శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదీ వంశవృక్షం

ఇదీ వంశవృక్షంDSCN3056

click on the picture to see details.

ఒక మిత్రుల ఇంటికెళితే,  కనపడింది. వివరంగా చూస్తే , కాస్తా ద్రవిడ వంశవృక్షం అని తేలింది.

ద్రవిడదేశం అని అనే తమిళనాడు ప్రాంతం నుంచి, కావేరీ తీరం నుంచి కొంతమంది బ్రాహ్మణులు దగ్గరగా నాలుగువందల సంవత్సరాల కితం గోదావరి ప్రాంతానికి చేరుకున్నారు. వారి వంశ వృక్షం దొరికింది. ఇందులో గోత్రాలు, ఇంటిపేర్లు వున్నాయి. వంశవృక్షం వేసుకునే, రాసుకునే పద్ధతి ఇది. మిగిలినవారు వారివారి పూర్వీకులను గుర్తించే సావకశం ఉంటే ఇలా తయారు చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకం గా ఉండేది కుటుంబ వివరాలతో దానిని కూడా ఇలాగే వేసుకోవచ్చు.

అసలు వంశాలు ఎలా వృద్ధి చెందాయో తెలపడానికే ఈ ప్రయత్నం. మరో సంగతి దీనిని 1934 వ సంవత్సరం లో శ్రీ చిట్టెల్ల సుబ్బారాయుడు గారనే డ్రాయింగ్ మాస్తారు వేశారట. వీరి కుటుంబ సభ్యులు ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్నారు, వారి తాతాసహోదరుల పిల్లలవద్ద ఇది దొరికింది.కావలసినవారికి ఇది ఉపయోగపడుతుందని అంతర్జాలానికి ఎక్కించా.

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదీ వంశవృక్షం

 1. తాపీగా మీకు జాబు వ్రాయాలన్న నా కోరిక నేరవేరెట్టు లేదు!!అంతా హడావిడి..ఈ వంశ వృక్షం సేకరించి మాకందించి నందుకు కృతజ్ఞతలు…(దీని పై రీసెర్చి చేయాలన్న నా కోరికా నేరవేరేట్టు లేదండీ!!)..అంతా విష్ణు మాయ!!!

  • kvsvగారు,

   మనగురించి, మనం కొంత సమయం తీసుకోవాలి. అంతా విష్ణుమాయ అనుకుంటే ఎలా? ఒకరికయినా ఉపయోగపడినందుకు సంతసం.
   నెనరుంచాలి.

 2. శర్మ గారూ,

  ఆ మౌసు క్లిక్ చేసి చదివినా చాలా అక్షరాలూ అలుక్కు పోయి ఉన్నయి కాబట్టి (ఫోటో వల్ల ఉండ వచ్చను కుంటా ) వీలైతే టపా రూపేణ వాటి ని నిక్షిప్తం చేయ వలె నని మనవి

  చాలా నెలల క్రితం ఇట్లాంటి దే మీరు మీ వంశ వృక్షం ఒకటి పెట్టా రను కుంటా ?

  జిలేబి

  • @జిలేబిగారు,
   ఇది ద్రవిడ బ్రాహ్మణుల వంశవృక్షం, అందులో కొమ్మలు గోత్రం, ఆకులు ఇంటిపేర్లు, చివరనున్న పువ్వులు ప్రవర. కొన్ని కనపడకపోవచ్చు, మళ్ళీ తయారు చేయడం చాలా పని. కావల్సిన వారికి చెప్పచ్చు. తెనుగు బ్రాహ్మణులు అందరిగోత్రాలు, ఇంటిపేర్లు, ప్రవర అన్ని నాదగ్గరున్నాయి, అనుమానమున్నవారికి, కావలసినవారికి చెబుతూనే ఉన్నా.అది మా కుటుంబానికి సంబంధించినది.
   నెనరుంచాలి.

