శర్మ కాలక్షేపంకబుర్లు- రోహిణీ కార్తె

రోహిణీ కార్తె

రోహిణీ కార్తె ఎండకి రోళ్ళు పగులుతాయనేవారు, మా చిన్నప్పుడు. ఎండ తీవ్రత అంతగా ఉంటుందనమాట. ఈ కార్తెలేంటీ అంటే, ఒకప్పుడు అడిగేరెవరో గుర్తులేదు, కార్తెల గురించి చెప్పమన్నారు. ఇప్పటికిగాని ముడిపడలేదు.

మనవారు కాలాన్ని చాంద్రమానంలో, సౌరమానంలో, బార్హస్పత్య (గురువు) మానంలో, నక్షత్ర మానం లో లెక్కించేరు. అందులో నక్షత్ర మానం ప్రకారంగా వచ్చేవే కార్తెలు. ఒక కార్తె ఉజ్జాయింపుగా దగ్గరగా పదమూడున్నర రోజులు ఉంటుంది. సంవత్సరానికున్న రోజులు 365/27 నక్షత్రాలతో భాగిస్తే 13.5 రోజులవుతుంది. కార్తెలు కూడా సంక్రాంతి పండగలాగా ఒక రోజు ఇటు అటు తేడాలో ఒకే తారీకులలో వస్తాయి. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన రోజును మేష సంక్రమణం అంటారు.ఇది సౌరమానం. మేషరాశిలో మొదటి నక్షత్రం అశ్వని సూర్యుడు అశ్వని నక్షత్రంలో ప్రవేశించిన రోజు మొదలు అశ్వని కార్తె అని చెబుతాం.ఇది నక్షత్రమానం. ఇలా గే మిగిలిన కార్తెలు, సంక్రమణాలు. సంక్రమణమంటే ఒక్క మకర సంక్రమణమే కాదు. ప్రతి నెల ఒక సంక్రమణం, సూర్యుని ప్రవేశాన్ని బట్టి ఉంటుంది. అందుకే మనకి రోహిణీ కార్తె మే 24,25 తేదీలలో వస్తూ ఉంటుంది. ఈ కార్తెల ఆధారంగా వర్షం చెప్పేవారు, పంచాంగంలో. రోహిణి కార్తె వచ్చేటప్పటికి మన ఆంధ్ర దేశం సూర్యునికి పూర్తి అభిముఖంగా ఉంటుంది. అందుకని మనకి ఇప్పుడు వేడిమి ఎక్కువగా ఉంటుంది.

