శర్మ కాలక్షేపంకబుర్లు- పోట్లాట ఒక కళ

పోట్లాట ఒక కళ

మొన్ననెప్పుడో జిలేబి గారి బ్లాగులో ’పోట్లాడుకుందాం రండి’ టపాకి వ్యాఖ్య రాస్తూ ” పోట్లాట ఒక కళ, దాన్ని మొదలు పెట్టడం తేలిక, ఎక్కడ ఆపాలో తెలిసుంటేనే…:) అన్నానయ్యా అదిగో అప్పటినుంచి ఈ అవస్థ, టపా రాయాలని అన్నా మా సత్తి బాబుతో. ’చెల్లెమ్మా! కాఫీ పెట్టమ్మా!’ అని ఓ కేకేసి కూచున్నాడు మా సత్తి బాబు. ’ఏంటీ! పోట్లాట ఒక కళ అన్నారా! దానికి టపా రాయాలా రాసుకోండి చెబుతా’ అని మొదలెట్టేడు.

“పోట్లాట ఎవరితో, ఎప్పుడు, ఎందుకువస్తుందీ చెప్పడం తేలికకాదు. ఎవరితో పోట్లాడచ్చు, ఎంతవరకు అన్నది తెలియకపోతే మిగిలేది విషాదం. మొట్టమొదట నేర్చుకోవలసినది ” తల్లి, తండ్రి,గురువు, దైవం వీరితో పోట్లాట ఎప్పుడూ పనికి రాదు. ’అదేంమాట రావణ కుంభకర్ణాదులు పోట్లాడలేదా? పరమాత్మతో అంటే’ “అది లాలోచీ కుస్తీ కదా! వారు శాపం తో వచ్చేటప్పుడే మూడు జన్మల విరోధంతో నిన్ను చేరుకుంటాం తప్పించి ఏడు జన్మల సఖ్యం తో కాదు, అంతకాలం నీ పాద పద్మాలు చూడక ఉండలేం అని కదా ఒప్పందం. మరి అలా పోట్లాడి పరమపదం చేరినావరిలో ముఖ్యులు కంసుడు, కంసుడు పోట్లాట కూడా అంత నిక్కచ్చిగానూ చేశాడు. కంసుడు అసలు సిసలు పోట్లాడినవాడు, భయపడినవాడూ.పోట్లాట ఎక్కడ విరమించాలో తెలియక భగవంతుని తలుచుకుని తలుచుకుని ఐక్యమయిపోయాడు.

నేటి కాలానికొస్తే విపక్షాలు ప్రజలకోసం పోట్లాడితే బాగుంటుంది, తరవాత సారి వారిని అందలమెక్కిస్తారు. కాని విపక్షాలు స్వప్రయోజనం కోసం పోట్లాడితే, ప్రజాస్వామ్యం కోసమని పోట్లాట మానేస్తే, అబ్బే! బాగోదు కదా! మీరక్కడే కూచోండి నాయనలూ అంటున్నారు ప్రజలు. ప్రజలకోసమే అనే యెర్రవారు పడక కుర్చీ రాజకీయాలకి చేరిపోడంతో మీరు అక్కడికే పరిమితవమని ప్రజలు చెబుతున్నారు. ఒకట్లస్థానం మీకు అచ్చివచ్చిందనీ చెబుతున్నారు, ఇదెందుకు జరుగుతోంది? పోట్లాట ఎప్పుడు, ఎందుకు మొదలు పెట్టాలో ఎప్పుడు ఆపాలో తెలియకపోవడం మూలంగానే.అసలైన పోట్లాట కాంతా కనకాల గురించే, మరెందుకూ పోట్లాట రాదు, వచ్చినవన్నీ ఉత్తుత్తివే, మూలాలు అక్కడుంటాయి, వెతికి చూస్తే.

ఇక ఇళ్ళలో ఆఫీసుల్లో పోట్లాటలు చూదాం:) ఆఫీసులో బాస్ తో పోట్లాడితే నష్టపోయేది మనమే :). పక్కవారి మానిటర్ లోకి అస్తమానం తొంగిచూస్తే పోట్లాట ఖాయం. అంచేత దొంగ చూపులు మాన్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.ఇల్లాలితో పోట్లాట అబ్బో అదొక పెద్ద వరం. పోట్లాడి ఓడిపోతే అసలయిన ఆనందం పొందచ్చు 🙂 కావాలని ఓడిపోతున్నట్లుండకూడదు, నిజంగానే ఓడిపోతున్నామనిపించాలి. ఆ పైన కొద్దిగా మస్కా కొట్టాలి, మాటలతో, నీ అంత తెలివయినది మరొకరు లేరు సుమా అని. నిజంగా నిన్ను చేసుకున్నాను కనకే నేను సుఖంగా వున్నానని కొద్దిగా మసాలా దట్టిస్తే, పిచ్చి ఇల్లాలు పాపం మగపురుగు ఓడిపోయాడు, మనం తప్పించి మరో దిక్కులేదంటున్నాడని గర్వంగా ఫీల్ అయి మనకి చూపించేది స్వర్గమే. అనుభవం కావాలండీ! అనుభవం. తప్పుచేసి దొరికి పోయినపుడు చాలా సీరియస్ గా క్షమాపణ అడిగేస్తే తగువు చల్లబడిపోతుంది 🙂 చూసేవాడు కూడా అదేంటయ్యా! తప్పు చేసేనని ఒప్పుకుంటున్నాడుగా ఇంకా ఎందుకు అరుస్తావని ఎడుటివాడినే తిడతారు. ఇదే అసలైన కిటుకు, పోట్లాట ఎప్పుడు ఆపుచేయాలో తెలియడానికి 🙂

