శర్మ కాలక్షేపంకబుర్లు-అంతయూ మనమేలునకే-ఎంత నిజం?

DSCN2359

అంతయూ మనమేలునకే-ఎంత నిజం?

’అంతయూ మనమేలునకే అంటారు. నిజమా’ అని అనుమానం వచ్చింది, మా సుధాకర్ గారికి. దీని గురించి ఆలోచిస్తుండగా మా సత్తిబాబొచ్చాడు. ’సత్తి బాబూ మా సుధాకర్ గారొక ప్రశ్న వేశారయ్యా దానికి సమాధానంగా టపా రాసేస్తా’ అన్నా! ’అందుకు ఆలోచిస్తున్నా’ అన్నా.

ప్రశ్న:- కర్మ భూమి అయిన మనదేశంలో అంతా మనమంచికే! అనుకునే స్వభావంతో, చాలా మంది జీవితం గడుపుతూ ఉండటమే, దేశం లో జరుగుతున్న అంతులేని అనర్ధాలకి కారణమని కూడా అనుకుందామా???

DSCN2391

’అదయ్యా ప్రశ్న’, అన్నా. దానికి మా సత్తి బాబు ’మీరేమనుకుంటున్నార’ంటే, ’సుధాకర్ గారన్నమాట నిజమే. ఎందుకంటే ఎప్పుడు ఏ విషయంలో అంతయూ మనమేలునకే అనుకోవాలో, ఎందులో అనుకో కూడదో విచక్షణ చేసుకున్నపుడు మాత్రమే సత్ఫలితాలిస్తుంది. లేకపోతే కష్టాలు అనుభవించడమే జరుగుతుంది. అంతులేని అనర్ధాలు జరుగుతూ ఉంటాయి.’ ఒక చిన్న కధ చెబుతా విను,

DSCN2357

‘అనగాఅనగా ఒక టిట్టిభం అంటే తీతువు పిట్ట, సముద్రాన్ని సాధించిందిట. సాధ్యమా? అహా! సాధ్యమే. తీతువు పిట్ట ఎంతుంటుంది? గుప్పెడు కూడా ఉండదు, కాని సాధించింది, ఆశ్చర్యంగా మహా సముద్రాన్ని. నమ్మకంలేదా? ఒక తీతువు తన గుడ్లను సముద్రపు ఒడ్డు దగ్గరలో ఉన్న చిన్న చెట్టుమీద గూటిలో పెట్టింది. సముద్రుడు పున్నమికి పోటు మీద ముందుకొచ్చి చెట్టుమీదున్న తీతువు గుడ్లను పట్టుకుపోయాడు. ఇది ఒక సారి కాదు రెండు సార్లు కాదు, చాలా సార్లు జరిగింది. ప్రతి సారి సముద్రుడిని తీతువు హెచ్చరించడం, సముద్రుడు పెడ చెవిని పెట్టడం జరుగుతూ వచ్చింది, తీతువు ప్రయత్నం విఫలమయింది.దీర్ఘంగా ఆలోచించిన తీతువు, తిన్నగా పక్షిరాజయిన గరుడుని దగ్గరకు పోయి తనగోడు వెళ్ళబోసుకుంది. దానితో బాటుగా ఒక మాట కూడా చెప్పింది. మహరాజా చిన్నవాళ్ళని, శక్తి లేని వాళ్ళనే కాపాడాలి, ప్రభువులు. నేను ప్రభువంశంలోని పక్షిని, చిన్న దానను, బలహీనురాలను, సముద్రుడు నా గుడ్లను పట్టుకుపోతున్నాడు, చెబితే వినటం లేదు, కనక తమరు సముద్రుని దండించి నా గుడ్లు నాకు ఇప్పించమని వేడుకుంది, మొరపెట్టుకుంది. సంగతి విన్న గరుడునిలో చలనమొచ్చింది. ప్రభువంశం వాడిని అన్యాయం చేస్తాడా సముద్రుడని బయలుదేరి, సముద్రునివద్దకు వచ్చి, డొక్క చీల్చి డోలు కట్టేస్తాను, లేదా అయ్యవారితో చెబుతాను, మీమామగారు ఇలా ఒక తీతువు గుడ్లను దొంగిలించుకుపోయాడని, అది నీ అల్లుని దగ్గర నీకు అవమానం అని భయపెట్టేడు. తీతువు గుడ్లను భద్రంగా ఒప్పచెప్పమన్నాడు. సముద్రుడు భయపడి తీతువు గుడ్లను తీసుకొచ్చి ఒప్పచెప్పేడు. ఆ తరవాత సముద్రుడెపుడూ తీతువు జోలికి రాలేదు. ఇది నీతి చంద్రికలోది. ఇక్కడ తీతువు, సముద్రుడు ప్రతీకలు మాత్రమే. సముద్రుడు బలవంతునికీ, తీతువు బలహీనునికీ ప్రతీక. ఇందులో తీతువు తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి సముద్రుని కంటే బలమైన వారిసాయం తీసుకుంది.ఇది ఒక సాధనం.ఇదొకటే సాధనం కాదు, చాలా ఉంటాయి. అంతయూ మనమేలునకే అని ఏడుస్తూ కూచోలేదు. ఇక్కడ అంతయూ మనమేలునకే అనుకోవడం తప్పు కదా! మనమూ తీతువులాగా ఆలోచించి మసలుకోవాలి’ అన్నా.