 3. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  శ్రమతో కూడినదైనా, చాలా చక్కని పని చేశారు. ఎంతోమందికి ఉపయోగపడవచ్చును.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • @మిత్రులు మాధవరావు గారు,
   ఇది చాలా కాలం కితమే తయారు చేయబడింది. నేను చేసిన పని నెట్ లో పెట్టడం. దీనివల్ల నాకు ఉపయోగం లేదు. ఈ శాఖవారు చాలా చోట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వీరికి వారి మూలాల విషయం తెలియకపోతే తెలుసుకుంటారని చేసిన ప్రయత్నం, చిత్రంగా వారిలో ఒకరూ మాట కలపలేదు.
   నెనరుంచాలి.

  • @ధాత్రి,
   తెలుసుకోవాలనే నీ తపనకి ముచ్చటగా ఉంది. నేను పైన ఇచ్చినది కొన్ని బ్రాహ్మణుల కుటుంబాలు కావేరీ తీరం నుంచి గోదావరీ తీరానికి వలసవచ్చాయి, చాలా కాలం కితమే. అలా వచ్చిన వారిలో కొంత మంది తోటలలో విడిశారు, వారిని ఆరామ ద్రవిడులన్నారు, కొంతమంది దివిలి ప్రాంతం చేరేరు వారిబి దివిలి ద్రవిడులన్నారు, కొంత మంది అప్పటికే ఉన్న గోదావరి తీరపు ఊళ్ళలో చేరేరు, వీరంతా కావేరీ తీరం నుంచి వలస వచ్చినందునా, దక్షణ దిశ నుంచి వచ్చినందున ద్రవిడులు అని పిలిచారనుఅకుంటా. ఇది మానవ వలసలకి సంబంధించినది.పైన ఇచ్చిన వంశ వృక్షం అందులో ఒకరిది.దాని పై క్లిక్ చేసి మాక్స్ చేసి చూడు. పక్కనిచ్చిన టేబుల్ చూస్తే బోధపడుతుంది.
   నెనరుంచాలి.

 4. శర్మ గారు ,

  నమస్తే.

  నేను మా గుంటూరి వారి వంశవృక్షం నా స్వంత ఆలోచన ప్రకారం తయారుచేశాను మా బాబాయి గారి కొఋఇకతో , మా పిన్నిగారి ప్రోద్బలంతో , మా బలగం సహకారంతో .

  అది వీలు చూసుకొని ఇందులో పెడ్తాను .

  వంశవృక్షం వల్ల మన పెద్దలు , పూర్వీకుల వివరాలు , బంధుత్వం బయటపడ్తాయి .

 5. మేము పుదూరు ద్రవిడులము . కొన్ని శతాభ్దా లకు పూర్వమే
  తంజావూరు ప్రాంతంనుంచి వలస వచ్చి, నెల్లూరు దగ్గర స్థిర పడిన వాళ్ల0 .
  మా పుర్వీకులలో ఒకరు రెండు తరాలకు పూర్వం,
  ‘వంశ వృక్షం’ గురించి చేసిన కృషి వల్ల ఆయనకు
  ‘వంశ వృక్షం’ ఇంటి పేరై పోయింది.

  • @మోహన్జీ,
   మన పూర్వీకుల గురించి, ఎక్కడినుంచి, ఎప్పుడు, ఎలా, ఏ కారణాలతో వలసలు పోయారో తెలుసుకుంటే అదే చరిత్ర, ప్రయత్నిస్తే దొరుకుతుంది కూడా. ఇప్పుడు తండ్రి పేరు తప్పించి తాత పేరు కూడా గుర్తుండని రోజులు. నిజమే అలా కృషి చేసినందుకు పౌరుషనామంగా ఇంటి పేరు స్థిరపడిందనమాట. మన పేర్లు, ఇంటి పేర్ల గురించి ఒక టపా మొదలెట్టాను, చాలా కాలం కితమే పూర్తి చేయలేదు.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s