శర్మ కాలక్షేపంకబుర్లు- కోహం ? రండే!

కోహం ? రండే!

భోజరాజు ఆస్థానంలో కాళిదాసు, దండి, భవభూతి మొదలయిన పండితులుండేవారట. కాళిదాసు జీవిత సమయానికి భోజరాజు జీవిత సమయానికి కుదరదయ్యా! కాకమ్మ కధలు చెప్పకు అనకండి. కాక దంత పరీక్ష కోసం, స్తన శల్య పరీక్ష కోసం, కాదు ఈ చెప్పేది. సరదాగా ఉండేది, చాలామందికి తెలిసే ఉండచ్చు కూడా! మరెందుకు చెబుతున్నావని చొప్పదంటు ప్రశ్న లేసేవారు లేరని భరోసా! చెప్పినదే చెప్పడం, చర్విత చర్వణం అదో తుత్తి! తుత్తి!!తుత్తి!!!

ఇలా ఉండగా ఒక రోజు దండికి, భవభూతికి మధ్య వివాదం వచ్చింది. కవి అయిన వాడు పండితుడు కానక్కరలేదు. అలాగే పండితుడయిన వాడు కవీ కానక్కర లేదు.కావచ్చు, కాకాపోవచ్చు. ఇప్పుడు వీరిద్దరిలో కవి ఎవరు? పండితుడెవరనే సమస్య తేలక కాళిదాసు దగ్గరకొచ్చి, వివాదం చెప్పేరు. కాళిదాసుకు తెలిసినా తను చెబితే బాగోదని అమ్మ చదువులతల్లి శ్రీవిద్య,పరదేవత,ఆ బ్రహ్మకీటజనని,అంతర్ముఖ సమారధ్యా బహిర్ముఖసుదుర్లభా, రసజ్ఞ అయిన కాళికాదేవినే అడిగేద్దామని బయకుదేరదీసి అమ్మ ఆలయానికి చేరేరు. వివాదం అమ్మకు వినిపించారు, కాళిదాసు. దండి, భవభూతిలలో కవి ఎవరు, పండితుడెవరని. అప్పుడు కాళికాదేవి ఇలా అంది.

కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితః అని ఊరుకుంది. వెళ్ళినవారు ముగ్గురు అందులో ఒకరు కవి అని, మరొకరు పండితుడనీ తేలిపోయింది. మరి మూడవ వాడయిన కాళిదాసుకు తనెవరొ వీరికి ఎరుకపరచాలని, కోపం వచ్చి

కోహం? రండే..
అని అరచాడు. అర్ధం “ఓసి! ముండకానా! నేనెవరు?” అని

అప్పుడు కాళికాదేవి

త్వమేవాహమ్, త్వమేవాహమ్, నసంశయః…… న సంశయః అంది. అంటే నువ్వేనేను,నువ్వేనేను, సంశయం లేదు,సంశయం లేదు అని. ఈ మాట విన్న దండి భవభూతి అమ్మకు, కాళిదాసుకు సాష్టాంగ దండ ప్రణామం చేసేరు.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- కోహం ? రండే!

 1. కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితః
  కోహం? తే త్వం? ఏవాహం? త్వమేవాహం నసంశయః !

  జిలేబి

 2. కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితః
  కోహం రండే త్వమేవాహం‌ త్వమేవాహం నసంశయః

  ఇది ప్రసిథ్తమైన శ్లోకం. బాగా గుర్తుచేసారు. చాలా ఆనందం‌కలిగింది. నిస్సందేహంగా కవికులగురువు కాళిదాసు కాళీస్వరూపుడే.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   శ్లోకంలో నేను చేసిన పొరపాటు సవరించాను. ఈ శ్లోకం తెలిసినదే సరదాగా మరొక సారి పరిచయం చేశా.నిజమే కాళిదాసు కవికులగురువు సాక్షాత్తు కాళికాదేవి అవతారం.
   దయ ఉంచండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s