శర్మ కాలక్షేపంకబుర్లు-ముడి

ముడి

ముడి ఏకవచనం, ముడులు బహువచనం, ముడులు కాస్తా వాడుకలో బహువచనార్ధంలో ముళ్ళుగా సామాన్యంగా వాడే మాట.ముడెయ్యడం అంటే దారం,తాడు వగైరాల రెండు కొసలను కలిపి ఉంచేందుకు చేసేప్రక్రియ. దీనికి మరొక అర్ధం కూడా చెబుతారు,ముళ్ళెట్టడం  అంటే తగవులు పెట్టడం,ముళ్ళెయ్యడం, లోభత్వంతో సొమ్ము కూడపెట్టడం. ముడి అంటే ముచ్చట ముడి కొప్పని కూడా అర్ధం.

deposit knot

మన భారతీయ సంస్కృతిలో ముడికి కూడా ప్రాధాన్యం ఉందండీ! మొన్ననీ మధ్యనొక పెళ్ళికెళ్ళేం, అక్కడ ఒక చిత్రం జరిగింది,బ్రహ్మగారు పెళ్ళికొడుకు చేతికి మంగళ సూత్రమిచ్చి పెళ్ళికుమార్తె మెడలో కట్టమన్నాడు. పెళ్ళి కొడుకు ఎంతసేపటికీ కట్టకపోతూంటే ’ఏమయ్యా! ఏమిటి ఆలస్యం అంటే’ ముడెయ్యడం రాదనక,’ రెడీ మేడ్ గా తయారు చేసినదుంటే మెడలో వేసేద్దును కదా! ఈ ముడులెయ్యడం నచ్చలేద’న్నాడు. ‘ఓరి నీ అసాధ్యం కూలిపోను ముడెయ్యరా’ అంటే చచ్చిచెడి చెప్పేడు ‘ముడెయ్యడం రాదని’. ఇప్పుడేంచేయాలనే సమస్య వచ్చింది, బ్రహ్మగారడిగారు ‘నాయనా! చిన్నప్పటినుంచి ముడెయ్యడం నేర్చుకో లేదురా? చెడ్డీలు తొడుక్కోలేదా? దానికి బొందు ముడేసుకోలేదా?’ అంటే ‘అబ్బే! అన్నీ రెడీ మేడ్ అండి ముడి సమస్యలేదు, ఎలాస్టిక్ తో ఉంటే సాగదీసి తొడుక్కుని వదిలేయడమేనండి, మరెప్పుడూ నా జీవితంలో చదువుకున్నప్పటి నుంచి ముడెయ్యవలసిన అవసరం లేకపోయిందండీ!’ అన్నాడు. ‘మరి ఫైళ్ళు ముడెయ్యవా?’ అంటే ‘మావన్నీ పేపర్ లెస్ ఆఫీసులండీ’ అన్నాడు. ‘ఓరి నాయనా! ఇప్పుడు నీ చేత ముడేయించడమెలా’ అని తలపట్టుకుని, బ్రహ్మగారు ముడెయ్యడమెలాగో చెప్పేడు, అబ్బే అది అతని వల్ల కాలా! బ్రహ్మగారు ‘పెళ్ళికూతురుని పెళ్ళి కొడుకు మెడలో పుస్తెలు కట్టేయమన్నాడు, ఆ తరవాత అతను తన మెడలో నుంచి తీసినీ మెడలో వేస్తాడు కొత్త సంప్రదాయమవుతుందన్నారు’. అప్పుడు ఆడపడుచు కాబోలు సాయం చేసి ముడేయించింది. అమ్మయ్య పెళ్ళయిందనిపించేరు. మరో సంగతి, పెళ్ళికి తాళి కట్టేటపుడు రెండు గట్టిముడులు ఒక జారు ముడీ వేయాలంటారు. ఇలా రెండు మంగళ సూత్రాలూ రెండు సార్లు కట్టిస్తారు.పెళ్ళి తరవాత బ్రహ్మగారు ఇద్దరి చెంగులూ కలిపి ముడేస్తారు దీనిని ‘బ్రహ్మ ముడి’ అంటారు. అది మళ్ళీ ఆయనే విప్పాలి, మనం విప్పుకోకూడదు.మన మనసులు ముడేసుకోవాలి, ఆ ముడి రోజురోజుకీ బిగవాలి. పై బ్రహ్మగారు ఎవరితో ముడేస్తే వారితో జీవితాంతం గడపాలి 🙂 తనువులెలాగా ముడిపడతాయి, మనసులు ముడిపడటమే ముఖ్యం.. పితృ కార్యాలలో దర్భతో ‘పవిత్ర’మని ఒక ముడి వేసి ఉంగరం వేలుకి పెడతారు, ఆ కార్యక్రమం పూర్తి అయేదాకా. ఆచారవంతులు ఆ ముడిని బంగారపు ఉంగరంగా కూడా చేయించుకుని ధరిస్తారు. ముడెయ్యడం చేతకాకపోతే ఎలా అంటే, నేటి విద్యార్ధులకు ఇటువంటి చిన్న పనులు చేసుకోడం కూడా చేత కావటం లేదు మరి.