DSCN2384

అప్పుడు మా సత్తిబాబిలా అన్నాడు. ‘నేనొక సంఘటన చెబుతా వినండి. ఇది నిజంగా జరిగిన కధ.భీమవరం-ఏలూరు రోడ్ లో ఆవులపాడు అనే ఊరు రయిల్వే క్రాసింగ్ గేట్ ఉంది. రయిలొస్తోందని గేట్ వేశారు. ఒక తండ్రి కొడుకు మోటర్ సైకిల్ మీద వస్తూ గేట్ వేసి ఉన్నందున ఆగారు. కొద్ది నిమిషాలలో గేట్ తీస్తే వెళ్ళిపోవచ్చు. అంతలో జరిగిందొక సంఘటన, హటాత్తుగా. మోటార్ సైకిల్ పై వెనక కూచున్న అబ్బాయి పై ఏదో పడింది. దగ్గర చెట్టు చేమ ఏమీలేదు. అబ్బాయి చూసేటప్పటికి అదొక త్రాచు పాము. దానిని విదిలించేలోగా అది కాటు వేసింది. విదిలింపుకు దూరంగా పడిన పామును ఒక గద్ద తన్నుకుపోయింది. అబ్బాయి నురగలు కక్కుతూ పడిపోయాడు. తండ్రి వెంటనే దగ్గరలో వైద్యాలయానికి తీసుకుపోయాడు, కొడుకుని. వైద్యాలయం చేరుకునేటప్పటికి అబ్బాయి, తండ్రి చేతులలో ప్రాణం వదిలేశాడు. తండ్రి గోలు గోలున ఏడ్చాడు, మొత్తుకున్నాడు, కిందపడి దొర్లాడు, చూసేవారికి ఆ దృశ్యం బహు హృదయ విదారకమే అయింది. అబ్బాయి శవాన్ని తీసుకుని ఊరు చేరి కార్యక్రమాలు పూర్తి చేసి తను బతకడం మొదలుపెట్టేడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. నేను అదే దారిలో చాలా సార్లు ప్రయాణించా.ఈ సంఘటన జరిగిన మరు రోజనుకుంటా నేను అటుగా వెళ్ళేను కూడా. ఈ సంఘటనలో తండ్రి అబ్బాయి మరణానికి ఏడ్చాడు, కాని ఒక స్థితిలో ఆంతయు మనమేలునకే అని సమాధానపడి బతికేడు. ఆ పాము కొడుకుని కరచి, విసిరేలోగా తననూ కరిచి ఉంటే తనూ చనిపోయి ఉంటే, కుటుంబం వీధిపాలయి ఉండేదని, జరిగినది మేలుకేనని, తన చేతిలో ఏమీ లేదని భగవన్నిర్ణయమని సరిపెట్టుకున్నాడు. ఇదిగో ఇటువంటి సమయంలో అంతయూ మనమేలునకే అనుకోవాలి కాని, బలవంతుడు బాధిస్తున్నపుడు చేతులు ముడుచుకు కూచోమని, భర్త తాగి వచ్చి తన్ని, మరొకదానిని ఇంట్లో పెట్టుకుని కులుకుతూ ఉంటే,ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన వానిని, మొన్న తెనాలి సంఘటన లాటి వాటిని అంతయు మనమేలునకే అని వదిలేసి చేతులు ముడుచుకుని కూచోడం తెలివితక్కువ, చేతకాని తనం. చెప్పిన విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోడమే. ఇప్పుడు తెలిసిందా అంతయు మనమేలునకే ఎలాగో?’

DSCN2341

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అంతయూ మనమేలునకే-ఎంత నిజం?

