శర్మ కాలక్షేపంకబుర్లు-పోతనగారి ’మాటలాట’

durga

పోతనగారి ’మాటలాట’

పోతనగారి పద్యాలు తెలియని తెనుగువారుండరు. పోతన అంటేనే భాగవతం, మనకు సంస్కృతం లో భాగవతం ఉందన్న విషయం కూడా మరిపించేలా ఉంటుంది పోతనగారి రచన. తెనుగు పదాలతో, మాటలతో ఆయన ఆడుకున్న ’మాటలాట’ మాటలతో ఆట లో తెనుగెంత తియ్యగా ఉంటుందో, కొన్ని పద్యాలు చూదాం.

పోతన గారు తన మాటలాట మొదట ’అమ్మ’తో ప్రారంభించారిలా.

అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ, తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబునయుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృతాభ్ధి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భాగ…స్కం.1….9

తల్లులను కన్న తల్లి, ముగురమ్మల మూలపుటమ్మ పార్వతి, లక్ష్మి, సరస్వతుల కు మూలమైన తల్లి, సురారులమ్మ కడుపారడిపుచ్చినయమ్మ, ఇక్కడ మంచి దొంకతిరుగుడుగా చెప్పేరు. సురలు=దేవతలు అరులు=శత్రువులు దేవతల శత్రువులు రాక్షసులు వారి తల్లి దితి. దితి కడుపారడిబుచ్చినయమ్మ, దితి కడుపుకోత కలిగించిన తల్లి అంటే రాక్షసులను సంహరించిన అమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మున యుండెడి యమ్మ, తనని నమ్ముకున్న దేవతా స్త్రీల మనసుల్లో ఉండే అమ్మ అయిన దుర్గ నాకు ప్రేమతో మహిమాన్వితమైన,పటుత్వమైన, కవిత్వ సంపద చేకూర్చాలని కోరేరు. ఈ పద్యం లో బీజాక్షరాలు నిక్షిప్తమయి ఉన్నాయంటారు. బీజాక్షరాలు ఉపాసించడానికి కొన్ని పద్ధతులున్నాయట. ఈ పద్యాన్ని పారాయణ చేసి కూడా ఆ ఫలితం పొందచ్చు. నిత్యం వీలున్నప్పుడంతా పారాయణ చేయండి, ఫలితం కనపడుతుంది.

హారికి నందగోకుల విహారికి జక్రసమీరదైత్య సం
హారికి భక్త దుఃఖపరిహారికి గోపనితంబినీ మనో
హారికి దుష్టసం పదపహారికి ఘోష కుటీ పయోఘృతా
హారికి బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్…భాగ…స్కం.1….27

హారి అనేమాట మీద పోతనగారి ఆట. హారి=మనోజ్ఞమైన,హారము ధరించిన,  హరించువాఁడు, అని అర్ధాలున్నాయి.హారి అనే మాటకి ’కి’చేర్చి హారికి చేసి కిరికిరి చేసేరు పోతనగారు.ఈ మాటలన్నీ హరిని సూచించేవే, మనోజ్ఞమైన రూపముకల, కౌస్తుభహారమును ధరించిన, వెన్నదొంగ కన్నయ్య నందగోకులవిహారి, చక్ర, సమీర దైత్యుల సంహారి, దుఃఖాన్ని పరిహారి, దుఃఖం పరిహరించేవాడు,గోపకాంతా మనోహారి, గోపకాంతల మనసు దొంగిలించినవాడు,దుష్ట సంపదలను పరిహరించనవాడు, పయో, ఘృతాహారి, పాలు,నెయ్యి తిన్నవాడు,బాలకగ్రహమహాసురదుర్వనితా, పూతనకి ఇంత పేరు చెప్పేరు ప్రహారి = సంహరించినవాడు అయిన నందగోపయ్యకు మొక్కుదాం.

ఈ పద్యంలో కుంతి కృష్ణుని స్తుతిస్తుంది, జ్ఞాపకం ఉంచుకోవలసిన పద్యం.

యాదవులందు బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
ఛ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువు జేరెడి గంగభంగి నీ
పాద సరోజ చింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితో గదియునట్లుగ జేయగదయ్య! యీశ్వరా!…..భా..స్కం..1….198

ఇది మనమూ కోరుకునేదే.

నాకు అమ్మంటే ఇష్టం , మీకూ ఇష్టం కనక,ఇలా మొదలెట్టేను. ఈ మధ్య మనసు బాగోక భాగవతం చదవడం మొదలెడితే ఇలా రాస్తే అనే భావన కలిగింది, సాగిపోదాం అమ్మ కరుణించినవరకూ.తప్పులూ పొరపాట్లూ ఉంటే తప్పక చెప్పండి. నచ్చినా, నచ్చకపోయినా మాట కలపండి,మీరు వద్దనుకుంటే మానేస్తా ,  ఒక సారి భాగవతం చదివినట్లవుతుందని ఆశ.

అశాంతిగా ఉంది.

http://www.vedamantram.com/audio/arunam.mp3

శారీరిక మానసిక అనారోగ్యాలకి అశాంతికి విరుగుడు, అరుణం ఆదివారం ఉదయమే స్నానం చేసి, నిరాహారం గా అరుణం వినండి చాలు.