ఇక అత్తా కోడలు మధ్య పోట్లాట నిజంగా కళే. ఇద్దరూ చతురులే. కూతురికి అత్తగారి పేరెడుతుంది కోడలు. మురిసిపోతుంది అత్తగారు. ఆ తరవాత రోజులలో కూతురుని తిట్టినట్టు వంకపెట్టి అత్తను తిడుతుంది.పాపం అత్తవి పోయే రోజులు కోడలివి వచ్చే రోజులు, అందుకు కోడలితో సద్దుకుపోయి, అలా నా పేరెట్టి పిల్లని తిడితే ఎలాగే పద్మా!నేనెప్పుడయినా నిన్ను గాని నీ పుట్టింటివారిని కాని తిట్టానా? అంటుంది, కోడలొచ్చిన కొత్తలో తను చేసిన యాగీ మరిచిపోయి. అలా అత్త గతం మరచి సద్దుకుపోకపోతే తాత తాగిన బోలి తలవాకిట వున్నట్లు వీధిలోకి చేరాల్సిందే, ఏమనుకునీ ఉపయోగముండదు.

కుర్రాళ్ళతోటీ గుణం తక్కువ వారితోనూ పోట్లాట వద్దన్నారు. కుర్రాళ్ళతో పోట్లాడితే చూసేవాళ్ళు కూడా ముసలాడివి బుద్ధిలేదా కుర్రాళ్ళతో సమానంగా దెబ్బలాడతావా? అని తిడతారు, ఇక గుణం తక్కువ వారితో పోటాడితే మిగిలేది అవమానం.   మొగుడూ పెళ్ళాలు దెబ్బలాడుకుంటున్నారని మధ్యలోకెళ్ళేమా! మనం ఫ్లోరయిపోతాం 🙂 ఆలు మగల మధ్య పోట్లాట అద్దం మీద ఆవ గింజ నిలిచినంతసేపనేవారు :)మొగుడూ పెళ్ళాల దెబ్బలాట ఎప్పుడూ లాలూచీ కుస్తీయే 🙂 తస్మాత్ జాగ్రత.

తెలుసుకోలేకపోతే,ఇంతే సంగతులు శ్రీమద్రమారణ గోవిందో హరి. అంతా విష్ణు మాయ.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- పోట్లాట ఒక కళ

 1. దీక్షితులు గారూ,

  ఈ మధ్య మా అయ్యరు గారి తో పోట్లాడి, సై అంటే సై అని, పందెం పెట్టి ఓ నెల రోజుల పాటు టపాలు గట్రా రాయకుండా ‘దీర్ఘ’ దర్శి అయి చేతులు అట్టే కట్టేసి ఉంచా .

  కామెంటులు కూడా ఆపవోయి చూద్దాం అన్నారు. అమ్మో,

  కామెంటులు మెంతులు, అవి లేక ఈ బ్లాగు ‘దియా బేటీ’ స్ ‘ తగ్గునా అని కుదరదు అని నిక్కచ్చి గా జెప్పి, టపా మాత్రం ఆపు జేసా !

  ఇది కూడా ఈ పోట్లాట కళ లో వచ్చునా మరి !!

  చీర్స్
  జిలేబి

  • @జిలేబి గారు,
   కాలోయం దురతిక్రమః మనచేతిలో ఏం లేదండి అంతా విష్ణుమాయ. 🙂 “ఇది కూడా పోట్లాట కళలో కి వచ్చునా?” వచ్చును కదా 🙂
   నెనరుంచాలి.

 2. శర్మ గారూ ,

  నమస్తే . నిజంగా మీ సత్తిబాబు , సత్ బాబు అండి . అన్ని విషయాలు కూలంకషంగా వివరిస్తున్నారు . పోట్లాట కూడా ఓ కళే అనటంతో , ప్రతిదీ ఓ కళేనని అర్ధమైపోయింది మోతాదు మించనంతవరకు . బాగుంది .

  • @శర్మా జీ,
   ఎప్పుడు ఆపాలో ఎప్పుడు తెల్లజండా ఊపాలో తెలిసుంటే పోట్లాటంత మంచి కాలక్షేపం మరొకటి లేదండి 🙂
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s