 1. ” మా సుధాకర్ అని రాసి మీ వాత్సల్యం చూపించారు, కృతజ్ఞుడిని ! టపా బాగుంది ! మీ క్రితం టపాలో నా అభిప్రాయం తెలియచేసింది ,సామాన్యం గా ” అంతా మన మంచికే ” అనుకుని చుట్టూ జరుగుతున్న సంఘటనలను, మనకు ఏమాత్రం పట్టనట్టుగా పోయే వారు చాలా మంది ఉన్నారు మన దేశం లో అని చెప్పడానికే ! ఈ ప్రవ్రుత్తి , మిగతా దేశాలలో కూడా ఉంది , కానీ మిగతా దేశాలలో , ప్రజలకు ,” పోలీసులు వారి పని వారు చేస్తారు ” అనే గట్టి నమ్మకం ఉండి, అట్లా చేస్తారు ! కానీ మన దేశం లో మనం, ఏ నమ్మకం మీద పట్టించుకోకుండా ఉండగలం ?!!! ఈ రోజే , ఢిల్లీ లో జరిగిన ఇంకో సంఘటన మనలను అందరినీ కదిలించక , కలత చెందించక మానదు ! కేవలం ఐదు ఏళ్ళ బాలికను రెండు రోజులు ఆహారం , నీరు ఇవ్వకుండా, ఒక రాక్షసుడు ” చెరిచాడు ” ! అట్లా ఎందుకు జరిగిందని ప్రశ్నించిన మహిళా వాలంటీరు చెంప వాయగొట్టాడు పోలీసు ఇన్స్పెక్టర్, వీడియో కెమేరా సాక్షిగా ! ఆ బాలిక తండ్రితో ” నువ్వు అదృష్ట వంతుడివి , నీ కూతురు బతికే ఉంది ఇంకా , ఎందుకు కేసు పెడతావు ? అని రెండు వేల రూపాయలు ఇవ్వబోయారు ట ! ఏమనుకుందాం ఇప్పుడు మనం ??? !!!!

  • @సుధాకర్ జీ,
   పాత టపాలో మీ వ్యాఖ్య మరొక టపారాయించింది. దేశం లో చట్టం మీద భయంలేదు, నేరగాళ్ళ సామ్రాజ్యం, మార్చుకోవలసినది బాధ్యత గల పౌరులు. చీమలున్నాయని ఇల్లూ తగలబెట్టుకోము, అంతా మనమంచికే అని నోరూ మూసుకు కూచో కూడదు, తెలుసుకోలేకపోతే అది వారి దురదృష్టం. అన్యాయాన్ని సహించడం కూడా నేరమే.

   నెనరుంచాలి.

 2. bagundi chala.. నాకు ఒక సందేహం మీరు చూపిన తీతువుపిట్ట నిజంగా అదేనా? ఎందుకంటే నేను మా పల్లెలో ఇలా కాకిలా వుంది బ్రౌన్ రెక్కలు వున్నా పక్షిని చూసి అది ఏ స్పీషిస్ కి చెందినదని ఆలోచించాను ….ఇది కరక్ట్ అయితే నా సందేహం తీరినట్టే …

  • @లక్ష్మీ రాఘవగారు,
   అది తీతువు కాదు, తీతువు ఇంకా చిన్నదిగా ఉంటుంది. దీనిని చెముడు కాకి అంటారు, ఇది ఈ మధ్య కనపడటం లేదు. మొన్న తిరుమలలో కనపడితే ఫోటో తీశా.
   నెనరుంచాలి.

 3. * చక్కగా వ్రాసారు. టపా మరియు వ్యాఖ్యలు బాగున్నాయండి.
  * పెద్దలు ఎన్నో చక్కటి విషయాలను కధల రూపంలో, సామెతల రూపంలో మనకు అందించారు.
  * .అంతయూ మన మేలునకే ….. నిదానమే ప్రధానం …… ఆలస్యం అమృతం విషం …….ఇవన్నీ సరైనవే.
  * జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఏవిధంగా ప్రవర్తిస్తే మంచిదో మనము నిర్ణయించుకోవాలి.

  • @అనూరాధ,
   జీవితం లో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అది తీసుకుంటే బాగుంటుంది. నిర్ణయాలు ఆలోచన లేకుండా తీసుకుంటే మిగిలేవి కష్టాలే.
   నెనరుంచాలి.

  • @జలతారు వెన్నెలగారు,
   మన ప్రయత్నం చేయగలది చేసి ఫలితం అనుకూలంగా లేకపోతే అప్పుడనుకుకోవాలి అంతా మనమంచికే, అని
   నెనరుంచాలి.

 4. ఆలస్యం అమృతం విషం
  నిదానమే ప్రదానం

  పండిత పుత్రః పరమ శుంఠహ …
  ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా

  అంతా మన మంచికే
  శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు

  ఎక్కడ ఏది ఉపయోగించాలి అన్నది మన విజ్ఞత. అంతే కదండీ.