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పోతనగారి ’మాటలాట’

 1. పోతనగారి పద్యాలు తెలియని తెనుగువారుండరు. పోతన అంటేనే భాగవతం, మనకు సంస్కృతం లో భాగవతం ఉందన్న విషయం కూడా మరిపించేలా ఉంటుంది పోతనగారి రచన. తెనుగు పదాలతో, మాటలతో ఆయన ఆడుకున్న ’మాటలాట’ మాటలతో ఆట లో తెనుగెంత తియ్యగా ఉంటుందో, కొన్ని పద్యాలు చూదాం.

 2. పోతన పద్యాలు ,మునుపటంత కాకపోయినా ఇంకా చదివేవాళ్ళున్నారు. భాగవతం ఇంకా అమ్ముడుపోతూనేఉంది అనితెలుస్తోంది.ఇంక జిలేబీ గారు నిజంగా తెలీక అడిగారనుకోను.ఏదో తమాషాకి అలా అడిగివుంటారు.ఎందుకంటే సంస్కృత శ్లోకాలను ఉదహరించే వారికి పోతన ఎవరో తెలీదంటే ఎలా నమ్ముతాము ?

  • @మిత్రులు రమణరావుగారు,
   మీరు చెప్పినది నిజమే. పెద్దలు ఒక మాట చెబుతున్నారు, భారత,భాగవత,రామాయణాలు ఇంట్లో ఉంచండి, మీరు చదవకపోయినా, ఏనాటికయినా మీ ఇంట్లో ఒకడు వాటిని చదివేవాడు పుడతాడంటే కొంటున్నారు.
   దయ ఉంచండి

   • నిజమే.క్రైస్తవుల ఇళ్ళలో బైబిలు,ముస్లిముల ఇళ్ళలో ఖురాను ఉండటం
    గమనించాను.అలాగే రామాయణ,భారత,భాగవతాలు,భగవద్గీత (పద్యకావ్యాలు కాకపోయినా )
    సులభవచన శైలిలో వ్రాసిన గ్రంథాలైనా ప్రతి హిందువుల ఇంటిలో ఉంచడం
    మంచిది.ఎప్పుడో,ఎవరో చదువుతారు.

   • @మిత్రులు రమణరావు గారు,
    ఆ పని మనతో నే మొదలు పెడదాం. పోతన భాగవతం తెలుగు పద్యాలు ద్రాక్షపళ్ళలా ఉంటాయి. అర్ధం కాకపోయే ప్రశ్న లేదు. చదవండి, మనసుపెట్టండి, గొప్ప అనుభూతి పొందుతారు, వాటిలో అందాలు చెప్పేవారూ ఉన్నారు. వీలు చూసుకుని మరొక టపా సాయిస్తా! మానెయ్యను.
    దయ ఉంచాలి.

 3. పోతనగారి పద్యాలు తెలియని తెనుగువారుండరు. పోతన అంటేనే భాగవతం, మనకు సంస్కృతం లో భాగవతం ఉందన్న విషయం కూడా మరిపించేలా ఉంటుంది పోతనగారి రచన. తెనుగు పదాలతో, మాటలతో ఆయన ఆడుకున్న ’మాటలాట’ మాటలతో ఆట లో తెనుగెంత తియ్యగా ఉంటుందో, కొన్ని పద్యాలు చూదాం.

  • @మిత్రులు కొండలరావుగారు,
   మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నిస్సహాయుడను క్షమించండి.
   దయ ఉంచండి.

  • @జిలేబి గారు,
   బుద్ధి, బుద్ధి, మరెప్పుడూ తప్పు చేయను, లెంపలేసుకుంటున్నాను.పోతనగారి గురించి ఇలా మరెప్పుడూ మాటాడనని హామీ ఇస్తున్నాను.
   దయ ఉంచండి.

 4. చాలా సంతోషం శర్మగారూ. పోతనగారి పద్యాలు తెలియని తెనుగువారుండరు అనేది మొన్నటి మాట. అప్పట్లో శ్రీమదాంద్రమహాభాగవతం (కనీసం దశమస్కంధం) కలిమి లేని యిల్లు లేదు. నేడు ఆ పుస్తకం పేరు తెలిసిన యిళ్ళు బహుస్వల్పం! కాల వైపరీత్యం. వేమన పద్యం కూడా అర్థం కాని, ఆ అవసరం కూడా లేదని భావించే‌ఆంగ్లమానసపుత్రసంతతి రోజులైపోయాక ఇలా వారికి భాగవతరుచిని పరిచయం చేయటం మంచి ప్రయత్నం. మీ‌ప్రయత్నం సఫలం‌కావాలని ఆశిస్తున్నాను.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   నేను పొరబడినట్లున్నా. భాగవతం చాలా మంది పారాయణ చేస్తున్నట్లే ఉంది. మీ బాధను నేను ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నా.ఎవరికో చెబుతున్నానని అనుకోడం నేను చేసిన తప్పు, సరిదిద్దుకుంటున్నా.
   దయ ఉంచండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s