enugu melika

ముడుల్లో జారుముడి, పీటముడి, సాధారణం గా కనపడే ఉగ్గిలి ముడివేయటం కష్టం. అలాగే ఏనుగు మెలికి ముడి వేయటం, జారు ముడివేయడం వీటిని పిల్లలకి నేర్పాలి, నిజానికి వారికి వీటిమీద అభిలాష, ఉత్సాహం ఉండటం లేదు. నిజం చెప్పండి మీలో ఎంతమందికి ఉగ్గిలి వేయడం, ఏనుగు మెలికి ముడివేయటం వచ్చు? కావడికి ‘మట్లు’ తగిలించడాన్ని ‘పన్నడం’ అంటారు. ఆ ముడివేయడం కూడా అందరివల్ల కాదు. ఇప్పుడు కావడి అవసరమే లేదనుకోండి. కావడిలో మొదటి తులాదండ సూత్రం మనవారెంత చక్కగా ఉపయోగించుకున్నారో చూశారా? ఇప్పుడన్నిటికీ అంటింపులే ముడి సమస్యలేదు:) ముడి ఉండక అన్నీ అంటింఫులు కనక అవన్నీ కొద్దికాలానికే ఊడిపోతున్నాయి 🙂

ord knot

ఇహ ముళ్ళెట్టడం ఉందిచూసారూ! నారదాయనమః. ఈయనని అనుకుంటాం కాని ఆయనెప్పుడు ముళ్ళెట్టినా లోక కల్యాణం కోసమే ముళ్ళేట్టేరు. జీవితం లో వర్గ శత్రువులని ఎర్రవారు శలవిచ్చినట్లుగా ఆత్తా, కోడలు, మామా, అల్లుడు వీరి మధ్య ముళ్ళకి కారణమే ఉండక్కరలేదు.ముడిపడలేదు అంటే వ్యవహారం సానుకూల పదలేదనీ, కృత్యాదవస్థ మీద ముడి పడిందయ్యా అంటే చాలా కష్టం మీద పనయ్యిందనీ అర్ధం. ముడులెయ్యడం ముళ్ళిప్పడం కూడా ఒక కళ. ఇందులో ఆడవారిదే పైచేయి అంటారు. ముళ్ళెయ్యడం మాటెలా వున్నా ముళ్ళిప్పడం ఒక గొప్ప సంగతి, ఇది అందరివల్లా కాదు, దానికి చాకచక్యం కావాలి, సామదాన భేద దండోపాయాలు ప్రయోగించగల నేర్పుకావాలి.బోడి గుండుకీ బొటనవేలికీ ముడెయ్యగల సమర్ధులూ ఉంటారు.  🙂  కొప్పు ముడేస్తే, అందం చూస్తేకాని తెలియదు.ముచ్చట ముడులెన్ని రకాలో ఎన్ని రకాల సౌదర్యం సాధించవచ్చో భారతీయులకు తెలిసినట్లు మరొకరికి తెలియదు.

rope knots

ముళ్ళేసి ముల్లె కట్టి దాస్తే వారసులు తరవాత హాయిగా అనుభవిస్తారు, బతికుండగా దానం ధర్మం చేసుకుంటే మరు జన్మలో పుడుతుందంటారు. పెడితేనే పుడుతుందని నానుడి ఉంది కదా! అంచేత కావల్సినది ఉంచుకుని మిగిలినదానిలో కొంతలో కొంతయినా అభాగ్యులకు దానం చేస్తే ముక్తి మోక్షం, అపాత్రదానం మటుకు చెయ్యద్దు.కలిగినవాడు దానం చేయకపోడం తప్పు, లేనివాడు అప్పు చేసి దానం చేయడం తప్పు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం , అంచేత మనకు కావలసినది, అవసరమయిన సొమ్ము ముడెయ్యలిసిందే, అంతకు మించి ముడెయ్యడమే….

