగ్ రాస్తే మాత్రం నాకు చెప్పండే!

  • @జలతారు వెన్నెలగారు,
   ఏ పని చేసినా నియమబద్ధంగా చేయడం, గత డెభ్భయి సంవత్సరాల పైచిలుకు జీవితపు అలవాటు. ఇది కూడా అలాగే నడిచింది, కుదిరినంత కాలం. నియమంగా రాయడం, నియమంగా ప్రచురించడం, నియమంగా సమాధానాలివ్వడం, ఇవన్నీ ఇప్పుడు సమయం తప్పుతున్నాయి, కారణం నా చేతిలో లేదు, కరంటు నాచేతిలోది కాదుకదా. విధి బలీయం. ఇప్పటిదాకా నా ప్రయత్నం చేశా. ఇక నా వల్ల కాలేదు. అదీ ఈ బాధ. నియమం గా బతకడం కూడా కష్టమే అయిపోయింది నేడు.
   నెనరుంచాలి.

 2. మీరు వ్రాస్తున్నవాటిని ఆచరణకనువుగా మలచుకొంటే మీరే మాకు పరోక్షంగా గురువులవుతారు .
  మీ పాత్ర చాలా చక్కగా పోషిస్తున్నారు ఈ భూమ్మీదనే కాదు , ఈ బ్లాగులో కూడా.

  ధన్యవాదములు.

  • @శర్మాజీ,
   అభిమాన, బాంధవ్య బంధాలు కట్టిపడేస్తున్నాయి. వాటినే విప్పుకుంటే ముక్తి అన్నారు. చెప్పడం చాలా తేలికగా ఉంది, ఆచరణ కుదరటం లేదు. ఇది తకరారు.
   నెనరుంచాలి.

 3. తాతగారు, మీరు ఒకే సమయానికి ప్రచురించక్కర్లేదు, మీరు వ్రాసి చెప్పిన సమయానికి ప్రచురించమంటే ఈ wordpress వారు ప్రచురిస్తారు.
  http://en.support.wordpress.com/posts/schedule-a-post/
  మీకు తెలిసే ఉంటుంది కానీ ఒకవేళ మరచిపోతే అని.

  • @ప్రసాదు,
   అలాచేసేనయ్యా!ప్రచురితం కాలా!! ఏంటని చూస్తే వర్డ్ ప్రెస్ వారు అలా ప్రచురితం కానపుడు లాగ్ ఇన్ అయి లాగ్ ఔట్ అవండి ప్రచురింపబడుతుందని. ఆయనుంటే మంగలితో పనిలేదని నానుడి. కరంట్ లేకకదా బాధ. సమయానికి వెయ్యాలనే ఒక నియమం కదా గోల.
   నెనరుంచాలి.

   • మీ దగ్గరనుంచీ ప్రతీ రోజూ వింటుంటే కొత్త పాత విషయాలు కళ్ళకు కడుతుంటాయి, అందుకే మా ఈ ప్రయత్నం.

   • నాకూ రోజూ రాయాలనే ఉంది. సంవత్సరంన్నరనుంచి రాస్తూనే ఉన్నా. పరిస్థియులనుకూలించటం లేదు, కరంట్ పోతే చేయగలది లేదు కదా!
    నెనరుంచాలి

 4. మాలిక్ కి ఊపిరి ఆడలేదు
  వేణువు సృజించి ఊదేడు
  హమ్మయ్య ప్రాణం సేద దీరింది !

  వేణువు అనుకుందట ఈ ద్వారాలే కదా
  మాలిక్ కి ప్రాణం పోస్తుందని !

  చీర్స్
  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s