DSCN3078

రోహిణిలో ఎండలగురించి తిట్టుకుంటాం. ఎండకాయకపోతే బువ్వలేదు మరి. అదేంటంటారా? ఇలా ఎండ కాయాలి వాతావరణం లో మార్పురావాలి, అప్పుడు వర్షం వస్తుంది. వర్షం వస్తేనే పంట. పంట ఉంటేనే బువ్వ, లేకపోతే……కడుపులో కాళ్ళుట్టుకు పడుకోడమే. ఎండ కాయాలి కాని ఎందుకింత వేడిమి పెరుగుతోందన్న దానికి కారణాలు అందరికి తెలుసు, ఎవరి మటుకు వారు పక్కవారు చెట్లు పెంచుతారులే అనుకుంటున్నారు. ఇంట్లో చెట్లుంటే పాములొస్తాయి కొట్టించెయ్యమన్న ప్రబుద్ధులున్నారు. కొద్ది జాగా కూడా లేకుండా అంతా సిమెంట్ చేసుకుంటున్నాం, సిమెంట్ కాంక్రీట్ వేడిమిని గ్రహించి వేడెక్కి రాత్రికి కూడా చల్లబడటం లేదు. భూమి ఆలస్యంగా వేడెక్కి తొందరగా చల్లారుతుంది. అదే నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది. సూర్యుడు చాలా కష్టపడి సముద్రంలో నీటిలో ఉప్పు వదిలేసి అసలయిన మంచినీరు ఆవిరి రూపంలో ఇప్పుడు సంగ్రహించి మనకిస్తుంటే, దానిని జాగ్రత్త గా వాడుకోలేక మళ్ళీ సముద్రం పాలు చేస్తున్నాం. ఇలా కాంక్రీట్ చేసుకోవడం, సిమెంట్ రోడ్లు వేసుకుని, నీరు ఇంకకుండా చేసుకుని, వర్షపునీరంతా సముద్రం లోకి పోయే ఏర్పాటు చేసుకుంటూ, ఒక్క చుక్కకూడా భూమిలోకి ఇనకకపోతే వేడి ఎలా చల్లారుతుంది. చెట్లు పెంచిన నాలాటి పిచ్చి వాడిని గోల చేసి చెట్లు కొట్టించేదాకా నిద్రపోక పోతున్నారు. వేడి పెరగడమే కాదు అకాల వర్షాలు, అంతా అస్తవ్యస్తమైపోతూ ఉంది. మా పల్లెలో నేను ఈ ఊరు వచ్చిన ముఫై సంవత్సరాల కితం మైన్ రోడ్ లో 20 చెట్లుండేవి ఒక కిలో మీటర్ దూరంలో. కితం సంవత్సరం చెట్లన్నిటినీ కొట్టేసి చివర నుంచి చివర దాకా సిమెంట్ రోడ్ వేశారు. ఇప్పుడు మైన్ రోడ్ లో షాపులో కూచోవలసిన దుకాణదారు పది దాటిన తరవాత కూచోలేకపోతున్నామని గోలపెడుతున్నారు, కారణం తెలిసినదేగా! రోహిణికి ముందు కృత్తిక కార్తె మే 11 న ప్రారంభమయింది, అప్పటికే ఎండలు మిక్కుటంగా ఉన్నాయి. రోహిణి ప్రారంభమయిన తరవాత వేడిమి 48 డిగ్రీలకి పెరిగిపోయింది. గో.జి లలో ఇది చాలా ప్రమాదకరమైన సన్నివేశం, కాని ఎవరు గుర్తించటం లేదు. రోహిణి ప్రారంభం తరవాత 27 ఉదయం పెద్దగాలి వీచి వర్షం వచ్చి అతలాకుతలం చేసింది. పడిన చినుకులకు చల్లబడలేదు కాని ఉక్కపోత చంపుతోంది, సూర్యుడు కనపడకపోయినా. అబ్బ మా కరంట్ వారికి మంచి సందు దొరికింది, మొన్న 27వ తేదీని మాకు వరుసగా తొమ్మిది గంటలు కరంట్ బంద్ చేసేరు, ఆ తరవాత ప్రతి పది నిమిషాలకి ఇచ్చి తీసేసేరు. నరకమే చూపించారు.

ఇక ఒక చిన్న సంగతి చెప్పేసుకుందాం.  కర్తరి అని అంటారు మనవారు.  కర్తరిలో గృహ సంబంధమయిన పనులు చేయద్దన్నారు. కారణాలు చూదాం. చిన్న కర్తరి లేదా డొల్లు కర్తరి అంటారు, పెద్ద కర్తరి లేదా నిజ కర్తరి కృత్తికా కార్తె ప్రవేశం తో అమలు లోకి వస్తుంది, ఈ సమయం లో గృహ సంబంధమయిన పనులు వద్దన్నారు. నాటిరోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేడి కాదు. వేసవి నుంచి, వడగాడ్పు నుంచి రక్షణకే ఈ కర్తరి చెప్పి పని వద్దన్నారు. ఇప్పుడు వ్యవసాయపనులు సరిగా రోహిణీ కార్తెలో మొదలుపెడుతున్నాం. ఈ కార్తెలో మంచిది చూచి ఆకు మడి తయారు చేస్తాం గో.జిలలో.నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక, కార్మిక పంచాంగం అనచ్చు.భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు దొల్లు కర్తరి, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం. కర్తరి అంటే కత్తెర అని అర్ధం, దేనికి కత్తెర? ఎండలో పనికి కత్తెరనమాట.వేసవిలో మే నెలలో 4,5 తారీకులమొదలు మే 27,28 దాకా కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్లబడుతుంది కనక పనులు మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసేరో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.

http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF_%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B0%82_-_%E0%B0%85%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B1%86

కార్తెలగురించి పంటలు సామెతల గురించి మరిన్ని వివరాలకు లింక్ లో చూడండి

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- రోహిణీ కార్తె

  1. మన ముందు యుగవాసుల అనుభసారమే ఈ శాస్త్రాలు . శాస్త్రాలు మన అవసరాల కొరకు ఉపయోగపడ్తాయి అన్నది అక్షర సత్యమే , ఆచరణ యోగ్యమేనని సెలవియ్యటం బాగుంది .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s