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ముడి

 1. నా చిన్న నాటి స్కౌట్ అనుభవాలను ,
  ఆ నా టి నా ప్రిఫెక్ట్ (గురువు) ఈ నాటి
  డాలర్ శేషాద్రి గారిని గుర్తుకు తెచ్చారు
  thanks

  • @మోహన్జీ,
   ఇప్పటి పిల్లలికి ముడెయ్యడం కూడా రావటం లేదండి. ఇది నిజమే, అన్నీ అంటింపులే కదా మరి. చిన్న నాటి ముచ్చట జ్ఞాపకం తేగలిగాననమాట.
   దయ ఉంచండి.

 2. బొమ్మలతో కూడా వివరించినందుకు ధన్యవాదములండి.
  ముడులెయ్యడం తెలియని వాళ్ళుంటారంటే ఆశ్చర్యంగా ఉంది .
  లోకంలో ఇంకా ఎంతమంది చిత్రమైన వాళ్ళున్నారో ?

  • @అమ్మాయ్ అనూరాధ,
   ఈత రానివారున్నారు, సైకిల్ తొక్కడం రానివారున్నారు, చదవడం, రాయడం రాని వారున్నారు, లోకం కదమ్మా!
   దయ ఉంచండి.

 3. మరి ఈ పెళ్లి కొడుకు గారు , లేసులు ఉన్న షూస్ ఎట్లా వేసు కుంటున్నాడో !
  మొదలయే బంధం తెగకుండా ఉంటే అదే పది వేలు , ముడులు వేయడం తెలియక పోయినా !

  • @సుధాకర్ జీ,
   మన దేశంలో ఇప్పుడు ముడు లేసు బూట్ల వాడకం తగ్గి, “అసలు కట్టుకోవలసిన అవసరం లేనివి, అంటింపులున్నవే కొంటున్నారు”. ముడేసుకోకుండా వాడేసుకోడమే, అర్ధమయిందనుకుంటా.అందుకే జీవితంలో మొదలయ్యే బంధాలు ఊడిపోతున్నాయి అంటింపులాగా.

   దయ ఉంచండి

 4. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  ఈ వ్యాసం బహు చక్కగా వున్నది. `ముడి’ లో ఒక ఆధ్యాత్మిక అంతరార్ధం వున్నది. ముడి భంధానికి సంకేతం గదా. attachment ని తగ్గించుకొని, detachment ని పెంచుకొమ్మని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అందుకేనేమో, నేటి తరం వాళ్ళు `ముళ్లు’ వేయటం నేర్చుకోవటంలేదు. అయితే, మరొకప్రక్క, ఆస్తులను మూటలు కట్టి ఇస్తే మాత్రం తీసుకొనేవాళ్లు వున్నారు. బ్రతకనేర్చిన వారు మరి!!

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • @మిత్రులు మాధవరావు గారు,
   చాగంటి వారు కట్టు మీద కట్టేస్తే, మొదటి కట్టు జారిపోతుందన్నారు.అక్కరలేని ముడులు మాత్రం వేసుకుంటున్నారు. కావల్సిన చోట మూడి పడటం లేదు. ఆస్తులు పుచ్చుకోడానికి ముందుంటారు కదా!
   దయ ఉంచండి

 5. శర్మ గారు ,

  నమస్తే .

  ముడులు ముళ్ళుగ మారిన విశ్లేషణ , పెళ్ళికోడుకు వేయలేని ముడులను , పెళ్ళికూతురు చేత వేయించి , దనినే ఆ పెళ్ళికొడుకు చేత కట్టించుకొనే కొత్త విధానం సంప్రదాయంగా మారవచ్చేమో ముందు ముందు ( మీ ఈ సలహా ప్రకారం ) .

  • @మిత్రులు శర్మాజీ,
   సంప్రదాయాలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే. ఒక రోజు అటువంటి సంప్రదాయం రావచ్చేమో
   దయ ఉంచండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s