  • @సాగర్ గారు,
   విజ్ఞతే బతుకు సార్ధకత. జీవితం లో ఎన్ని తక్కువ తప్పులు చేస్తే అంత గొప్పవారవుతారు.
   నెనరుంచాలి.

 5. శర్మ గారూ,

  నమస్తే .

  మీ బ్లాగులోని విషయం ఎల్లప్పుడూ ” నమ్మకాన్ని మించిన దైవం లేదు , అనుభవాన్ని మించిన చదువు లేదు ” అన్నది ఙ్నప్తికి తెస్తోందెపుడూ.
  ఏ సామెతలైనా , సంభాషణలైనా సందర్భోచితంగా సమాజంలోకి వచ్చినవే.అవి ఉపయోగించుకోవలసిన తీరు సందర్భోచితంగానే ఉండాలి తస్ప్ప . మన పెద్దలు చెప్పారు కదా! అలాగే నడుచుకొందాం అని నిమ్మకు నీరెత్తినట్లు కూచుంటే , కుదేలు పడటం తప్ప మరోటి ఉండదు .
  ఉదా : నిదానమే ప్రధానం , ఆలస్యం అమృతం విషం
  ఈ రెండూ సామెతలే .మన సమాజంలో ఎలా వీలుంటే అలా వాడేసుకుంటున్నారు . నిజానికి ఈ రెండు సామెతలు ఒక్కటే.
  ఏదైనా ఓ విషయం ఆలోచించాల్సి వచ్చినపుడు , నిదానమే ప్రధానంగా ఆలోచించి , ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేటప్పుడు ఆలస్యం అమృతం విషం అన్నది గుర్తుంచుకొని వెంటనే అమలు చేయమని .

  ఏ సామెతలైనా సరిగా అర్ధం చేసుకొంటే సత్ఫలితాలనందిస్తాయని మనం గ్రహించుకొనాలి.

  • @శర్మాజీ,
   అవసరపడవలసివస్తే మెల్లగా కూచుంటే బతుకులో మిగిలేది నిరాశ.చేవలసిన పని చేయాల్సిందే. తీతువు చాలా చిన్నది చేతులు ముడుచుకు కూచోలేదు. అన్యాయాన్ని ఎదిరించాలి.
   నెనరుంచాలి.

 6. పోస్టు బాగుంది శర్మగారు. “అంతా మన మంచికే” అంటే జరిగినదానిని బట్టి అనుభవం ద్వారా మంచిని గ్రహించడమే. మంచిని రూపుదిద్దుకోవడమే చేయాల్సినదని అర్ధం. ప్రతీదీ పరిస్తితులూ – ప్రదేశమూ – కాలం పైన ఆధారపడి ఉంటాయి. గతం ఆధారంగా వర్తమానంలో పని చేస్తూ భవిష్యత్తును నిర్మించుకోవడమే ఎవరైనా చేయగలిగేది. ‘ఆలస్యం అమృతం విషం’ , ‘నిదానమే ప్రధానం’ ఇవి రెండూ రైటే. రెండూ పరస్పర విరుద్ధ అంశాలు కూడా! ప్రతి అపజయం లో ఒక విజయావకాశం వెతకాలంటారు కానీ అపజయాన్ని ప్లాన్ చేసుకోరు.

  • @కొండలరావుగారు,
   రెండు విభిన్నమయిన విషయాలుంటాయి. ఒక సమస్య వచ్చినపుడు దేనిని ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన సరిగా చేస్తే తప్పులు దొర్లవు. జీవితమెప్పుడూ భూత, వర్తమానాల మేలు కలయిక.
   నెనరుంచాలి.

 7. మానవ ప్రయత్నం అన్నీ చేసి ఆ పై కూడా అది ‘మనం’ అనుకున్నట్టు కాకుంటే, అంతా మన మంచికే అనుకుని ‘accept the life as it comes’ అనుకోవడం భళీ అంటారు !

  భళారే !

  జిలేబి.

  • @జిలేబిగారు,

   అంతా మన కర్మ, అంతా మనమేలుకే అని చేతులు ముడుచుకుని కూచోమని చెప్పలేదు, మనవారు. శ్రీ కృష్ణుడు నీ పని నీవు చెయ్యి ఫలితం ఏమయినది బాధ పడకు అని చెప్పేడు కదా! దీనిని చాలా సార్లు తప్పుగా అన్వయించుకుంటారు. అదీ పెద్ద తిరకాసు.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s